Home Blog Page 986

‘Sathya Raju’ Special Interview about ‘Prathi Roju Pandaage’

సాయితేజ్‌ కథానాయకుడిగా మారుతీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ప్రతిరోజూ పండగే’. రాశీఖన్నా కథానాయిక. డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మంచి టాక్‌ను అందుకుంది. కుటుంబ ప్రేక్షకులను అలరించేలా దర్శకుడు మారుతీ ఈ సినిమాను తీర్చిదిద్దారు. ఈ చిత్రలో ముఖ్య పాత్రలో కనిపించిన సత్యరాజ్ తో స్పెషల్ ఇంటర్వ్యూ...

డైరెక్టర్ మారుతి నాకు ఈ కథ చెప్పగానే నచ్చింది. నేను సినిమాలు అరుదుగా ఒప్పుకుంటాను, చిత్రంలో నా పాత్రకు ప్రాధాన్యతను చూసుకుంటాను. తెలుగులో నేను ఇప్పటివరకు చేసిన రోల్స్ అన్ని నాకు మంచి గుర్తింపును తెచ్చాయి.

ప్రతిరోజు పండగే సినిమాలో నా పాత్రకు అద్భుతమైన స్పందన లభిస్తోంది. సాయి తేజ్ తో నేను చేసిన సీన్స్ అన్ని బాగున్నాయని ఆడియన్స్ అంటున్నారు. మారుతి ఒక ఎమోషనల్ సబ్జెక్ట్ ను ఎంటర్టైనింగ్ వేలో చెప్పడంలో సక్సెస్ అయ్యాడు, అది ధియేటర్ లో ఆడియన్స్ రెస్పాన్స్ చూస్తుంటే తెలుస్తోంది.

ఈ సినిమాకు అన్ని కుదిరాయి, గీతా ఆర్ట్స్, యూవీ మేకింగ్, సాయి  తేజ్ స్క్రీన్ ప్రజెన్స్, మారుతి డైరెక్షన్, తమన్ మ్యూజిక్ ఇలా అన్ని సినిమాకు మెయిన్ అసెట్ అయ్యాయి కావునే సినిమా గ్రాండ్ గా ఉంది. వీటన్నింటికి తోడు ఆడియన్స్ సినిమాకు కనెక్ట్ అయ్యి బాగా రిసీవ్ చేసుకున్నారు.

యువి బ్యానర్ లో మిర్చి చేశాను, అప్పటినుండి ప్రభాస్ బాగా ఫ్రెండ్ అయ్యాడు, ఆ తరువాత బాహుబలిలో మళ్ళీ కలిసి చేశాం. నేను ఇప్పుడు మళ్లీ యువి బ్యానర్ లో ప్రతిరోజు పండగే సినిమాకు వైర్క్ చెయ్యడం హ్యాపీగా ఉంది. భవిషత్తులో యువి, గీతా ఆర్ట్స్ లో మరిన్ని మంచి సినిమాలు చెయ్యాలని ఉంది

‘‘George Reddy’’ wins Best Appreciation award at ‘’4th Lakeview International film festival’’

ఉస్మానియా యూనివర్సిటీలో ఇప్పటికీ రోల్ మోడల్ గా పేర్కొనే స్టూడెంట్ లీడర్ “జార్జ్ రెడ్డి” జీవితం ఆధారంగా సందీప్ మాధవ్ టైటిల్ పాత్రలో తెరకెక్కిన “జార్జ్ రెడ్డి” చిత్రం గత నెల విడుదలై మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే. ప్రేక్షకుల అభినందనలతోపాటు..
విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్న ఈ చిత్రం ఈ నెల 23న నోయిడా,ఢిల్లీలో జరిగిన 4th లేక్ వ్యూ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో స్క్రీనింగ్ జరుపుకుంది..అంతేగాకుండా సినిమా చూసిన అవార్డు కమిటీ నిర్మాత అప్పిరెడ్డిని అభినందిచడమే కాకుండా‘‘బెస్ట్ అప్రిషియేషన్’’ అవార్డును ఆయనకు అందజేశారు. 35 దేశాల నుండి 259భాషల చిత్రాలు ఈ ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శింపబడ్డాయి..అక్కడ సినిమాచూసిన ప్రేక్షకులు టీమ్ ను అభినందించడం విశేషం. చిన్న సినిమాగా విడుదలై..

ఇండస్ట్రీ మొత్తాన్ని ఆకట్టుకున్న “జార్జ్ రెడ్డి” చిత్రం ఇప్పుడుఇంటర్నేషనల్ లెవల్ కి వెళ్లడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందంటోంది టీమ్.

Music Director ‘Kaala Bhairava’ Interview

ఇండస్ట్రీలో తొలి అవకాశం రావడం గొప్ప అన్నది నా సిద్ధాంతం. పెద్ద కుటుంబం నుంచి వచ్చినా ఆ నియమం నాకు వర్తిస్తుంది అన్నారు కాలభైరవ. సంగీత దిగ్గజం ఎం.ఎం.కీరవాణి తనయుడు కాలభైరవ సంగీత దర్శకుడిగా పరిచయమవుతున్న చిత్రం మత్తువదలరా. ఈ నెల 25న మత్తు వదలరా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా కాలభైరవ జరిపిన ఇంటర్వ్యూ ఇది.

