Home Blog Page 987

‘Sarileru Neekevvaru’ Anthem’ full song released

సూపర్‌స్టార్‌ మహేష్‌ హీరోగా దిల్‌రాజు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ సమర్పణలో జి.ఎం.బి.ఎంటర్‌టైన్‌మెంట్‌, ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకాలపై యంగ్‌ టాలెంటెడ్‌ డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న అవుట్‌ అండ్‌ అవుట్‌ మాస్‌ ఎంటర్‌టైనర్‌ ’సరిలేరు నీకెవ్వరు’. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో ప్రత్యేక పాత్రలో లేడీ అమితాబ్‌ విజయశాంతి నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది. ఇప్ప‌టికే  విడుదలైన టీజర్‌, మాస్‌ సాంగ్‌, మెలొడి సాంగ్, రొమాంటిక్ సాంగ్‌కి టెర్రిఫిక్‌ రెస్పాన్స్‌ రాగా ఈ చిత్రం నుండి అంద‌రూ ఎదురు చూస్తున్న ’సరిలేరు నీకెవ్వరు’ ఆంథమ్ ఫుల్ సాంగ్‌ను ఈ రోజు సాయంత్రం 05.04 గంటలకు విడుదల చేసింది చిత్ర యూనిట్.

“భగ భగ భగ భగ మండే నిప్పులవర్షమొచ్చినా జనగణమన అంటూనే దూకే వాడే సైనికుడు..పెళ పెళ పెళ పెళ మంటూ మంచు తుఫాను వచ్చినా వెన‌కడుగే లేదంటూ దాటే వాడే సైనికుడు..సరిలేరు నీకెవ్వరు నువ్వెళ్ళే రహదారికి జోహారు..సరిలేరు నీకెవ్వరు ఎనలేని త్యాగానికి నువ్వే మారుపేరు…“అంటూ సాగే ఈ థీమ్‌ సాంగ్‌కి అద్భుతమైన సాహిత్యాన్ని అందించారు దేవి శ్రీ ప్రసాద్‌. యూరోప్ లోని అతి పెద్ద ఆర్కెస్ట్రా్ల్లో ఒక‌టైన‌ మేసెడోనియన్‌ సింఫనీ ఆర్కెస్ట్రా్తో రికార్డ్ చేశారు  దేవి శ్రీ ప్రసాద్‌. లెజెండరీ సింగర్‌ శంకర్‌ మహదేవన్‌ ఈ పాటని హృద్యంగా ఆలపించారు.

జనవరి 5 ఆదివారం సాయంత్రం 5:04నిమిషాలకు  హైద‌రాబాద్ లాల్‌బహదూర్‌ స్టేడియంలో అభిమానుల సమక్షంలో గ్రాండ్‌గా ‘సరిలేరు నీకెవ్వరు మెగా సూపర్‌ ఈవెంట్`ను నిర్వహించనున్నారు. ఈ కార్య‌క్ర‌మంలో మెగాస్టార్‌ చిరంజీవి ముఖ్య అతిథిగా పాల్గొనబోతున్నారు. సంక్రాంతి కానుక‌గా జనవరి 11, 2020న  ప్రపంచవ్యాప్తంగా విడుద‌ల‌చేయ‌నున్నవిష‌యం తెలిసిందే..
సూపర్‌స్టార్‌ మహేష్‌, రష్మిక మందన్న, ప్రత్యేక పాత్రలో లేడీ అమితాబ్‌ విజయశాంతి, రాజేంద్రప్రసాద్‌, ప్రకాష్‌రాజ్‌, సంగీత, బండ్ల గణేష్ త‌దిత‌రులు నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్‌, రత్నవేలు, కిశోర్‌ గరికిపాటి, అజ‌య్ సుంక‌ర‌, త‌మ్మిరాజు, రామ్‌లక్ష్మణ్‌, యుగంధర్ టి. ఎస్‌.కృష్ణ సాంకేతిక వర్గం.

King Nagarjuna Unveiled The Teaser Of Samudra ‘Jai Sena’

శ్రీకాంత్‌, సునీల్‌ ప్రధాన పాత్రల్లో శ్రీకార్తికేయ, అభిరామ్‌, ప్రవీణ్‌, హరీష్‌ గౌతమ్‌లను పరిచయం చేస్తూ వి.విజయలక్ష్మి సమర్పణలో శివ మహాతేజ ఫిలిమ్స్‌ పతాకంపై వి.సముద్ర దర్శకత్వంలో వి.సాయిఅరుణ్‌ కుమార్‌ నిర్మిస్తున్న చిత్రం ‘జై సేన’. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రంలోని పాటలకి మంచి రెస్పాన్స్‌ వస్తోంది. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా ఈ చిత్రం టీజర్‌ను డిసెంబర్‌ 23న కింగ్‌ నాగార్జున విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో దర్శకులు సముద్ర, నటులు కార్తికేయ, ప్రవీణ్‌, శిరీష్‌ రెడ్డి, హరీష్‌, శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

కింగ్‌ నాగార్జున మాట్లాడుతూ – ”ముందుగా సముద్రకి ఆల్‌ ది బెస్ట్‌. ఆయన స్టోరీ, స్క్రీన్‌ ప్లే, దర్శకత్వం వహించిన ‘జై సేన’ త్వరలో విడుదలవుతుంది. ‘జైసేన’ టీం అందరికి పేరు పేరునా ఆల్‌ ది బెస్ట్‌” అన్నారు.
దర్శకుడు సముద్ర మాట్లాడుతూ – ”శివమహాతేజ ఫిలిమ్స్‌లో నిర్మించిన చిత్రం ‘జై సేన’. హీరో సునీల్‌, గోపిచంద్‌, నాగబాబు విడుదల చేసిన పాటలకు మంచి రెస్పాన్స్‌ వస్తోంది. ఇప్పుడు నాగార్జునగారు టీజర్‌ను విడుదల చేశారు. అంతకన్నా మంచి రెస్పాన్స్‌ వస్తుందని ఆశిస్తున్నాం. నా మీద ఉన్న అభిమానంతో టీజర్ రిలీజ్ చేసిన నాగార్జున గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అందరి అభిమానులు, రెండు రాష్ట్రాల ప్రజలు తప్పకుండా చూడాల్సిన చిత్రం ‘జైసేన’. మా సినిమాకి అందరి ఆశిస్సులు ఉండాలని కోరుకుంటున్నా” అన్నారు.
శ్రీకాంత్‌, సునీల్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం ద్వారా శ్రీకార్తికేయ, అభిరామ్‌, ప్రవీణ్‌, హరీష్‌గౌతమ్‌ పరిచయం అవుతున్నారు. అజయ్‌ ఘోష్‌, మధు, ఆజాద్‌, ధనరాజ్‌, వేణు, చమ్మక్‌ చంద్ర తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు: తిరుమల శెట్టి సుమన్‌, పార్వతిచందు, పాటలు: అభినయ్‌ శ్రీను, సిరాశ్రీ, సంగీతం: రవిశంకర్‌, డ్యాన్స్‌: అమ్మారాజశేఖర్‌, అజయ్‌, ఫైట్స్‌: కనల్‌ కన్నన్‌, నందు, రవివర్మ, కెమెరా: వాసు, కో ప్రొడ్యూసర్స్‌: పి.శిరీష్‌ రెడ్డి, దేవినేని శ్రీనివాస్‌, నిర్మాత: వి.సాయి అరుణ్‌ కుమార్‌, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వి.సముద్ర.

