Home Blog Page 991

Cine industry Condolences on Gollapudi Maruthi Rao Demise

బాహుముఖ ప్రజ్ఞాశాలి, ఇటీవల మృతిచెందిన గొల్లపూడి మారుతీరావుకు తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఘనంగా నివాళి 
అర్పించింది. ఫిలిం ఛాంబర్ లో బుధవారం తెలుగు సినిమా రచయితల సంఘం, తెలుగు చలన చిత్ర దర్శకుల సంఘం, 
‘మా’ నటీనటుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సంతాప సభలో తెలుగు సినీ పరిశ్రమకు చెందిన పలువురు 
ప్రముఖులు పాల్గొన్నారు. పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ గొల్లపూడి మారుతీరావు కమెడియన్ గా,  విలన్ గా,  తండ్రి గా 
ఎన్నో వైవిధ్యమైన పాత్రలకు పోషించి ప్రక్షకుల ఆదరాభిమానాలను చూరగొన్న వ్యక్తి అన్నారు. ప్రతి సంవత్సరం నూతన 
దర్శకుడికి తన కుమారుడి పేరుతో అవార్డు ఇవ్వడం ఆయన వ్యక్తిత్వాన్ని తెలియజేస్తోందన్నారు. మా అసోసియేషన్ ప్రధాన 
కార్యదర్శి జీవిత మాట్లాడుతూ ఈ మధ్య కాలంలో ఆణిముత్యాల లాంటి వారిని సినీ పరిశ్రమ కోల్పోయిందని ఆవేదన వ్యక్తం 
చేశారు. వారిలో ఒకరు గొల్లపూడి మారుతీరావు అన్నారు. ఆయన ప్రతిభను పక్కన పెడితే ఆయన గొప్ప మానవతా వాది అని 
కొనియాడారు. ఇలాంటి వ్యక్తిని పరిశ్రమ కోల్పోవడం బాధాకరంగా ఉందన్నారు.
త్రిపురనేని వరప్రసాద్ (చిట్టి ) మాట్లాడుతూ విజయవాడ ఆకాశవాణిలో ఆడియో నాటకాలతో ఆయన జీవితం
ప్రారంభమైందన్నారు. ఆయనది గొప్ప వ్యక్తిత్వమన్నారు. సినిమా రంగంలో గోల్డెన్ ఎరా సమయంలో ఉన్న రచయితల
సముదాయంలో ఆఖరి వ్యక్తి గొల్లపూడి మారుతీరావేనని అన్నారు.
దర్శకుల సంఘం కార్యదర్శి రాంప్రసాద్ మాట్లాడుతూ కుమారుడి పేరున అవార్డుని ఇస్తూ దర్శకుడి గొప్పతనాన్ని చాటిన వ్యక్తి అని కొనియాడారు. దేశంలో మంచి దర్శకులను ఈ అవార్డుతో సత్కరించడం గొప్పవిషయం అన్నారు.
ఫిలింనగర్ హౌసింగ్ సొసౌటీ కార్యదర్శి, కార్పొరేటర్ కాజ సూర్యనారాయణ ప్రసంగిస్తూ గొల్లపూడి తనకు సన్నిహిత మిత్రుడన్నారు. ఆయన ఆత్మకు శాంతికలగాలని కోరకుంటున్నానన్నారు.
నిర్మాత ప్రసన్నకుమార్ మాట్లాడుతూ ‘నిర్మాతకు ఎంతో సహకారం అందించే వ్యక్తి గొల్లపూడి, సామాజానికి ఎంతో ఉపయోగపడే వ్యక్తి, ఆయన భావజాలం ఎప్పటికీ బతికే ఉంటుంది’ అన్నారు. ఈ కార్యక్రమంలో ఇంకా నిర్మాత రామసత్యనారాయణ, సురేష్
కొండేటి తదితరులు పాల్గొన్నారు

Benerjee best actor award in the LIFFT India Filmostav International Film Festival – 2019

