Home Blog Page 990

Acter Satyaraj interview for Donga movie

హీరోగా, విల‌న్‌గా, క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా న‌టించి న‌టుడిగా త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌త‌ను సంపాదించుకున్న స‌త్యరాజ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన చిత్రం `దొంగ‌`. యాంగ్రీ హీరో కార్తీ హీరోగా వయాకామ్‌ 18 స్టూడియోస్‌, ప్యారలల్‌ మైండ్స్‌ పతాకాలపై రూపొందుతున్నఈ చిత్రంలో నటి జ్యోతిక, స‌త్య‌రాజ్  కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. ఈ సినిమాను తెలుగులో హర్షిత మూవీస్‌ పతాకంపై నిర్మాత రావూరి వి. శ్రీనివాస్‌ అందిస్తున్నారు. డిసెంబర్‌ 20న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న సందర్భంగా స‌త్యరాజ్ ఇంట‌ర్వ్యూ..

మీ కోసం ద‌ర్శ‌కులు కొత్త పాత్ర‌ల‌ను క్రియేట్ చేయ‌డం ఎలా ఉంది?
– ఇప్ప‌టి వ‌ర‌కు దాదాపు 230 పైగా సినిమాల్లో నటించాను. 100 సినిమాల్లో హీరోగా, 75 కి పైగా సినిమాల్లో విలన్ పాత్రలు పోషించాను. వివిద ర‌కాల‌ పాత్రలు పోషించాను. అయితే  ఏ పాత్రకు ఆపాత్ర భిన్నంగా ఉంటుంది. ఈ క్రెడిట్ అంతా నాతో పని చేసిన దర్శకులకే చెందుతుంది. మారుతున్న ట్రెండ్‌కు అనుణంగా ఈ తరం దర్శకులు నన్ను, నా నటనను దృష్టిలో పెట్టుకుని పాత్రలు రాస్తున్నా రు.  ప్రతి ఒక్కరూ విభిన్నమైన పాత్రలు రాయడం వలనే నటుడిగా నన్ను నేను కొత్తగా ఆవిష్క రించుకునే అవకాశం లభించింది. ఓ నటుణ్ణి దృష్టిలో పెట్టుకుని దర్శకులు పాత్రలు రాస్తుంటే గర్వంగా ఉంటుంది. ఇంతకంటే ఓ న‌టుడికి  కావల్సింది ఏముంటుంది. ఉదాహ‌ర‌ణ‌కు 38 ఏళ్లుగా చిత్రపరిశ్రమలో నటుడిగా కొనసాగుతున్నాను. కానీ, ప్రస్తుతం అందరూ నా పేరు మర్చిపోయి ‘కట్టప్ప’ అని పిలుస్తున్నారు. చిన్నారులు సైతం ‘కట్టప్ప’ అని గుర్తుపడుతుంటే చాలా సంతోషంగా ఉంది. జీవితంలో ఒక్కసారే ఇటువంటి పాత్రలు లభిస్తాయి.
దగ్గరకు వచ్చి సెల్ఫీ, ఆటోగ్రాఫ్స్ అని అడుగుతుంటే ఇబ్బందిగా అనిపిస్తుందా?
–  అలా ఏం లేదండి! ఎందుకంటే నా దృష్టిలో యాక్టర్ అనే వాడు సెల్ఫీ, ఆటోగ్రాఫ్స్ కి ఇరిటేట్ అవ్వకూడదు. ఎందుకంటే మనకిచ్చే పేమెంట్ అనేది వాటికి కూడా కలిపే( నవ్వుతూ)
మీరు న‌టించిన సినిమాలు నేను నటించిన చాలా సినిమాలు తెలుగులో రీమేక్ చేశారు క‌దా?
– `పసివాడిప్రాణం“ఆరాధన“అసెంబ్లీరౌడీ“ఎస్.పి.పరశురాం`,యం ద‌ర్మ‌రాజు యంఎ. `బ్రహ్మ` ఇలా చాలా చిత్రాలుతెలుగులో రీమేక్ చేశారు. అన్ని సూప‌ర్‌హిట్ సాధించాయి.
`దొంగ‌` చిత్రంలో మీ పాత్ర ఎలా ఉంటుంది?
– `దొంగ‌` సినిమాలో ఇంటర్వెల్ బ్లాక్ లో నా పాత్ర ద్వారా  మెయిన్ ట్విస్ట్ ఉంటుంది. అది చాలా కొత్త పాయింట్ ఎవరూ ఊహించని విధంగా ఉంటుంది. అలాగే ప్రతి క్యారెక్టర్ కి థియేటర్స్ లో క్లాప్స్ పడేలా ఉంటాయి.
కార్తీతో క‌లిసి రెండోసారి వ‌ర్క్ చేయ‌డం ఏలా అనిపిస్తోంది?
– కార్తీ తో ‘చినబాబు’ సినిమా చేశాను. తరువాత మళ్ళీ ఈ సినిమాలో కలిసి నటించడం సంతోషంగా ఉంది. ఈ సినిమాలో కార్తీ, జ్యోతిక ఇద్దరు బాగా చేశారు. జీతూ జోసెఫ్ ఈ సినిమా విజయం ఫై కాన్ఫిడెంట్ గాఉన్నాడు. అనవసరమైన సీన్లు తీయకుండా తనకి ఎం కావాలో అదే తీస్తాడు. చాలా టాలెంటెడ్ డైరెక్ట‌ర్.
ఒకే వారంలో రెండు సినిమాలు విడుద‌ల‌వుతున్నాయిగా?
– నిజ‌మే!..తెలుగు, త‌మిళంలో రూపొందిన ‘దొంగ`, తెలుగులో న‌టించిన `ప్రతి రోజూ పండగే` సినిమాలు ఒకే రోజు విడుదలవుతున్నాయి. రెండు పాత్రలు దేనిక‌దే భిన్నంగా ఉంటాయి. ఆర్టిస్టుగా అదో సంతృప్తి.