Vijaya Bheri Arts New Film Production House Logo Launch

సీనీ ప్రముఖులు మురళి మోహన్,వి.కె.నరేష్,వీరుపోట్ల,బాబు మోహన్,అంబికా కృష్ణ లు.. విష్ణు బొప్పన  నూతన చిత్ర నిర్మాణ సంస్థ   విజయభేరీ ఆర్ట్స్ లోగో ను జయభేరి క్లబ్ లో బుల్లి తెర అవార్డ్స్ ఫంక్షన్ లో లాంచ్ చేశారు.*
విజయభేరి ఆర్ట్స్ సంస్థ అధినేత గతంలో వి.బి.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ద్వారా 2014 నుండి తెలుగు సినీ టీవీ డైరెక్టరీ ప్రచురిస్తూ, బుల్లితెర తో పాటు, వెండి తెర అవార్డులు అందిస్తున్నారు.

ఈ సందర్బంగా- విష్ణు బొప్పన మాట్లాడుతూ-* .సినీ ప్రముఖుల చేతుల మీదుగా లాంచ్ చేసిన విజయభేరి ఆర్ట్స్ లో నేను నిర్మించ బోయే చిత్రాలకు మంచి టాలెంట్ ఉన్న నూతన నటీ నటులను ప్రోత్సాహిస్తూ మా సంస్థ లో ప్రారంభమయ్యే ప్రొడక్షన్ నెంబర్ 1 చిత్రానికి ఆర్టిస్ట్,టెక్నీషన్ల వివరాలను త్వరలో తెలియ చేస్తానని అన్నారు.

మురళీమోహన్  మాట్లాడుతూ** -. విష్ణు చిన్న కళా కారుడుగా కెరీర్ మొదలుపెట్టి, నిర్మాతగా మారి, గత 5 సంవత్సరాలుగా ఇలాంటి అవార్డ్స్ కార్యక్రమం చేయడం  అభినందనీయం.నా జయభేరి ఆర్ట్స్ ప్రొడక్షన్స్ ను ఇన్స్పిరేషన్ తీసుకుని తను విజయభేరీ ఆర్ట్స్ అను సంస్థను స్థాపించడం చాలా సంతోషం. ఈ ప్రొడక్షన్ లో మంచి సినిమాలు తీసి ఏంతో మందికి ఉపాధి కల్పించాలని అన్నారు..

నటుడు సీనియర్ నరేష్ మాట్లాడుతూ* – విష్ణు  విజయభేరి ఆర్ట్స్ సంస్థ  ను మొదలుపెట్టడం చాలా సంతోషం. ఈ సంస్థ లో మంచి చిత్రాలు నిర్మించి మా… ఆర్టిస్ట్ లకు చాలా అవకాశాలు కల్పించాలని కోరుకుంటున్నానని అన్నారు

దర్శకుడు వీరుపోట్ల మాట్లాడుతూ* — విష్ణు గారి బ్యానర్ లో కొత్త టాలెంట్ తో వచ్చే దర్శకులకు అవకాశాలు కల్పించి ఉత్తమమైన చిత్రాలు నిర్మించాలని అన్నారు.

అంబికా కృష్ణ మాట్లాడుతూ:* -విష్ణు లాంచ్ చేసిన విజయభేరి ఆర్ట్స్ లో ఎంతో మంది ఆర్టిస్ట్ లకు అవకాశం కల్పించి మంచి చిత్రాలు తీయాలని అన్నారు..

VB Entertainments Bullitera Awards 2019

వి.బి. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ 2014 నుంచి తెలుగు సినిమా టివి, సినీ డైరెక్టరీ ప్రచురిస్తూ బుల్లితెర అవార్డులు అందిస్తున్న విషయం తెలిసిందే. విబి ఎంటర్‌టైన్‌మెంట్‌ విష్ణు బొప్పన ప్రతి ఏటా లాగే ఈఏడాది కూడా టీవీ అవార్డులు  అంగరంగ వైభవంగా జయభేరి క్లబ్ నందు నిర్వహించారు.  అవార్డుల కార్యక్రమం ద్వారా నటీనటులకు టెక్నీషియన్లను ప్రోత్సాహాన్నందిస్తున్నారు. గ‌త 5 సంవ‌త్స‌రాలుగా ప్రతి ఛానెల్ నుండి అన్ని క్యాటగరి లలో బుల్లి తెర అవార్డుల‌ను అందిస్తున్న విష్ణు  గ‌త‌ రెండు ఏళ్ళ‌ నుంచి వెండి తెర అవార్డుల‌ను కూడా అందించ‌డం విశేషం.సరికొత్తగా విజయభేరీ ఆర్ట్స్ ప్రొడక్షన్స్ ను స్థాపించి ప్రొడక్షన్ రంగం లోకి అడుగు పెట్టారు.వి.బి.ఎంటర్టైన్మెంట్స్ బుల్లి తెర అవార్డుల వేదికపై సినీ ప్రముఖులు మురళి మోహన్,వి.కె.నరేష్,వీరుపోట్ల,బాబు మోహన్,అంబికా కృష్ణ లు విష్ణు బొప్పన గారి విజయభేరీ ఆర్ట్స్ సంస్థ లోగో ను లాంచ్ చేశారు.

ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిధి గా వచ్చిన మురళి మోహన్ గారు, బుల్లితెర ఉత్తమ నటీ,నటులకు అవార్డులను అందజేసారు..
జెన్నీ కు- లైఫ్ టైం అచీవమెంట్ అవార్డు.