ముంబైలోని లోనావాలాలో ఇటీవల ప్రతిష్టాత్మకంగా జరిగిన వరల్డ సినీ ఫెస్ట్ లిఫ్ట్ ఇండియా ఫిల్మోత్సవంలో  రక్తం చిత్రానికి
గాను ఉత్తమ నటుడిగా తెలుగు బెనర్జీ  అవార్డును అందుకున్నారు. ఈ చిత్రాన్ని జాతీయ అవార్డు గ్రహీత  రాజేష్ టచ్ రివర్
రూపొందించారు. సోషల్ యాక్టివిస్ట్ సునీతా కృష్ణన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ అవార్డు అందుకున్న తొలి తెలుగు నటుడు
బెనర్జీ కావడం గమనార్హం.
విప్లవం తుపాకులతోనే సాధించాలా? లేక ప్రేమతో కూడా సాధించవచ్చా అనే సంఘర్షణతో సాగే ఈ
చిత్రం ఆద్యంతం ఉత్కంఠతో సాగుతుంది. ఇందులో శంకరన్న పాత్రలో విప్లవ నాయకుడిగా బెనర్జీ కనబరిచిన ప్రతిభకు
చిత్రోత్సవాలలో చక్కటి ఆదరణ లభించింది.
గతంలో అమెరికాలోని ఓహియోలో జరిగిన ఇండీ గేదరింగ్ అంతర్జాతీయ
చిత్రోత్సవంలో కూడా ఆయన పోషించిన ఈ పాత్రకు ప్రశంసలు దక్కాయి. ఈ చిత్రోత్సవంలో ఉత్తమ నటుడిగా నామినేట్ అయిన
తొలి భారతీయ నటుడు బెనర్జీ కావటం విశేషం.  అంతేకాక’రక్తం‘ ఉత్తమ చిత్రంగా,  ఉత్తమ సినిమాటో గ్రఫీ అవార్డులను
సొంతం చేసుకుంది. బెస్ట్ ఎడిటింగ్, ఉత్తమ చిత్రం విభాగాలలో  పలు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్ కు నామినేట్ అయ్యింది.

ఈసందర్భంగా బెనర్జీ మాట్లాడుతూ ’ ఇప్పటి వరకు 40 ఏళ్లలో 400 సినిమాల్లో  నటించానని,లిఫ్ట్ ఇండియా
చిత్రోత్సవానికి 40 దేశాల నుంచి  250 సినిమాలు వచ్చాయని, వాటిలో తనకే ఉత్తమ నటుడిగా గుర్తింపు దక్కడం
ఆనందంగా ఉందన్నారు. తన సినిమా కెరీర్ లో ‘రక్తం’ చిత్రం మైలు రాయిలా నిలిచిపోయిందన్నారు. ఈ అవార్డు నటుడిగా
తన బాధ్యతను మరింత పెంచెందని అన్నారు.

ఈ సినిమాలో ఇంకా సంజు శివరామ్, మధుశాలిని, సన, జాన్ కొటోలి ,
హరిశ్చంద్ర, సత్యవతి, తదితరులు నటించారు. దీనికి  మాటలు: నరసింహ కుమార్, సంగీతం వివేక్ మహదేవ్,  ఆర్ట్: రాజీవ్
నాయర్, ఎడిటింగ్: శశికుమార్, కెమెరా: రామ తులసి, నిర్మాతలు:  పద్మశ్రీ గ్రహీత డా.. సునీతా క్రుష్ణన్,  సహ నిర్మాత:
మున్సీ రియాజ్ అహమ్మద్. స్టోరీ, స్క్రీన్ ప్లే , దర్శకత్వం: రాజేష్ టచ్ రివర్.

