‘Prathi Roju Pandage’ Vijayothsavam in Rajamundry
Natural Star Nani’s Production ‘HIT’ movie first look Launch
‘Hulchul’ Movie Releasing on 3rd Jan 2020
ఎం.ఎస్.కే డిజిటల్ బ్యానర్ పై మల్కాపురం శివకుమార్ సమర్పించు, శ్రీ రాఘవేంద్ర ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్ పై గణేష్ కొల్లూరి నిర్మించిన హల్ చల్ జనవరి 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఉత్కంఠభరితమైన కథాంశంతో, అన్ని వర్గాలవారిని ఆకట్టుకునే మలుపులతో కొత్త తరహాలో చిత్రీకరించారు దర్శకులు శ్రీపతి కర్రి.
ఈ చిత్రానికి హీరో రుద్రాక్ష్ , హీరోయిన్ ధన్య బాలకృష్ణ మరియు కృష్ణుడు, మధునందన్, ప్రీతి నిగమ్, రవి ప్రకాష్, జెమిని సురేష్ తదితరులు నటించారు. ఈ చిత్రానికి అర్జున్ రెడ్డి ఫెమ్ రాజ్ తోట ఛాయా గ్రహణం అందించగా ఎడిటింగ్ ప్రవీణ్ పూడి, సంగీతం భరత్ మధుసూదనన్ అందించారు.
‘Iddari Lokam Okate’ Movie Review
Release date : December 25, 2019
Cinemarangam.com.. Rating : 3/5
Movie name:-”Iddari Lokam Okate”
Banners:-Sri venkateswaracreations
Starring :Raj Tharun,Shalini Pandey.Bharath,Najar,Rohini
Editor :Thammiraju
Cinematography:Sameer Reddy
Music Director :Mickey J Meyar
Director :G.R. Krishna
Producer :Dil Raju,Shirish
ఉయ్యాల జంపాల సినిమాతో కెరీర్ మొదలుపెట్టి ఎనర్జటిక్ హీరో గా పేరు తెచ్చుకున్న రాజ్ తరుణ్ కొన్ని సినిమాలు విజయాలు సాధించినా…గత కొంత కాలంగా సరైన సక్సెస్ లు లేక వెనుకపడిపోయారు. హిట్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాణం లో సుధీరబాబుతో ఆడు మగాడ్రా బుజ్జీ సినిమాతో దర్శకుడుగా పరిచయమై మంచిపేరు తెచ్చుకున్న జి. ఆర్.కృష్ణ దర్శకత్వంలో రాజ్ తరుణ్,షాలిని షిండే, హీరో, హీరోయిన్లుగా ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కిన ‘ఇద్దరి లోకం ఒకటే’ సినిమా క్రిస్మస్ సందర్భంగా ఈ రోజు విడుదల అయింది.మరి ఈ మూవీతో రాజ్ తరుణ్‌కు జి.ఆర్.కృష్ణ మంచి సక్సెస్ అందించాడా లేదా అనేది మన మూవీ రివ్యూలో చూద్దాం..