ఈ సినిమాలో చివరగా చేరిన సాంకేతిక నిపుణుడు మీరేనని దర్శకనిర్మాతలు ప్రచార వేడుకల్లో పేర్కొన్నారు?సినిమాలో మీకు ఎలా అవకాశం వచ్చింది?
సినిమాకు సంబంధించి నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరూ కుదిరిన తర్వాత  షూటింగ్ ప్రారంభమయ్యే తరుణంలో నేను భాగమయ్యాను. సంగీత దర్శకుడిగా ఎవరిని తీసుకుంటే బాగుంటుందని చిత్రబృందం చర్చించుకున్న తర్వాత  నిర్మాత చెర్రి నాకు అవకాశమిచ్చారు.సాధారణంగా పాటలున్న సినిమాతో సంగీత దర్శకుడిగా పరిచయం కావాలని కోరుకుంటారు.

పాటలు లేని నేపథ్య సంగీతంతో కూడిన ఈ సినిమాను ఎంచుకోవడానికి కారణం  ఏమిటి?
ఇండస్ట్రీలో తొలి అవకాశం రావడం గొప్ప అన్నది నా సిద్ధాంతం. పెద్ద కుటుంబం నుంచి వచ్చినా ఆ నియమం నాకు వర్తిస్తుంది.  వచ్చిన అవకాశాన్ని స్వీకరించకపోతే నష్టపోయేది నేనే.  లక్కీగా తొలి ప్రయత్నంలోనే బలమైన కథ, కథనాలున్న సినిమాకు సంగీతాన్ని అందించే అవకాశం దొరికింది. అందువల్లే సినిమాలో పాటలు లేవు అన్న ఫీలింగ్ ఎప్పుడూ కలగలేదు. కథ విన్న తర్వాత ఇందులో పాటలు ఉండాల్సిన అవసరం లేదనిపించింది. బలవంతంగా మంచి పాట పెట్టినా కథకు అన్యాయం చేసినట్లవుతుందనిపించింది.  ఈ సినిమా కోసం నేను అందించిన నేపథ్యసంగీతం ప్రతి ఒక్కరిని మెప్పిస్తుందనే నమ్మకం ఉంది.

సంగీత దర్శకుడిగా నాన్నగారి ప్రభావం మీపై ఎంత  ఉందని అనుకుంటున్నారు?
చిన్నతనం నుంచి నేను నాన్న దగ్గర పనిచేశాను. దర్శకుడు సన్నివేశం చెప్పినప్పటి నుంచి పాట ప్రయాణం ఎలా  ఆరంభమవుతుంది?ట్యూన్ ఎలా కంపోజ్ చేస్తారు? దర్శకుడు చేసే మార్పులు, వాటికి స్పందించే తీరుతో పాటు నాన్న నుంచి చాలా నేర్చుకున్నాను. తెలిసో తెలియకో నాన్న ప్రభావం నాపై వందశాతం  ఉంది.

 నాన్నతో  మీరు చేసిన తొలి సినిమా ఏది?
నాలుగైదు ఏళ్లుగా నాన్న దగ్గరే పనిచేస్తున్నాను. ఆయన దగ్గర కోరస్ సింగర్‌గా  కెరీర్ ఆరంభించాను.  ఆయన దగ్గరే సరదాగా ట్యూన్స్ కంపోజింగ్ చేయడం మొదలుపెట్టాను. బాహుబలి-2 చిత్రం  నాకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత లఘు చిత్రాలతో పాటు బాహుబలి ది లాస్ట్ లెజెండ్స్ యానిమేషన్ వెబ్‌సిరీస్‌కు సంగీతాన్ని అందించాను. సినిమాకు సంగీతాన్ని అందించడం ఇదే తొలిసారి. సంగీతంలో ఎవరి దగ్గర ప్రత్యేకంగా శిక్షణ తీసుకోలేదు. స్వీయ సాధనతోనే పట్టు సాధించాను.
సోదరుడు శ్రీసింహాకు నటన పట్ల ఉన్న ఆసక్తిని మీరు ఎప్పుడూ గ్రహించారు.
శ్రీసింహాకు చిన్నతనం నుంచే నటన అంటే ఇష్టం ఉంది.  యాక్టింగ్‌ను కెరీర్‌గా ఎంచుకోవాలని  నిర్ణయించుకోవడానికి కొంత టైమ్ తీసుకున్నాడు. నటుడవ్వాలని నిశ్చయించుకున్న తర్వాత ఆ దిశగానే ప్రయత్నాలు మొదలుపెట్టాడు.

నేపథ్య గాయకుడిగా మీ ప్రయాణం  పట్ల సంతృప్తిగా ఉన్నారా?
ఇప్పటివరకు దాదాపు ముప్పై పాటలు పాడాను.బాహుబలి-2లోని  దండాలయ్యా.. పాట మంచి పేరుతీసుకొచ్చింది.  అరవిందసమేతలోని పెనిమిటి.. గీతం ఆ పేరును రెట్టింపుచేసింది. చిన్నతనం నుంచి సంగీత దర్శకుడినవ్వాలనేది నా కల. అయితే వాయిస్ బాగుండటంతో  నేపథ్యగాయకుడిగా అవకాశాలు వస్తున్నాయి.  పాటలు పాడటాన్ని నేను ఎంజాయ్ చేస్తాను.ఒకే సినిమాతో మీరు,  మీ సోదరుడు శ్రీసింహా ఇండస్ట్రీకి పరిచయం కావడం ఎలాంటి అనుభూతిని పంచుతుంది.గొప్ప అనూభూతి కలుగుతున్నది. ఇద్దరం ఒకే సినిమాతో సినీ పరిశ్రమకు పరిచయం అవుతామని కలలో కూడా ఊహించలేదు. తొలుత తమ్ముడు ఈ సినిమాలో హీరోగా ఖరారయ్యాడు. ప్రీప్రొడక్షన్ జరిగే సమయంలో నేను సంగీత దర్శకుడిగా సినిమాలో భాగమయ్యాను.  మ్యూజిక్ డైరెక్టర్‌గా నా పేరును శ్రీసింహా చిత్రబృందానికి  సూచించలేదు. అలాంటి నిర్ణయాలు తీసుకునే స్థాయిలో  మేము లేము. చెర్రి మామ  మాకు అవకాశం ఇవ్వడం అదృష్టంగా భావిస్తున్నాను.బయటి వారితో పోలిస్తే నాకున్న కుటుంబ నేపథ్యం కారణంగా అవకాశాలు రావడం సులభమే. అయితే వచ్చిన ప్రతి అవకాశాన్ని ఒప్పుకోకుండా సరైన సమయం కోసం ఎదురుచూసి ఈ సినిమాను అంగీకరించాను.కీరవాణిగారు సంగీత దర్శకుడిగా అన్ని జోనర్‌లలో సినిమాలు చేశారు.