‘Sarileru Neekevvaru’ Shoot Completed Worldwide Grand Release As Sankranthi

సూపర్‌స్టార్‌ మహేష్‌ హీరోగా దిల్‌రాజు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ సమర్పణలో జి.ఎం.బి. ఎంటర్‌టైన్‌మెంట్‌, ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకాలపై యంగ్‌ టాలెంటెడ్‌ డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న అవుట్‌ అండ్‌ అవుట్‌ మాస్‌ ఎంటర్‌టైనర్‌ ’సరిలేరు నీకెవ్వరు’. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో ప్రత్యేక పాత్రలో లేడీ అమితాబ్‌ విజయశాంతి నటిస్తున్నారు. కాగా ఈ చిత్రం షూటింగ్ ఈ రోజు(డిసెంబ‌ర్ 18) పూర్తయింది. ఈ సంద‌ర్భంగా..

యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి మాట్లాడుతూ “జులై 5న మొదలైన ఈ ‘సరిలేరు నీకెవ్వరు’ మెమొరబుల్ జర్నీడిసెంబర్18తో పూర్తయింది.  సినీ ప్రేమికులకు, మహేష్ బాబు ఫ్యాన్స్ కి ఈ సంక్రాంతి ఒక‌ మెమరబుల్ గా ఉండబోతుంది“ అన్నారు.
నిర్మాత అనిల్ సుంక‌ర మాట్లాడుతూ – “ఈ పరిశ్రమలోకి ప్రవేశించిన తర్వాత మరపురాని జ్ఞాపకాన్నిఇచ్చిన నా ప్రియమైన సూపర్ స్టార్ మహేష్ బాబు కి ధ‌న్య‌వాదాలు. అలాగే ఈ అద్భుతమైన షూటింగ్ ని సంతోషకరంగా ముగించిన డైరెక్టర్ అనిల్ రావిపూడి, రత్నవేలు, దేవిశ్రీప్రసాద్‌, కిశోర్‌ గరికిపాటి సహా ఎంటైర్ ’సరిలేరు నీకెవ్వరు’ యూనిట్ కి థాంక్స్’ అన్నారు.
ఇప్ప‌టికే విడుదలైన మూడు సాంగ్స్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. కాగా ఈ సోమవారం (డిసెంబర్ 23) న విడుదల కానున్ననాలుగో పాట క్లాస్ సాంగ్ గా ఉండనుందని ఇంట్రెస్టింగ్ అప్డెట్ ఇచ్చారు దేవి శ్రీ ప్రసాద్.  ఈ పాట కోసం యూరోప్ లోని అతి పెద్ద ఆర్కెస్ట్రా తో కలిసి మ్యూజిక్ కంపోజ్ చేశారు. అక్కడి ఫారిన్ మ్యూజిషియన్స్ తో కలిసి ఈ పాటని ప్రత్యేకంగా రికార్డ్ చేశారు దేవి. జనవరి 5 ఆదివారం సాయంత్రం 5:04 నిమిషాలకు హైద‌రాబాద్ ఎల్‌.బి స్టేడియంలో ’సరిలేరు నీకెవ్వరు’ గ్రాండ్ ప్రీరిలీజ్ ఈవెంట్ ను జరిపి సంక్రాంతి కానుక‌గా జనవరి 11, 2020న  ప్రపంచవ్యాప్తంగా విడుద‌ల‌చేయ‌నున్నవిష‌యం తెలిసిందే..

సూపర్‌స్టార్‌ మహేష్‌, రష్మిక మందన్న, ప్రత్యేక పాత్రలో లేడీ అమితాబ్‌ విజయశాంతి, రాజేంద్రప్రసాద్‌, ప్రకాష్‌రాజ్‌, సంగీత, బండ్ల గణేష్ త‌దిత‌రులు నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్‌, రత్నవేలు, కిశోర్‌ గరికిపాటి, అజ‌య్ సుంక‌ర‌, త‌మ్మిరాజు, రామ్‌లక్ష్మణ్‌, యుగంధర్ టి. ఎస్‌.కృష్ణ సాంకేతిక వర్గం.