సినీ,టీవీ నటులు రాజ్ కుమార్ కు-లెజెండరీ అవార్డ్.
వినోదబాలకు-అల్ రౌండర్ అవార్డ్.
ప్రసన్నకుమార్ కు-సోషల్ అవెర్నెస్ అవార్డుల తో పాటు బుల్లి తెర ఉత్తమ నటీనటుల అవార్డ్,ఉత్తమ ఫిమేల్ విలన్ అవార్డ్ లు,స్పెషల్ జ్యురీ అవార్డ్ లను అందజేశారు.
.

అనంతరం మురళీమోహన్ గారు మాట్లాడుతూ* -ఏ కళాకారుడికైనా ఇలాంటి అవార్డులను అందుకోవడం వారికి ఆరోజు పండుగ రోజె. విష్ణు చిన్న కళా కారుడుగా కెరీర్ మొదలుపెట్టి నిర్మాతగా మారి, గత 5 సంవత్సరాలుగా ఇలాంటి అవార్డ్స్ కార్యక్రమం చేయడం,వీరికి స్పాన్సర్లు తోడు ఉండడం,రాష్ట్ర ప్రభుత్వాలు చేయాల్సిన పనిని వీరు చేయడం అభినందనీయం.నా జయభేరి ఆర్ట్స్ ప్రొడక్షన్స్ ను ఇన్స్పిరేషన్ తీసుకుని తను విజయభేరీ ప్రొడక్షన్ ను స్థాపించడం చాలా సంతోషం. ఈ ప్రొడక్షన్ లో మంచి సినిమాలు తీసి ఏంతో మందికి ఉపాధి కల్పించాలని అన్నారు..

నటుడు సీనియర్ నరేష్ మాట్లాడుతూ -గత 5 సంవత్సరాలుగా బుల్లితెర అవార్డ్స్ లను అందజేస్తున్న విష్ణువిజయభేరి ప్రొడక్షన్ మొదలుపెట్టడం చాలా సంతోషం. ఈ సంస్థ లో మంచి చిత్రాలు నిర్మించి మా ఆర్టిస్ట్ లకు చాలా అవకాశాలు కల్పించాలని కోరుకుంటున్నానని అన్నారు.

దర్శకుడు వీరుపోట్ల మాట్లాడుతూ — విష్ణు గారి బ్యానర్ లో కొత్త టాలెంట్ తో వచ్చే దర్శకులకు అవకాశాలు కల్పించి ఉత్తమమైన చిత్రాలు నిర్మించాలని అన్నారు.

 *బాబుమోహన్ మాట్లాడుతూ -*విష్ణు అన్ని రంగాల కళా కారులకు అవార్డుల ద్వారా  ప్రోత్సహించి వారికి నూతన ఉత్తేజాన్ని ఇవ్వడం చాలా ఆనందంగా ఉందని అన్నారు.

 అంబికా కృష్ణ మాట్లాడుతూ: -విష్ణు లాంచ్ చేసిన విజయభేరి ప్రొడక్షన్ లో ఎంతో మంది ఆర్టిస్ట్ లకు అవకాశం కల్పించి మంచి చిత్రాలు తీయాలి.విష్ణు చేస్తున్న బుల్లి తెర అవార్డ్స్ లను ఇరు తెలుగు రాష్ట్రాలు ముందుకు వచ్చి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు..
 *విష్ణు బొప్పన మాట్లాడుతూ
గత 5 సంవత్సరాలుగా నేను చేస్తున్న ఈ కార్యాక్రమానికి అండగా నిలిచిన స్పాన్సర్ లకు ధన్యవాదాలు.సినీ ప్రముఖుల చేతుల మీదుగా లాంచ్ చేసిన విజయభేరి ప్రొడక్షన్ లో నేను నిర్మించ బోయే చిత్రానికి ఆర్టిస్ట్,టెక్నీషన్ల వివరాలను త్వరలో తెలియ చేస్తానని అన్నారు.
నటుడు రాజకుమార్ మాట్లాడుతూ– స్వర్గస్తులైన దాసరి గారి ఆశీస్సులతో 1980 లో ‘అమ్మ రాజీనామా’ చిత్రం తో కెరీర్ మొదలు పెట్టిన నేను సినిమా నుండి సీరియల్ వైపు అడుగులు వేయడం జరిగింది.అందరి ఆశీస్సుల తో  ఈరోజు నాకు ఇష్టమైన మురళీమోహన్ సార్  చేతుల మీదుగా లెజెండరీ అవార్డ్ అందుకోవడం గర్వాంగా ఉంది.ఇందుకు కారకుడైన విష్ణు బొప్పన కు నా కృతజ్ఞతలు అని అన్నారు..

బెస్ట్ మేల్  యాక్టర్ అవార్డులు.. ..
1)శ్రీ వాసుదేవ్- లాహిరి లాహిరి లాహిరి లో..
2)సిద్దార్థ వర్మ -మట్టిగాజులు.
3)ఆలీ రజా-మాటే మంత్రము.4)సాయికిరణ్-కోయిలమ్మ..

 బెస్ట్ ఫిమేల్ యాక్టర్స్ అవార్డులు*
1)దీపిక-నాలుగు స్తంబాలాట.
2)రేష్మి-పౌర్ణమి.
3)పూజ మూర్తి-గుండమ్మ కథ.
4)ప్రియాంక-మౌనరాగం

 స్పెషల్ జ్యురీ అవార్డ్స్
బిగ్ బాస్ ఫెమ్-పునర్నవి.బాబీ లహరి,రాజశ్రీ,జ్యోతిరెడ్డి,మౌనిక,బాబిశ్రీ,రాగిణి

ఈ కార్యక్రమానికి స్పాన్సర్స్ గా వ్యవహరించిన యస్.ఆర్.ఆర్.ఇన్ఫ్రాస్ట్రక్చర్- శ్రీనివాసరెడ్డి,ప్రగతి ఇన్ఫ్రా డేవలపర్స్- సునీల్,అహల్య టౌన్ షిప్- ఉస్మాన్,స్పెస్ విజన్-నరసింహారావు,ప్లాంటేరిఎస్-బాబురావు,శతాబ్ది టౌన్ షిప్-శ్రీనివాసరెడ్డి,ఫిల్మ్ ట్రీ-గోవిందరావు,భారతి ఇన్ఫ్రా-శ్రీ భారతి,పక్కాలోకల్-కోటి
గార్లకు ముఖ్య అతిధులుగా వచ్చిన అంబికాకృష్ణ,బాబుమోహన్ లు  శాలువా కప్పి సత్కారం చేయడం జరిగింది.