మీ నాన్నగారి దారిలోనే మీరు అడుగులు వేయాలని అనుకుంటున్నారా? మ్యూజిక్ డైరెక్టర్‌గా మీకు ఎలాంటి సినిమాలు చేయాలనుంది?
ఐదు, పదేళ్ల తర్వాత నా పేరు చెబితే ప్రత్యేకంగా ఒకటే రకమైన సంగీతం  గుర్తురాకుండా ఏదైనా చేయగలడని చెప్పుకోవాలి. అదే సంగీత దర్శకుడిగా నా లక్ష్యం.

ఓ సంగీత దర్శకుడిగా నాన్న కీరవాణిలో మీకు నచ్చినదేమిటి?
కంపోజింగ్,ఇన్‌స్ట్రూమెంటేషన్, నేపథ్య సంగీతం అన్ని చేసే ప్రతి పని ఇష్టమే. నాన్న ఏ భాషలో పాటను సమకూర్చిన ఆ నేటివిటీ కనిపిస్తుంది. హిందీ పాటకు బాణీలు అందిస్తే  హిందీ కంపోజర్ స్వరాల్ని అందించినట్లుగా ఉంటుంది. తమిళ పాట చేస్తే ఆ నేటివిటీ టచ్ ఉంటుంది. తెలుగు సంగీత దర్శకుడు ఐనా పరిపూర్ణంగా ఓ భాషకు తగినట్లుగా స్వరాల్ని అందించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. నాన్న సంగీతాన్ని అందించిన సినిమాల్లో ఒకరికి ఒకరు సినిమా అంటే నాకు చాలా ఇష్టం.

సెలబ్రిటీ పిల్లల్లా కాకుండా నా తనయుల్ని సాధారాణంగా పెంచానని మీ నాన్నగారు అన్నారు?ఎందుకలా?మేము సంపాదించే పరిజ్ఞానం కంటే మంచి బుద్ధి కలిగి ఉండటం ముఖ్యమనే భావంతో అమ్మనాన్న  చిన్నతనం నుంచి మమ్మల్ని పెంచారు. మేము అలాగే పెరిగాం.

నేపథ్య థ్రిల్లర్ సినిమాకు నేపథ్య సంగీతాన్ని అందించడం ఎంతవరకు ఛాలెంజింగ్‌గా అనిపించింది?నిజాయితీగా మాట్లాడాలంటే ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా  నా  పేరు వినిపించడం కంటే కీరవాణి అబ్బాయి సంగీతాన్ని అందించిన సినిమా ఇదనే అందరూ చెబుతారు. తొలి సినిమా ఏ విధంగా స్వరాల్ని సమకూర్చాడో  చూద్దాం అనే ఆలోచనతోనే  సినిమాకు వస్తారు.  ఆ అంచనాల వల్ల ఒత్తిడి  పెరుగుతుంది. సంగీత దర్శకుడిగా నా  నుంచి ఎక్కువగా కోరుకుంటారు. అయితే నాపై ఒత్తిడి ఉందనే ఫీలింగ్‌తో ఈసినిమాకు ఏ రోజు పనిచేయలేదు. ఆ క్రెడిట్ నాది కాదు. టీమ్ అందరం కొత్తవాళ్లం కావడంతో స్నేహితుల్లా కలిసిపోయి కాలేజీ ప్రాజెక్ట్ కోసం పనిచేస్తున్నట్లుగా కష్టపడ్డాం. మైత్రీ మూవీస్ నిర్మాతలు, చెర్రి మాపై ఏ రోజు ఒత్తిడి తీసుకురాలేదు. సినిమా మొత్తం హాయిగా సాగిపోయింది.

ఈ సినిమా విషయంలో నాన్నగారు మీకు ఏమైనా సలహాలు ఇచ్చారా?
సంగీతాన్ని సమకూర్చే విషయంలో నాన్న తనంత తానుగా నాకు ఎలాంటి సలహాలు ఇవ్వలేదు. రీరికార్డింగ్ సమయంలో కొన్ని సీన్స్ చూపించి నాన్న ఫీడ్‌బ్యాక్ తీసుకున్నాను.

సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాకు సంబంధించిన ఇతర విషయాల్లో మీ సహకారం ఎంత ఉంది?
స్నేహితుల మాదిరిగా అన్ని విభాగాల వారందరం ఒకరి అభిప్రాయాల్ని మరొకరం పంచుకుంటూ ఈ సినిమాలు చేశాం.