Director Jeethu joseph interview about ‘Donga’

‘దృశ్యం’ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా పాప్యులారిటీ సంపాదించుకున్నారు టాలెంటెడ్ డైరెక్టర్  జీతు జోసెఫ్‌.
 ప్రస్తుతం ఆయన దర్శకత్వంలో యాంగ్రీ హీరో కార్తీ హీరోగా వయాకామ్‌ 18 స్టూడియోస్‌, ప్యారలల్‌ మైండ్స్‌ పతాకాలపై రూపొందుతున్న చిత్రం ‘దొంగ’. ఈ సినిమాను తెలుగులో హర్షిత మూవీస్‌ పతాకంపై నిర్మాత రావూరి వి. శ్రీనివాస్‌ అందిస్తున్నారు. డిసెంబర్‌ 20న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న సందర్భంగా దర్శకుడు జీతు జోసెఫ్‌ ఇంటర్వ్యూ..

తెలుగు లో ఫస్ట్ టైమ్ మీ సినిమా రిలీజ్ కాబోతుంది కదా! ఎలా అనిపిస్తుంది?
– చాలా సంతోషంగా ఉంది. 2014లో ‘దృశ్యం’ సినిమా తెలుగులో రీమేక్‌ అయ్యి పెద్ద విజయం సాధించినప్పటినుండి తెలుగులో సినిమా చేయాలి అనుకున్నా. మంచి స్క్రిప్ట్ కోసం ఇన్నిరోజులు ఎదురుచూశాను. అయితే  ఇప్పుడు ‘దొంగ’ లాంటి సాలిడ్ కంటెంట్, అన్నిఎమోషన్స్ ఉన్నసినిమాతో తెలుగులో ఇంట్రడ్యూస్ అవడం నిజంగా హ్యాపీ. ‘దొంగ’ నా హృదయానికి బాగా దగ్గరైన సినిమా. మంచి కాస్ట్‌ అండ్‌ క్రూ కుదిరింది.
‘దృశ్యం’ సినిమాతో మీరు బాగా పాపులర్ అయ్యారు. ఈ సినిమా మీకు ఎలాంటి పేరు తీసుకువస్తుంది అనుకుంటున్నారు?
– నాకు రెగ్యులర్ కథలు అస్సలు నచ్చవు. నేనెప్పుడూ కొత్త తరహా కథలనే ఎంచుకుంటాను. ఈ సినిమా విషయానికి వస్తే ఇదొక కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఫ్యామిలీ ఎమోషన్స్ ఉంటూనే కొంత సస్పెన్స్ ఉంటుంది.  ‘దృశ్యం’ తరువాత ప్రతి ఒక్కరూ నా నుండి సస్పెన్స్ కథలనే కోరుకుంటున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ సినిమాలో కొంత సస్పెన్స్ పెట్టడం జరిగింది తప్ప ఆ సస్పెన్స్ అనేది కథను డామినేట్ చేయదు.
మీరు ఎలాంటి జోనర్స్ చేయడానికి ఇష్టపడతారు?
– నా మొదటి సినిమా ‘డిటెక్టివ్’ ఒక ఇన్వెస్టిగేటింగ్ థ్రిల్లర్. రెండవ సినిమా ‘మమ్మి అండ్ మీ’ ఫ్యామిలీ డ్రామా. మూడవ సినిమా ‘మై బాస్’ ఒక రొమాంటిక్ కామెడీ. ఇలా ప్రతి సినిమా కొత్త జోనర్ లో, కొత్త కథతో ఉండాలని కోరుకుంటా. అయితే తెలుగులో, తమిళ్ లో మాస్ సినిమా చూసినప్పుడు తప్పకుండా నేను కూడా ఎలాంటి లాజిక్స్ లేకుండా ఫుల్ కమర్షియల్ మాస్ మసాలా మూవీ చేయాలి అనుకుంటా…