Light House Cine Magic’s ‘Raghava Reddy’ title announcement

‘అక్కడొకటుంటాడు’ ఫేమ్ శివ కంఠమనేని కథానాయకుడిగా లైట్‌ హౌస్‌ సినీ మేజిక్‌ పతాకంపై ప్రొడక్షన్‌ నెం. 2గా రూపొందుతోన్న చిత్రానికి ‘రాఘవ రెడ్డి’ టైటిల్ ఖరారు చేశారు. ‘criminals can not escape’ అనేది ఉపశీర్షిక. సంజీవ్‌ మేగోటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు జి. రాంబాబు యాదవ్‌, ఆర్‌. వెంకటేశ్వరరావు, కె.ఎస్‌. శంకరరావు నిర్మాతలు. యువ కథానాయిక నందితా శ్వేత, రాశి ప్రధాన తారాగణం. ప్రస్తుతం హైదరాబాద్‌లోని ప్రముఖ పబ్‌లో శివ కంఠమనేని, స్నేహా గుప్తా తదితరులపై తెరకెక్కిస్తున్న ‘చదివిందే నే టెన్త్ రో… అయ్యింది డాక్టర్’ పాటను తెరకెక్కిస్తున్నారు. భాను మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. షూటింగ్ లొకేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టైటిల్ ప్రకటించారు. 

ఈ సందర్భంగా అజయ్ ఘోష్ మాట్లాడుతూ“తొలుత ఈ సినిమాకు చాలా టైటిల్స్ అనుకున్నాం. చివరకు, మా యూనిట్ ‘రాఘవ రెడ్డి’ టైటిల్ ఖరారు చేశారు. ఈ టైటిల్ నాతో అనౌన్స్ చేయిస్తారని అసలు ఊహించలేదు. నాకు చాలా సంతోషంగా ఉంది. చిన్న సినిమాగా ప్రారంభమైన ‘రాఘవ రెడ్డి’ ఈ రోజు పెద్ద సినిమా అయింది. ఇందులో నేను మెయిన్ విలన్ గా నటిస్తున్నాను” అని అన్నారు.

