Home Blog Page 988

‘Prathiroju Pandage’ Success Meet

సాయితేజ్‌ కథానాయకుడిగా మారుతీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ప్రతిరోజూ పండగే’. రాశీఖన్నా కథానాయిక. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మంచి టాక్‌ను అందుకుంది. కుటుంబ ప్రేక్షకులను అలరించేలా దర్శకుడు మారుతీ ఈ సినిమాను తీర్చిదిద్దారు. ముఖ్యంగా హస్య సన్నివేశాలు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తున్నాయి. రావు రమేష్‌, సత్యరాజ్‌ పాత్రలను తీర్చిదిద్దిన విధానం ఆకట్టుకుంటోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్ లో చిత్ర యూనిట్ సభ్యులతో పాటు దర్శకుడు సుకుమార్, పరుశురాం, పరుచూరి గోపాల కృష్ణ పాల్గొన్నారు.

డైరెక్టర్ సుకుమార్ మాట్లాడుతూ.
ప్రతిరోజు పండగే సినిమా సక్సెస్ అయినందుకు హ్యాపిగా ఉంది. ఇండస్ట్రీలో ఉన్న తక్కువగా ఉన్న ఫ్రెండ్స్ లో బన్నీ వాసు నాకు ఒకడు. సైకాలజీ బాగా తెలిసిన వ్యక్తి కనుకనే ఇన్ని సక్సెస్ ఫుల్ సినిమాలు తియ్యగలిగాడు బన్నీ వాసు. సినిమా సినిమా చూస్తున్న థియేటర్ లో ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మారుతి ఇప్పుడు ఈ స్థాయిలో ఉండడం సంతోషంగా ఉంది. చాలా ట్యాలెంట్ ఉన్న డైరెక్టర్ తను. ఈ సినిమాలో పనిచేసిన అందరూ టెక్నీషియన్స్, నటీనటులకు అభినందనలు తెలుపుతున్నాను అన్నారు.

హీరో సాయి తేజ్ మాట్లాడుతూ...
ఈ ఫంక్షన్ కు వచ్చిన సుకుమార్ గారికి, బుజ్జి గారికి ధన్యవాదాలు. నాకు ఎప్పుడు సపోర్ట్ చేసున్న బన్నీ వాసు అన్నాకు ధన్యవాదాలు. నా కెరీర్ కు పిల్లర్స్ లా నిలబడిన బన్నీ వాసు అన్నకు అలాగే మారుతి అన్నకు థాంక్స్. ఈ సినిమా నా కెరీర్ లొనే ఇంపార్టెంట్, ఇలాంటి సమయంలో నా దగ్గరికి ఒక మంచి కథను తీసుకొని వచ్చిన మారుతి గారికి థాంక్స్. మా సినిమాకు చాలా మంది కనెక్ట్ అవుతున్నారు. థియేటర్ లో ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సత్యరాజ్ గారు చేసిన రోల్ మర్చిపోలేను. రావు రమేష్ గారితో నేను చేసిన అన్ని సినిమాలు సక్సెస్ అయ్యాయి. తమన్ నా కాంబినేషన్ లో వచ్చిన మంచి సినిమా ఇది. మా సినిమాను సపోర్ట్ చేసున్న అందరికి ధన్యవాదాలు, ఈ సక్సెస్ ను మెగా అభిమానులకు, తెలుగు ప్రేక్షకులకు అంకితం చేస్తున్న అన్నారు.

డైరెక్టర్ మారుతి మాట్లాడుతూ.
ప్రతిరోజు పండుగే సినిమా కథను నమ్మి చేశాము. ఇప్పుడు ఆడియన్స్ థియేటర్స్ లో ఎంజాయ్ చేస్తున్నారు. తేజు నన్ను నమ్మి ఈ సినిమా ఇచ్చాడు, అందుకు థాంక్స్. ఈ సినిమాను థియేటర్ లో ఆడియన్స్ మధ్య చూశాను, ఆడియన్స్ రియాక్షన్స్ చూసి హ్యాపీగా ఫీల్ అయ్యాను. రావు రమేష్ గారు తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు, చాలా ఎమోషన్స్ ఉన్న రోల్ చేసాడు తను. నాకంటే ఎక్కువగా తమన్ ఈ సినిమాను నమ్మాడు. ఈ సక్సెస్ కు అందరూ కారణం, ప్రతి టెక్నీషియన్, ఆర్టిస్ట్ ఈ సినిమా సక్సెస్ అవ్వాలని చేశాడు. ఇండస్ట్రీలో చాలామంది కాల్స్ చేసి మెచ్చుకున్నారు. ఈ సినిమాను యాక్సెప్ట్ చేసిన ఆడియన్స్ కు ధన్యవాదాలు. మేము ఏ ఉద్దేశంతో తీశామో అది ఇప్పుడు ఆడియన్స్ మాట్లాడుకోవడం సంతోషంగా ఉంది. సినిమా షూటింగ్ సమయంలో అరవింద్ గారి సపోర్ట్ మరువలేనిదన్నారు.

తమన్ మాట్లాడుతూ.
మహానుభావుడు సినిమా తరువాత మారుతి నాకు ఈ అవకాశం ఇచ్చాడు మారుతి, తనకు థాంక్స్, మారుతితో సినిమా చెయ్యడం చాలా హ్యాపీగా ఉంది. నాకు ఈ సక్సెస్ చాలా ముఖ్యం, రెండు పెద్ద బ్యానర్లు చేస్తున్న సినిమా కావున తప్పకుండా ఈ సినిమా సక్సెస్ ను నేను ఉహించాను. యూవీ వంశీ కి అలాగే ఈ చిత్రంలో నటించిన అందరూ నటీనటులకు టెక్నీషియన్స్ కు స్పెషల్ థాంక్స్. సత్యరాజ్ రావు రమేష్ లాంటి ఆర్టిస్ట్స్ తో వర్క్ చెయ్యడం గ్రేట్ మెమోరీ, సాయి తేజ్ కెరీర్ లో ఈ సినిమా పెద్ద హిట్ అవ్వడం సంతోషంగా ఉందన్నారు.

నిర్మాత బన్నీ వాసు మాట్లాడుతూ.
నన్ను సపోర్ట్ చేస్తున్న మీడియాకు ధన్యవాదాలు. మారుతి నాకు కొన్ని ఏళ్ల నుండి పరిచయం, మా కలయికలో వచ్చిన ఈ సినిమా పెద్ద సక్సెస్ అవ్వడం సంతోషంగా ఉంది. నేను నిర్మతగా మారడానికి ముఖ్య కారణమైన సుకుమార్ గారికి ధన్యవాదాలు, తాను స్టార్ట్ చేసిన గీతా ఆర్ట్స్ 2 సంస్థ ఇప్పుడు ఇంత సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది, అందరికి సుకుమార్ కు థాంక్స్, అలాగే నా బ్యానర్ లో గీత గోవిందం వంటి బ్లాక్ బాస్టర్ సినిమా ఇచ్చిన డైరెక్టర్ బుజ్జికి ధన్యవాదాలు. నాతో కలసి జర్నీ చేసిన మారుతి ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నందుకు గర్వాంగా ఉంది. సక్సెస్ మీటర్ బాగా తెలిసిన దర్శకుడు మారుతి, తేజు తో ఒక మంచి సినిమా నిర్మించానన్న సంతృప్తి ఉందన్నారు.