సగటు ప్రేక్షకుడిగా ఈసినిమా చూసినప్పుడు ఏమనిపించింది?
సెట్‌కు వెళితే నాకు బోర్ కొడుతుంది. అందుకే షూటింగ్‌లకు దూరంగా ఉంటాను. ఈ సినిమా షూటింగ్‌కు ఒక్కరోజు కూడా వెళ్లలేదు. రీరికార్డింగ్  కోసం రఫ్ కట్‌ను నాకు పంపించారు. తొలి సినిమా కావడం, పరిమిత బడ్జెట్‌లో తెరకెక్కించడంతో ఎలా ఉంటుందో ననే ఉత్సుకతతో నా తమ్ముడు  నటించిన సినిమా అన్నది మర్చిపోయి ప్రేక్షకుడి మైండ్‌సెట్‌తో సినిమా చూశాను.  ఆ రోజు నా జీవితంలో మర్చిపోలేని థ్రిల్‌ను అనుభవించాను. నేను ఊహించిన దానికంటే అద్భుతంగా సినిమా ఉండటంతో నేను బాగా సంగీతాన్ని అందించాలని ఫిక్సయ్యాను.

ఈ సినిమా కోసం మీరు అందుకున్న బెస్ట్ కాంప్లిమెంట్ ఏది?
చాలా కొత్తగా ఉంది. ఇదివరకు ఎక్కడ ఇలాంటి సన్నివేశాలు చూడలేదని చాలా అంది అన్నారు.

రాజమౌళి తనయుడు కార్తికేయతో మీరు సినిమా చేయబోతున్నట్లు తెలిసింది?
కార్తికేయ నిర్మాణ సంస్థలో ఆకాశవాణి సినిమాకు సంగీతాన్ని అందించారు.

Herione ‘Karronya Katrynn’ Interview about ‘Uttara’ Movie

శ్రీరామ్, కారుణ్య కత్రేన్ జంటగా తిరుపతి యస్ ఆర్ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘ఉత్తర’. జనవరి3 న విడుదలకు సిద్దం అయిన ఈ సినిమా యూత్ ని ఆకట్టుకునే అంశాలతో ముస్తాబయ్యింది. ఈ సందర్భంగా హీరోయిన్ కారుణ్య కత్రిన్ మీడియా తో ముచ్చటించారు.

ఈ సందర్భంగా హీరోయిన్ కారుణ్య కత్రేన్ మాట్లాడుతూ:“నాకు చిన్నతనం నుండి డాన్స్ అంటే చాలా ఇష్టం ఆ ఇష్టంతో ఆట 5 లో డాన్స్ ర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాను. నా లైఫ్ లో తొలి విజయం ఆట వేదికనుండే అందుకున్నాను. ఆ తర్వాత కొన్ని సినిమాలలో చైల్డ్ క్యారెక్టర్స్ చేసాను. తర్వాత రాములమ్మ సీరియల్ నాకు మంచి పేరును తెచ్చింది. క్లాసికల్, వెస్ట్రన్, లను మిక్స్ చేసి ఎలాంటి డాన్స్ అయినా చేయగలగడం నాకు నేషనల్ అవార్డ్ ని తెచ్చి పెట్టింది. అది నా జీవితంలో మరపు రాని సంఘటన.. నటనలో నాకు సావిత్రి, శ్రీదేవి గార్లు నా ఇన్సిపిరేషన్ వారిలా పేరు తెచ్చుకోవాలన్నదే నా కొరిక. మా ఇంట్లో వారి ఇష్టం మేరకు గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్నాను. కానీ నటన నా ప్యాషన్ తెలుగులో ఇది నా రెండో సినిమా ఉత్తర లో స్వాతి క్యారెక్టర్ ని ప్లే చేస్తున్నాను. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో నడిచే ప్యూర్ లవ్ స్టోరీ ఇది, నిజం చెప్పాలంటే ప్రతి ఊరిలో ఒక ఉత్తర ఉంటుంది కానీ వేరే పేర్లతో ఉంటుంది. అంతలా ఈ క్యారెక్టర్ కనెక్ట్ అవుతుంది. నా టాలెంట్ ని షోకేస్ చేసుకునేందుకు ఇందులో‘పిల్లా నా గుండె ను పట్టి లాగకే’ పాట లో నా డాన్స్ మీ అందరికీ తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను. మా డెరక్టర్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన స్టైయిల్ శేఖర్ కమ్ముల గారిని పోలి ఉంటుంది. చాలా నాచురల్ గా సీన్స్ ని తెరమీదకు తెస్తారు. మేం అంతా రియల్ లోకేషన్స్ లో షూట్ చేసాం.. షూటింగ్ పార్ట్ అంతా చాలా చక్కగా జరిగింది. ఒక మంచి టీం తో పనిచేసాను అనే సంతృప్తి ఉంది. దీనితో పాటు మరో రెండు తెలుగు సినిమాలు చేస్తున్నాను. ఒక తమిళ సినిమా కు సైన్ చేసాను. ఉత్తర లో స్వాతి క్యారెక్టర్ కాస్త డామినేటింగ్ గా ఉంటుంది. అందమైన అమ్మాయిలకు పోగరు ఉండటం తప్పకాదు అని నమ్మే క్యారెక్టర్ , హీరో కథను నడిపిస్తే అతడ్ని హీరోయిన్ క్యారెక్టర్ నడిపిస్తుంది. వారి మద్య సంభాషణలు చాలా ఫన్ గా ఉంటాయి. వారి ప్రేమకు ప్రాబ్లమ్స్ వస్తాయి. వాటిని స్వాతి ఎలా సాల్వ్ చేసుకుంది అనేది ఇంట్రెస్ట్ గా ఉంటుంది. నేను డాన్స్ , సినిమాలలో పేరు తెచ్చుకోవడానికి కారణం మా తల్లిదండ్రులే. వారి ప్రొత్సాహంతోనే నేను ప్యాషన్ ని కొనసాగించగలుగు తున్నాను అన్నారు”.