హీరో శివ కంఠమనేని మాట్లాడుతూ “నేను హీరోగా నటించిన ‘అక్కడొకడుంటాడు’ మంచి విజయం సాధించింది. ఈ సినిమా కూడా మంచి విజయం సాధిస్తుందనే విశ్వాసం ఉంది. కొత్త కాన్సెప్టుతో తీస్తున్న చిత్రమిది. తెలుగు సినిమాల్లో నవరసాలు ఉంటాయి. అలాగే, మా సినిమాలో అన్ని ఎమోషన్స్ ఉన్నాయి. అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ సినిమా ఆకట్టుకుంటుంది. ఈ సినిమాలో నాకు బాగా నచ్చింది క్లైమాక్స్. దర్శకుడు ఎమోషనల్ ఎండింగ్ ఇచ్చారు. అందులో నటీనటులు అందరూ ఉంటారు. అజయ్ ఘోష్ కామెడీ విలన్ గా అద్భుతంగా చేశారు” అని అన్నారు.

దర్శకుడు సంజీవ్‌ మేగోటి మాట్లాడుతూ “చాలా ఏళ్ల క్రితం తెలుగులో ‘అఘోరా’తో పాటు కొన్ని చిత్రాలకు దర్శకత్వం వహించాను. తర్వాత కన్నడకు వెళ్లాను. అక్కడ మంచి దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాను. కానీ, నాలో ఓ వెలితి. నా మాతృభాష తెలుగులో సరైన సక్సెస్ లేదని. అందుకని, తెలుగులోకి వచ్చి ఈ సినిమా చేస్తున్నాను. ఈ సినిమాతో నన్ను నేను నిరూపించుకోవాలని అనుకుంటున్నాను. నేరం చేసిన వాళ్లు ఎక్కడ ఉన్నా… విశ్లేషించి పట్టుకోగలిగే పాత్రలో రాఘవ రెడ్డిగా శివ కంఠమనేని కనిపిస్తారు. కథ అంతా రాఘవ రెడ్డి చుట్టూ తిరుగుతుంది. శివ కంఠమనేని మంచి నటుడు, నిర్మాత. ఈ చిత్రంలో నందితా శ్వేత మంచి పాత్ర చేసింది. గతంలో ఎప్పుడూ చేయనటువంటి పాత్రలో ఆమె కనిపిస్తుంది. సతీష్ మంచి ఫైట్స్ కంపోజ్ చేశాడు. ‘రాఘవ రెడ్డి’ టైటిల్ చూసి ఫ్యాక్షన్ మూవీ అనుకోవద్దు. ఫ్యాక్షన్ నేపథ్యంలో ఉంటుందంతే. ఈ సినిమాలో యాక్షన్, థ్రిల్, సెంటిమెంట్, ఫ్యామిలీ  ఎమోషన్స్ ఉంటాయి” అని అన్నారు.

నిర్మాతలలో ఒకరైన రాంబాబు యాదవ్ మాట్లాడుతూ “సినిమా టాకీ పూర్తయింది. ఈ పాటతో సినిమా చిత్రీకరణ అంతా పూర్తవుతుంది. మరో రెండు రోజులు ఈ పాటను చిత్రీకరిస్తాం. సినిమా చాలా బాగా వచ్చింది. దర్శకుడు సంజయ్ మాకు కథను చెప్పిన దానికంటే చాలా అద్భుతంగా తెరకెక్కించారు ”

నటి స్నేహా గుప్తా మాట్లాడుతూ “నేను ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ చేస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన మా హీరో, దర్శకుడు, నిర్మాతలకు థాంక్స్” అని అన్నారు.

శివ కంఠమనేని, నందితా శ్వేత, రాశి, శ్రీనివాసరెడ్డి, అజయ్‌, పోసాని కృష్ణమురళి, ప్రవీణ్‌, ‘బిత్తిరి సత్తి, రఘుబాబు, అజయ్‌ ఘోష్‌, ఆదిత్యా మీనన్‌, అన్నపూర్ణమ్మ, ‘చమ్మక్’చంద్ర, మీనా కుమారి, బీహెచ్ఈఎల్ ప్రసాద్, ఆర్. వెంకటేశ్వరరావు, చంద్రకాంత్, లాబ్ శరత్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రంలో ప్రధాన తారాగణం.

