‘Enthamanchi Vadavura’ Movie Releasing on Sankranthi
George Reddy*Movie selected for International Film Festival
ఉస్మానియా యూనివర్సిటీలో ఇప్పటికీ రోల్ మోడల్ గా పేర్కొనే స్టూడెంట్ లీడర్ “జార్జ్ రెడ్డి” జీవితం ఆధారంగా సందీప్ మాధవ్ టైటిల్ పాత్రలో తెరకెక్కిన “జార్జ్ రెడ్డి” చిత్రం గత నెల విడుదలై మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే. ప్రేక్షకుల అభినందనలతోపాటు.. విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్న ఈ చిత్రం 4th లేక్ వ్యూ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ కు ఎంపికైంది. ఈమేరకు డిసెంబర్ 22 మరియు 23వ తారీఖుల్లో ఈ చిత్రాన్ని ప్రదర్శించనున్నారు. నోయిడా, ఢిల్లీలో ఈ ప్రత్యేక ప్రదర్శనలు జరగనున్నాయి. చిన్న సినిమాగా విడుదలై.. ఇండస్ట్రీ మొత్తాన్ని ఆకట్టుకున్న “జార్జ్ రెడ్డి” చిత్రం ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవల్ కి వెళ్లడం పట్ల చిత్రబృందం ఆనందం వ్యక్తం చేస్తోంది. ఈ వేడుకకు చిత్రబృందం హాజరుకానున్నారు.
‘Prema Pipasi’ Bungamoothi Pilla Song Launch
ఎస్.ఎస్.ఆర్ట్ ప్రొడక్షన్స్, యుగ క్రియేషన్స్ బ్యానర్స్ పై రాహుల్ భాయ్ మీడియా మరియు దుర్గశ్రీ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం `ప్రేమ పిపాసి` .పి.ఎస్.రామకృష్ణ (ఆర్ .కె ) ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి మురళీరామస్వామి ( ఎమ్ ఆర్ ) దర్శకత్వం వహిస్తున్నారు. జిపిఎస్, కపిలాక్షి మల్హోత్రా, సోనాక్షివర్మ హీరో హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ చిత్రం లోని `బుంగమూతి పిల్లదాన “ అనే ఫస్ట్ సింగిల్ ని రేడియో సిటీలో లాంచ్ చేశారు.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత .పి.ఎస్.రామకృష్ణ మాట్లాడుతూ ...“లహరి ఆడియో ద్వారా మార్కెట్ లోకి పాటలు విడుదల చేస్తున్నాం. ఈ రోజు రేడియో సిటీ లో మా సినిమా లోని `బుంగమూతి పిల్లదాన ` అనే ఫస్ట్ సింగిల్ లాంచ్ చేసాము. సాంగ్ వినడానికి ఎంత బావుటుందో విజువల్ గా కూడా అంత బావుంటుంది. ప్రెసెంట్ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఫైనల్ లో ఉన్నాయి . అన్ని పనులు పూర్తి చేసి ఫిబ్రవరి లో సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం“ అన్నారు.
డైరెక్టర్ మురళి రామ స్వామి మాట్లాడుతూ….“ఇటీవల కాలం లో అమ్మాయిల పై జరుగుతున్న అకృత్యాలు చూస్తుంటే చాలా బాధేస్తుంది. అమ్మాయిలను ప్రేమించాలి, టీజ్ చేయాలి కానీ ఏది శృతి మించేలా ఉండకూడదు. ఎదుటి వారికి ఇబ్బంది కలిగేలా ఉండకూడదు . ఇక ఈ రోజు రిలీజ్ చేసిన సాంగ్ కూడా స్వీట్ టీజింగ్ సాంగ్. ఒక అబ్బాయి తన ప్రేమను ఒక అమ్మాయితో ఎంతో బుజ్జి గా, ముద్దుగా వ్యక్త పరుస్తాడు. కచ్చితంగా యూత్ కి నచ్చే సాంగ్. ఆర్స్ గారు అద్భుతమైన ట్యూన్ ఇస్తే.. దానికి సురేష్ ఉపాధ్యాయ యూత్ ఫుల్ లిరిక్స్ ఇచ్చారు. సెకండ్ సింగల్ ని ఈ నెలాఖరు లో రిలీజ్ చేసి త్వరలో ట్రెండీ ట్రైలర్ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం“అన్నారు.
కో -ప్రొడ్యూసర్ రాహుల్ పండిట్ మాట్లాడుతూ...“బుంగమూతి పిల్లదాన ` సాంగ్ నాకు చాలా ఇస్టమైన సాంగ్. మంచి మ్యూజిక్ , మంచి లిరిక్స్ కుదిరాయి. అందరికి నచ్చే సాంగ్ అవుతుంది “ అన్నారు.
హీరో జిపియస్ మాట్లాడుతూ...“ఇటీవల విడుదలైన టీజర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. యూట్యూబ్, టిక్ టాక్ లలో డైలాగ్స్ హల్ చల్ చేస్తున్నాయి. ఇక ఈ రోజు రేడియో సిటీ లో `బుంగమూతి పిల్లదాన` సాంగ్ రిలీజే చేసాం . అర్స్ మ్యూజిక్, సురేష్ ఉపాధ్యాయ లిరిక్స్ పోటాపోటీగా ఉంటాయి. మంచి యూత్ ఫుల్ సాంగ్. `ఢీ జోడి ` ఫేమ్ కన్నా ఈ పాటకు అద్భుతం గా కొరియోగ్రఫీ చేసారు“ అన్నారు .