దృశ్యం తరువాత తెలుగులో ఆఫర్స్ ఏమైనా వచ్చాయా?
– ఇద్దరు ముగ్గురు నిర్మాతలు కథలు తీసుకొని వచ్చారు. అయితే ఆ కథలు విన్నాక వాటిపై చాలా వర్క్ చేయాలి  అనిపించింది. అదే సమయంలో నేను వేరే సినిమాలతో బిజీ గా ఉండడం వల్ల కుదరలేదు.
దృశ్యం చైనీస్ వెర్షన్ కూడా ఇదే రోజు విడుదలవుతుంది కదా?
– అవును. చైనీస్ ప్రొడ్యూసర్స్ హిందీ వెర్షన్ చూసి అక్కడి నిర్మాతలని కాంటాక్ట్ అయ్యారు. వారి ద్వారా నన్ను కలిసి రైట్స్ తీసుకున్నారు. అయితే ఇదంతా జరిగి రెండు సంవత్సరాలు అవుతుంది. ఈ  మ‌ధ్యే ట్రైలర్ నాకు పంపారు. బాగుంది. అయితే తమిళంలో ‘దృశ్యం’ నా ఫస్ట్ రిలీజ్. దాని తర్వాత రిలీజవుతున్న రెండో సినిమా ‘దొంగ’.
దృశ్యం సినిమా విడుదలైన అన్ని భాషలలో విజయం సాధించింది కదా !  మీరు పాన్ ఇండియా సినిమా చేసే ఆలోచ‌న‌ ఉందా?
– తప్పకుండా ఉంది. ఆ సినిమా విడుదలైనప్పుడు అంత పెద్ద సక్సెస్ అవుతుంది అనుకోలేదు. అయితే పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కించే కథ ఒకటి నా దగ్గర ఉంది. కాకపొతే దానిమీద కొంత వర్క్ చేయాలి. తప్పకుండా త్వరలోనే రెడీ చేస్తాను. దృశ్యం సినిమా అన్ని భాషలలో సినిమా చేయడానికి బారియర్స్ ఓపెన్ చేసింది అనుకుంటున్నా..
దొంగ గురించి చెప్పండి?
– ఈ సినిమాలో కనిపించే చిన్న‌ పిల్లాడి నుండి ప్రతి క్యారెక్టర్ కి ఒక పర్పస్ ఉండి కథలోఒకభాగం అయి ఉంటుంది. కార్తీ నటన గురించి మనందరికీ తెలిసిందే.. ఈమద్యే ‘ఖైదీ’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. ఈ సినిమాలో కార్తీ గారికి, జ్యోతిక గారికి మ‌ధ్య కీల‌క‌మైన‌ రెండు మూడు ఎమోషనల్ సీన్స్ ఉంటాయి. ఆ సన్నివేశాలలో ఇద్దరు పోటీపడి  నటించారు. అలాగే నికిలా విమ‌ల్‌, సత్యరాజ్ గారి పాత్రలు అందరికి కనెక్ట్ అయ్యేలా ఉంటాయి.‘షావుకారు’ జానకి  బామ్మ పాత్ర చేశారు.
ఈ సినిమా తెలుగు ప్రొడ్యూసర్ రావూరి వి. శ్రీనివాస్ గురించి?
– రావూరి వి.శ్రీనివాస్ గారు  సినిమా మీద ఫ్యాషన్ తో ఇండస్ట్రీ కి వచ్చారు. ఈ చిత్రాన్నిడిసెంబర్‌ 20న తెలుగులో చాలా గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాతో ఆయనకు పెద్ద హిట్ రావాలని కోరుకుంటున్నాను.. అంటూ ఇంటర్వ్యూ ముగించారు.