సాంకేతిక నిపుణుల వివరాలు….
స్టంట్స్‌: ‘సింధూరం’ సతీష్‌కొరియోగ్రఫీ: భాను, కిరణ్
కూర్పు: ఆవుల వెంకటేశ్‌
కళా దర్శకుడు: కె.వి. రమణ
మాటలు: అంజన్‌పాటలు: సాగర్ నారాయణ
ఛాయాగ్రహణం: ఎస్.ఎన్. హరీష్‌
ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: గంటా శ్రీనివాసరావు
నిర్మాణ సంస్థ పేరు: లైట్‌ హౌస్‌ సినీ మేజిక్‌
సంగీత దర్శకులు: యశస్వినీ గున్ను, సుధాకర్‌ మారియో
నిర్మాతలు: జి. రాంబాబు యాదవ్‌, ఆర్‌. వెంకటేశ్వరరావు, కె.ఎస్‌. శంకరరావుకథ, స్ర్కీన్‌ప్లే, దర్శకత్వం: సంజీవ్‌ మేగోటి

‘Prathiroju Pandage’ team Participated Film news Casters Association Green India Challenge event

*తెలంగాణా ప్రభుత్వం చేపట్టిన హారిత హారం , గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లు పర్యావరణాన్ని రక్షించేందుకు ప్రజలను జాగృతం చేస్తున్నాయి. MP జోగినపల్లి సంతోష్ కుమార్ గారు చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రొగ్రాం ఖండంతారాలు దాటి మొక్కలు నాటడం, పెంచడం పై అవగాహాన, అవసరం తెలియజేస్తున్నాయి. ఈ కార్యక్రమంలో ఫిల్మ్ న్యూస్ క్యాస్టర్ అసోసియేషన్ కూడా తమ వంతు బాధ్యతను పాలు పంచుకుంది. ప్రతి రోజు పండగే టీం తో పాటు మేయర్ బొంతు రామ్మెహనన్ ,ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్, లతో బంజారాహిల్స్ లోని శ్రీనికేతన్ కాలనీ పార్క్ లో మొక్కలు నాటి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగం అయ్యారు..ఈ సందర్భంగా

*హీరో సాయి ధరమ్ తేజ్ మాట్లాడుతూ:*
MP జోగినపల్లి సంతోష్ కుమార్ గారు చేపట్టిన ఈ ప్రొగ్రాం నన్ను ఎంతో ఆకర్షించింది. అలాగే ఫిల్మ్ న్యూస్ క్యాస్టర్స్ అసోసియేషన్ ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో నన్ను భాగం చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా ఈ కార్యక్రమాన్ని నిర్వ హించాలి. పర్యావరణం ని రక్షించుకోవడం అందరి బాధ్యత ’’ అన్నారు.

*రాశీ ఖన్నా మాట్లాడుతూ:*
‘‘ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన MP జోగినపల్లి సంతోష్ కుమార్ గారికి స్పెషల్ థ్యాంక్స్ చెబుతున్నాను. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అనేది ఇప్పుడు చాలా అవసరం. పర్యావరణాన్ని కాపాడుకోవడం అందరి బాధ్యత అన్నారు.

*దర్శకుడు మారుతి మాట్లాడుతూ:*
‘‘ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అవడం బాధ్యతగా తీసుకోవాలి. అలాగే మరో ముగ్గురుచేత ఈ మొక్కలు నాటే కార్యక్రమం ని చేపట్టేలా చూడలి. మా టీం తో పాటు ఈ కార్యక్రమంలో పాల్గోనడం చాలా సంతోషంగా ఉంది’’ అన్నారు.

*ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ మాట్లాడుతూ:*
‘‘ ప్రకృతిని కాపాడుకోవడం అందరి బాధ్యత .. ఎమ్ పి సంతోష్ గారు చేపట్టిన ఈ కార్యక్రమం మంచి విజయం సాధించింది. ప్రతి ఒక్కరూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగం అవ్వడం నాకు ఆనందంగా ఉంది. ప్రకృతిని కాపాడుకోవడం లో అందరూ చేతులు కలపాలి ’’ అన్నారు.