లిరిసిస్ట్ సురేష్ ఉపాధ్యాయ మాట్లాడుతూ…` నేనొక ప్రేమ పిపాసిని `. ఈ సాంగ్ ఎంత ఫేమస్సో అందరికి తెలిసిందే . నాకు ఎంతో ఇష్టమైన సాంగ్. ఆ పాటలో పల్లవిని తీసుకొని `ప్రేమ పిపాసి` అనే టైటిల్ తో మురళి రామ స్వామి గారు యూత్ ఫుల్ సినిమా చేస్తున్నారు. ఇందులో నాతో నాలుగు సాంగ్స్ రాయించారు. “బుంగమూతి పిల్లదానా “ అంటూ సాగే స్వీట్ టీజింగ్ సాంగ్ అందరికి నచ్చుతుందన్న నమ్మకం ఉంది . ఆర్స్ ఎక్సలెంట్ మ్యూజిక్ ఇచ్చారు“ అన్నారు .
జిపిఎస్ , కపిలాక్షి మల్హోత్రా, సోనాక్షి వర్మ, జ్యోతి రాజ్ పుత్, మమత శ్రీ చౌదరి, `ఢీ జోడి ఫేమ్` అంకిత , బిగ్ బాస్ ఫేమ్ బందగీ కర్ల , సంజన చౌదరి , సుమన్ , భార్గవ్ , షేకింగ్ శేషు, జబ్బర్దస్థ్ రాజమౌళి, ఫసక్ శశి, ఫన్ బకెట్ భరత్ తదితరులు నటిస్తోన్న ఈ చిత్రానికి డీఓపీ తిరుమల రోడ్రిగ్జ్ , మ్యూజిక్: ఆర్స్ , పాటలు : సురేష్ ఉపాధ్యాయ-అల రాజు, సౌండ్ డిజైన్ :యతిరాజ్ , పీఆర్వో : వంగాల కుమారస్వామి , ఎడిటర్: ఎస్ శివ కిరణ్, ఫైట్స్: మిస్టర్ దేవ్, కో-ప్రొడ్యూసర్స్ : రాహుల్ పండిట్, జిఎస్ రావు, వై వెంకట లక్ష్మి , అస్సోసియేట్ ప్రొడ్యూసర్ :యుగంధర్ కొడవటి , ప్రొడ్యూసర్ : పియస్ రామకృష్ణ (ఆర్కే), రచన-దర్శకత్వం: మురళి రామస్వామి (ఎమ్ .ర్ ).
Asian Cinemas Acquires The Theatrical Rights Of ‘Savaari’ Movie in Nizam.
నందు, ప్రియాంక శర్మ జంటగా నటించిన సవారీ సినిమా విడుదలకు సిద్ధమైంది. ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ మరియు ప్రొడక్షన్ సంస్థ ఏషియన్ సినిమాస్ సవారీ సినిమా థియేట్రికల్ హక్కులను దక్కించుకున్నారు. నైజాంలో ఈ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేయనున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ పాటలకు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాకు క్రేజ్ వచ్చింది. సవారీ చిత్రంలోని పాటలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. రాహుల్ సిప్లిగంజ్ పాడిన నీ కన్నులు లిరికల్ సాంగ్ 3 మిలియన్ వ్యూస్ దక్కించుకుని.. ఇంకా వ్యూస్ తెస్తూనే ఉంది. సాహిత్ మోత్కూరి తెరకెక్కించిన ఈ చిత్రాన్ని సంతోష్ మోత్కూరి, నిశాంక్ రెడ్డి కుడితి సంయుక్తంగా నిర్మించారు. శేఖర్ చంద్ర సంగీతం అందించారు. ఇక ఇప్పుడు ఏషియన్ సినిమాస్ నైజాం రైట్స్ తీసుకున్నారు. ఈ చిత్రాన్ని ఫిబ్రవరిలో భారీగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. త్వరలో విడుదల తేదీని అనౌన్స్ చేయనున్నారు చిత్ర యూనిట్.
నటీనటులు: నందు, ప్రియాంక శర్మ, శ్రీకాంత్ గంట, శివ, మది తదితరులు..
టెక్నికల్ టీం:
దర్శకుడు: సాహిత్ మోత్కూరి
నిర్మాతలు: సంతోష్ మోత్కూరి నిశాంక్ రెడ్డి కుడితి
నైజాం విడుదల: ఏషియన్ సినిమాస్
సంగీతం: శేఖర్ చంద్ర
Megastar Chiranjeevi As Chief Guest For The Mega Event Of ‘Sarileru Neekevvaru’
సూపర్‌స్టార్ మహేష్ హీరోగా దిల్‌రాజు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ సమర్పణలో జి.ఎం.బి. ఎంటర్‌టైన్‌మెంట్, ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న అవుట్ అండ్ అవుట్ మాస్ ఎంటర్‌టైనర్ ’సరిలేరు నీకెవ్వరు’. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో ప్రత్యేక పాత్రలో లేడీ అమితాబ్ విజయశాంతి నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి జనవరి 11న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని వరల్డ్‌వైడ్‌గా రిలీజ్ చేస్తున్నారు. కాగా, ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఫంక్షన్‌ను జనవరి 5న హైదరాబాద్‌లోని లాల్‌బహదూర్ స్టేడియంలో అభిమానుల సమక్షంలో చాలా గ్రాండ్‌గా నిర్వహించనున్నారు. ఈ ఫంక్షన్‌కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా పాల్గొనబోతున్నారు. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ శుక్రవారం ప్రకటించింది.
ఈ సందర్భంగా సూపర్‌స్టార్ మాట్లాడుతూ “మా ఆహ్వానాన్ని మన్నించి మా సినిమా ప్రీ రిలీజ్ సెలబ్రేషన్స్‌కి రావడానికి అంగీకరించినందుకు చిరంజీవిగారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మా సినిమా ఫంక్షన్‌కు మీరు రావడం మాకెంతో సంతోషాన్ని కలిగిస్తోంది. మీ రాకతో మా హ్యాపీనెస్ రెట్టింపు అవుతుంది. మా యూనిట్ అంతా ఈ ఫంక్షన్‌ను ఓ ల్యాండ్‌మార్క్ ఈవెంట్‌గా సెలబ్రేట్ చేసుకుంటుంది. సర్, మీ రాక కోసం ఎదురుచూస్తున్నాను” అన్నారు.