‘Namaste Nestama’ Releasing On January 3rd ….Popular Film-maker KC Bokadia

కె.సి.బొకాడియ…చలనచిత్ర రంగంలో పరిచయం అవసరంలేని పేరు. ఎంద‌రో  స్టార్‌హీరోలను, హీరోయిన్లను ఇండస్ట్రీకి పరిచయం చేసి, ఫాస్ట్‌గా 50 సినిమాలు కంప్లిట్‌ చేసిన ఫిలిం మేకర్‌గా రికార్డ్‌ సాధించిన బాలీవుడ్‌ పాపులర్‌ ఫిలిం మేకర్‌. లేటెస్ట్‌గా లలిత్‌ మోడీ, గౌతమ్‌చంద్‌ రాథోర్‌ సమర్పణలో కె.సి.బొకాడియా నిర్మిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం ‘నమస్తే నేస్తమా’. గతంలో ఆయన నిర్మాణంలో బ్లాక్‌బస్టర్‌హిట్‌ సాధించిన ‘తేరి మెహర్భానియా’ చిత్రానికి పార్ట్‌-2 వస్తోన్నఈమూవీ ద్వారా తెలుగు పరిశ్రమకి పరిచయమవుతున్నారు.  రెండు కుక్క‌లు ముఖ్య పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలోఈషానియ మహేశ్వరి, నాజర్‌, బ్రహ్మానందం, షాయాజీ షిండే, తాగుబోతు రమేష్‌, చమక్‌ చంద్ర తదితరులు నటిస్తున్నారు. హీరో శ్రీరామ్ గెస్ట్ అప్పీయ‌రెన్స్ ఇస్తున్నారు. జనవరి 3న ఈ చిత్రం గ్రాండ్ గా విడుదలవుతున్న సందర్భంగా..హైదరాబాద్‌ ది ప్లాజా హోటల్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాపులర్‌ ఫిలిం మేకర్‌ కె.సి.బొకాడియ, చిత్ర సమర్పకులు గౌతమ్ చంద్‌ రాథోర్‌, రాజ్ కుమార్ బొకాడియ పాల్గొన్నారు..

పాపులర్‌ ఫిలిం మేకర్‌ కె.సి. బొకాడియ మాట్లాడుతూ – ”రాజస్థాన్‌ లోని చిన్న గ్రామం నుండి వచ్చి బొంబాయిలో ఉన్న హైకాంపిటేషన్‌ని తట్టుకొని 1972లో మొదటి సారి  సంజీవ్‌ కుమార్‌తో ‘రివాజ్‌’ సినిమాను నిర్మించడం నేను ఎప్పటికి మర్చిపోలేను. ఆతరువాత  అమితాబ్‌ బచ్చన్‌, రజినీకాంత్‌, షారుఖ్‌ఖాన్‌, సల్మాన్‌ఖాన్,  అక్షయ్‌కుమార్‌, అజయ్‌దేవగన్‌, సన్నీదేవన్‌, సైఫ్ వాళ్ళూ ఖాన్, ప్రియాంక చోప్రా, ఐశ్వర్య రాయ్, శ్రీదేవి, జయప్రద, ఇలా 100కు పైగా స్టార్ హీరోలతో, స్టార్ హీరోయిన్లతో వర్క్ చేశాను. అతి తక్కువ సమయంలో 50 సినిమాలు తీసిన నిర్మాతను కాబట్టి నన్ను ‘ఫాస్టెస్ట్‌ ప్రొడ్యూసర్‌’ అంటారు.  చెన్నైలో రజనీకాంత్‌ ఇల్లు, మా ఇల్లు దగ్గర దగ్గరే ఉండేవి. రజిని కాంత్ గారు నాకు చాలా క్లోజ్. ఆయనతో రజనీతో నేను ‘ఫూల్‌ బనే అంగారే, త్యాగీ, ఇన్‌సానియత్‌ కా క్యా హోగా, ఇన్‌సాఫ్‌ క్యా కరేగా?, అస్‌లీ– నక్లీ’ సినిమాలు చేశాను. 1985లో ‘ప్యార్‌ జుక్తా నహి’, ‘తేరి మెహర్భానియా’, ‘ఆజ్‌ కాఅర్జున్‌’ సూపర్ హిట్ సాధించాయి. నా మొదటి సినిమాకే  అమితాబ్ బచ్చన్ ని డైరెక్ట్ చేయడం మర్చిపోలేను. మానాన్నగారు బి.ఎం. బొకాడియా పేరుమీద ‘బి.ఎం.బి’ ప్రొడక్షన్‌ స్టార్ట్‌ చేసి బాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ అందరితో సినిమాలు నిర్మించాను. మా ప్రొడక్షన్‌లో వచ్చిన  అన్నీ సినిమాలు  సూపర్‌ హిట్స్‌ అయ్యాయి. దీనంతటికి మీ మీడియా వారి ప్రోత్సాహమే కారణం. నిర్మాత గా సున్నా నుంచి మొదలై టాప్‌ పొజిషన్‌లోకి వచ్చాను. మధ్యలో కొంచెం విరామం వచ్చింది. ఇప్పుడు మళ్లీ  ‘నమస్తే నేస్తమా` తో ప్రయాణం ప్రారంభిస్తున్నాను.

ఈ సినిమా విషయానికి వస్తే..రెండు కుక్క పిల్లలు చిన్నప్పుడే  విడిపోయి ఒకటి పోలీసుల దగ్గర, మరోటి దొంగల దగ్గర పెరుగుతాయి. శ్రీరామ్‌ పోలీస్‌ ఆఫీసర్ పాత్ర చేశారు. అతను హత్యకు గురవుతాడు. ఈ రెండు కుక్కపిల్లలు కలిసి బాస్‌ని చంపిన వాళ్ల మీద ఎలా పగ తీర్చుకున్నాయి? ఆ క్రమంలో ఎలాంటి సాహసాలు చేశాయి? చివరికి రెండు కుక్కపిల్లలు ఎలా కలుసుకున్నాయి అనేది కథ. నాజర్‌, షాయాజీ షిండే, తాగుబోతు రమేష్‌, చమక్‌ చంద్ర మంచి పాత్రలలో కనిపిస్తారు.  బ్రహ్మానందం పోలీస్ డాగ్స్ కి ట్రైనింగ్ ఇచ్చే అధికారిగా కనిపిస్తారు. నాకు చాలా ఇష్టమైన ‘తేరి మెహర్భానియా’ ఇన్స్పిరేషన్‌తో తీసిన ఈ మూవీ తప్పకుండా సూపర్‌ అవుతుంది అనుకుంటున్నాను.

ఈ సినిమాలో రెండు కుక్కలు అద్భుతంగా పెర్ఫామ్ చేశాయి. రెండు కుక్కలతో షూటింగ్ చేయడం చాలా కష్టం. అయినా దాదాపు 100 రోజులు ఆ డాగ్స్ తో షూటింగ్ చేశాం. సినిమా చాలా బాగా వచ్చింది. బాలీవుడ్ పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్ బప్పి లహరి రెండు పాటలు కంపోజ్ చేశారు. తప్పకుండా మిమ్మల్ని అలరిస్తాయి. అలాగే న్యూ టాలెంట్ చరణ్ అర్జున్ మరో రెండు పాటలకి సంగీతం చేశారు అవికూడా చాలా బాగా వచ్చాయి.