రవి కుమార్ మాదారపు సమర్సణలో లైవ్ ఇన్ సి క్రియేషన్స్ , గంగోత్రి ఆర్ట్స్ బ్యానర్స్ పై నిర్మించిన ఉత్తరజనవరి 3 విడుదలకు సిద్దం అయ్యింది. ఈ మవీ ట్రైలర్ కి మంచి రెస్సాన్ వస్తుంది. ఒక స్వచ్చమైన ప్రేమకథను, రియలిస్టిక్ అప్రోచ్ తెరమీదకు తెచ్చిన ఈమూవీ తప్పకుండా అన్ని వర్గాల వారినీ అలరిస్తుందని అంటుంద చిత్ర యూనిట్.

సమర్పణ: రవికుమార్ మాదారపు,
బ్యానర్స్: లైవ్ ఇన్ సి క్రియేషన్స్, గంగోత్రి ఆర్ట్స్,
సినిమాటోగ్రఫీ: చరణ్ బాబు,
మ్యూజిక్ : సురేష్ బొబ్బిలి,
ఎడిటర్: బొంతుల నాగేశ్వర రెడ్డి,
రైటర్: ఎన్. శివ కల్యాణ్,
రచన మరియు దర్శకత్వం : తిరుపతి యస్ ఆర్,
ప్రొడ్యూసర్స్ : తిరుపతి యస్ ఆర్. శ్రీపతి గంగదాస్,
నటీ నటలు: శ్రీరామ్ నిమ్మల, కారుణ్య కత్రేన్, అజయ్ ఘోష్, వేణు, అభినవ్, అభయ్.

“Beautiful”Movie Pre-Release Event

సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ టైగర్ కంపెనీ ప్రొడక్షన్ పతాకంపై టి. అంజయ్య స‌మ‌ర్ప‌ణ‌లో నైనా గంగూలి, సూరి హీరోహీరోయిన్లుగా `అగస్త్య మంజు` దర్శక‌త్వంలో రూపొందిన లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ `బ్యూటిఫుల్` (ట్రి బ్యూట్ టు రంగీలా) అనేది ఉప శీర్షిక. టి. నరేష్ కుమార్, టి. శ్రీధర్ నిర్మాత‌లు. ఇప్పటికే విడుదలైన పాటలకి మంచి రెస్పాన్స్ వస్తోంది. జ‌న‌వ‌రి 1న ఈ చిత్రం గ్రాండ్ గా విడుద‌ల‌కానుంది. కాగా ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఫంక్షన్ డిసెంబర్ 23న హైదరాబాద్ ఐటిసి కోహినూర్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో హీరోయిన్ నైనా గంగూలీ విసిరిన స‌వాల్‌కు సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మొదటి సారి స్టేజ్ మీద నైనా గంగూలీతో క‌లిసి డాన్స్ వేసి ఆమెకు బ‌దులివ్వ‌డం విశేషం. ఈ వీడియో ప్రస్తుతం ఇంటర్ నెట్ లో వైరల్ గా మారింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాతలు సి .కల్యాణ్, తుమ్మలపల్లి రాంసత్యనారాయణ, న‌ట్టి కుమార్‌,చంద్ర సిద్దార్థ్, బి వి ఎస్ రవి, తదితరులు పాల్గొన్నారు.

సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ మాట్లాడుతూ – ” బ్యూటిఫుల్ నాకు చాలా స్పెషల్ ఫిలిం. నేను ‘రంగీలా’ సినిమా తీయడానికి చాలాముఖ్యకారణం ఊర్మిళ. ఊర్మిళ లాంటి అమ్మాయి లేకుంటే నేను రంగీలా సినిమా తీసుండేవాణ్ణి కాదు. అదే ఇప్పుడు నైనా విషయంలో జరిగింది. కొంత మంది యాక్టర్స్ కొన్ని ప్రత్యేక మైన క్యారెక్టర్స్ కోసమే క్రియేట్ అయ్యారనిపిస్తుంది. ఈ సినిమా కాస్టింగ్ కోసం చూస్తున్నప్పుడు అదే జరిగింది. అగస్త్యమంజు మీద నాకెప్పుడూ చాలా నమ్మకం ఉంటుంది. సిన్సియర్ గా వర్క్ చేస్తారు. ఈ లవ్ స్టోరీని ఒక కొత్త పంథాలో సరికొత్తగా చూపించారు. నట్టి కుమార్‌, అంజయ్య గారితో కలిసి ఈ సినిమా చేశాం. వారికి ధన్యవాదాలు. సూరి మొదటి సినిమా అయినా ఏ మాత్రం తగ్గకుండా సూపర్ గా చేశారు. రవిశంకర్ ఫంటాస్టిక్ మ్యూజిక్ ఇచ్చారు. ‘బ్యూటిఫుల్’ అనేది నాకు తెలిసిన ఒక అమ్మాయికి సంబందించిన కథ. నేను గత పది పదిహేనేళ్లుగా లవ్ స్టోరీ జోలికి వెళ్ళలేదు. దానికి రెండు కారణాలు ఒకటి నన్నుఅంతగా ఇన్స్పైర్ చేసిన కథ రాలేదు. రెండు నన్ను అంతగా ఇన్స్పైర్ చేసిన యాక్టర్ దొరకలేదు. అవి రాగానే ఈ సినిమా మొదలుపెట్టాం. బ్యూటిఫుల్ అంటే మనసుకి ఆహ్లాదం కలిగించి మనల్నిఉద్రేకానికి గురిచేసే ఏ ఎమోషన్ అయినా బ్యూటిఫుల్. నేను నా హిట్ ని ఎంత బ్యూటిఫుల్ గా తీసుకుంటానో నా ప్లాఫ్ ని కూడా అంతే బ్యూటిఫుల్ గా తీసుకుంటాను. నా లైఫ్ లో ఎవరి మీద కంప్లైంట్ చేయను..నాకు ఎవరిమీద కోపం రాదు. నేను బ్యూటిఫుల్ కాక పోవచ్చు కానీ నా లైఫ్ మాత్రం బ్యూటిఫుల్ గా గడిపాను” అన్నారు.