Anil Ravipudi launched Bombhat movie song

ద‌ర్శ‌కేంద్రుడు కె.రాఘ‌వేంద్ర‌రావు స‌మ‌ర్ప‌ణ‌లో సుచేత డ్రీమ్ వర్క్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై `ఈన‌గ‌రానికి ఏమైంది` ఫేమ్ సుశాంత్ హీరోగా, సిమ్రాన్, చాందిని హీరోయిన్స్‌గా రాఘ‌వేంద్ర వర్మ(బుజ్జి) ద‌ర్శ‌క‌త్వంలో విశ్వాస్ హ‌నూర్‌క‌ర్ నిర్మిస్తున్న చిత్రం `బొంబాట్`. జోష్ బి సంగీతం అందిస్తున్న ఈ సినిమా తొలి లిరిక‌ల్ వీడియో సాంగ్‌ను ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి విడుద‌ల చేశారు.

ప‌ట్టి జ‌డ‌ప‌ట్టి మెడ‌ప‌ట్టి నిను గెంటేస్తానే
తిట్టి నిను కొట్టి పొగ‌బెట్టి నిను త‌రిమేస్తానే
పెట్టి మందెట్టి ప‌డ‌గొట్టి నే మెచ్చిన ల‌వరుని చుట్టి మ‌డ‌తెట్టి నీ బుట్టికేసావే
నే ముద్దులు పెట్టిన ఎంగిలి పొంగ‌లి అనుకుంటున్నావే …………..చుప్ప‌నాతి హీ ఈజ్ మై ఓన్ ల‌వ‌ర్ అంటూ సాగే ఈ పాట హీరోయిన్ త‌న ప్రేమికుడు మిస్ అవుతున్నాడ‌ని మ‌రో అమ్మాయితో తిరుగుతున్నాడ‌ని కోపంగా పాడుతున్న‌ట్లు తెలుస్తుంది. ఈ సాంగ్‌ను జ‌ల‌స్ సాంగ్ ఆఫ్ ది డికేట్ అని చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది.
ఈ పాట‌ను ప్ర‌ముఖ పాట‌ల ర‌చ‌యిత రామ‌జోగయ్య శాస్త్రి రాయ‌గా, శ‌ర‌ణ్య శ్రీనివాస్ పాడారు. జోష్‌.బి సంగీత సార‌థ్యం వ‌హిస్తున్నారు.

రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతున్న ఈ సినిమా ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటుంది. త్వ‌ర‌లోనే సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు సినిమాను తీసుకురావ‌డానికి ప్లాన్  చేస్తున్నారు.

Ram’s tryst with rifle shooting!

వెండితెర మీద డమ్మీ గన్ లతో ప్రత్యర్థుల మీదికి విరుచుకుపడే హీరోకి అసలైన గన్ లు చేతికి వస్తే ఎలా ఉంటుంది. అలాంటి అవకాశం మన ఇస్మార్ట్ శంకర్, టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేనికి వచ్చింది. రక్షణ దళాలు, పారామిలిటరీ దళాలు, 
వివిధ పోలీసు శాఖలకు గత 25 ఏళ్లుగా తుపాకులు, ఏకే 47 లాంటి ఆయుధాలను రూపొందించి సరఫరా చేసే జెన్ టెక్నాలజీస్ సంస్థ హైదరాబాద్ లో  నిర్వహించిన రజతోత్సవ కార్యక్రమానికి రామ్  ని  ముఖ్య అతిథిగా 
ఆహ్వానించింది. అలాంటి అవకాశం వస్తే ఈ ఎనర్జిటిక్ స్టార్ ఎలా ఊరుకుంటారు. గన్ చేతికి తీసుకుని ఎలా కాలిస్తే టార్గెట్ రీచ్ అవుతుందో తెలుసుకున్నారు. తన సినిమాలకు బాగా పనికి వస్తుందనుకుని ఆయుధాలకు సంబంధించిన సమాచారమంతా అడిగిమరీ తెలుసుకున్నారు. ఎంఎంజీ, ఏజీఎల్, ఏటీజీఎమ్, సీటీఎస్ఆర్, ఏకే 47… ఇలా అన్ని రకాల ఆయుధాల సమాచారం 
తెలుసుకోవడమే కాకుండా , చేతుల్లోకి తీసుకుని ప్రయోగాలు కూడా మొదలు పెట్టేశారు. షూటింగ్ రేంజ్ ఎలా ఉంటుందో ప్రత్యక్ష ప్రయోగం కూడా చేశారు.

ఈ అనుభవం గురించి రామ్ మాట్లాడుతూ ‘అరుదైన అనుభవమిది… సినిమా లాగా లేదు . చాలా కొత్తగానూ, థ్రిల్లింగ్ గానూ ఉంది. ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు ఈ సంస్థవారికి థాంక్స్ చెప్పాలి’అన్నారు.
ఈ సంస్థ ఎండీ, ఛైర్మన్ అశోక్ అట్లూరి ఈ సందర్భంగా రామ్ ను జ్ఞాపికతో సత్కరించారు. సంస్థ ప్రెసిడెంట్ కిషోర్ దత్ అట్లూరి,
బిజినెస్ హెడ్ రవికుమార్ చెన్నా తదితరులు తమ కార్యక్రమానికి హాజరైనందుకు రామ్ కు కృతజ్ఞతలు తెలిపారు.

Hero Sri Simha interview about ‘Mathu Vadakara’

నాన్నపై ఆధారపడకుండా నా కాళ్లపై నేను నిలబడి  నా సొంతంగా ఏదైనా సాధిస్తే సంతృప్తిగా వుంటుంది.అందుకే నాన్నకు తెలియకుండానే సుకుమార్ గారి దగ్గర సహాయ దర్శకుడిగా, మత్తు వదలరాతో హీరోగా కెరీర్‌ను మొదలుపెట్టాను అంటున్నారు హీరో శ్రీసింహా. ప్రముఖ సంగీత దర్శకుడు ఎమ్.ఎమ్.కీరవాణి తనయుడు శ్రీసింహా హీరోగా పరిచయమవుతున్న చిత్రం మత్తు వదలరా. రితేష్‌రానా దర్శకత్వంలో  ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం గురించి శ్రీసింహాతో జరిపిన ఇంటర్వ్యూ ఇది. 