ప్రస్తుతం భారతదేశంలో  తెలుగు ఇండస్ట్రీయే బెస్ట్‌ ఇండస్ట్రీగా ఉంది. ఇక్కడ హిట్ అయినా సినిమాలు అన్ని భాషలలో రీమేక్, డబ్బింగ్ చేస్తున్నారు. ప్రస్తుతం మరో రెండు సినిమాలు ప్లాన్ చేస్తున్నాం. ప్రతి సంవత్సరం రెండు మూడు మూవీస్ తెలుగులో చేయాలి అనుకుంటున్నా. మా బేనర్ లో వర్క్ చేయాలి అనుకునే యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్స్  కి ఇదే మా ఆహ్వానం. అలాగే ఈ సినిమా ప్రమోషన్స్‌లో నాకు ఎంతో సహకరిస్తున్న బి.ఎ.రాజు గారికి ధన్యవాదాలు. జనవరి 3 న సినిమా విడుదలవుతుంది. తప్పకుండా మీరందరూ చూసి ఆదరించాలని కోరుకుంటున్నాను

చిత్ర సమర్పకులు గౌతమ్‌చంద్‌ రాథోర్‌ మాట్లాడుతూ – “మాది రాజస్థాన్. 64 సినిమాలతో నిర్మాతగా, దర్శకుడిగా, స్క్రీన్‌ ప్లే రైటర్‌గా తనని తాను ప్రూవ్‌ చేసుకున్న బొకాడియా గారు తెలుగులో తీస్తున్న మొదటి సినిమా . ఆయన గురించి నేను చెప్పడం అంటే సూర్యుడికి వెలుగు చూపించినట్లు ఉంటుంది.  ఈ సినిమా విజయం మాకు  తెలుగులో మరిన్ని సినిమాలు నిర్మించడానికి ఉపయోగపడుతుంది. మీ అందరి సపోర్ట్ ఉండాల‌ని కోరుకుంటున్నాను” అన్నారు.

రాజ్ కుమార్ బొకాడియ మాట్లాడుతూ – “నన్ను బొకాడియా గారే ఇండస్ట్రీ కి పరిచయం చేశారు. దర్శకుడిగా తొలి సినిమా (ఆజ్‌ కా అర్జున్‌)ను అమితాబ్‌ బచ్చన్ గారితో తీశారు. అలాగే  రజనీకాంత్‌తో ఐదు సినిమాలు, విజయశాంతి, శ్రీదేవి ఇలా ఎంతో మంది స్టార్ హీరో, హీరోయిన్స్, దర్శకులతో వర్క్ చేసిన బొకాడియా గారు తెలుగులో పరిచయం అవుతున్న‌ ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నా” అన్నారు.

శ్రీరామ్‌ (గెస్ట్ అప్పీరియన్స్), ఈషానియ మహేశ్వరి, నాజర్‌, బ్రహ్మానందం, షాయాజీ షిండే, తాగుబోతు రమేష్‌, చమక్‌ చంద్ర తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: అజ్మల్‌ఖాన్‌, సంగీతం: బప్పిలహరి, చరణ్‌ అర్జున్‌, ఎడిటర్‌: బి. లెనిన్‌, ఫైట్స్‌: బి.జె శ్రీధర్‌, సమర్పణ: లలిత్‌ మోడీ, గౌతమ్‌చంద్‌ రాథోర్‌, కో-ప్రొడ్యూసర్‌: ఎస్‌.ఆర్‌ చాప్లాట్‌, నిర్మాత: బి.ఎం.బి మ్యూజిక్‌ అండ్‌ మాగ్నెటిక్స్‌ లిమిటెడ్‌, ర‌చ‌న‌- దర్శకత్వం: కె.సి. బొకాడియా.

‘Ruler’ Movie Success Meet

నంద‌మూరి బాల‌కృష్ణ హీరోగా హ్యాపీ మూవీస్ బ్యాన‌ర్‌పై కె.ఎస్‌.ర‌వికుమార్ ద‌ర్శ‌క‌త్వంలో సి.కల్యాణ్ నిర్మించిన చిత్రం `రూల‌ర్‌`. డిసెంబ‌ర్ 20న ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఈ సంద‌ర్భంగా ఆదివారం జ‌రిగిన పాత్రికేయుల స‌మావేశంలో…