దర్శకుడు అగస్త్యమంజు మాట్లాడుతూ – ” ఈ సినిమా అంతా బొంబాయి లో ఉన్న దారవి అనే ఏరియాలో జరుగుతుంది. అది అంత ‘బ్యూటిఫుల్’ ప్లేస్ కాదు. కానీ అక్కడ మనుషులు బ్యూటిఫుల్ గా ఉంటారు. అందుకనే ఈ సినిమాకి ఆ పేరు పెట్టడం జరిగింది’ అన్నారు.

నిర్మాత సి .కల్యాణ్ మాట్లాడుతూ – “సినిమా అయినా, కాంట్రవర్సీ అయినా రాము అంత క్రియేటర్ లేరు. సెన్సేష‌న‌ల్‌ అనే పదం మీతోనే ఉంటుంది. అలానే ఉండాలని కోరుకుంటున్నా.త్వరలో శివ లాంటి మ‌రో మూవీ తీయాలని కోరుకుంటున్నా” అన్నారు.

హీరో ఆకాష్ పూరి మాట్లాడుతూ – ” నా చిన్నప్పటినుండి మానాన్న గారు, ఆయన ఫ్రెండ్స్ అందరూ ఆయన గురించి చెప్తుండేవారు. రామ్ గోపాల్ వర్మ గారి గురించి తెలిసాక ఆయన దగ్గరకు వెళ్లి ఒక ఫోటో దిగాలి అనిపించింది. ఆర్ జి వి గారు నాకు ఫీలింగ్స్ లేవు అంటారు కానీ ‘మెహబూబా’ సినిమా విడుదలై అంతగా ఆడలేదు. ఆరోజు నాకు ఫోన్ చేసి రెండు గంటలు మాట్లాడారు. అంత కేర్ తీసుకుంటారు. ఈ సినిమా పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నా” అన్నారు.

చిత్ర స‌మ‌ర్ప‌కులు టి. అంజయ్య మాట్లాడుతూ – ” ఈ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఒక దర్శకుడు అన్ని జోనర్స్ లో సినిమా తీయడం ఆయనకే చెల్లింది. ఇండస్ట్రీ కి ఒక డిక్షనరీ లాంటివారు. జనవరి 1విడుదలవుతున్న ఈ సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నా” అన్నారు.
ఈ చిత్రానికి పాటలను సిరా శ్రీ అందించగా…సంగీతాన్ని రవి శంకర్ సమకూర్చారు.ఈ చిత్రానికి సమర్పణ: టి.అంజయ్య

నిర్మాతలు: టి నరేష్ కుమార్, టి.శ్రీధర్,

సహ నిర్మాతలు: నట్టి క్రాంతి, నట్టి కరుణ, రచన, ఫోటోగ్రఫీ,

దర్శకత్వం: అగస్త్య మంజు.

New movie from Yerrachira Banner to start on January 27th !!

శ్రీ సుమన్ వేంకటాద్రి ప్రొడక్షన్స్ బేనర్ పై ప్రొడక్షన్ నెం 2గా బేబీ దమ‌రి స‌మ‌ర్ప‌ణ‌లో సి.హెచ్ సత్య సుమన్ బాబు నిర్మిస్తూ దర్శకత్వం వహిస్తున్ననూత‌న చిత్రం జనవరి 27 నుండి ప్రారంభం కానుంది.  ఈ సందర్భంగా..
దర్శక నిర్మాత సి. హెచ్ సత్య సుమన్ బాబు మాట్లాడుతూ – ” ఒక ఐ.ఎ.ఎస్ అధికారి  అవినీతి పై పోరాటం చేసి పూర్తిగా అవినీతిని ఎలా అంతమొందించారు అని తెలియ‌జెప్పే మంచి సందేశాత్మక చిత్రం ఇది. జనవరి 27 నుండి రెగ్యూల‌ర్ షూటింగ్‌ ప్రారంభం కానుంది.
బేనర్: సుమన్ వేంకటాద్రి ప్రొడక్షన్స్,
స‌మ‌ర్ప‌ణ‌: బేబి ద‌మ‌రి,
నిర్మాత, దర్శకుడు:  సి హెచ్ సత్య సుమన్ బాబు,
కథ, మాటలు:  కె. బాలకిషోర్,
సంగీతం: ప్రమోద్ కుమార్.