మత్తువదలరా సినిమా ప్రయాణం ఎలా ఆరంభమైంది?
నటన పట్ల నాకున్న ఆసక్తి గురించి నిర్మాత చెర్రికి చాలా రోజులుగా తెలుసు. రంగస్థలం ప్రారంభంకావడానికి ముందు మైత్రీ మూవీస్ నిర్మాతలకు దర్శకుడు రితేష్ ఈ కథ వినిపించారు.  పెద్ద సినిమాలతో వారు బిజీగా ఉండటంతో సినిమా వెంటనే ప్రారంభంకాలేదు. రంగస్థలం సినిమాకు నేను అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాను. ఆ సమయంలో  నటుడిగా రాణించగలననే, నాతో సినిమా చేయచ్చనే నమ్మకం నిర్మాతలు నవీన్, రవిశంకర్‌లో కలిగింది. సినిమా అంగీకరించిన తర్వాత మూడు నెలల పాటు నటనలో శిక్షణ తీసుకున్నాను. నిర్మాత చెర్రి తన బ్యానర్ క్లాప్ ఎంటర్‌టైనర్‌పై సినిమాను ప్రారంభించారు.రితేష్‌కు నాపై నమ్మకం కలిగేలా ఆరు నెలల పాటు వర్కషాప్స్, ఆడిషన్స్ చేశారు. నాన్నపై ఆధారపడకుండా నా సొంతంగా సాధించినది ఏదైనా సంతృప్తి ఉంటుంది. అందుకే నాన్నకు  తెలియకుండా సినిమా చేశాను.
మీలోని నటుడ్ని ఎలా గుర్తించారు?
బాలనటుడిగా సినిమాలు చేశాను. అప్పుడే నటన పట్ల నాకున్న ఆసక్తి గురించి ఇంట్లో వారికి అర్థమైంది. అయితే నటననే కెరీర్‌గా ఎంచుకోవాలనే ఆలోచన మాత్రం ఉండేది కాదు. డిగ్రీ తర్వాత  రంగస్థలం సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాను.  అదే సమయంలో మత్తువదలరా సినిమాలో నటించే అవకాశం రావడంతో హీరోగా మారాను.
సినిమాలో నటిస్తున్న విషయం తెలియగానే కీరవాణి, రాజమౌళి ఎలాంటి సలహాలు ఇచ్చారు?
నటన పరంగా వారు ఎలాంటి సలహాలు ఇవ్వలేదు. నాన్న, రాజమౌళిగారు పనిచేసే విధానం నుంచే మేము  ఎక్కువగా నేర్చుకున్నాం. వారి ప్రభావంపై మాపై చాలా ఉంది. ఇండస్ట్రీలో ఎలా ఉండాలి, పనులు ఎలా జరుగుతాయో వారి నుంచే నేర్చుకొని అలవాటుపడ్డాం.
బాలనటుడిగా ఎన్ని సినిమాలు చేశారు?
యమదొంగలో చిన్ననాటి ఎన్టీఆర్‌గా కనిపించాను. చిన్నతనం నుంచి నేను ఎన్టీఆర్ అభిమానిని. ఆయన నా సినిమా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేయడం నమ్మకాన్ని ప్రోత్సాహాన్నించింది.  రంగస్థలం నుంచి రామ్‌చరణ్‌తో పరిచయం ఉంది.  నటనకు సంబంధించి ఆయన చాలా సలహాలు ఇచ్చారు. రానా ట్రైలర్‌ను విడుదలచేశారు.
సుకుమార్ దగ్గర మీరు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు కదా?ట్రైలర్ చూసి ఆయన ఏమన్నారు?
ట్రైలర్ చూసి ఆయన సంతోషంగా ఫీలయ్యారు. నాకు ఫోన్ చేసి బాగుందని అభినందించారు. సినిమా తొలిరోజు చూస్తానని మాటిచ్చారు.
హీరోగా నటిస్తున్న విషయం తెలియగానే రాజమౌళి ఏమన్నారు?
హీరోగా పరిచయం అవుతున్నానని  తెలియగానే భవిష్యత్తు ఎలా ఉంటుంది, ప్రతిభను నిరూపించుకోగలుగుతాడా లేదా  అని రాజమౌళిగారు తొలుత భయపడ్డారు.   అలాగని నటన వద్దని ఏ రోజు ఆపలేదు.  పూర్తి స్వేచ్ఛనిచ్చారు.  కష్టపడి సినిమా చేయమని ప్రోత్సహించారు.
తొలిసినిమా ప్రేమకథనో, మాస్ సినిమానో ఎంచుకోలేదు ఎందుకని?
సినిమాలో ప్రేమ, పాటలు, ఫైట్స్ ఉంటేనే మంచి ఆరంభం అవుతుందని, పెద్ద స్టార్ అవుతారనే అనుకోవడం సరికాదు. కథ బాగుంటే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు. ఈ కథ ఉత్కంఠను పంచుతుంది. పాటలు లేకపోయినా ఎంటర్‌టైన్ చేస్తుందనే నమ్మకంతో అంగీకరించాను.
మత్తు వదలరా కథ ఏమిటి?
ఎప్పుడూ నిద్రమత్తులో ఉండే డెలివరీబాయ్‌గా సినిమాలో నేను కనిపిస్తాను. ఊరి నుంచి వచ్చి చాలిచాలని జీతంతో పనిచేసే అతడు ఓ సమస్యలో చిక్కుకుంటాడు. ఆ ఇబ్బంది నుంచి ఎలా బయటపడ్డాడన్నది ఆసక్తిని రేకెత్తిస్తుంది. మూడు రోజుల్లో జరిగే కథ ఇది. స్క్రీన్‌ప్లే ప్రధానంగా సాగుతుంది. ఒక్క నిమిషం కూడా బోర్ కొట్టదు. ఒక్కో చిక్కుముడి వీడితూ ఆద్యంతం ఉత్కంఠను పంచుతుంది.
ఈ సినిమాతోనే మీ అన్నయ్య కాలభైరవ కూడా సంగీత దర్శకుడిగా పరిచయమయ్యారు. ఒకేసారి మీరు ఇద్దరు చిత్రసీమకు పరిచయం కావడం ఎలా అనిపిస్తుంది?
నేను హీరోగా, అన్నయ్య సంగీతదర్శకుడిగా మారాలనే కలలు నేరవేర్చుకోవాలని అనుకున్నాం. కానీ ఇద్దరం కలిసి ఒకే సినిమాతో చిత్రసీమకు పరిచయం అవుతామని ఎప్పుడూ ఊహించలేదు.  ఆ ఆలోచన మాకు ఎప్పుడూ రాలేదు.
వృత్తిపరంగా అన్నయ్య, మీకు మధ్య అనుబంధం ఎలా ఉండేది?
ఈ సినిమాలోకి చివరగా భాగమైన సాంకేతిక నిపుణుడు అన్నయ్య కాలభైరవనే. ఇందులో పాటలుండవు. రీరికార్డింగ్ సమయంలో  తమ్ముడిగా కొన్ని సలహాలు ఇచ్చారు. అంతేకానీ హీరోగా అన్నయ్య పనిలో జోక్యం చేసుకోలేదు.
రాజమౌళి తనయుడు కార్తికేయతో పాటు మీ స్నేహితులు సినిమా చూసి ఏమన్నారు?
కార్తికేయకు మాపై చాలా నమ్మకం ఉంది. తన ప్రొడక్షన్స్‌లో ముగ్గురం కలిసి సినిమా చేసేలా కార్తికేయ ప్లాన్ చేస్తున్నారు. మంచి కథతో సినిమా చేస్తుండటంతో స్నేహితులంతా సంతోషంగా ఉన్నారు.
అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన అనుభవంతో సినిమా రూపకల్పనలో రితేష్‌రానాకు ఏమైనా సలహాలు ఇచ్చారా?
స్నేహితులుగా మా మధ్య తరుచుగా చర్చలు జరిగేవి తప్పితే అతడికి నేను ఎలాంటి సలహాలు ఇవ్వలేదు. తన టీమ్‌తో కలిసి రితేష్ ఈ కథను రాసుకున్నాడు. మిగతా వారి ఇన్‌వాల్వ్‌మెంట్ ఇందులో లేదు.
భవిష్యత్తులో హీరోగా కొనసాగుతారా?దర్శకత్వం వహించే ఆలోచన ఉందా?
హీరోగానే కొనసాగుతాను. దర్శకత్వం ఆలోచన లేదు.  హీరోగానే కాకుండా కథ నచ్చితే ఇతర పాత్రల్లో నటిస్తాను. రాజమౌళి గారి సినిమాలో ఒక ఫ్రేములో కనిపించిన చాలన్నది నా కల.
పెద్ద కుటుంబం నుంచి హీరోగా అరంగేట్రం చేస్తుండటంతో మీపై అంచనాలు చాలా ఉన్నాయి. వాటిని ఒత్తిడిగా ఫీలవుతున్నారా?
ఆ అంచనాల గురించి నేనెప్పుడూ ఆలోచించలేదు. వాటి పట్టించుకుంటే  స్వేచ్ఛగా పనిచేయలేము. కీరవాణి, రాజమౌళి కుటుంబం నుంచి వస్తున్నాను కాబట్టి ఫలానా రీతిలో నటించాలి, కొత్తగా కనిపించాలని ఆలోచిస్తే నటనలో సహజత్వం లోపిస్తుంది. కథ, క్యారెక్టర్‌కు న్యాయం చేయడానికి నిజజీవితంలో  ఎలా ఉంటానో అలాగే నటించాను.  అంతేకానీ ఒత్తిడిలను మైండ్‌లో పెట్టుకొని క్యారెక్టర్‌కు న్యాయం చేయలేదు. రాజమౌళి, కీరవాణి కుటుంబం నుంచి వచ్చిన నటుడిగా నన్ను ప్రేక్షకులు చూడాలని కోరుకోవడం లేదు. నా పాత్రతో పాటు సినిమా చూసి ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను.