సినిమాటోగ్రాఫ‌ర్ రాంప్ర‌సాద్ మాట్లాడుతూ – “జైసింహా త‌ర్వాత అదే కాంబినేష‌న్‌లో వ‌చ్చిన ఈ సినిమాకు నేను సినిమాటోగ్ర‌ఫీ అందించ‌డం హ్యాపీగా ఉంది. అలాగే క‌ల్యాణ్‌గారి బ్యాన‌ర్‌లో మూడో సినిమా చేస్తున్నాను. బాల‌కృష్ణ‌గారు అద్భుతంగా న‌టించారు. ఆయ‌న‌తో మ‌రిన్ని సినిమాలు చేయాల‌నుకుంటున్నాను“ అన్నారు.
పరుచూరి ముర‌ళి మాట్లాడుతూ – “బాల‌కృష్ణ‌గారి గురించి నేను ప్ర‌త్యేకంగా చెపన‌క్క‌ర్లేదు. నిర్మాత క‌ల్యాణ్‌గారు నిర్మాత  ఎక్క‌డా రాజీ ప‌డ‌కుండా సినిమాను నిర్మించారు. ఇలాంటి నిర్మాత‌తో క‌లిసి పనిచేయ‌డం సంతోషంగా ఉంది“ అన్నారు.
వేదిక మాట్లాడుతూ – “సినిమాను ప్రేక్ష‌కులు బాగా రిసీవ్ చేసుకుంటున్నందుకు చాలా హ్యాపీగా ఉన్నాను. బాల‌కృష్ణ‌లాంటి హీరోతో వ‌ర్క్ చేయ‌డం సంతోషంగా ఉంది. హీరోగానే కాదు.. వ్య‌క్తిగా కూడా ఆయ‌నెంతో మంచివారు. క‌ల్యాణ్‌గారు అంద‌రినీ ఎంతో కేర్‌గా చూసుకున్నారు. ఈ సినిమాలో పనిచేసే అవ‌కాశం ఇచ్చిందుకు ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు, బాల‌కృష్ణ‌గారికి థ్యాంక్స్‌“ అన్నారు.
నిర్మాత సి.క‌ల్యాణ్ మాట్లాడుతూ – “జైసింహా త‌ర్వాత మ‌రోసారి మా కాంబినేష‌న్‌లో వ‌చ్చిన రూల‌ర్ సినిమాను హిట్ చేసిన ప్రేక్ష‌కుల‌కు థ్యాంక్స్‌. రాంప్ర‌సాద్‌గారు సినిమాను అద్భుతంగా విజువ‌లైజ్ చేసి చూపించారు. డిస్ట్రిబ్యూట‌ర్స్ కూడా ఎంతగానో హెల్ప్ చేశారు. ఐదు నెల‌లు పాటు టీం అంద‌రం ఎంత‌గానో హార్డ్ వ‌ర్క్ చేశాం. మ‌ళ్లీ నెక్ట్స్ సినిమాను కూడా దీని కంటే మంచి సిన‌మా ఇస్తాన‌ని తెలియ‌జేస్తున్నాను“ అన్నారు.
నంద‌మూరి బాల‌కృష్ణ మాట్లాడుతూ – “రూల‌ర్ సినిమాకు విజయాన్ని అందించిన ప్రేక్ష‌కుల‌కు థ్యాంక్స్‌. ఓ మంచి ప్ర‌య‌త్నం చేశాం. మా ప్ర‌య‌త్నానికి విజయాన్ని అందించారు ప్రేక్ష‌కులు. క‌ల్యాణ్‌గారు ఖ‌ర్చుకు ఎక్క‌డా కాంప్రైజ్ కాలేదు. క‌ల్యాణ్‌గారితో నేను చేసిన మూడో సినిమా. మంచి క‌థా విలువ‌లున్న సినిమా చేయాల‌ని భావించే నిర్మాత ఆయ‌న‌. ఆయ‌న‌కు నా త‌రపున‌, అభిమానుల త‌ర‌పున కృత‌జ్ఞ‌తలు. వి.ఎస్‌.ఆర్‌.స్వామిగారి వ‌ద్ద శిష్య‌రికం చేసిన రాంప్ర‌సాద్‌గారు ఈ సినిమాకు మంచి విజువ‌ల్స్‌ను అందించారు. ఆయ‌న‌కు కృత‌జ్ఞ‌త‌లు. హీరోయిన్స్‌ సోనాల్‌, వేదిక చ‌క్క‌గా న‌టించారు. జ‌య‌సుధ‌గారు, ప్ర‌కాష్‌రాజు, స‌ప్త‌గిరి, ధ‌న్‌రాజ్‌, ర‌ఘు గారు అంద‌రూ చ‌క్క‌గా న‌టించారు. ప‌రుచూరి ముర‌ళిగారు మంచి క‌థ‌ను అందించారు. మంచి డైలాగ్స్‌ను కూడా అందించారు. మంచి మెసేజ్‌ను కూడా ఈ క‌థ‌లో చొప్పించారు ముర‌ళిగారు. ఆయ‌న‌కు థ్యాంక్స్‌. డైరెక్ట‌ర్ కె.ఎస్‌.ర‌వికుమార్‌గారు ఆర్టిస్టుల ద‌గ్గ‌ర నుండి ఏం కావాలో ఆ న‌ట‌న‌ను రాబ‌ట్టుకునే ద‌ర్శ‌కుడు. అలాగే నిర్మాత‌ల ద‌ర్శ‌కుడు కూడా ఆయ‌న‌. చిరంత‌న్ భ‌ట్‌తో నేను చేసిన మూడో సినిమా. అద్భుత‌మైన సంగీతాన్ని అందించారు. ఈ సినిమాలో భాగ‌మైన ప్ర‌తి ఒక్క‌రికీ కృత‌జ్ఞ‌త‌లు“ అన్నారు.

Aksharam Movie Grand Release on Dec26

పిఎల్ క్రియేషన్స్ బ్యానర్ పై నటుడు లోహిత్ కుమార్ నిర్మాతగా జాకీ తోట దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘అక్షరం`. శివాజి రాజా, జాకీ, గుండు సుద‌ర్శ‌న్‌, సివి ఎల్ న‌ర‌సింహ‌రావు, భావ‌న ముఖ్య పాత్ర‌ల‌లో న‌టిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 26న భీమినేని ఫిలిమ్స్ ఎల్.ఎల్.పి ద్వారా గ్రాండ్ గా విడుదలవుతుంది… ఈ సందర్భంగా..
నిర్మాత లోహిత్ కుమార్‌ మాట్లాడుతూ.. ‘అక్షరం’ అందరిదీ. అన్నీ ఉచితంగా అందరికీ ఇవ్వాలనుకుంటున్న ప్రభుత్వాలు విద్యను మాత్రం అందరికీ ఒకేలా ఎందుకు ఇవ్వడం లేదు? అని ప్రశ్నించే సినిమా ఇది. మోయలేని బరువులు పిల్లల మీద రుద్దుతున్న తల్లిదండ్రులను ప్రశ్నించే సినిమా. తల్లిదండ్రుల శ్రమను అర్థం చేసుకోవాలని పిల్లలకి తెలియజెప్పే సినిమా ఇది. ఒకరకంగా సమాజహితమైన సినిమా ‘అక్షరం’. దేశం సర్వనాశనం కావాలంటే అణుబాంబులు, యుద్ధాలు చేయనక్కర్లేదు. విద్యా వ్యవస్థ మీద దెబ్బకొడితే చాలు. ఆ దేశం నిర్వీర్యమౌతుంది అన్నది అందరికీ తెల్సిన అంశమే. నేడు మనం చదువు కోవడం లేదు. చదువు కొంటున్నాం. దాని వల్ల సహజమైన జ్ఞానం అనేది నశించి అసలు పిల్లలు ఏమవ్వాలి? ఎలా అవ్వాలి? భవిష్యత్తులో ఎలా ఉండాలి? అనేది కూడా వారు మరిచిన క్షణాలివి. అందుకే దానివల్ల స్వార్ధం, క్రూరత్వమే పెరుగుతుంది తప్ప మంచి అభివృద్ధి అనేది, మంచి అనేది రాదు. ఈరోజు సమాజంలో జరిగే ప్రతి అకృత్యానికి వారికి  వారి అజ్ఞానమే కారణం. అందుకే ‘అక్షరం’ ప్రతి ఒక్కరూ అందుకోవాలనుకునే సినిమా” అన్నారు.
శివాజిరాజా, లోహిత్ కుమార్, జాకీ, గుండు సుద‌ర్శ‌న్‌, సిబిఎల్ న‌ర‌సింహ‌రావు, భావ‌న, జయల‌క్ష్మి, మేఘ‌నా చౌద‌రి, చ‌క్రి, త‌రున్ బ‌ర్మ, నికిల్ త‌దిత‌రులు న‌టిస్తున్న ఈ చిత్రానికి.. 
రచన, దర్శకత్వం: జాకీ తోట,
నిర్మాత: లోహిత్ కుమార్,
సినిమాటోగ్రఫీ: కూనపరెడ్డి జైకృష్ణ,
సంగీతం: శశి ప్రీతమ్,
మాటలు: ఆదిత్య భార్గవ్,
పిఆర్ఓ: సాయి సతీష్ పాలకుర్తి.

Aadi Saikumar 16 New Movie

హీరో ఆది సాయికుమార్ పుట్టినరోజు సందర్భంగా తన తదుపరి చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు. మహంకాళి మూవీస్ పతాకంపై మహంకాళి దివాకర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. హిట్ కొట్టాలని కసిమీద ఉన్న ఆదికి సరైన కథ దొరికిందని వెల్లడించారు. పూరి జగన్నాధ్ దగ్గర పని చేసిన జి.బి.కృష్ణ ఈ సినిమాకు కథ ఇవ్వడం జరిగింది. ఈ యువ దర్శకుడు చెప్పిన కథ నచ్చడంతో ఆది సాయి కుమార్ వెంటనే ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.

సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ జనవరి నుండి ప్రారంభం కానుంది. ఆది సాయికుమార్ చేసిన గత సినిమాల కంటే ఈ సినిమాలో భిన్నంగా ఉంటుందని తెలిపారు. వేగంగా ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసిన ఈ చిత్రం షూటింగ్ జనవరిలో స్టార్ట్ చేసి సింగల్ షెడ్యూల్ లో పూర్తి చేసి సమ్మర్ లో విడుదల చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు. కథ నచ్చడంతో ఎక్కడా రాజీ పడకుండా క్వాలిటీగా సినిమము నిర్మించబోతున్నట్లు నిర్మాత మహంకాళి దివాకర్ తెలిపారు.  ఈ చిత్రంలో నటించబోయే ఇతర నటీనటులు సాంకేతిక నిపుణుల వివరాలు చిత్ర యూనిట్ త్వరలో తెలియజేయనుంది. ఈ చిత్రానికి
నిర్మాత: మహంకాళి దివాకర్, నిర్మాణ నిర్వాహణ : శంకర్, 
రచనా దర్శకత్వం: జీ.బి.కృష్ణ.

‘Iddari Lokam Okate’ Movie Pre Release Event

యంగ్‌ హీరో రాజ్‌తరుణ్‌, షాలిని పాండే జంటగా రూపొందుతోన్నలవ్‌ ఎంటర్‌టైనర్‌ ‘ఇద్దరి లోకం ఒకటే’. స్టార్‌ ప్రొడ్యూసర్‌ దిల్‌రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై శిరీష్‌ నిర్మాతగా రూపొందుతున్న చిత్రం ‘ఇద్దరి లోకం ఒకటే’. జీఆర్‌.క ష్ణ దర్శకత్వం వహిస్తున్నారు.  క్రిస్మస్‌ సందర్భంగా సినిమాను డిసెంబర్‌ 25న విడుదల చేస్తున్నారు. శ‌నివారం ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ హైద‌రాబాద్ చైత‌న్య కాలేజ్‌లో నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ..
నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ – “చైత‌న్య కాలేజ్‌లోనే కేరింత సినిమా ఫంక్ష‌న్‌ను ప్లాన్ చేశాం. ఈ కాలేజ్ స్టూడెంట్స్‌కే తొలిసారి సినిమా వేశాం. చాలా పాజిటివ్ రెస్పాన్స్ వ‌చ్చింది. ఇప్పుడు సోమ‌వారం నెల్లూరు, మంగ‌ళ‌వారం వైజాగ్‌, బుధ‌వారం మెల్‌బోర్న్‌లో స్పెష‌ల్ షోలు వేస్తున్నాం. రెండేళ్ల ప్ర‌యాణ‌మే ఈ సినిమా. డైరెక్ట‌ర్ కృష్ణ చెప్పిన ఐడియా న‌చ్చింది. ఇద్ద‌రు ముగ్గురు హీరోల‌ను అనుకున్నాం కానీ ఓకే కాలేదు. ఇక నావ‌ల్ల కాద‌ని డైరెక్ట‌ర్‌కి చెప్పేశా. అయితే ఓ రోజు డైరెక్ట‌ర్ కృష్ణ‌గారు నాకు ఫోన్ చేసి ఇలా రాజ్‌త‌రుణ్‌గారిని క‌లిసి క‌థ చెప్పాం. ఆయ‌న చేస్తామ‌ని అన్నారని చెప్పాడు. త‌ర్వాత రాజ్‌త‌రుణ్ వ‌చ్చి నాతో మాట్లాడాడు. త‌ర్వాత ప్రాజెక్ట్ ఓకే అయ్యింది. మిక్కి జె.మేయ‌ర్‌, స‌మీర్ రెడ్డి స‌హా టాప్ టెక్నీషియ‌న్స్ అంద‌రూ ఈ సినిమాకు ప‌నిచేశారు. హీరోయిన్ విష‌యంలో ముగ్గురు, న‌లుగురిని అనుకున్నాం. కానీ శిరీష్ మాత్రం షాలిని పేరును స‌జెస్ట్ చేసి ఒప్పించాడు. షాలిని ఈ ప్రాజెక్ట్‌లోకి వ‌చ్చిన త‌ర్వాత లుక్ మ‌రింత బెట‌ర్ అయ్యింది. ఇద్ద‌రి మ‌ధ్య కెమిస్ట్రీ అద్భుతంగా కుదిరింది. ఫ‌స్టాఫ్ చూసిన త‌ర్వాత నాకు ఎక్క‌లేదు. ఆ విష‌యాన్ని డైరెక్ట‌ర్‌కి చెప్పాను. మళ్లీ మార్పులు చేర్పులు చేసి సినిమాను చూపించారు. గ‌త నెల ఫైన‌ల్ ప్రొడ‌క్ట్ చూసి డైరెక్ట‌ర్‌కి షేక్ హ్యాండ్ ఇచ్చి బ‌య‌ట‌కు వ‌చ్చేశాను. నేను ఏదైతే ఫీల‌య్యానో నిన్న స్టూడెంట్స్ సినిమా చూసి అలాంటి రెస్పాన్స్‌ను ఇచ్చారు. డిమాంగ్ చేసిన‌ట్లు కాకుండా క‌థానుగుణంగా సినిమాను తెరకెక్కించారు. ఫ‌స్టాఫ్ టైమ్‌పాస్‌లా ఉంటుంది. సెకండాఫ్ గుడ్‌..ముఖ్యంగా క్లైమాక్స్ వెరీగుడ్ అనిపిస్తుంది. జెన్యూన్ ఫిలిం. ఎఫ్‌2, మ‌హ‌ర్షి త‌ర్వాత ఈ సినిమాతో స‌క్సెస్ కొడితే హ్యాట్రిక్ వ‌చ్చేసిన‌ట్టే“ అన్నారు.
హీరో రాజ్‌త‌రుణ్ మాట్లాడుతూ – “`ఇద్ద‌రి లోకం ఒక‌టే` బ్యూటీఫుల్ ల‌వ్‌స్టోరీ. క‌చ్చితంగా సినిమా న‌చ్చుతుంది. అంద‌రూ థియేట‌ర్‌లోనే సినిమా చూడండి. పైర‌సీని  ఎంక‌రేజ్ చేయొద్దు“ అన్నారు.
డైరెక్ట‌ర్ జి.ఆర్‌.కృష్ణ మాట్లాడుతూ – “పుట్టుక నుండి చివ‌రి వ‌ర‌కు ఇద్ద‌రి వ్య‌క్తుల జ‌ర్నీ. డిసెంబ‌ర్ 25న విడుద‌ల‌వుతుంది“ అన్నారు.
ఈ కార్య‌క్ర‌మంలో బెక్కం వేణుగోపాల్ స‌హా చిత్ర యూనిట్ స‌భ్యులు పాల్గొన్నారు.