‘Dabang 3’ pre Release event

స‌ల్మాన్‌ఖాన్ హీరోగా స‌ల్మాన్‌ఖాన్ ఫిలింస్‌, అర్బాజ్ ఖాన్ ప్రొడ‌క్ష‌న్స్‌, స‌ఫ్రాన్ బ్రాడ్‌కాస్ట్ మీడియా లి. ప‌తాకాల‌పై స‌ల్మాన్‌ఖాన్‌, అర్బాజ్‌ఖాన్‌, నిఖిల్ ద్వివేది నిర్మిస్తోన్న చిత్రం `ద‌బాంగ్ 3`. ప్ర‌భుదేవా ద‌ర్శ‌కుడు. క్రిస్మ‌స్ సంద‌ర్భంగా డిసెంబ‌ర్ 20న సినిమా విడుద‌ల‌వుతుంది. ఈ చిత్రాన్ని తెలుగులో సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ విడుద‌ల చేస్తుంది. ఈ సంద‌ర్భంగా బుధ‌వారం జ‌రిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో…

అనంత్ శ్రీరామ్ మాట్లాడుతూ – “ఈ సినిమాలో రెండు ప్రేమ పాట‌లు రాసే అవ‌కాశం క‌లిగింది. ప్ర‌భుదేవాగారికి, స‌ల్మాన్‌ఖాన్‌గారికి కృత‌జ్ఞ‌త‌లు“ అన్నారు.
రామ‌జోగ‌య్య శాస్త్రి మాట్లాడుతూ – “మంచి క‌మ‌ర్షియ‌ల్ ఎంటర్‌టైన‌ర్‌. హిందీలో స‌క్సెస్ అవుతుంది. అక్క‌డ‌లాగానే తెలుగులోనూ సినిమా పెద్ద విజ‌యాన్ని సాధించాల‌ని కోరుకుంటున్నాను“ అన్నారు.
కిచ్చా సుదీప్ మాట్లాడుతూ – “స‌ల్మాన్‌గారిలో క‌లిసి ద‌బాంగ్ 3లో న‌టించడాన్ని గౌర‌వంగా భావిస్తున్నాను. సినిమా త‌ప్ప‌కుండా తెలుగు ప్రేక్ష‌కుల‌కు న‌చ్చుతుంది“ అన్నారు.
సయీ మంజ్రేక‌ర్ మాట్లాడుతూ – “నా తొలి చిత్ర‌మిది. స‌ల్మాన్‌ఖాన్‌గారితో క‌లిసి న‌టించ‌డం చాలా హ్యాపీగా ఉంది. మీ ప్రేమాభిమానులు కావాల‌ని ఎదురుచూస్తున్నాను“ అన్నారు.
సోనాక్షి సిన్హా మాట్లాడుతూ – “ద‌బాంగ్ సిరీస్ నాకెంతో ప్ర‌త్యేకం. ఇది మూడో భాగం. స‌యూ తొలిసారి న‌టిస్తుంది. మీ ప్రేమాభిమానాలు చూసి హ్యాపీగా అనిపించింది“ అన్నారు.
డైరెక్ట‌ర్ ప్ర‌భుదేవా మాట్లాడుతూ – “చాలా రోజుల త‌ర్వాత వెంక‌టేశ్‌గారిని క‌లిశాను. అలాగే రామ్‌చ‌ర‌ణ్‌ని చూస్తుంటే చిరంజీవిగారిని చూస్తున్న‌ట్లే ఉంది. ద‌బాంగ్ 3 విష‌యానికి ప‌క్కా మాస్‌గా, యాక్ష‌న్ మూవీలా ఉంటుంది. త‌ప్ప‌కుండా అంద‌రికీ న‌చ్చుతుంది“ అన్నారు.
మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ మాట్లాడుతూ – “స‌ల్మాన్‌గారంటే నాకెంతో ప్రేమ‌. స‌ల్మాన్‌గారు, చిరంజీవిగారు, సుదీప్‌గారు, వెంక‌టేష్‌గారు .. వీరంద‌రి నుండి ఓ విష‌యం నేర్చుకున్నాను. అదే క్ర‌మ‌శిక్ష‌ణ‌. మా త‌రం హీరోలు వారి నుండి నేర్చుకున్న‌దిదే. ప్ర‌భుదేవాగారికి అభినంద‌న‌లు. సోనాక్షిసిన్హా, స‌యి, సుదీప్ స‌హా ఎంటైర్ యూనిట్‌కి కంగ్రాట్స్‌“ అన్నారు.
విక్ట‌రీ వెంక‌టేశ్ మాట్లాడుతూ – “ద‌బాంగ్ 3 తెలుగులో విడుద‌ల కావ‌డం అది కూడా తెలుగు డైలాగ్స్ ను స‌ల్మాన్ భాయ్ వాయిస్ నుండి విన‌డం బావుంది. తెలుగులో సినిమాను సూప‌ర్‌హిట్ చేస్తార‌ని భావిస్తున్నాను. సోనాక్షిసిన్హా, సుదీప్‌, స‌యి స‌హా ఎంటైర్ యూనిట్‌కు అభినంద‌న‌లు“ అన్నారు.
స‌ల్మాన్‌ఖాన్ మాట్లాడుతూ – ``హైద‌రాబాద్ ప్ర‌జ‌లు ఎంతో ఘ‌నంగా స్వాగ‌తం ప‌లికారు. హిందీలో నా సినిమాలు ఇక్క‌డ రిలీజ్ అయ్యేవి. మంచి రెస్పాన్స్ వ‌స్తుండేవి. ఆ రెస్పాన్స్‌ను చూసి తెలుగులో కూడా రిలీజ్ చేయాల‌ని ద‌బాంగ్ 3ని తెలుగులో రిలీజ్ చేస్తున్నాను. రామ్‌చ‌ర‌ణ్ నాకు ఎంతో స‌న్నిహితుడు. నా చిన్న‌త‌మ్ముడిగా భావిస్తాను. చిరంజీవిగారితో ఎంతో స‌న్నిహితం ఉంది. వెంకటేశ్‌గారితో 25ఏళ్లుగా ప‌రిచ‌యం ఉంది. ప్ర‌భుదేవాగారు చ‌క్క‌గా డైరెక్ట్ చేశారు. సినిమా త‌ప్ప‌కుండా మీ అంద‌రికీ న‌చ్చుతుంద‌ని భావిస్తున్నాను.