Senior Acter Satyaprakash interview about ‘Ullala Ullala’

సీనియర్ నటుడు సత్యప్రకాష్ గారి దర్శకత్వంలో వారి అబ్బాయి నటరాజ్ ని హీరోగా పరిచయం చేస్తూ లవర్స్ డే ఫేమ్ ఎ.గురురాజ్ నిర్మాణంలో తెరకెక్కిస్తున్న చిత్రం “ఊల్లాల ఊల్లాల”. సుఖీభవ మూవీస్ పతాకంపై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించిన వివరాలు దర్శకుడు సత్యప్రకాష్ మీడియా తో తెలుపుతూ ” నేను అసలు దర్శకుడు అవుదామనే పరిశ్రమకి వచ్చాను కానీ ఆ పైవాడి నిర్ణయంతో నటుడ్ని అయ్యాను. నటుడు అయిన ప్రతీవాడికి హీరో అవుదామని ఆలోచన, అభిరుచి, అభిలాష ఉంటుంది కానీ ఆ దేవుడి లెక్కలు వేరేలా ఉంటాయి. అందులో భాగంగానే ఏమో క్రూరుడైన విలన్ పాత్రలే అన్ని భాషల్లో దొరికాయి, అలా చాలా మందికి నా పేరు సత్య ప్రకాష్ అని తెలీదు. భోజ్ పూరి లో తివారి బాబా అని, కర్ణాటకలో యాసిడ్ రాజా అని, కొత్వాల్ అని రకరకాల పేర్లతో పిలిచేవాళ్ల ప్రేమని పొందాను దానికి చాలా సంతోషంగా ఉంది” అన్నారు. అలాగే పాత్రికేయులు అడిగే ప్రశ్నలకి సమాధానమిస్తూ…

మొదటి సారి దర్శకత్వం చేశారు కష్టంగా అనిపించిందా?

నిర్మాత ఇచ్చిన సమయంలో, ఇచ్చిన బడ్జెట్ లో పని పూర్తి చేసి విడుదలకి సిద్ధం చేయడం తెరవెనుక ఎన్నో సార్లు చూసినా నేనే మొదటి సారి చేయడం వల్ల కొంచం కష్టంగానే అనిపించింది. అలాగే తండ్రిగా, నటుడిగా నేను మా అబ్బాయి నటరాజ్ కి హీరోగా అవ్వడానికి కావాల్సిన ఫైట్స్, డాన్స్, బాడీ బిల్డింగ్, జిమ్నాస్టిక్స్ వంటివి 2 ఏళ్ళు శిక్షణ తీసుకునేలా చేసాను, మా అబ్బాయిని కన్నడలో రాక్ లైన్ వెంకటేష్ గారు పరిచయం చేశారు. అదే సమయంలో గురురాజ్ గారితో ‘ఊల్లాల ఊల్లాల’ తీద్దాం అనుకోవడం ఆయనకి మా అబ్బాయి నటనని చూపించడం ఆయన ఒప్పుకోవడం కావాల్సిన ఏర్పాట్లు చేసుకోవడం వెంట వెంటనే జరిగిపోయాయి.

“ఊల్లాల ఊల్లాల” కథ ఏంటి?

ఒక ప్రేమ కథగా మొదలయ్యి చాలా ఎంటర్టైనింగ్ గా థ్రిల్లింగ్ గా సాగుతుంది, తరువాత ఏం జరుగుతుంది అన్న క్యూరియాసిటీ చివరి వరకు ఉంటుంది.