కథ:మహి (రాజ్ తరుణ్) వర్ష (షాలినీ పాండే) ఒకరి కోసం ఒకరు అన్నట్లు ఇద్దరూ ఒకే రోజు ఒకే ఆసుపత్రిలో పుడతారు. చిన్న తనంలోనే ఇద్దరు మధ్య బలమైన స్నేహం ఏర్పడినా.. ఆ తరువాత ఇద్దరూ విడిపోతారు. పెద్దయ్యాక వర్ష హీరోయిన్ కావాలని కలలు కంటుంటుంది. తన ప్రయత్నాలు ఏమాత్రం నిలబడవు. ఎన్ని ఆడిషన్స్‌కి వెళ్లినా. అవమానాలే.ఇటు మహి (రాజ్ తరుణ్) ఫోటోగ్రాఫర్ గా మంచి పేరు తెచ్చుకుంటాడు.ఇలా సాగుతున్న వీరి జీవితాలు వర్ష చిన్నప్పటి ఫోటో ద్వారా మళ్లీ కలుస్తాయి.ఆ తరువాత ఇద్దరు మధ్య చోటు చేసుకున్న సంఘటనలు ఏమిటి ? వర్ష తన గోల్ ను సాధించడానికి మహి ఎలా సాయ పడ్డాడు ? అప్పటికే వర్ష వేరే వ్యక్తితో పెళ్లికి ఒప్పుకున్నా.. మళ్లీ మహిని ఎలా ప్రేమిస్తోంది ? ఇద్దరూ తమ ప్రేమను వ్యక్తపరుచుకుంటారా ? లేదా ? అంతలో మహికి వచ్చిన సమస్య ఏమిటి ? చివరికీ వీరి ప్రేమ గెలిచిందా ?మరి. మహి తన ప్రేమని వర్ష ముందు వ్యక్తపరిచాడా? విధి వీరిద్దరి జీవితాలతో ఎలాంటి ఆటలు ఆడుకుంది?ఈ జంట కథ సుఖాంతం అయిందా లేదా అనే విషయాలు తెలియాలంటే ఈ చిత్రం చూడాల్సిందే.
విశ్లేషణ:ఉయ్యాల జంపాల నుంచి ప్రతి సినిమా నుంచి ప్రతి సినిమాలో సరదా ఆట పట్టించే కుర్రాడి క్యారెక్ట్ చేసే రాజ్ తరుణ్ ఈ సారి ఫీల్ గుడ్ లవ్ స్టోరీతో మెస్మరైజ్ చేయకపోయినా కాస్త కొత్తగానే ప్రయత్నం చేశాడు.తన లుక్స్ అండ్ యాక్టింగ్ పరంగా కూడా ఈ సినిమాలో కొత్తగా కనిపించడానికి బాగానే తాపత్రయ పడ్డాడు. ఇలాంటి సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ రావడంతో ఫ్రెష్ గా అనిపించింది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన షాలినీ పాండే తన నటనతో పాటు గ్లామర్ తోనూ బాగా ఆకట్టుకుంది. ప్రేమ సన్నివేశాలతో పాటు, కొన్ని భావోద్వేగ సన్నివేశాల్లో కూడా తన పెర్ఫార్మెన్స్ తో షాలినీ మెప్పించింది. హీరోయిన్ కి మదర్ గా నటించిన రోహిణి ఎప్పటిలాగే తన ఎమోషనల్ నటనతో ఆకట్టుకుంది. అలాగే మరో కీలక పాత్రలో నటించిన నాజర్, మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగా నటించారు. సినిమాలో మిక్కీ జె.మేయర్ అందించిన సంగీతం సినిమాకి బాగా ప్లస్ అయింది.దర్శకుడు జి.ఆర్.కృష్ణ ప్యూర్ లవ్ కి సంబంధించి మంచి స్టోరీ లైన్ ను తీసుకున్నారు,మనసుకు హత్తుకునే కథే చెప్పాలనుకున్నాడు. అందుకే ఎలాంటి పక్కదారులు తొక్కకుండా తను అనుకున్నది అనుకున్నట్లు స్క్రీన్ పై చూపించే ప్రయత్నం చేసాడు కూడా. కానీ, ఆ లైన్ ను పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా కథా,కథనాలను రాసుకోలేదు..హీరో, హీరోయిన్ల మధ్య వచ్చే కొన్ని ఎమోషనల్ సీన్స్ బాగా హ్యాండిల్ చేసాడు.ఒకరి కోసం ఒకరు పుట్టారనే కాన్సెప్ట్ బాగానే ఉన్నా.. ఇద్దరి మధ్య మరిన్ని బలమైన సన్నివేశాలు రాసుండుంటే బాగుండేది. క్లైమాక్స్ బాగా చేసాడు. తమ్మిరాజు ఎడిటింగ్ జస్ట్ ఓకే అనిపిస్తోంది. బోర్ కొట్టించే కొన్ని సన్నివేశాలను అయన తన ఎడిటింగ్ తో మ్యానెజ్ చేసుంటే బాగుండేేది.సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాతలు దిల్ రాజు,శిరీష్ లు పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.అయితే సినిమా ఓవరాల్ గా యూత్ తో పాటుగా మిగిలిన అన్నివర్గాల ప్రేక్షకులని అలరిస్తుందని చెప్పొచ్చు