ఇప్పటికే విడుదలైన మూడు సాంగ్స్‌కి ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. కాగా, ఈ సోమవారం విడుదల కానున్న నాలుగో పాట క్లాస్ సాంగ్‌గా ఉండనుందని ఇంట్రెస్టింగ్ అప్డెట్ ఇచ్చారు దేవిశ్రీ ప్రసాద్. ఈ పాట కోసం యూరప్‌లోని అతి పెద్ద ఆర్కెస్ట్రాతో కలిసి మ్యూజిక్ కంపోజ్ చేశారు దేవి. అక్కడి ఫారిన్ మ్యూజిషియన్స్‌తో కలిసి ఈ పాటని ప్రత్యేకంగా రికార్డ్ చేశారు. జనవరి 5 ఆదివారం సాయంత్రం 5:04 నిమిషాలకు హైదరాబాద్ ఎల్.బి స్టేడియంలో ’సరిలేరు నీకెవ్వరు’ గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను జరిపి సంక్రాంతి కానుకగా జనవరి 11, 2020న ప్రపంచవ్యాప్తంగా చిత్రాన్ని విడుదల చేస్తున్నారు.
సూపర్‌స్టార్ మహేష్, రష్మిక మందన్న, ప్రత్యేక పాత్రలో లేడీ అమితాబ్ విజయశాంతి, రాజేంద్రప్రసాద్, ప్రకాష్‌రాజ్, సంగీత, బండ్ల గణేష్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్, రత్నవేలు, కిశోర్ గరికిపాటి, అజయ్ సుంకర, తమ్మిరాజు, రామ్‌లక్ష్మణ్, యుగంధర్ టి. ఎస్.కృష్ణ సాంకేతిక వర్గం.
‘Donga’ Movie Review
Release date : December 20, 2019
Cinemarangam.com.. Rating : 3/5
Movie name:-”DONGA”
Presented:-Akshayasri
Banners:-Viocom18 studios & Harshitha
Starring : Karthi,Jyothika,Sathyaraj,Nikhila Vimal
Editor : Vinayak
Cinematography :R D Rajasekhar
Music Director : : Govind Vasantha
Director : Jeethu Joseph
Producer : Dr.Ravuri v srinivs
తమిళ సినిమా రంగానికి చెందిన హీరో కార్తీకి తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉంది. సూర్య తమ్ముడిగా వెండితెరపై ఎంట్రీ ఇచ్చిన కార్తీ తక్కువ కాలంలోనే తనకంటూ సపరేట్ క్రేజ్ క్రియేట్ చేసుకుని వైవిధ్యమైన సినిమాలు మరియు క్యారెక్టర్లు ఎంచుకుని అటు తమిళంలో మరియు తెలుగులో కూడా సినిమాలు రిలీజ్ చేస్తూ కెరియర్ కొనసాగిస్తున్నాడు. ఇటీవలే ‘ఖైదీ’ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న కార్తీ తాజాగా ‘దొంగ’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. కార్తీ హీరోగా జ్యోతిక, సత్యరాజ్ ప్రధాన పాత్రలలో నటించిన చిత్రం దొంగ. మెగాస్టార్ చిరంజీవి నటించిన బ్లాక్‌బ్లస్టర్ సినిమా దొంగ చిత్రం పేరుతో కార్తీ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాను దర్శకుడు జీతూ జోసెఫ్ తెరకెక్కించిన సస్పెన్సు అండ్ క్రైమ్ థ్రిల్లర్. తమిళ చిత్రం తంబీ చిత్రానికి తెలుగు అనువాదంగా నేడు ఈ మూవీ విడుదలైనది. కార్తీ గతంలో కూడా మెగాస్టార్ చిరంజీవి నటించిన భారీ హిట్ చిత్రం ఖైదీ.ఈ సినిమా పేరుతో ఇటీవల కార్తీ ప్రేక్షకుల ముందుకు రాగా ప్రేక్షకులు ఈ సినిమాను సూపర్ హిట్ గా నిలివడంతో దొంగ చిత్రంపై అంచనాలు బాగున్నాయి. దొంగ చిత్రం ఎలా ఉందో.. కార్తీ నటనతో ఎలా ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించాడో ఓసారి సమీక్షించుకుందాం.
కథ:15 సంవత్సరాల క్రితం ఇంట్లోంచి పారిపోయిన తమ్ముడు మళ్ళీ తిరిగి వస్తే ఎలా ఉంటుంది ? ఆ అక్క , ఆ ఫామిలీ యొక్క రియాక్షన్స్ ఏంటి ?హీరో కార్తీ (విక్కి) గోవాలో చిన్న చిన్న దొంగతనాలు, చీటింగ్ లు చేస్తూ స్వేచ్చా జీవిగా బతుకుతుంటాడు. 15ఏళ్లుగా తప్పిపోయిన కొడుకు శర్వా కోసం వెతుకుతున్న తండ్రి జ్ఞానమూర్తి(సత్య రాజ్) అక్క పార్వతి(జ్యోతిక). అయితే ఈ విషయం తెలుసుకున్న గోవా పోలీస్ అధికారి జీవానంద్(ఇళవరసు) డబ్బుకోసం విక్కీతో కుమ్మక్కవుతాడు. అయితే విక్కీ శర్వాగా మారి ఆ కోటీశ్వరుల ఇంట్లో కి ప్రవేశిస్తాడు. మరి జ్ఞానమూర్తి కొడుకు శర్వా ఏమయ్యాడు.. విక్కీ ఆ శర్వాగా ఎదుర్కోన్న పరిస్థితులు ఏమిటీ.. పోలీసు అధికారి వేసిన ఎత్తులు ఫలించాయా అనేది తెరపై చూడాల్సిందే.