నిర్మాత గురురాజ్ గారు ఈ చిత్రంలో పాత్ర చేయడానికి కారణం మీరేనా?

ఆయనకి సినిమాల పైన ఉన్న ఇష్టం తో ఇదివరకు కూడా చాలా చిత్రాలు చేసారు కానీ ఈ చిత్రంలోని పాత్రకి ఆయన సరిగ్గా సరిపోతారు అనిపించి గెటప్ వేయించాం, అనుకున్న దానికంటే బాగా చేశారాయన.

మీరు ఈ చిత్రంలో ఏ పాత్ర చేయలేదా?

నేను చేశాను, కానీ సినిమా కథాంశం చెప్పే చిన్న పాత్ర అది.

మీ అబ్బాయి తెలుగు మాట్లాడుతారా?

చాల బాగా మాట్లాడుతాడు. ఈ చిత్రంలో అతనే దుబ్బింగ్ చెప్పాడు, ఇంతకముందు చేసిన కన్నడ సినిమా లో కూడా తానే డబ్బింగ్ చెప్పుకున్నాడు.

చిత్రం అనుకున్న బడ్జెట్ లో చేసారా? బడ్జెట్ ఎంత అయింది?

నిర్మాత మాకు బడ్జెట్ చాలా సౌకర్యంగా ఉండేలా ఇచ్చారు, అనుకున్నట్టుగానే ప్రమోషన్ ఖర్చుతో కలిపి 4cr లోపలే 34 రోజుల్లో హైదరాబాద్ లోపల మరియు చుట్టుపక్కల్లోనే చేసేశాం.

మీరు దర్శకుడు కావాలి అని వచ్చారు కానీ పరిశ్రమకి నటుడిగా ఎలా పరిచయమయ్యారు?

దర్శకుడు అవుదామనే నిర్మాత రవి రాజా పినిశెట్టి గారి దగ్గరికి వస్తే విలన్ పాత్ర చేయమని చెప్పారు. అలాగే మలయాళం దర్శకుడు ప్రియదర్శన్ కూడా మోహన్ లాల్ గారి అభిమన్యు చిత్రంలో పాత్ర ఇచ్చారు. ఆ తరువాత విజయ్ బాపినీడు గారి దగ్గర పని చేస్తుండగా చిరంజీవి గారితో బిగ్ బాస్ చిత్రంలో చేయమన్నారు. అప్పటి నా పరిస్థితులకి సంపాదన, పేరు ముఖ్యం అనిపించి అలా వరుసపెట్టి వచ్చిన ఒకే రకం పాత్రలే చేసాను. తెలుగువాడిని అయినా ఇప్పటికి చాలా మంది నన్ను కన్నడ వాడు అనుకుంటారు.

మీరు ఎక్కువ చిత్రాలు ఈ భాషలో చేశారు?
కన్నడ, తరువాత తెలుగు ఆ తరువాత భోజపురి అలా చాలా భాషల్లో భారీ రెమ్యూనరేషన్ తీసుకున్న ముఖ్య విలన్ గా చేసాను. ఈ మధ్య కొంచం తగ్గించినా, మళ్లీ మునుపటిలాగే ఎక్కువ చిత్రాలు చేస్తాను.

మీ తరువాతి చిత్రమేంటి ?

ఒక పెద్ద బ్యానర్ లో పెద్ద హీరయిన్ తో థ్రిల్లర్ చిత్రం లో ముఖ్య పాత్ర చేస్తున్నాను.

ఎందుకని ఎక్కువ థ్రిల్లర్ చిత్రాలు ??

నాకిప్పుడున్న మనస్థితికి ఇలాంటి చిత్రాలే చేయగలనేమో, నాదగ్గర 14 స్క్రిప్టులు సిద్ధంగా వున్నాయి, నేను ప్రేమ కథ చేస్తాను అంటే ఈ వయసులో ఈయనకి ఇలాంటి చిత్రాలు అవసరమా అని అనుకుంటారు అది కూడా ఒక కారణమేనేమో.

“ఊల్లాల ఊల్లాల” కథకి స్ఫూర్తి ఏంటి ??

ఏదో ఒక వైవిధ్యమైన జోనర్ లో చిత్రం చేయాలి కామెడీ ,థ్రిల్లర్ , యాక్షన్ ఇలా అన్ని ఉండాలి అన్న ఆలోచననుండి కథ పుట్టింది ఆ తరువాత అవసరం కొద్దీ సన్నివేశాలు, కమర్సియల్ ఎలిమెంట్స్ జత చేయాల్సి వచ్చింది.

ఈ చిత్రం కన్నడలో కూడా చేస్తున్నారా?

రాక్ లైన్ వెంకటేష్ గారిని అడగటం జరిగింది ఆయన చెప్తా అన్నారు. కుదిరితే జనవరి 1న తెలుగు తో పాటు కన్నడలో విడుదల చేస్తారు లేదంటే మంచి సమయం చూసుకొని తరువాత విడుదల చేస్తాం.

మీరు చాల పెద్ద డైరెక్టర్స్ తో వర్క్ చేసారు ఎవరైనా టిప్స్ ఇచ్చారా?

90ml డైరెక్టర్ శేఖర్ రెడ్డి, వై.వ్.స్ చౌదరి, పూరి జగన్నాథ్ గారు వీళ్ళందరూ చాలా సలహాలు చెప్పారు అవి నాకు చాలా సహాయపడ్డాయి. అనుకున్న సమయం కంటే ముందే పూర్తి చేసినపుడు పూరి గారు, నువ్వు చాల సక్సెసఫుల్ డైరెక్టర్ అవుతావు అని మెచ్చుకున్నారు. అలాగే మా ప్రొడ్యూసర్ గురురాజ్ గారు కేవలం నిర్మాత గానే కాక అన్ని విధాలుగా సహాయపడ్డారు. అయన రియల్ ఎస్టేట్ లో బిజీగా ఉన్నా, బిజినెస్ పక్కన పెట్టి మరీ చాలా సపోర్టివ్ గా ఉన్నారు.

మీ రెమ్యూనరేషన్ ఎక్కువ లేదా హీరో హీరోయిన్ రెమ్యూనరేషన్ ఎక్కువా?

మగవాళ్ళ జీతం, ఆడవాళ్లు వయసు అడక్కూడదు, చెప్పకూడదు ఇది మీకు తెలిసిందే కదా.

Keerthy Suresh ‘Mahanati’ Wins 4 Filmfare Awards

The 66th Filmfare Awards South was held last night at the Nehru Indoor Stadium in Chennai. Stars consider Filmfare Award as the second-highest honor after National Awards in India. Big stars from Telugu, Tamil, Kannada, and Malayalam turned up for the Filmfare award show hosted by Sundeep Kishan and Regina Cassandra.