Katha Kanchiki Manam Intiki Movie Opening

స్వాతి సినిమాస్ పతాకంపై డి.సురేష్ బాబు నిర్మాతగా చాణక్య చిన్న దర్శకత్వంలో అరుణ్ ఆదిత్య, పూజిత పొన్నాడ జంటగా నాటిస్తోన్న “కథ కంచికి మనం ఇంటికి” అనే చిత్రం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభం అయ్యింది. జి.హరినాధ్ నేతృత్వంలో డి.సురేష్ బాబు నిర్మాతగా పిక్ ‌న్ హుక్ సమర్పణలో ఈ చిత్రం తెరకెక్కనుంది.
ఈ కార్యక్రమంలో చిత్ర నిర్మాత డి.సురెష్ బాబు, జి.హరినాధ, శివకుమార్, పిక్ న్ హుక్ సిఇఒ మొనీష్ పత్తిపాటి తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా దర్శకుడు చాణక్య చిన్న మాట్లాడుతూ….
ఈ చిత్రం సరికొత్త కథ కథనాలతో అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే విధంగా ఉంటుందని తెలిపారు.
నిర్మాత డి.సురేష్ బాబు మాట్లాడుతూ….
ఈ సినిమా మా  ప్రొడక్షన్ లో ఒక మంచి చిత్రంగా నిలిచిపోయే సినిమా ఇది. ఈ నెలాఖరులో షూటింగ్ ప్రారంభించి రెండు షెడ్యూల్స్ లో పూర్తి చేస్తామని తెలియజేసారు.
ఈ చిత్రంలో మురళి శర్మ, సత్యం రాజేష్, జయ ప్రకాష్, సాహితి, సత్య, హర్షిని రాయ్, జాహ్నవి, బిందు తదితరులు నటిస్తున్నారు.

సాంకేతిక నిపుణులు:మాటలు:శ్రీనివాస్ తేజ్, కెమెరామెన్: వై.ఎస్ కృష్ణ, సంగీతం: భీమ్స్,ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: పాండు, పిఆర్ఒ: ఏలూరు శ్రీను,నిర్మాత: డి.సురేష్ బాబు, వి.ఎఫ్.ఎక్స్: దుర్గ ప్రసాద్, కథ – స్క్రీన్ ప్లే- దర్శకత్వం: చాణక్య చిన్న.

Aadi birthday Celebrations

హీరోల లైఫ్ లో ఫ్యాన్స్ కూడా ఫ్యామిలీ అయిపోతారు.. అందుకే తన బర్త్ డే
వేడుకల్ని ఫాన్స్ తో సెలబ్రేట్ చేసుకున్నాడు హీరో ఆది. ఫాన్స్ మద్యలో సెలబ్రేట్ చేసుకున్నాడు.  రెండు తెలుగు రాష్ట్రాల నుండి వచ్చిన ఫాన్స్ తో జరిగిన  బర్త్ డే వేడుకల్లో తన రాబోయే చిత్రాల విశేషాలను పంచుకున్నాడు.

ఈ సందర్భంగా హీరో ఆది మాట్లాడుతూ:
‘ఒక సాలిడ్ హిట్ వచ్చినప్పుడే ఫాన్స్ ని కలుద్దాం అనుకునే వాడిని, కానీ జయాపజయాలకంటే ఫాన్స్ ని కలవడం చాలా ముఖ్యం అనుకొని ఈ వేడుకలకు వచ్చాను.నామీద మీరు చూపిస్తున్న అభిమానం చాలా గొప్పది, నాకు ఒక సపోర్ట్ గా
నిలుస్తుంది. వచ్చే యేడాది మీ అందరినీ అలరించే సినిమాలతో రాబోతున్నాను.శశి అని సినిమా రాబోతుంది అది ఒక లవ్ స్టోరీ ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా ఉంటాయి. అలాగే ఒక థ్రిల్లర్ చేయబోతున్నాను. ఫస్ట్ టైం డాక్టర్ గా
కనిపిస్తున్నాను ఈరోజు రిలీజ్ అయిన లుక్ కి చాలా మంచి రెస్సాన్స్ వచ్చింది . చాలా సీరియస్ గా ఉండే థ్రిల్లర్. మంచి కంటెంట్ ఉన్న కథలు ఓకే
చేసాను. తప్పకుండా మిమ్మల్ని ఆనందింపజేసే సినిమాలు తో వస్తాను. నాకోసం మీరంతా ఇక్కడికి వచ్చి నా బర్త్ డే ని మరింత మెమరబుల్ చేసారు. మీరు చూపిస్తున్న అభిమానానికి నా థ్యాంక్స్ ’’ అన్నారు.

నటడు రవిశంకర్ మాట్లాడుతూ:
‘‘ ఆదికి నెక్ట్స్ ఇయర్ మోస్ట్ మెమరబుల్ అవుతుందని నమ్ముతున్నాను.
కంటెంట్ సాలిడ్ గా ఉన్న కథలతో వస్తున్నాడు. శశి సినిమా చాలా బాగా వచ్చింది దానితో పాటు ఒక థ్రిల్లర్ ని చేస్తున్నాడు. ఈ రోజు లుక్ రిలీజ్
అయ్యింది దానికి మంచి రెస్సాన్స్ వస్తుంది ’’ అన్నారు.

హీరో సాయి కుమార్ మాట్లాడుతూ:
‘‘ ఆది నటుడు అవుతాడని అనుకోలేదు..క్రికెట్ లో చాలా బాగారాణిస్తాడనుకున్నాను. ఏదైనా మ్యాచ్ లు చూస్తుంటే అతను ఆ రేంజ్ లో ఉండే
వాడు అనిపిస్తుంటుంది. మాలో ఉన్న స్వరం మా నాన్నగారిది , సంస్కారం అమ్మది, ఆశీర్వాదం భగవంతుడుది, అభిమానం మీది. మానాన్నగారు సాధించిన దాని కంటే కాస్త ఎక్కవు నేను సాధించి ఉండవచ్చు. కానీ ఆది అంతకు మించి
ఎదుగుతాడనే నమ్మకం ఉంది. వచ్చే యేడాది అతను మంచి సినిమాలతో మిమ్మల్ని
అలరిస్తాడని నమ్ముతున్నాను. మేము ప్రయత్నం లో త్రికరణశుద్దిగా ఉన్నాం..ఫలితం అనేది మీ చేతుల్లో ఉంది. కానీ ఆది ఎంచుకున్న కథలు వాటి లుక్స్
కొన్ని చూపించాడు చాలా షాకింగ్ అనిపించాయి. తప్పకుండా మిమ్మల్ని ఆనంద పరుస్తాయి అలరిస్తాయి అని నమ్ముతున్నాను’’ అన్నారు.