నటీ నటులు : ఇంతకు ముందే ఖైదీతో వచ్చి మంచి హిట్ సంపాదించిన కార్తీ ఇప్పుడు దొంగ గా వచ్చి ప్రేక్షకులను మెప్పించాడు. కార్తీ ఖైదీ సినిమా జోనర్‌లోనే ఈ సినిమాను ఎంచుకుని విజయవంతం అయ్యాడనే చెప్పవచ్చు. కోటీశ్వరుడైన సత్యరాజ్ తన కొడుకు కోసం పడుతున్న యాతన.. నటించిన తీరు సినిమాకు హైలెట్‌గా నిలిచింది. ఇక జ్యోతిక కూడా తనదైన శైలీలో నటించింది. ఇక సినిమా ఫస్టాఫ్ అంతా నవ్వులే నవ్వులు. ఇక సెకంఢాఫ్ అంతా యాక్షన్‌కు ప్రాధాన్యత ఇచ్చారు. కార్తీకి సరిజోడిగా నిలిచింది నిఖిల విమల్. తన రోమాన్స్‌తో ఆడిపాడింది. సినిమా కామెడీకి కామెడీ.. యాక్షన్‌కు యాక్షన్ సస్సెన్స్‌కు సస్పెన్స్ అన్నింటిని సమ పాళ్ళలో ఉన్నాయి.
సాంకేతిక విభాగం:ఈ సినిమాకు గోవింద వసంత పాటలు ఆకట్టుకున్నప్పటికీ బీజీఎమ్ పర్వాలేదు అన్నట్లుగా ఉంది. ఆర్ డి రాజశేఖర్ సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంటుంది. అందమైన హిల్ ఏరియాలో నడిచిన ఈ చిత్ర సన్నివేశాలను ఆయన చక్కగా కెమెరాలో బంధించారు. ఎడిటింగ్ పరవాలేదు. రెన్సిల్డ్ సిల్వా, సమీర్ అరోరా, జీతూ జోసెఫ్ స్క్రీన్ ప్లే మూవీకే ప్రధాన ఆకర్షణ. కథలో పొరలు పొరలుగా వచ్చే ట్విస్ట్స్ ప్రేక్షకుడిని థ్రిల్ చేస్తాయి. దర్శకుడు జీతూ జోసెఫ్ ఒక క్రైమ్ థ్రిల్లర్ ని తెరకెక్కించడంలో చాలా వరకు సక్సెస్ అయ్యారు. ఒక చిన్న పాయింట్ చుట్టూ సస్పెన్సు క్రియేట్ చేసి నడిపిన విధానం బాగుంది. ఆయన చివరి వరకు సినిమాను అలరించే ట్విస్ట్స్ తో నడిపారు. ఐతే జ్యోతిక పాత్రను ఆయన నిర్లక్ష్యం చేశారు. అలాగే సెకండ్ హాఫ్ లో ఆయన కమర్షియల్ అంశాలు విస్మరించారు.
ఖైదీ సినిమాతో మెప్పించిన కార్తీ ఈ సినిమాతోనూ కూడా తెలుగు ప్రేక్షకుల మదిని దోచాడు. తన నటన, కామెడీ, యాక్షన్‌తో మెప్పించాడు. దర్శకుడు కూడా తన శక్తి మేరకు సినిమాను తెరకెక్కించడంలో కృతకృత్యుడు అయ్యాడు. ఇక సినిమా హాస్యంతో కూడిన యాక్షన్ సెంటిమెంట్ సినిమాగా నిలిచిపోతుంది.
cinema Rangam..Rating..3/5
‘Ruler’ Movie Review
Release date : December 20, 2019
Cinemarangam.com.. Rating : 2.5/5
Movie name:-”Ruler”
Presented:-Ck Entertainment
Banners:-Happy Movies
Starring : Balakrishna, Sonal Chauhan, Vedhika,Bhumika Chawla, Prakash Raj
Editor : John Abraham
Cinematography : C Ram Prasad
Music Director :Chirantan Bhatt
Director : K. S. Ravikumar
Producers : C. Kalyan
గౌతమీపుత్ర శాతకర్ణి తరువాత ఆ రేంజ్ హిట్ కోసం ఎదురుచూస్తున్ననందమూరి బాలయ్య ‘కథానాయకుడు’ మరియు ‘మహా నాయకుడు’ వంటి రెండు పరాజయాల తర్వాత చేస్తున్న సినిమా ‘రూలర్’. యాక్షన్ ఎంటర్ టైనర్ రూపంలో తెరకెక్కిన ఈ సినిమాపై నందమూరి అభిమానులు చాలా అంచనాలు పెట్టుకున్నారు.బాలకృష్ణ కెరీర్లో ‘జై సింహా’ లాంటి సూపర్ డూపర్ హిట్ ఇచ్చిన కె.ఎస్.రవికుమార్ దర్శకత్వం లో నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన 105వ చిత్రం ‘రూలర్’ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయిన సందర్భంలో వచ్చే సంక్రాంతికి రిలీజ్ అవుతుందని అందరూ భావించారు. అయితే అనూహ్యంగా బాలకృష్ణ సంక్రాంతికి ముందే సినిమా డిసెంబర్ నెలలో విడుదల చేయడం జరిగింది. సినిమాలో విభిన్నమైన పాత్రలో బాలకృష్ణ నటించారు. ఈ రోజు విడుదలైన ఈ సినిమాకి సినిమా హాల్ దగ్గర అభిమానులు బ్రహ్మరథం పడుతున్నారు.ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం మంచి బజ్ నడుమ ఈరోజే విడుదల అయ్యింది.మరి ఈ సినిమా ఎలా ఉందొ ఇపుడు రివ్యూ లోకి వెళ్లి తెలుసుకుందాం.