Mahanati, which made Telugu industry proud and won three National Awards, has bagged four awards at Filmfare. Besides best film award, Mahanati also won awards in best director (Nag Ashwin), best actress (Keerthy Suresh) and best actor critics (Dulquer Salman) categories.

Nag Ashwin and Mahanati makers are in ecstasy to obtain the prestigious award, as we can observe in the picture. They are seen contentedly posing with the awards they

*Vivaha Bhojanambu New restaurant branch inaugurated at AS Rao Nagar

భాగ్యనగర వాసులకు తెలుగింటి వంట రుచి ఏంటో చూపిస్తూ… ఎప్పటికప్పుడు కొత్త కొత్త రుచులను అందిస్తున్న ‘వివాహ భోజనంబు’ రెస్టారెంట్ కొత్త బ్రాంచ్ ఆదివారం ఏఎస్‌రావు నగర్‌లో ప్రారంభమైంది. యువ కథానాయకుడు సందీప్ కిషన్, ఆయన స్నేహితులు రవిరాజు, అమిత్, షెఫ్ యాదగిరి కలిసి తొలుత జూబ్లీహిల్స్‌లో ‘వివాహ భోజనంబు’ రెస్టారెంట్ ప్రారంభించారు. ఏడాదిలో ప్రజల ఆదరణ పొందింది. రెండో ఏడాది సికింద్రాబాద్‌లోని పార్క్‌లేన్‌లో రెండో బ్రాంచ్ ప్రారంభించారు. విజయవంతంగా మూడో ఏడాదిలో అడుగుపెట్టిన ‘వివాహ భోజనంబు’ రెస్టారెంట్ కొత్త బ్రాంచ్ ఇప్పుడు ఏఎస్‌రావు నగర్‌లో ఓపెన్ అయింది. అలాగే, సూపర్‌స్టార్ మహేష్‌బాబుకు చెందిన ఏఎంబి మాల్, మై హోమ్ అంబుజాలో ఫుడ్ కోర్ట్స్ ‘వివాహ భోజనంబు’కు ఉన్నాయి. 

గౌరవనీయులైన రాజ్యసభ సభ్యులు (ఎంపి), తెరాస నేత జె. సంతోష్ కుమార్, ఉప్పల్ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి, ఎంఎల్‌సిలు పి. శ్రీనివాసరెడ్డి, కె. నవీన్ రావు, సందీప్ కిషన్ దీపారాధనతో ఏఎస్‌రావు నగర్‌లో ‘వివాహ భోజనంబు’ ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో సీనియర్ తెరాస నేత లక్ష్మణారెడ్డి, కార్పొరేటర్లు పురుషోత్తం రెడ్డి, పావని రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

రవిరాజు మాట్లాడుతూ “రెండో సంవత్సరం సికింద్రాబాద్ లో స్టార్ట్ చేశాం. మూడో సంవత్సరం ఏఎస్ రావు నగర్ – సైనిక్ పురి క్రాస్ రోడ్స్ దగ్గర స్టార్ట్ చేశాం. ఇది చాలా పెద్దది కావాలని కోరుకుంటున్నాను. ఈ రెస్టారెంట్ లో మొత్తం మూడు ఫ్లోర్స్ ఉన్నాయి. రెండు ఫ్లోర్స్ లో బాంకెట్ హాల్స్ ఉన్నాయి. ఒక్కో హాల్ లో 300 మంది హ్యాపీగా పార్టీ, ఫంక్షన్ చేసుకోవచ్చు. రెస్టారెంట్ లో వందమందికి పైగా కూర్చుని తినవచ్చు. తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో వంటకాలను, చాలామందికి తెలియని రుచులను ప్రజలకు అందించడం మాకు సంతోషంగా ఉంది. సందీప్ కిషన్ గారికి, అమిత్ గారికి థాంక్స్” అని అన్నారు.

‘వివాహ భోజనంబు’ పార్ట్‌నర్స్‌లో ఒకరు, హెడ్ షెఫ్ అయిన యాదగిరి మాట్లాడుతూ “సందీప్ కిషన్ గారు ‘వివాహ భోజనంబు’ పేరు ఎందుకు పెట్టారనేది తొలుత ఎవరికీ అర్థం కాలేదు. కానీ, ఈ రోజు అందరికీ అర్థం అయింది. అమ్మచేతి కమ్మదనం ఎక్కడ దొరుకుతుందంటే… వివాహ భోజనంబు అని నేను గట్టిగా చెబుతాను. రాబోయే తరానికి ఆరోగ్యమే ఒక ఔషధంగా మారాలన్నది మా సంకల్పం. ఆహారాన్ని ఒక ఔషధంగా ప్రజలకు మేం అందిస్తాం” అని అన్నారు.

సందీప్ కిషన్ మాట్లాడుతూ “ఈ రెస్టారెంట్ ప్రాంరంభోత్సవానికి వచ్చేసిన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా థాంక్స్. ఇప్పటివరకూ మా రెస్టారెంట్లకు వచ్చి భోజనం చేసిన ప్రతి ఒక్కరికీ థాంక్స్. వాళ్లకు మా ఫుడ్ నచ్చడం వల్ల మేం అంచలు అంచలుగా ఎదుగుతూ వచ్చాం. ప్రతి డిసెంబర్ లో కొత్త బ్రాంచ్ ఓపెన్ చేస్తూ వస్తున్నాం. ‘వివాహ భోజనంబు’ ఫ్యామిలీకి మూడో ఏడాది ఇది. ఇప్పుడు ఏఎస్‌రావు నగర్‌లో మూడో బ్రాంచ్ ఓపెన్ చేశాం. మా రెస్టారెంట్ విజయానికి కారణం షెఫ్ లే. మా రెస్టారెంట్లలో సుమారు 250 నుండి 300 మంది షెఫ్ లు యాదగిరి నేతృత్వంలో పని చేస్తున్నారు. ఇంచుమించు 900 మందికి పైగా పని చేస్తున్నారు. సుమారు 1000 మంది ఫ్యామిలీలు ఈ రెస్టారెంట్ల మీద ఆధారపడి ఉన్నారు. అందరికి పని కల్పిస్తున్నందుకు సంతోషంగా ఉంది. త్వరలో ఇతర నగరాల్లోనూ మా రెస్టారెంట్ బ్రాంచ్ లు ఓపెన్ చేయాలని ఆలోచిస్తున్నాం” అని అన్నారు.