Adi saikumar New Concept Based Movie First look launch

హీరో ఆది సాయికుమార్ కొత్త కాన్సెప్ట్ తో ప్రేక్షకులను థ్రిల్ చేసేందుకు రెడీ అవుతున్నాడు . పుట్టిన రోజు సందర్భంగా కొత్త కాన్సెప్ట్ తో తెరకెక్కబోతున్న చిత్రం కాన్సెప్ట్ లుక్ ని విడుదల చేసింది చిత్ర యూనిట్. అవుట్ అండ్ అవుట్ క్రైమ్ థ్రిల్లర్ గా రాబోతున్న ఈ చిత్రం ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. త్వరలోనే సెట్స్ మీదకు వెళ్ళ బోయే ఈ థ్రిల్లర్ లో ఆది ఒక ఫారెన్సిక్ డాక్టర్ గా థ్రిల్ చేయబోతు్న్నాడు. మరుధూరి ఎంటర్ టైన్మెంట్స్, చాగంటి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించే ఈ చిత్రానికి నిర్మాతలు మరుధూరి వినోద్, చాగంటి శాంతయ్య.

ఈ మూవీ లో ఆది ఒక కొత్త్ పాత్రలో పరిచయం కాబోతున్నాడు. శివ శంకర్ దేవ్ ఈ చిత్రం తో దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. ఆద్యంతం ప్రేక్షకుల్ని థ్రిల్ చేసే అంశాలతో స్ర్కిప్ట్ ని పకడ్బందీగా రెడీ చేసిన దర్శకుడు శివ శంకర్ దేవ్ ఈ చిత్రంలో ఇప్పటి వరకూ తెలుగులో రాని కొత్త కాన్సెప్ట్ ని తెరమీద చూపించబోతున్నాడు. త్వరలోనే సెట్స్ మీదకు వెళ్ళే ఈ చిత్రంలోని ఇతర పాత్రల వివరాలు త్వరలోనే తెలియజేస్తారు.

బ్యానర్స్:
మరుధూరి ఎంటర్ టైన్మెంట్స్
చాగంటి ప్రొడక్షన్స్
నిర్మాతలు : మరుధూరి వినోద్, చాగంటి శాంతయ్య.
డైరెక్టర్ : శివశంకర్ దేవ్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: ఎమ్. సాయికిరణ్, ప్రతాని శ్రీనివాస్ గౌడ్, అనీల్ మైలాపురమ్, పి.ఆర్.ఓ. జియస్ కె మీడియా

‘Amrutharamam’ Trailer launch

రామ్ మిట్టకంటి, అమితా రంగనాథ్ జంటగా నటించిన చిత్రం అమృతరామ్. సురేందర్
కొంటాడి దర్శకత్వంలో ఎస్ఎన్ రెడ్డి నిర్మించిన ఈ మూవీ ట్రైలర్ విడుదలైంది.ఎన్ఎస్ పర్సు సంగీత సారథ్యంలో ఇప్పటికే విడుదలైన పాటలు ఆడియోన్స్ ను ఆకట్టుకోగా తాజాగా విడుదలైన ట్రైలర్ సినిమాపై ఆసక్తిని మరింత రేకెత్తిస్తోంది. అమృత- రామ్ ల ప్రేమకథకు దృశ్యరూపం ఈ మూవీ. ఆ జంట మధ్య జరిగే సంఘర్షణ, రామ్ ను అమృత ఎంత గాఢంగా ప్రేమించింది. చివరకు వారి ప్రేమ ఎలాంటి త్యాగాన్ని కోరుకుందో రెండు నిమిషాల ట్రైలర్ లో వివరించాడు దర్శకుడు సురేందర్ కొంటాడి
.

రామ్ నా కోసం వస్తున్నాడంటూ అమృత మాటలతో మొదలైన ట్రైలర్ … ప్రేమలో
సంతోషాలే కాదు.. త్యాగాలు కూడా ఒక భాగమనే మాటలతో ముగుస్తుంది. అమృతరామమ్
ఒక ఫీల్ గుడ్ లవ్ స్టోరీఅని చెప్పకనే చెబుతున్నాయి..ఇప్పటికే ఇండస్ట్రీ
ప్రముఖుల ప్రశంసలందుకున్న ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ సమర్పించడం విశేషం.. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని త్వరలోనే ఈ
సినిమా విడుదల కానుంది.

నటీ నటులు:
హీరో: రామ్ మిట్టకంటి,హీరోయిన్: అమిత రంగనాథ్‌,శ్రీజిత్ గంగాధర్,ఎమిలి మార్టిన్,
సారా జోన్స్,శుక్రుతి నారాయణ్.చెరుకూరి జగదీశ్వర్‌రావ్,వంశీ దావులూరి

సాంకేతిక నిపుణులు:

మ్యూజిక్ డైరెక్టర్: ఎన్ ఎస్ ప్రసు
ఎడిటర్: కార్తీక శ్రీనివాస్
పిఆర్వో : జిఎస్ కె మీడియా
సినిమాటోగ్రఫీ: సంతోష్ శానమోని
నిర్మాత: యస్ ఎన్ రెడ్డి
రచన-దర్శకత్వం: సురేందర్ కొంటాడ్డి