కథ :ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో రైతుల కోసం పోరాడిన స్టోరీగా డైరెక్టర్ కె.ఎస్.రవికుమార్ ‘రూలర్’ సినిమాని తెరకెక్కించారు. ఈ సినిమాలో బాలయ్య బాబు ఉత్తరప్రదేశ్ రైతు కుటుంబానికి చెందిన వ్యక్తిగా కనిపిస్తారు. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలో జరిగిన అల్లర్లు వల్ల రైతులు అనేక సమస్యలు ఎదుర్కొన్న తరుణంలో రెండువేల రైతు కుటుంబాల కోసం ఓ బడా కంపెనీ సీఈఓగా బాలకృష్ణ ఎలా మారాడు అదేవిధంగా సినిమాలో ధర్మ అనే పోలీస్ ఆఫీసర్ రైతుల కోసం సినిమా లో ఏం చేశారు అనేది చాలా సస్పెన్స్ గా తెరకెక్కించాడు డైరెక్టర్. పోలీస్ ఆఫీసర్ గా ఉన్న ధర్మ అసలు రైతుల కోసం ఎందుకు పోరాడాడు అనేది సినిమా తెరపై చూడాల్సిందే .
జయసుధ (సరోజినీ ప్రసాద్) పెద్ద ఐటీ బిజినెస్ మాగ్నెట్. అయితే ఆమె తీవ్రమైన గాయాలతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న బాలయ్యను చూసి కాపాడుతుంది. గతం మర్చిపోయిన అతన్ని తన కొడుకుగా మార్చుకుని అతనికి అర్జున్ ప్రసాద్ అని పెట్టి అమెరికా పంపించి బిజినెస్ మెన్ గా తయారుచేస్తోంది. అర్జున్ ప్రసాద్ (బాలయ్య) ఆమె కంపెనీని నెంబర్ వన్ పోజిషన్ లో పెడతాడు. ఈ క్రమంలో ఉత్తర ప్రదేశ్ లో తన కంపెనీ మొదలుపెట్టి ఆపేసిన ఓ ప్రాజెక్ట్ ను మళ్ళీ స్టార్ట్ చేసే ప్రాసెస్ లో.. అక్కడ తన తల్లికి (జయసుధ) జరిగిన అవమానం గురించి తెలుస్తుంది. దానితో అర్జున్ ప్రసాద్ తన తల్లిని అవమానించిన వారిని టార్గెట్ చేసి మరి వారిని కొడతాడు. అయితే అంతలో కొన్ని ఊహించని క్యారెక్టర్స్ అతని జీవితంలోకి వస్తాయి. తనని అక్కడి వారందరూ ధర్మ అని పిలుస్తూ పోలీస్ ఆఫీసర్ ధర్మ గురించి చెబుతారు. ఇంతకీ ధర్మ ఎవరు? అంతేకాకుండా సినిమాలో మాజీ వ్యవసాయ శాఖ మంత్రి కూతుర్ని ధర్మ అనే పోలీస్ ఆఫీసర్ఎందుకు కాపాడాల్సి వచ్చింది.ధర్మకు నిరంజన (భూమిక)కు ఉన్న సంబంధం ఏమిటి? అసలు పోలీస్ ఆఫీసర్ ధర్మ గతం ఏమిటి? దేని కోసం అతను పోరాడాడు? లాంటి విషయాలు తెలియాలంటే ఈ చిత్రాన్ని వెండి తెరపై చూడాల్సిందే.
విశ్లేషణ:
దర్శకుడు కె.యస్ రవికుమార్ రొటీన్ కథని ఎన్నుకొన్నాడు. దాన్నిఅంతే రొటీన్ గా తెరకెక్కించాడు. ఇప్పుడు బీసీ కాలం నాటి కథని ప్రేక్షకులు ఎంజాయ్ చేసేలా లేరు. అసలు తెలుగు రైతులని యూపీ ప్రభుత్వానికి లింకు చేయడమే సరిగ్గాలేదు.ఒక్కటి కొత్త సీన్ కనబడదు.అంతేకాదు.. బాలయ్య గత సినిమాల్లోని సీన్స్ ని ఇందులో మిక్స్ చేశాడు.అసలు దర్శకుడు ఈ కథ-కథనంపై ఏమాత్రం ఫోకస్ పెట్టలేదు. కనీసం బాలయ్యకి విగ్గుకూడా సరిగ్గా సెట్ చేయలేకపోయాడు .అయితే, ‘రూలర్’ ట్రైలర్ వచ్చిన తరవాత బాలకృష్ణ పోలీస్ గెటప్‌పై విమర్శలు వచ్చాయి.ఈ పాత్రలో బాలయ్య విగ్ అస్సలు బాగాలేదని చాలా మంది పెదవి విరిచారు. నిజానికి బాలకృష్ణ అభిమానులకు కూడా ఈ విగ్ నచ్చలేదు. కాకపోతే వాళ్లు ఎక్కడా ఆ విషయం మాట్లాడరు. కానీ, ఒక అభిమాని మాత్రం ఈ విషయాన్ని మనసులో దాచుకోలేకపోయాడు.తన బాధను, ఆవేదనను సోషల్ మీడియాలో పెట్టేశాడు. ‘రూలర్’ సినిమా చూసిన తరవాత తన అభిమాన హీరోను ఉద్దేశించి, ఆయనకు పలు రకాల సూచనలు చేస్తూ ఫేస్‌బుక్‌లో ఒక పోస్ట్ పెట్టాడు. ”జై బాలయ్య జై బాలయ్య… ఏందయ్యా బాలయ్య బాబు మీ ఆ విగ్గులు మోజు తగలెయ్య ఈ వయసులో కుర్రాళ్ళతో పోటీగా అద్భుతమైన నటనతో అందరినీ మెప్పిస్తున్నావు.
కుర్రాడిలా తగ్గి అందంగా తయారై ఆ ఫిజిక్ ఏంటి ఎలా సాధ్యం అని అందరూ ముక్కున వేలేసుకుని శభాష్ బాలయ్య అనేటట్టుగా మీ రూపం ఉంది. మీరు ఏం చేస్తున్నారండి.. మీ దగ్గరికి కథలు పట్టుకు వచ్చేవాడిని కత్తితో కండకండాలుగా నరికేయాలి. ఆ సెట్టింగులేంటి…
అంత తొందరగా సినిమా ఎవరు తీయమన్నారు బాల బాబు. ఆ కాస్ట్యూమ్స్ ఏంటండి బాబు. కాస్త శ్రద్ధ తీసుకోండి. మీ పక్కన హీరోయిన్లకి కాస్త కండ ఉండేటట్లు చూడండి బాల బాబు.