Mathuvadalara Movie Pre Release Event

కొత్తగా దర్శకతం చేయాలనుకునే వారందరికి మత్తు వదలరా చిత్రం ఓ మంచి ఉదాహరణ. నిర్మాత నమ్మి డబ్బులు పెట్టాలంటే మీ మీద వాళ్ళకు కాన్ఫిడెన్స్ కలగాలి. ఈ సినిమా దర్శకుడు రితేష్‌రానా సొంతగా టీమ్ అంతా ఫామ్ చేసుకుని, నిర్మాతకు నమ్మకం కలిగించి ఈ చిత్ర దర్శకత్వ అవకాశాన్ని సంపాందించాడు. రితేష్ ఐడియా నాకు బాగా నచ్చిందిఅన్నారు ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి. సంగీత దిగ్గజం కీరవాణి తనయుడు శ్రీసింహా కథానాయకుడిగా  అరంగేట్రం చేస్తున్న చిత్రం మత్తు వదలరా. రితేష్ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. చిరంజీవి (చెర్రీ), హేమలత నిర్మాతలు. కీరవాణి పెద్ద కుమారుడు కాలభైరవ స్వరాల్ని అందిస్తున్నారు. ఈ నెల 25న  చిత్రం ప్రేక్షకులముందుకురానుంది. ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్‌లో జరిగింది.

ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి మాట్లాడుతూ:- మా కుటుంబానికి చెందిన ఇద్దరు ఈ చిత్రంతో పరిచయ కావడం ఎంతో ఎమోషన్‌గా వుంది. ఈ సినిమా చేశాను. తీపి కారం ఒకేసారి తిన్నట్ట అనిపించింది. చూస్తున్న కొద్ది సినిమా ఎంతో నచ్చేసింది. ప్రతి ఫ్రేము నన్ను ఆకట్టుకుంది. ఇక జనాలకు నచ్చాలి. సింహా,కాలభైరవకు చక్కటి భవిష్యత్తు వుంది. ఈ నెల 25న ప్రేక్షకులతో కలిసి మరోసారి ఈ సినిమా చూస్తాను. ఈ చిత్ర నిర్మాత చెర్రి ఎంతో ప్లానింగ్ వున్న వ్యక్తి. ఎలాంటి సమస్యకైనా పరిష్కారం చూపిస్తాడు. అందుకే చెర్రి అంటే నాకు చాలా ఇష్టం. నా యమదొంగకు నిర్మాత చెర్రినే. నా కెరీర్‌లో అతి తక్కువ సమయంలో తీసిన సినిమా ఇదే. దానికి కారణ చెర్రీ ప్లానింగే అన్నారు.

ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి మాట్లాడుతూ:- మా పిల్లల్ని నేను ఎప్పుడూ తిడుతూ ఎంకరైజ్ చేస్తుంటాను. ప్రతి దాంట్లో తప్పులు వెతుకుతుంటాను.కానీ ఇప్పుడు నా తనయులను చూస్తుంటే గర్వంగా వుంది. ఓ అబ్బాయి సంగీతం చేశాడనో, మరో అబ్బాయి నటించాడనో పుత్రోత్సహం, గర్వం కలగలేదు. బాహుబలిలో దేవసేన పరిచయ సన్నివేశానికి కాలభైరవ సంగీతం అందించాడు. హంసనావపాటలో రెండు లైన్లు పాడాడు. ప్రేక్షకులందరూ మెచ్చుకున్నారు. ఇది నేనే చేశాను అని ఎప్పుడూ చెప్పలేదు. ఆ లక్షణం నాకు నచ్చింది. ఒకసారి మా ఫ్యామిలీ  ఫంక్షన్‌లో సరదాగా ఓ క్వీజ్ కార్యక్రమం ఆడినప్పుడు కొడుకు మీద ప్రేమతో శ్రీ సింహాకు సమాధానం ముందే చెప్పాను. అయితే శ్రీసింహా మాత్రం తనకు ఆన్సర్ తెలిసినా జవాబు తప్పు చెప్పి క్రీడాస్ఫూర్తి చాటుకున్నాడు. ఆ సమయంలో తనలో నటుడు కనిపించాడు. ప్రతి ఆర్టిస్ట్‌లోనూ ఓ మంచి లక్షణం వుంటుంది. దాన్ని పట్టుకుని సాధన చేసుకోవాలని సింహాకు సలహా ఇస్తున్నాను. రితేష్ చిత్రాన్ని చక్కగా రూపొందించాడు. ఈ సినిమా అందరికి మంచి పేరు తీసుకరావాలని ఆశిస్తున్నాను అని తెలిపారు.

కాలభైరవ మాట్లాడుతూ:-  ఎప్పటి నుంచో సంగీత దర్శకుడిని కావాలనేది నా డ్రీమ్. ఈ సినిమాతో నా కల తీరింది. నేను నా సోదరుడు ఒకేసినిమాతో పరిచయం కావడం మ్యాజిక్‌లా అనిపిస్తుంది. రీరికార్డింగ్‌లో సినిమా చూస్తున్నప్పుడు తప్పకుండా విజయం సాధిస్తుందనే నమ్మకం కలిగింది అన్నారు.

నిర్మాత మాట్లాడుతూ:- దర్శకుడు కథ చెప్పగానే నచ్చింది.  రంగస్థలం షూటింగ్‌లో బిజీగా వుండటం వల్ల ఈ సినిమా పట్టాలెక్కడం ఆలస్యమైంది. తప్పకుండా చిత్రం చూసిన వాళ్లంతా కొత్తదనంతో కూడిన థ్రిల్ల్‌ను ఫీలవుతారు అన్నారు. శ్రీసింహా మాట్లాడుతూ  అందరూ కొత్తవాళ్లం కలిసి నిర్మించిన సినిమా ఇది. మాపై నమ్మకం వుంచిన నిర్మాతకు కృతజ్ఞతలు అని తెలిపారు.

దర్శకుడు మాట్లాడుతూ:-  ఈ సినిమాలో పాటలు, హీరో, హీరోయిన్స్, రొమాన్స్ లేకున్నా నిర్మాత కథ నచ్చి, కథలో ఎటువంటి మార్పు లేకుండా నిర్మించారు అన్నారు.

ఈ కార్యకమంలో గుణ్ణం గంగరాజు,  నరేష్ ఆగస్త్య, అతల్య చంద్ర, సత్య,  సినిమాటోగ్రఫర్ సురేష్ సారంగం, క్రియేటివ్ హెడ్: థోమస్‌జై సాహిత్యం: రాకేందుమౌళి,  లైన్ ప్రొడ్యూసర్: పి.టి.గిరిధర్ రావు తదితరులు పాల్గొన్నారు.