*మేయర్ బొంతు రామ్మెహాన్ మాట్లాడుతూ:*
‘‘ హారిత హారం, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రొగ్రాం లు చాలా బాగా సక్సెస్ అయ్యాయి. MP జోగినపల్లి సంతోష్ కుమార్ గారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఖండాంతరాలు దాటింది. ఈ కార్యక్రమలో పాల్గోనడం చాలా సంతోషంగా ఉంది ’’ అన్నారు.

*ఈ కార్యక్రమంలో సహా నిర్మాత SKN, ఫిల్మ్ న్యూస్ క్యాస్టర్స్ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ, ఉప అధ్యక్షులు రాంబాబు, శేఖర్, ప్రధాన కార్యదర్శి నాయుడు మరియు కాలనీ వాసులు పాల్గొన్నారు*

 

Ram Charan Konidela makes his debut as a wildlife photographer.

ఇప్పటిదాకా కెమెరా ముందు కనిపించే రామ్ చరణ్ కొణిదెల కెమెరా వెనక్కి వెళ్లిపోయారంటే మీరు నమ్మగలరా? నిజంగా ఇది ఆయనకు కొత్త పాత్రే. అది వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్ పాత్ర అన్నమాట. అంటే కెమెరా వెనకే కదా ఆయన ఉండేది. వన్యప్రాణి సంరక్షణ కోసం ఆయన కొత్త పాత్ర ఇది. వన్యప్రాణి సంరక్షణ కోసం ప్రపంచస్థాయిలో చేపట్టే నిధుల సమీకరణలో ఆయన కూడా పాలుపంచుకోనున్నారు. ఆయన కొత్తగా నిర్మించిన ఇంట్లో  ‘వైల్డెస్ట్ డ్రీమ్స్’ పేరుతో ఓ విభాగాన్ని కూడా ఏర్పాటుచేశారు. ఇందులో సింహాలు, చిరుతపులులు,  జిరాఫీలు తదితర వన్యప్రాణుల ఫొటోలను కూడా ఏర్పాటుచేశారు. ఈ ఫొటోలు తీయడంలో రామ్ చరణ్ తోపాటు షాజ్ జంగ్, ఇజాజ్ ఖాన్, ఇషేతా సాల్ గావ్ కర్ లు కూడా ఫొటోగ్రాఫర్లుగా పనిచేశారు. ఈ ఫొటో ప్రదర్శన ద్వారా ప్రజలను చైతన్య పర్చడమే వీరి ఉద్దేశం. ఒక విధంగా ఇది రామ్ చరణ్ చేసే స్వచ్ఛంద సేవ.

ఈ భూమిని, ప్రకృతిని కాపాడటం కోసం డబ్ల్యు.డబ్ల్యు.ఎఫ్. అనే స్వచ్ఛంద సంస్థ గత 60 ఏళ్లుగా పనిచేస్తోంది. అంతర్జాతీయంగా ఐదు మిలియన్ల సభ్యులతో 100 దేశాలలో ఈ సంస్థ తన కార్యకలాపాలను నిర్వహిస్తోంది. పర్యావరణ మార్పుల కారణంగా ఆంద్ర, తెలంగాణ ప్రాంతాల్లో ఉన్న తూర్పు కనుమల్లో అనేక వృక్షజాతలు, పక్షులు, కీటకాలకు రక్షణ లేకుండా పోయింది. కృత్రిమ వనరుల కల్పనతోనైనా వీటిని రపరిరక్షించుకోవాల్సిన ఆవశ్యకతపై వీరు దృష్టిపెట్టారు. మన భూమిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మన చేతుల్లోనే ఉందంటున్నారు రామ్ చరణ్. ‘ప్రకృతిలోకి నేను కెమెరాతో ప్రయాణించడానికి కారణం ఇదే. ఇది ప్రతి ఒక్కరి బాధ్యత కూడా’ అన్నారు రామ్ చరణ్. ఆయన ఈ కార్యక్రమానికి పూనుకోడానికి కారణం ఆయన జీవిత భాగస్వామి ఉపాసన కొణిదెల. ఈ బృహత్తర కార్యకలాపాలు నిర్వహిస్తున్న డబ్ల్యు,డబ్ల్యు.ఎప్. సంస్థకు ఆమె రాయబారిగా వ్యవహరిస్తున్నారు. రామ్ చరణ్ కెమెరా వెనకున్న శక్తి ఉపాసనే సుమా.