Cinemarangam.com…3/5
‘Mathu Vadalara’ Movie Review
Release date : December 25, 2019
Cinemarangam.com.. Rating : 3/5
Movie name:-”Mathu Vadalara”
Banners:-Mythri Movie Makers,Clap Entertainment
Starring : Sri Simha,Vennela kishore,Satya, Naresh agashtya,Bramhaji,Athulya chandra
Editor :karthik srinivas
Cinematography :Suresh sarangam
Music Director : : kalabairava
Director :Rithesh rana
Producer :Chiranjeevi(cherry),Hemalatha
సంగీత దిగ్గజం కీరవాణి తనయుడు శ్రీసింహా కథానాయకుడిగా అరంగేట్రం చేసిన చిత్రం ‘మత్తు వదలరా’. కాగా రితేష్ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కాగా ఈ సినిమాకి కీరవాణి పెద్ద కుమారుడు కాలభైరవ స్వరాల్ని అందించారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది . క్రైమ్ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం..
కథ : ఒక డెలివరీ బాయ్ గా నెలంతా పని చేస్తే చేతికి నాలుగు వేలు జీతం కూడా దక్కని బాబూ మోహన్ (శ్రీ సింహా) కథ ఇది. ఇటువంటి ఉద్యోగం ఉంటే ఏమిటి? పోతే ఏమిటి? అనుకుని ఉద్యోగం మనేద్దామనుకుంటాడు. కానీ బాబూ మోహన్ స్నేహితుడు యేసు (సత్య) మాత్రం ఈ కొరియర్ బోయ్ ఉద్యోగమే చేస్తూ వేలకు వేలు ఎలా సంపాదించాలో ఓ ఐడియా చెబుతాడు.కస్టమర్ ను ఎలా మోసం చేయాలో కస్టమర్ ఏమరపాటుగా ఉన్నప్పుడు కస్టమర్ దగ్గర నుండి 500 రూపాయలు ఎలా నొక్కేయాలో ప్రాక్టికల్‌గా చూపిస్తాడు. ముందు ఇది దొంగతనం కదా అనుకున్నా, యేసు(సత్య) హితబోధ వల్ల ఇది దొంగతనం కాదు, తస్కరించే విద్య అని తెలుసుకుని, స్నేహితుడు చెప్పింది ఫాలో అవుదామని అనుకుంటాడు. ముందుగా ఓ ముసలమ్మ దగ్గర 500 రూపాయలు కొట్టేద్దామని ఫిక్సవుతాడు. కానీ ఆ ముసలమ్మ అతి తెలివి, చాదస్తం, ముందు జాగ్రత్తల వలన 500 రూపాయలు తస్కరించి దొరికిపోతాడు.కానీ అక్కడ అనుకోకుండా జరిగే కొన్ని సంఘటనతో ఓ మర్డర్ కేసులో ఇరుక్కొంటాడు. అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నంలో జరిగిన తోపులాటలో ముసలమ్మ కిందపడి పోతుంది. అక్కడి నుంచి మెల్లమెల్లగా తన జీవితాన్నీ, తననీ రిస్కులో పడేసుకుంటూ వెళ్తాడు బాబూ మోహన్. 500 రూపాయల కోసం ఆశ పడి. తన జీవితంతో పాటు, తన స్నేహితుల జీవితం కూడా ప్రమాదంలో పడేలా చేస్తాడు. ఇంతకీ అక్కడ ఏం జరిగింది? ఈ కేసు నుంచి బాబూ మోహన్ ఎలా బయటపడ్డాడు?ఈ మధ్యలో బాబుమోహన్ ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు? అనేదే మత్తువదలరా సినిమా కథ.