Puri Penned Lyrics For Nuvvu Nenu E Kshanam Song In Romantic Is Out

ఆకాష్‌ పూరి, కేతికా శర్మ హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం ‘రొమాంటిక్‌’. ఈ సినిమా ప్రమోషన్స్‌ శరవేగంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా సినిమాలో తొలిపాట ‘నువ్వు  నేను ఈ క్షణం..’ను శనివారం చిత్ర యూనిట్‌ విడుదల చేసింది. పోస్టర్స్‌లో హీరో హీరోయిన్‌ మధ్య కెమిస్ట్రీతో పాటు డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ ఈ పాటను రాయడంతో  సినిమాపై భారీ అంచనాలే నెలకొన్నాయి. ఈ అంచనాలకు ధీటుగా ఈ సాంగ్‌ను హీరో హీరోయిన్లపై గోవాలో చిత్రీకరించారు. సునీల్‌ కశ్యప్‌ సంగీతాన్ని అందిస్తున్నారు.
పూరి జగన్నాథ్‌ వాయిస్‌తో ఈ పాట ప్రారంభమైంది. పూరితో పాటు చిన్మయి, ఆకాష్‌ పూరి వాయిస్‌లు ఈ పాటలో ఉన్నాయి. హీరో, హీరోయిన్‌ ఒకరిపై ఒకరు తమ ప్రేమను వ్యక్తం  చేసుకునేలా సాంగ్‌ ఉంది. నరేష్‌ ఈ సాంగ్‌ను అద్భుతమైన విజువల్స్‌తో పిక్చరైజ్‌ చేశారు.కేతికా శర్మ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో రమ్యకృష్ణ కీలక పాత్రలో నటించింది. ఈ ఇన్‌టెన్స్‌ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ను అనిల్‌ పాదూరి డైరెక్ట్‌ చేశారు. సునీల్‌ కశ్యప్‌ సంగీతం  .. నరేష్‌ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. పూరి జగన్నాథ్‌ టూరింగ్‌ టాకీస్‌, పూరి కనెక్ట్‌ పతాకాలపై ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ వంటి బ్లాక్‌ బస్టర్‌ తర్వాత పూరిజగన్నాథ్‌, ఛార్మి నిర్మిస్తోన్న  చిత్రమిది.

న‌టీన‌టులు:
ఆకాశ్ పూరి, కేతికాశ‌ర్మ‌, ర‌మ్య‌కృష్ణ‌, మ‌క‌రంద్ దేశ్ పాండే, ఉత్తేజ్‌, సునైన త‌దిత‌రులు

సాంకేతిక వ‌ర్గం:
ద‌ర్శ‌క‌త్వం:  అనిల్ పాదూరి,నిర్మాత‌లు:  పూరి జ‌గ‌న్నాథ్‌, ఛార్మి.స‌మ‌ర్ప‌ణ‌:  లావ‌ణ్య‌.సంగీతం:  సునీల్ క‌శ్య‌ప్‌
సినిమాటోగ్ర‌ఫీ: న‌రేశ్.ఎడిట‌ర్‌:  జునైద్ సిద్ధిఖి.ఆర్ట్‌:  జానీ షేక్‌.పాట‌లు:  భాస్క‌ర భ‌ట్ల‌.ఫైట్స్‌:  రియ‌ల్ స‌తీశ్‌

‘K.G.F Chapter2’ First look launch

సినిమా చరిత్రలో హిట్స్‌, సూపర్‌హిట్స్‌, బ్లాక్‌బస్టర్‌ చిత్రాలు వస్తుంటాయి. కానీ ట్రె్‌ండ సెట్టింగ్‌ మూవీస్‌ మాత్రం అరుదుగానే వస్తుంటాయి. అలాంటి అరుదైన ట్రెండ్‌ సెట్టింగ్‌ మూవీస్‌లో ‘కె.జి.యఫ్‌’ ఒకటి. రెండు భాగాలుగా విడుదలవుతున్న ఈ చిత్రంలో తొలి భాగం ‘కె.జి.యఫ్‌ చాప్టర్‌ 1’ కన్నడ చిత్రసీమలో ‘కె.జి.యఫ్‌’ ట్రె్‌ండ సెట్టింగ్‌ మూవీగా నిలవడమే కాకుండా కలెక్షన్స్‌ పరంగా సరికొత్త రికార్డులను క్రియేట్‌ చేసింది. పాన్‌ ఇండియా చిత్రంగా తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో గ్రా్‌ండ రిలీజైంది. వసూళ్లలోనే కాకుండా అవార్డుల్లోనూ ‘కె.జి.యఫ్‌ చాప్టర్‌ 1’ విజువల్‌ ఎఫెక్ట్‌, స్టంట్స్‌ విభాగాల్లో ఈ ఏడాది జాతీయ అవార్డులను సొంతం చేసుకుంది. 
అటు అభిమానులు, ఇటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలను క్రియేట్‌ చేసిన ‘కె.జి.యఫ్‌ చాప్టర్‌ 1’కి కొనసాగింపుగా ‘కె.జి.యఫ్‌ చాప్టర్‌ 2‘ రూపొందుతోంది. కైకాల సత్యనారాయణ సమర్పణలో హోంబలే ఫిలిమ్స్‌ బ్యానర్‌పై ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో విజయ్‌ కిరగందూర్‌ భారీ బడ్జెట్‌తో అంచనాలకు ధీటుగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  ‘కె.జి.యఫ్‌ చాప్టర్‌ 1’ విడుదలైన ఏడాది పూర్తవుతుంది. ఈ సందర్భంగా ‘కె.జి.యఫ్‌ చాప్టర్‌ 2’ ఫస్ట్‌ లుక్‌ను శనివారం సాయంత్రం చిత్ర యూనిట్‌ విడుదల చేసింది. ఇందులో రాకింగ్‌ స్టార్‌ యష్‌ డిఫరెంట్‌ లుక్‌తో ఆకట్టుకుంటున్నారు. ఈ ఫస్ట్‌ లుక్‌ ప్రేక్షకులు, అభిమానుల నుండి అమేజింగ్‌ రెస్పాన్స్‌ వస్తోంది. బాలీవు్‌డ స్టార్‌ యాక్టర్‌ సంజయ్‌ దత్‌ ఈ చిత్రంలో అధీర అనే పవర్‌ఫుల్‌ పాత్రలో నటిస్తున్నారు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను 2020 ద్వితీయార్థంలో విడుదలవుతున్న ఈసినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. 
రాకీ భాయ్‌గా రాకింగ్‌ పెర్ఫామెన్స్‌తో యష్‌ ప్రేక్షకులను మెస్మరైజ్‌ చేయనున్నారు. శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తుంది. సంజయ్‌ దత్‌ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి రవి బస్రూర్‌ సంగీతం .. భువన్‌ గౌడ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

Hatric Directer Maruthi interview!!

సుప్రీమ్‌ హీరో సాయి తేజ్‌, రాశి ఖన్నా హీరోహీరోయిన్లుగా హ్యాట్రిక్‌ డైరెక్టర్‌ మారుతి దర్శకత్వంలో ఏస్‌ ప్రొడ్యూసర్‌ అల్లు అరవింద్‌ సమర్పణలో జిఎ2 పిక్చర్స్‌, యువి క్రియేషన్స్‌ బేనర్స్‌పై యంగ్‌ ప్రొడ్యూసర్‌ బన్నీ వాస్‌ నిర్మాతగా రూపొందిన చిత్రం ‘ప్రతిరోజూ పండగే’. డిసెంబర్‌ 20న ప్రపంచవ్యాప్తంగా రిలీజైన ఈ చిత్రం పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకొని, మంచి కలెక్షన్స్‌ సాధిస్తోంది. ఈ సందర్భంగా హ్యాట్రిక్‌ డైరెక్టర్‌ మారుతి మీడియాతో ముచ్చటించారు.