Avuno Teliyadu Lyrical outnow from ‘Entha ManchiVadavura’

నందమూరి క‌ల్యాణ్ రామ్ హీరోగా  ‘శతమానం భవతి’ చిత్రంతో జాతీయ పురస్కారాన్నిగెలుచుకున్న సతీష్‌ వేగేశ్న దీనికి దర్శకత్వంలో రూపొందుతోన్న ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ `ఎంత‌మంచివాడ‌వురా`. ఆడియో రంగంలో అగ్రగామిగా వెలుగొందుతున్న ఆదిత్యా మ్యూజిక్‌ సంస్థ తొలిసారిగా చిత్ర నిర్మాణ రంగంలోకి దిగి ఆదిత్యా మ్యూజిక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. దేవి మూవీస్‌ శివలెంక కృష్ణప్రసాద్ ఈ చిత్రానికి స‌మ‌ర్ప‌కుడిగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.
ఈ సినిమా రెండో లిరిక‌ల్ వీడియో సాంగ్‌గా మెలోడీ సాంగ్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది.

అవునో తెలియ‌దు కాదో తెలియ‌దు ఏం న‌వ్వో ఏమో
మోగ‌మాటం పోదా వ‌య‌సుకు మెళ‌కువ రాలేదా
చెలిమంటే త‌మ‌రికి చేదా త‌గువ‌ర‌సై వ‌స్తున్నాగా
ఒక మంచి మాట అని మంచివాడివనిపించుకో చ‌క్క‌గా!!
వ‌ద్దంటే వ‌దులుతానా.. విడ‌న‌ని ముడిప‌డ‌నా

అంటూ సాగే ఈ పాటలో హీరోపై త‌న‌కున్న ప్రేమ‌ను హీరోయిన్ తెలియ‌జేస్తుంది. బ్యూటీఫుల్ లొకేష‌న్స్‌లో ఈ పాట‌ను పిక్చ‌రైజ్ చేశారు. జాతీయ అవార్డ్ గ్ర‌హీత గోపీసుంద‌ర్ సంగీత సార‌థ్యం వ‌హించిన ఈ పాట‌ను  ప్ర‌ముఖ పాట‌ల ర‌చ‌యిత సిరివెన్నెల సీతారామశాస్త్రి రాశారు. ప్ర‌ముఖ సింగ‌ర్ శ్రేయా ఘోష‌ల్ ఆల‌పించారు.

ఈ సంద‌ర్భంగా   నిర్మాత ఆదిత్య ఉమేష్ గుప్తా మాట్లాడుతూ “ సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. సినిమాను సంక్రాంతి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 15న గ్రాండ్ రిలీజ్ చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాం.  కళ్యాణ్ రామ్, సతీష్ వేగేశ్న కాంబినేష‌న్‌లో రూపొందిన బ్యూటీఫుల్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌. ఈ అంద‌మైన కుటుంబ క‌థా చిత్రాన్ని అద్భుత‌మైన ఎమోష‌న్స్‌తో అందమైన లొకేష‌న్స్‌లో చిత్రీక‌రించాం. కుటుంబ స‌భ్యుల మ‌ధ్య బంధాలు, అనుబంధాలు, ఆప్యాయత‌లు, అనురాగాల‌ను తెలియ జేసే చిత్రమిది. రీసెంట్‌గా విడుద‌లైన `ఏమో ఏమో ఏ గుండెల్లో ..` అనే పాట‌కు ప్రేక్ష‌కుల నుండి అద్భుతమైన పాట వ‌చ్చింది. ఇప్పుడు మ‌రో సాంగ్‌ను విడుద‌ల చేశాం. దీనికి కూడా మంచి రెస్పాన్స్ వ‌స్తుంది. ఇది ల‌వ్‌సాంగ్  త్వ‌ర‌లోనే మిగిలిన పాట‌ల‌ను, ట్రైల‌ర్‌ను కూడా విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నాం“ అన్నారు.
చిత్ర సమర్పకులు  శ్రీదేవి మూవీస్‌ శివలెంక కృష్ణప్రసాద్‌ మాట్లాడుతూ  ‘‘హీరో, హీరోయిన్ మ‌ధ్య సాగే ల‌వ్ మెలోడీని రెండో లిరిక‌ల్ వీడియో సాంగ్‌గా విడుద‌ల చేశాం. ఇప్ప‌టికే విడుద‌లైన మొద‌టి పాట‌కు చాలా మంచి స్పంద‌న వ‌చ్చింది. సిరివెన్నెల సీతారామ‌శాస్త్రి రాసిన ఈ పాట‌ను శ్రేయా ఘోష‌ల్ ఆల‌పించారు. మంచి స్పంద‌న వ‌స్తుంది. త్వ‌ర‌లోనే మ‌ర్నిన్ని లిరిక‌ల్ వీడియో పాట‌ల‌ను విడుద‌ల చేస్తాం. అన్ని వర్గాల ప్రేక్షకులనూ ఈ చిత్రం రంజింపజేస్తుంది“ అన్నారు.