విశ్లేషణ : .క్రైైమ్ కామెడీ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ లో ఓ మర్డర్ మిస్టరీ చుట్టూ ఈ సినిమా సప్సెన్స్ తో కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో సరదాగా సాగుతుంది. సినిమాలో సత్య కామెడీ, ఇంటర్వెల్ బ్యాంగ్ మరియు సెకెండ్ హాఫ్ లో వచ్చే ట్విస్ట్ లు అలరిస్తాయి.అలాగే హీరో పాత్రతో ముడి పడిన మిగిలిన ప్రధాన పాత్రలు.. ఆ పాత్రల తాలూకు పాయింట్ అఫ్ వ్యూస్ లో రివీల్ అయ్యే సస్పెన్స్ ఎలిమెంట్స్.. సెకెండ్ హాఫ్ లో వచ్చే విచారణ సన్నివేశాలు కామెడీ సీన్స్ వంటి అంశాలు సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.ఇక హీరో శ్రీసింహా చాలీచాలని జీతంతో ఇబ్బంది పడే మంచి స్వభావం ఉన్న ఒక డెలివరీ బాయ్ గా చాల బాగా నటించాడు. మర్డర్ కేసులో ఇరుకునే సన్నివేశాల్లో కూడా చాల బాగా నటించాడు.ఇక కమెడియన్ సత్య తన కామెడీతో ఈ సినిమాకి ఊపిరి పోసాడు. సినిమా మొత్తం తన భుజాల పై మోసాడు. ముఖ్యంగా కామెడీ టైమింగ్ తో చక్కగా పర్ ఫామ్ చేసాడు.విలన్ గా నటించిన నటుడు, వెన్నెల కిషోర్, అజేయ్ ఇక మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. సినిమా మొదటి పది నిముషాలు బోర్ గా సాగడం, ఫస్ట్ హాఫ్ లో ఉన్నంత ఫన్, సెకెండ్ హాఫ్ లో మిస్ అవ్వడం అలాగే సెకెండాఫ్ లో కొన్ని సన్నివేశాలు స్లోగా సాగడం సినిమాకి మైనస్ పాయింట్స్ గా నిలుస్తాయి. ఈ సినిమాలో పాటలు, హీరోయిన్, రొమాన్స్ లేకున్నా దర్శకుడు రాసుకున్న ట్రీట్మెంట్ కామెడీని డీల్ చేసిన విధానం బాగా ఆకట్టుకుంది. మొదటి మూవీ అయినా కూడా దర్శకుడు రితేష్ ఎంచుకున్నకథను చెప్పిన విధానం చాలా బాగుంది. వాస్తవికతకు కాస్త దూరంగా అనిపించినా,ఆయన స్క్రీన్ ప్లే మాత్రం ప్రేక్షకుడికి ఉత్కంఠను కలిగిస్తూనే బాగా నవ్విస్తోంది. మొత్తానికి రితేష్ ఇటు హాస్యాన్ని అటు సీరియస్ నెస్ ని మిక్స్ చేసి సినిమాని బాగా హ్యాండిల్ చేశాడు.. అతని డైలాగ్ డిక్షన్ కూడా సినిమాకు చక్కగా ఉపయోగపడింది. సంగీత దర్శకుడు కాలభైరవ అందించిన నేపథ్య సంగీతం కూడా బాగా ఆకట్టుకుంది.కెమెరామెన్ అందించిన సినిమాటోగ్రఫీ సినిమాకే హైలెట్ గా నిలుస్తోంది.ఎడిటర్ వర్క్ సినిమాకి తగ్గట్లు ఉంది. సినిమాలోని నిర్మాత పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి.అయితే ఈ సినిమా ఓవరాల్ గా యూత్ తో పాటుగా మిగిలిన అన్నివర్గాల ప్రేక్షకులని అలరిస్తుందని చెప్పొచ్చు
Cinemarangam.com..3/5
Raja narasimha Release on jan1st