ఇంకా కె.ఎస్.రవికుమార్ లాంటి డైరెక్టర్లను పట్టుకొని వేలాడుతున్నారు ఏంటండి. ఆ ఆర్టిస్టుల ఎంపిక ఏంటండి. పాప బీతితో అందరికీ మాట ఇచ్చేస్తారు. అట్లా కాదండి.
మీ నటన బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. కాస్త ఆలోచించండి బాలయ్య. మీ ఒరిజినల్ గెటప్‌తో వచ్చినా ప్రజలు నీరాజనాలు పడతారు. ఎందుకంటే మీదంతా ఒరిజినల్లే మీకు నటించడం రాదండి.నటించడం రాదు అంటే నటన రాదు అని కాదు అండి. ఒకటే మంచి విగ్గు పర్మినెంట్‌గా ఉంచేయండి. ఒక్కమగాడులో విగ్గు మీకు భలే సూట్ అయిందండి. అదే కంటిన్యూ చేయండి బాలయ్యబాబు.అందులో అందంగా ఉన్నారు. సినిమా బాగుందండి. మాకు బాగుంటే సరిపోదండి. మీ విశ్వరూపానికి తగ్గ కథ దొరికి, ఎప్పుడూ మాకు ఫుల్ మీల్స్ భోజనమే తినాలనిపిస్తుంది.
అయ్యా బాలయ్య అభిమానులారా నన్ను అపార్థం చేసుకోకండి. బాలయ్యకు వీరాభిమానిని. నేను కూడా మీలాగా బాలయ్య అభిమానినే. నా ప్రొఫైల్లో జూనియర్ బొమ్మలు చూసి అపార్థం చేసుకోకండి. నేను నందమూరి కుటుంబ అభిమానిని. జై బాలయ్య జై జై బాలయ్య” ………..అని సుధీర్ఘంగా రాసుకొచ్చాడు ఆ అభిమాని. .
బాలయ్య మాత్రం అభిమానులని నిరాశపరచలేదు. తనదైన మార్క్ యాక్షన్, డైలాగ్స్ తో అదరగొట్టేశాడు. బాలయ్య డ్యాన్స్ బోనస్. చాలా హుశారుగా స్టెప్పులేశాడు.హీరోయిన్లు అందంగా కనిపించారు. సోనాల్ బికినీ ట్రీట్ బాగుంది. మిగితా నటీనటుల గురించి చెప్పుకోవాల్సింది ఏమీ లేదు.దర్శకుడు కె ఎస్ రవికుమార్ యాక్షన్ సన్నివేశాలను అద్భుతంగా తెరకెక్కించారు.దర్శకుడు టేకింగ్ తో ఆకట్టుకున్నా స్క్రిప్ట్ పరంగా మాత్రం పరుచూరి మురళి పూర్తిగా న్యాయం చేయలేకపోయారు.ఆయన స్క్రిప్ట్ మీద ఇంకా బాగా శ్రద్ద పెట్టి ఉంటే సినిమా అవుట్ ఫుట్ మరోలా ఉండేది. అలాగే బాలయ్య చేసిన ధర్మ పాత్ర లుక్ ను దర్శకుడు ఇంకా అందంగా చూపించొచ్చు.అర్జున్ ప్రసాద్ గా,ధర్మ గా పాత్రకు బాలకృష్ణ తనదైన న్యాయం చేశారు, డాన్స్ లు అయితే సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి,ఈ ఏజ్ లో కూడా బాలయ్య ఈజీ గా చేయడం ప్రేక్షకులతో ఈలలు వేయిస్తుంది.ఈ సినిమాకి కెమెరామెన్ గా పని చేసిన రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ సినిమాకే హైలెట్ గా నిలుస్తోంది. కొన్ని యాక్షన్ సన్నివేశాల్లో ఆయన పనితనం చాలా బాగుంది. సంగీత దర్శకుడు చిరoతన్ బట్ అందించిన నేపథ్య సంగీతం జస్ట్ ఓకే అనిపిస్తుంది. సాంగ్స్ చాలా బాగుంటాయి.నిర్మాత సి కళ్యాణ్ పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి.హీరోహిన్స్ తనదైన పాత్ర మేరకు బాగానే చేశారు, భూమిక కీలకమైన పాత్రలో అద్భుతమైన పెరఫార్మన్స్ ఇచ్చింది. ప్రకాష్ రాజ్ ఈ సినిమాకి మరో ప్లస్ అని చెప్పొచ్చు.మొత్తానికి ఈ సినిమా మాస్ ఆడియన్స్ ఎంజాయ్ చేసే పక్క మాస్ ఫిల్మ్,ఫ్యామిలీ ఆడియన్స్ కూడా బాగా ఎంజాయ్ చేస్తారు.
cinema Rangam..Rating..2.5/5
Prathi Roju Pandage Review
Release date : December 20, 2019
Cinemarangam.com… Rating : 3/5
Movie name:-”Prathi Roju Pandage”
Presented:-Allu aravind
Banners:-u.v.Creations & G.A.2 pictures
Starring : Sai Dharam Tej, Raashi Khanna, Sathyaraj, Vijayakumar , Rao Ramesh, Hari Teja,mahesh
Editor : Kotagiri Venkateswara Rao
Cinematography : Jaya Kumar
Music Director : S. Thaman
Director : Maruthi
Producers : Allu Aravind, Bunny Vasu
మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన హీరోల్లో సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ కూడా ఒకడు.కెరీర్ ఆరంభంలో బాగానే నిలబడినా తర్వాత సరైన హిట్టు చిత్రాలు పడడం లేదు.అలాగే రీసెంట్ గా వచ్చిన “చిత్రలహరి”తో పర్వాలేదనిపించినా అంత పెద్ద హిట్ అయితే కాలేదు.అయితే మారుతీ దర్శకత్వంలో రాశీ ఖన్నా హీరోయిన్ గా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం మంచి బజ్ నడుమ ఈరోజే విడుదల అయ్యింది.మరి ఈ సినిమా ఎలా ఉందొ ఇపుడు రివ్యూ లోకి వెళ్లి తెలుసుకుందాం.