న‌టీన‌టులు:
నంద‌మూరి క‌ల్యాణ్ రామ్‌, మెహ‌రీన్‌, వి.కె.న‌రేశ్‌, సుహాసిని,శరత్‌బాబు,త‌నికెళ్ల భ‌ర‌ణి, ప‌విత్రా లోకేశ్‌, రాజీవ్ క‌న‌కాల‌, వెన్నెల కిశోర్‌, ప్ర‌వీణ్‌, ప్ర‌భాస్ శ్రీను త‌దిత‌రులు

సాంకేతిక నిపుణులు:
రచన, ద‌ర్శ‌క‌త్వం: స‌తీశ్ వేగేశ్న‌
నిర్మాణం: ఆదిత్య మ్యూజిక్‌  (ఇండియా ) ప్రైవేట్‌ లిమిటెడ్‌
నిర్మాతలు ‌:  ఉమేష్‌ గుప్తా, సుభాష్ గుప్తా
సమర్పణ :శివలెంక కృష్ణ ప్రసాద్,
సినిమాటోగ్ర‌ఫీ:  రాజ్ తోట‌
సంగీతం:  గోపీ సుంద‌ర్‌
ఎడిటింగ్‌:
త‌మ్మిరాజు
ఆర్ట్‌:  రామాంజ‌నేయులు
ప్రొడ‌క్ష‌న్ ఎగ్జిక్యూటివ్‌: ర‌షీద్ ఖాన్

Chiranjeevi All Praises For Venky Mama Team

విక్ట‌రీ వెంక‌టేశ్‌, అక్కినేని నాగ‌చైత‌న్య హీరోలుగా కె.ఎస్‌.ర‌వీంద్ర‌(బాబీ) ద‌ర్శ‌క‌త్వంలో సురేష్ ప్రొడ‌క్ష‌న్స్‌, పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ప‌తాకాల‌పై డి.సురేష్‌బాబు, టీజీ విశ్వ‌ప్ర‌సాద్ నిర్మించిన చిత్రం `వెంకీమామ‌`. ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా డిసెంబ‌ర్ 13న విడుద‌లైన ఈ చిత్రం సూప‌ర్‌హ‌ట్ టాక్‌తో మంచి క‌లెక్ష‌న్స్‌ను రాబ‌ట్టుకుంది. ప్రేక్ష‌కులు, విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకున్న ఈ చిత్రాన్ని మెగాస్టార్ చిరంజీవి ప్ర‌త్యేకంగా వీక్షించారు. షో అనంతరం మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ “మా ఫ్యామిలీ అంతా క‌లిసి `వెంకీమామ‌` సినిమా చూశాం. అంద‌రికీ బాగా న‌చ్చింది. అంద‌రూ ఎంజాయ్ చేశాం. సినిమా అంత బాగా న‌చ్చ‌డానికి కార‌ణం మిత్రుడు వెంక‌టేశ్‌. త‌న స్టైల్ ఆఫ్ కామెడీ, ఎమోష‌న్స్‌తో అందరినీ మెప్పిస్తున్నారు. చాలా కాలం త‌ర్వాత యాక్ష‌న్ స‌న్నివేశాల్లోనూ వావ్ అనిపించాడు. అద్భుతంగా న‌టించి ఈ స‌క్సెస్‌కు ప్ర‌ధాన కార‌ణంగా నిలిచాడు. త‌న‌ను మ‌న‌స్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అలాగే మామ‌కు త‌గ్గ అల్లుడిగా నాగ‌చైత‌న్య మెచ్యూర్డ్ పెర్ఫామెన్స్ చేశాడు. ఈ స‌క్సెస్‌లో త‌ను కూడా భాగ‌స్వామిగా మారాడు. డైరెక్ట‌ర్ బాబీ త‌న స్టైల్ ఆఫ్ టేకింగ్, స్క్రీన్‌ప్లేతో ప‌ట్టు స‌డ‌ల‌కుండా బ్యూటీఫుల్‌గా సినిమాను తెర‌కెక్కించి శ‌భాష్ అనిపించాడు. ఈ సినిమాలో స‌క్సెస్ అయిన సంద‌ర్భంలో చిత్ర‌యూనిట్‌కు నా అభినంద‌న‌లు“ అన్నారు.