‘‘అదొక మారుమూల అటవీ ప్రాంతం. డబ్బు సంపాదనే లక్ష్యంగా ఓ వ్యక్తి తయారు చేసే కల్తీ మందుతాగి అక్కడ 75 మంది చనిపోయారు. ఆ సమస్యను తీర్చగలిగే ఏకైక వ్యక్తి నవ్యాంధ్ర ప్రజాసేన అధ్యక్షుడు రాజా! ఆతను చెప్పిందే చేస్తాడు.. చేసేది మాత్రమే మాట్లాడతాడు. జనాల్ని మోసం చేసే సాధారణ వ్యక్తినైనా, మంత్రినైనా బట్టలు లేకుండా జనాల్లో నిలబెట్టే సత్తా ఉన్నవాడు. నమ్మి తన వెంట వచ్చినవాళ్లను ప్రాణం ఇచ్చి అయినా కాపాడతాడు. ఆ అటవీ ప్రాంతంలో సమస్యను ‘రాజా నరసింహా’ ఎలా పరిష్కరించాడు అన్నదే మా చిత్రం” అని దర్శకుడు వైశాక్ అన్నారు. మలయాళ సూపర్‌స్టార్ మమ్ముటీ కథానాయకుడిగా రూపొందిన ‘మధుర రాజా’ చిత్రం తెలుగులో ‘రాజా నరసింహా’గా జనవరి 1న ప్రేక్షకుల ముందుకొస్తుంది. ‘మన్యం పులి’ సినిమాతో విజయం అందుకున్న వైశాఖ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. జై, మహిమా నంబియార్ కీలక పాత్రధారులు. జగపతిబాబు ప్రతినాయకుడిగా కనిపిస్తారు. జై చెన్నకేశవ పిక్చర్స్ పతాకంపై సాధు శేఖర్ తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.
నిర్మాత సాధు శేఖర్ మాట్లాడుతూ ”చక్కని సందేశంతో యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన చిత్రమిది. మమ్ముటీ పవర్‌ఫుల్ మాస్ యాక్షన్‌తో పాటు ప్రతినాయకుడిగా జగపతిబాబు క్యారెక్టర్, గోపీ సుందర్ సంగీతం, సన్నీలియోన్ ప్రత్యేక గీతం, పీటర్ హెయిన్స్ పోరాటాలు సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయి. మలయాళంలో వంద కోట్లు వసూలు చేసిన ఈ సినిమా తెలుగులో కూడా మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది. వచ్చే నెల 1న సినిమాను విడుదల చేస్తున్నాం” అని అన్నారు.
ఈ చిత్రానికి సహనిర్మాత: నూల అశోక్, నిర్మాణ సారధ్యం: వడ్డీ రామానుజం, పురం రాధాకృష్ణ.
‘BUTTA BOMMA’ Song from Allu Arjun’s “Ala Vaikunthapurramuloo” Garners Good Buzz
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, మాటల మాంత్రికుడు, సుప్రసిద్ధ సినీ దర్శకుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘అల వైకుంఠపురంలో’. ఈ చిత్రం లోని మరో పాట ఈ రోజు (24-12-19) సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకు సామాజిక మాధ్యమం అయిన ‘యు ట్యూబ్’ ద్వారా విడుదల అయింది. ప్రముఖ గీత రచయిత రామజోగయ్య శాస్త్రి రచించిన ఈ గీతాన్ని యువ గాయకుడు ‘అర్మాన్ మాలిక్’ అద్భుతంగా ఆలపించారు. సంగీత దర్శకుడు తమన్ తన వీనుల విందైన బాణీలతో మరోసారి సంచలనం సృష్టించారు. ‘బుట్ట బొమ్మా..బుట్ట బొమ్మా నన్ను సుట్టూ కుంటివే, జిందగీకే అట్ట బొమ్మై జంట కట్టూ కుంటివే’ అంటూ సాగే ఈ గీతం టీజర్ ఇటీవల విడుదలై పాట ఎప్పుడు విడుదల అవుతుందా అని ఎదురు చూసేలా చేసింది. ఇప్పుడు విడుదల అయిన ఈ పూర్తి గీతం అటు సంగీత ప్రియుల్ని, ఇటు ప్రేక్షకాభిమానులను విపరీతంగా అలరిస్తూ, ఈ చిత్రం నుంచి విడుదలైన గీతాల రికార్డ్ ల సరసన చేరే దిశగా దూసుకు పోతోంది.