కథ:
ఇక కథలోకి వెళ్లినట్టయితే రఘురామయ్య(సత్యరాజ్)పిల్లలు, మనువరాళ్ళు ఆస్ట్రేలియాలో,అమెరికాలో వారందరు జాబ్స్ లో బిజీగా నివసిస్తుంటారు.రావురమేష్ తండ్రి(సాయి ధరంతేజ్ తాత)సత్యరాజ్ క్యాన్సర్ తో బాధపడతారు అయితే తన ఆఖరి రోజుల్లో గడిపే కొన్ని క్షణాలు అయినా సంతోషంగా ఉంచాలని యూఎస్ నుంచి సాయి తేజ్ఇండియాలో రాజమండ్రిలోని తన ఊరికి బలదేరుతాడు.అక్కడ నుంచే తన కుటుంబాన్ని ఒకే చోటుకు చేర్చాలని ప్లాన్ చేస్తాడు.అయితే ఈ నేపథ్యంలో సాయి తేజ్ ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడు?నిజంగానే సత్యరాజ్ కు ఏమన్నా అయ్యిందా లేక ప్లానా?ఈ పరిస్థితులను సాయి తేజ్ ఎలా హ్యాండిల్ చేసాడు?ఇలాంటి ప్రశ్నలకు సమాధానం తెలియాలి అంటే ఈ చిత్రాన్ని వెండి తెరపై చూడాల్సిందే.
విశ్లేషణ :
ఈ చిత్రం విషయంలో మొదటగా చెప్పుకోవాల్సిన పాయింట్ ఇప్పటికే చూసేసిన సినిమాలాగే ఉందా లేక మారుతి ఏమన్నా కొత్తగా తెరకెక్కించారా అన్నది.అయితే దీని కోసం మాట్లాడే ముందు మిగతా సినిమా ఎలా ఉందో చూద్దాం.ఈ చిత్రం మొదలైనప్పటి నుంచి దర్శకుడు మారుతి ఎప్పటి లానే ఎంటర్టైన్మెంట్ పైనే ఎక్కువ దృష్టి పెట్టినట్టు అనిపిస్తుంది.ఆ కామెడీ ట్రాక్స్ నవ్వించేలా బాగానే ఉంటాయి.చూసినప్పుడు కొన్ని ట్రాక్స్ అయితే మంచి హిలేరియస్ గా వర్కౌట్ అయ్యాయి.కానీ వాటి మోతాదే కాస్త ఎక్కువ కావడం వల్ల సినిమా కాస్త పక్క దారి పడుతుందా అని అనిపిస్తుంది.ఈ విషయంలో మారుతి కాస్త జాగ్రత్త వహించి ఉంటే బాగుండేది.అయితే మనం మొదట్లో మాట్లాడుకున్న అంశాన్నే పక్కకు తప్పించేందుకు మారుతి ఈ ప్రయత్నం చేసి ఉండొచ్చు.ఇలా పర్వాలేదనిపించే నరేషన్ తో ఫస్ట్ హాఫ్ పూర్తయ్యిపోయింది కానీ ఇంకా ఏదో అసంతృప్తి అయితే ప్రేక్షకుడిలో మిగలొచ్చు.అలాగే ఇదే తరహా నరేషన్ తో కామెడీ ట్రాక్స్ తో ఎమోషన్స్ కు తావివ్వకుండా సెకండాఫ్ కూడా మారుతి నింపేశారు.దీనితో ఇవే ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది.అయితే లాస్ట్ కి వచ్చే సరికి మాత్రం ఎప్పటిలానే అన్ని సినిమాల్లోలా తాను చెప్పాలనుకున్న పాయింట్ ను రివీల్ చేసి ఒకే అనిపిస్తారు.
ఇక నటీనటుల విషయానికి వచ్చినట్టయితే సాయి ధరమ్ తేజ్ ఎనర్జిటిక్ యాక్టింగ్ మరియు ఎంజెల్ అర్ణ పాత్రలో రాశీ ఖన్నాల ఫైర్ మరోసారి చక్కగా కుదిరింది.సుప్రీం తర్వాత వీరిద్దరి మధ్య మిస్సయిన కామెడీ ట్రాక్స్ కానీ టైమింగ్ కానీ ఈ చిత్రం ద్వారా మనం చూడొచ్చు.అలాగే క్లైమాక్స్ లోని ఎమోషనల్ సీన్ సహా ఇతర కీలకమైన ఎమోషన్స్ ను పండించడంలో సాయి తేజ్ ఆకట్టుకున్నాడు.అంతేకాకుండా ప్రీ క్లైమాక్స్ లో సిక్స్ ప్యాక్ ఫైట్ సీన్ తో అయితే అదరగొట్టేసాడు.ఇంక అలాగే మరో కీలక పాత్రలో కనిపించిన సత్య రాజ్ మంచి ఎనర్జిటిక్ గా మాత్రమే కాకుండా ఎమోషనల్ గా అద్భుతమైన నటన కనబర్చారు.