Cheema Prema madhyalo Bhaama

“వీధుల్లో చీమ విహారం” ” వీధి వీధినా చీమ”, “వీధుల్లో చీమ విడుదల” ! “మా చీమ మీకుగానీ కనిపించిందా? “
చీమ గోడలకెక్కిన సందర్భంగా “చీమ – ప్రేమ మధ్యలో భామ!
” సినిమా దర్శకుడు శ్రీకాంత్ “శ్రీ” అప్పలరాజు మాట్లాడుతూ “ ఈ మా సినిమాను చీమ హీరోగా ‘You can be what you want to be’, *అంతఃకరణశుద్ధితో* అడుగు ముందుకు వేయగలిగితే ఎవరేమి కావాలనుకున్నా కావచ్చు – అన్న అంతర్లీన సందేశంతో రూపొందించాము. అంతేకాదు, ఈ సినిమా హీరో ప్రభాస్ అభిమానులకు ప్రత్యేకంగా నచ్చుతుంది! ఎందుకో తెలియాలంటే కొంతకాలం ఆగాలి! ” అన్నారు.
ఈ సందర్భంగా సినీ నిర్మాత లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ” “చీమ – ప్రేమ మధ్యలో భామ!”   అనే ఒక fantasy తో కూడిన ప్రేమ కథను యూత్ మరియు కుటుంబ సభ్యులు అందరినీ అలరించే విధంగా డైరెక్టర్ గారు తన  New York Film Academy అనుభవంతో ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దారు” అని తెలిపారు.
మాగ్నమ్ ఓపస్  (Magnum Opus ) ఫిలిమ్స్ పతాకం పై శ్రీకాంత్ “శ్రీ” అప్పల రాజు దర్శకత్వం లో ఎస్ ఎన్ లక్ష్మీనారాయణ నిర్మిస్తున్న చిత్రం  “చీమ – ప్రేమ మధ్యలో భామ !”. అమిత్ మరియు ఇందు హీరో హీరోయిన్ గా నటించారు
నటీ  నటులు :
అమిత్, ఇందు, సుమన్, హరిత, పురంధర్ , వెంకట్ నిమ్మగడ్డ, రమ్య చౌదరి, బొమ్మ శ్రీధర్, రవి కిషోర్ , కిషోర్ రెడ్డి, వెంకటేశ్ మరియు సురేష్ పెరుగు.
సంగీతం : రవి వర్మ, సింగర్స్ : ఎస్.పి. బాలసుబ్రమణ్యం , గీతా మాధురి, సినిమాటోగ్రఫీ : ఆరిఫ్ లలాని, ఎడిటర్ : హరి శంకర్.
కథ, మాటలు, స్క్రీన్ ప్లే, డైరెక్షన్  : శ్రీకాంత్ “శ్రీ” అప్పల రాజు
నిర్మాత : ఎస్ ఎన్ లక్ష్మీనారాయణ