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, మాటల మాంత్రికుడు, సుప్రసిద్ధ సినీ దర్శకుడు త్రివిక్రమ్ద ర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా కావడంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. పలు విజయవంతమైన చిత్రాల్ని అందించిన భారీ నిర్మాణ సంస్థలు ‘గీతా ఆర్ట్స్’ ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’ కాంబినేషన్ లో ఈ చిత్రం సంక్రాంతి కానుకగా 2020 జనవరి 12న విడుదల అవుతోంది.
నటీనటులు :సౌత్ ఇండియన్ క్రేజీ స్టార్ అల్లు అర్జున్, పూజా హెగ్డే, టబు, రాజేంద్రప్రసాద్, సచిన్ ఖేడ్ కర్, తనికెళ్ళ భరణి, మురళీ శర్మ, సముద్ర ఖని, జయరాం, సునీల్, నవదీప్, సుశాంత్, నివేతా పేతురాజ్, గోవిందా పద్మసూర్య, కల్యాణి నటరాజన్, రోహిణి, ఈశ్వరీ రావు, శిరీష, బ్రహ్మాజీ, హర్షవర్ధన్, అజయ్, రాహుల్ రామకృష్ణ, పమ్మి సాయి నటిస్తున్నారు.
సాంకేతిక నిపుణులు : డి.ఓ.పి: పి.ఎస్.వినోద్,
సంగీతం: థమన్.ఎస్, ఎడిటర్: నవీన్ నూలి: ఆర్ట్: ఏ.ఎస్.ప్రకాష్,
ఫైట్స్: రామ్ – లక్ష్మణ్, పి.ఆర్.ఓ: లక్ష్మీవేణుగోపాల్, ఏలూరు శ్రీను
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : పి.డి.వి.ప్రసాద్
నిర్మాతలు: అల్లు అరవింద్, ఎస్.రాధాకృష్ణ (చినబాబు)
Superstars ‘Ram Charan’ and ‘Prabhas’ Praised ‘Prati Roju Pandaage’
‘చిత్రలహరి’ సూపర్ హిట్ తరువాత సుప్రీమ్ హీరో సాయి తేజ్ హీరోగా, హ్యాట్రిక్ డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో, బన్నీవాస్ నిర్మాతగా, గ్లామర్ డాల్ రాశి ఖన్నా హీరోయిన్‌గా రూపొందిన చిత్రం ‘ప్రతిరోజూ పండగే’. శుక్రవారం (డిసెంబర్ 20న) ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమాకు పాజిటీవ్ రెస్పాన్స్ లభించమే కాకుండా హౌస్ ఫుల్స్ అవుతున్నాయి.
ఇటీవల ప్రతిరోజు పండగే సినిమాపై యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ ప్రశంసల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. ‘ప్రతిరోజు పండగే సక్సెస్ సాధించడంపై తేజ్, మారుతి, జీఏ2 పిక్చర్స్, యూవీ క్రియేషన్స్‌కు మనస్పూర్తిగా అభినందనలు’ అంటూ ప్రభాస్ తన ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు. తాజాగా రామ్ చరణ్ ఈ సినిమాపై స్పందిస్తూ..
‘ ప్రతిరోజు పండగే చిత్రం మోరల్ వ్యాల్యూస్ తో కూడిన చిత్రం, తప్పకుండా అందరూ చూడదగ్గ సినిమా, మంచి చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సాయి తేజ్, మారుతి, తమన్, రాశి ఖన్నా ఇతర చిత్ర యూనిట్ సభ్యులకు అభినందనలు’ అని తన ఫేస్ బుక్ లో వెల్లడించాడు.