‘ప్రతిరోజూ పండగే’ చిత్రానికి ఆడియన్స్‌ నుండి ఎలాంటి రెస్పాన్స్‌ వస్తోంది?
– ఈ కథ మీద నమ్మకం ఉండటంతో బిగినింగ్‌ నుండి ఎప్పుడూ టెన్షన్‌ పడలేదు. ఈ థాట్‌ గురించి ఎవరికి చెప్పినా బాగుంది, బాగుంది అన్నారు. 65 రోజుల్లో సినిమాని పూర్తి చేశాం. రిలీజ్‌కి ముందు నుంచి కూడా హ్యూమన్‌ ఎమోషన్స్‌ ఉన్న సినిమాల్ని మన తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తూ వస్తున్నారు. ఈ ట్రెండ్‌లో ఈ కథ బాగుంటుందని ముందు నుండి అనుకున్నాం. అలాగే నిన్న సినిమా రిలీజ్‌ అయింది. థియేటర్స్‌లో ఆడియన్స్‌ ఎలా ఎంజాయ్‌ చేస్తున్నారనేది అందరం చూస్తున్నాం. ఒక మంచి ఎమోషన్‌ కూడా చెప్పదలుచుకున్నాం. కాకపోతే నా కామెడీ టైమింగ్‌ ఆ ఎమోషన్‌ని డామినేట్‌ చేసింది. అయితే మన తల్లిదండ్రుల్ని మనం ఎంతవరకు చూసుకుంటున్నాం అనే ఫీలింగ్‌ ప్రతి ఒక్కరికీ కలిగింది. ఆ విషయంలో నేను చాలా సంతోషంలో ఉన్నాను.
ఇండస్ట్రీ నుండి ఎలాంటి అప్రిషియేషన్‌ వచ్చింది?
– చిరంజీవిగారు ప్రివ్యూ చూడగానే ‘చాలా హెల్దీగా తీశావ్‌. చాలా నీట్‌గా సందేశం వెళ్లింది. ఎంత కలెక్ట్‌ చేస్తుందో చెప్పలేను కానీ.. మంచి సినిమా. మీ టీమ్‌ అందరికీ గుర్తుండిపోయే సినిమా’ అన్నారు. అలాగే రాఘవేంద్రరావుగారు ఫోన్‌ చేసి ‘చాలా రిస్కీ పాయింట్‌. అలాంటి పాయింట్‌ను చాలా ఎంటర్‌టైన్‌ చేస్తూ చెప్పావ్‌’ అని అప్రిషియేట్‌ చేశారు. అలాగే దిల్‌ రాజు, శిరీష్‌, శివ నిర్వాణ, పరశురామ్‌, బుజ్జి.. ఇలా చాలామంది దర్శకులు, నటులు ఫోన్‌ చేసి అభినందనలు తెలిపారు. ‘భలే భలే మగాడివోయ్‌’ తర్వాత నాకు అన్ని కాల్స్‌, మెసేజ్‌లు వచ్చిన సినిమా ఇది. ఇంతకుముందు మారుతి కామెడీ మాత్రమే బాగా చేస్తాడు అనుకునేవారు.. ఈ సినిమాతో ఎమోషన్‌ని కూడా బాగా హ్యాండిల్‌ చేయగలడు అని మరోసారి ప్రూవ్‌ అయింది.
రావు రమేష్‌ క్యారెక్టర్‌ను స్పెషల్‌గా డిజైన్‌ చేశారు కదా? ఎవరైనా ఇన్‌స్పిరేషన్‌ ఉన్నారా?
– ఈ కథ అనుకున్నప్పుడే హీరో తండ్రి క్యారెక్టర్‌ రావు రమేష్‌గారు అని డిసైడ్‌ అయ్యాం. నేను వెళ్ళి ఆయనకు కథ చెప్పగానే ‘చాలా బాగుంది. తప్పకుండా చేస్తాను’ అన్నారు. సినిమాలో కీలకమైన పాత్ర కావడంతో 28 రోజులు షూట్‌ చేశాం. ఆయనతో షూటింగ్‌ చేస్తున్నప్పుడు మాకు ప్రతిరోజూ పండగ లాగే అన్పించింది.
బిజీగా ఉండి ఎంతమంది పేరెంట్స్‌ విషయంలో కేర్‌ తీసుకుంటున్నారు అనుకునేదానికి రెండు, మూడు ఇన్సిడెంట్స్‌ చూశాను. కొంతమంది అయితే వెంటిలేటర్‌ మీద పెట్టి పోయే ముందు చెప్పండి వస్తాం అనేవారు కూడా ఉన్నారు. ఇలాంటివన్నీ చూసి, వినీ నిజంగా తల్లిదండ్రులు చివరిదశలో ఉన్నప్పుడు అన్నీ పక్కన పెట్టి, ఫ్యామిలీ అంతా కలిసి చూసుకోవడమే ధర్మం అని చెప్పదలుచుకున్నాను.
ఈ కథ మొదట దిల్‌రాజుగారికి చెప్పారు కదా?
– నాకు ఈ థాట్‌ రాగానే ఇలాంటి కథ దిల్‌రాజుగారి బేనర్‌లో చేస్తే బాగుంటుంది అనుకొని ఆయనకి కథ చెప్పడం జరిగింది. ఆయన ఇప్పటికే ఇలాంటి ఫ్యామిలీ, ఎమోషన్స్‌ ఉన్న సినిమాలు తీసి ఉండటంతో రెగ్యులర్‌ అవుతుందని జిఎ2, యువి క్రియేషన్స్‌లో చేశాం.
వెబ్‌ సిరీస్‌ చేసే అవకాశం ఉందా?
– మన ఫ్యూచర్‌ వెబ్‌ సిరీసే అని నమ్ముతాను. క్వాలిటీతో తీస్తే రాను రాను థియేటర్‌ ఆడియన్స్‌ తగ్గే అవకాశం ఉంది. పెద్ద దర్శకులు కూడా మంచి కంటెంట్‌ని సినిమా రేంజ్‌లో ఇవ్వగలిగితే వెబ్‌ సిరీస్‌ చాలా బాగుంటాయి. హిందీలో అనురాగ్‌ కశ్యప్‌లాంటి దర్శకులు మంచి సిరీస్‌లను తెరకెక్కిస్తున్నారు. నన్ను కూడా నెట్‌ఫ్లిక్స్‌లో లస్ట్‌ స్టోరీస్‌కి దర్శకత్వం చేయమని అడిగారు. నేను బిజీగా ఉండటం వల్ల కుదరలేదు.
మీకెలాంటి చిత్రాలంటే ఇష్టం?
– స్టార్‌ హీరోల కన్నా ప్రేక్షకుల హృదయాల్ని కదిలించే సినిమాలు తీయడానికే ఇష్టపడతాను. కథకి ఎవరైతే యాప్ట్‌ అవుతారో వారినే అప్రోచ్‌ అవుతాను. త్వరలో ఒక ఫుల్‌లెంగ్త్‌ ఎంటర్‌టైనింగ్‌ ఉండే ప్రేమకథ చేయబోతున్నాను.. అంటూ ఇంటర్వ్యూ ముగించారు హ్యాట్రిక్‌ డైరెక్టర్‌ మారుతి.