ఇక అలాగే రావు రమేష్ లోని ఎమోషన్స్ కంటే కామెడీ సెన్స్ ను ఈ చిత్రం ద్వారా మనం చూడొచ్చు.ఇంకా మిగతా నటీనటులు తమ పాత్రల పరిధి మేరకు మెప్పిస్తారు.ఇక ఇతర టెక్నిషన్స్ విషయానికి వస్తే సంగీతం అందించిన థమన్ డీసెంట్ బ్యాక్గ్రౌండ్ మరియు సాంగ్స్ అందించారు.విజువల్ పరంగా సాంగ్స్ మరింత ఆకట్టుకుంటాయి.వీటిలో జయకుమార్ అందించిన సినిమాటోగ్రఫీ బాగుంది.ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే మారుతి మరియు సాయి ధరమ్ తేజ్ ల కాంబో వచ్చిన “ప్రతిరోజూ పండగే” ఎక్కువ కామెడీ పైనే దృష్టి పెట్టారు. కామెడీ ఎమోషనల్ ఎంటర్ టైనర్, యూత్ తో పాటుగా మిగిలిన అన్నివర్గాల ప్రేక్షకులని అలరిస్తుందని చెప్పొచ్చు.
cinema Rangam..Rating..3/5
Ramgopal varma’s Bueatiful movie releasing on jan1
టైగర్ కంపెనీ ప్రొడక్షన్ పతాకంపై దర్శక సంచలనం రాంగోపాల్ వర్మ రూపొందించిన తాజా చిత్రం బ్యూటిఫుల్ (ట్రిబ్యూట్ టు రంగీలా ఉప శీర్షిక). నైనా కథానాయిక కాగా సూరి కధానాయకుడిగా నటించారు. అగస్త్య మంజు దర్శకుడు. ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఎలాంటి కట్స్ లేకుండా `ఎ` సర్టిఫికెట్ పొందిన ఈ చిత్రాన్ని నూతన సంవత్సరం సందర్బంగా జనవరి 1న ప్రంపంచ వ్యాప్తంగా భారీగా విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు వెల్లడించారు. రొమాంటిక్ ప్రేమ కధాంశంతో వైవిధ్య భరితంగా మలిచిన ఈ చిత్రంలో హీరోహీరోయిన్లు సూరి, నైనా అభినయం హత్తుకుంటుంది. సన్నివేశాలతో పాటు పాటలు మదిని దోచుకుంటాయి. ఆ మధ్య విడుదలైన ఈ చిత్రం ట్రైలర్, సింగిల్స్ కు విశేష స్పందన లభించింది. ఇక రాంగోపాల్ వర్మ పరిచయం చేసిన… అలాగే ఆయన చిత్రాలలో నటించిన నటీనటులు, పనిచేసిన సాంకేతిక నిపుణులు ఎంతటి పేరు తెచ్చుకుని బిజీ అయ్యారో తెలియంది కాదు. ఈ కోవలోనే లోగడ వంగవీటి చిత్రం ద్వారా పరిచయమైన నైనా గంగూలీ కూడా బాలీవుడ్, ఇంకా ఇతర బాషల చిత్రాలు చేస్తోంది. తాజాగా ఆమె నటించిన ఈ చిత్రంలో రొమాంటిక్ గా కనిపిస్తూ యువ ప్రేక్షక హృదయాలను కొల్లగొడుతుంది అని అన్నారు.
ఈ చిత్రానికి పాటలను సిరా శ్రీ అందించగా…సంగీతాన్ని రవి శంకర్ సమకూర్చారు. ఈ చిత్రానికి సహ నిర్మాతలు: నట్టి క్రాంతి, నట్టి కరుణ, సమర్పణ: టి.అంజయ్య, నిర్మాతలు: టి నరేష్ కుమార్, టి.శ్రీధర్, , రచన, ఫోటోగ్రఫీ, దర్శకత్వం: అగస్త్య మంజు.
Tremendous Response for ‘Aswathama’ First Single Ninne Ninne
యువ కథానాయకుడు నాగశౌర్య హీరోగా ఐరా క్రియేషన్స్ బ్యానర్‌పై శంకర్ ప్రసాద్ ముల్పూరి సమర్పణలో ఉషా ముల్పూరి నిర్మాతగా రూపొందుతోన్న చిత్రం `అశ్వథ్థామ`. రమణ తేజ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. మెహరీన్ హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. జనవరి 31న సినిమాను విడుదల చేస్తున్నారు.
ఈ సినిమా హీరో నాగశౌర్యనే ఈ సినిమాకు కథను అందించాడు. సినిమా పేరుని తన ఛాతిపై పచ్చబొట్టుగా పొడిపించుకున్నాడు నాగశౌర్య.సినిమా విడుదల సందర్భంగా సినిమా యూనిట్ సభ్యులు భారీ ప్రమోషన్స్ చేస్తున్నారు. ఇప్పటి వరకు సినిమా పోస్టర్స్, మోషన్ పోస్టర్స్, నిన్నే నిన్నే తొలి లిరికల్ వీడియో సాంగ్ ప్రొమోకు ప్రేక్షకుల నుండి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. శ్రీచరణ్ పాకాల సంగీత సారథ్యం వహించిన `నిన్నే నిన్నే…` పూర్తి పాటను గురువారం విడుదల చేశారు. నాగశౌర్య, మెహరీన్‌పై ఈ సాంగ్‌ను చిత్రీకరించారు. విశ్వ రఘు ఈ పాటకు నృత్య రీతుల్ని సమకూర్చారు.
నటీనటులు:
నాగశౌర్య, మెహరీన్ తదితరులు
సాంకేతిక వర్గం:
బ్యానర్: ఐరా క్రియేషన్స్,నిర్మాత: ఉషా ముల్పూరి,కథ: నాగశౌర్య,దర్శకత్వం: రమణతేజ,సినిమాటోగ్రఫీ: మనోజ్ రెడ్డి,
సంగీతం: శ్రీచరణ్ పాకాల.ఎడిటర్: గ్యారీ బి.హెచ్,లైన్ ప్రొడ్యూసర్: బుజ్జి,డిజిటల్: ఎంఎన్ఎస్ గౌతమ్,డైలాగ్స్: పరుశురాం శ్రీనివాస్,యాక్షన్: అన్బరివు,కొరియోగ్రాఫర్: విశ్వ రఘు,