‘Mathu vadalara’Theatrical Trailer launch

సంగీత దిగ్గజం కీరవాణి తనయుడు శ్రీసింహా కథానాయకుడిగా  అరంగేట్రం చేస్తున్న చిత్రం మత్తు వదలరా. రితేష్ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. చిరంజీవి (చెర్రీ), హేమలత నిర్మాతలు. ఈ సినిమాతో కీరవాణి పెద్ద కుమారుడు కాలభైరవ సంగీత దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ నెల 25న  చిత్రం విడుదలకానుంది.
ఈ చిత్ర ట్రైలర్‌ను బుధవారం ట్విట్టర్ ద్వారా హీరో రానా విడుదలచేశారు. ఈ సందర్భంగా చిత్రబృందం పాత్రికేయుల సమావేశాన్ని ఏర్పాటుచేసింది.
చిత్ర సమర్పకుడు, మైత్రీ మూవీ మేకర్స్ అధినేతల్లో ఒకరైన నిర్మాత రవిశంకర్ మాట్లాడుతూ మూడేళ్ల క్రితం ఈ కథ విన్నాను.  చాలా నచ్చింది. తపన కలిగిన యువప్రతిభావంతులంతా  టీమ్‌గా ఏర్పడి అద్భుతంగా సినిమాను రూపొందించారు. విజువల్ ఎఫెక్ట్స్, కెమెరావర్క్‌తో పాటు ప్రతి డిపార్ట్‌మెంట్ వారే స్వంతంగా సమకూర్చుకుంటూ సినిమా చేస్తామని చెప్పగానే అశ్చర్యపోయాను. ఇలా కూడా సినిమా రూపొందించవచ్చా అనిపించింది. రితేష్‌రానా చెప్పిన కథ నాలో ఆసక్తిని రేకెత్తించింది.  సినిమాను చేయనని చెప్పడానికి ఛాన్స్ లేకుండాఅద్భుతంగా ఉంది.  యమదొంగ, ఒక్కడున్నాడు లాంటి పెద్ద సినిమాలు చేసిన చెర్రీ సుదీర్ఘ విరామం తర్వాత నిర్మించిన చిత్రమిది. ఈ సినిమాకు మేము సమర్పకులుగా వ్యవహరించడం ఆనందంగా ఉంది. పెద్ద హిట్ కంటెంట్‌ను చిన్న బడ్జెట్‌లో చేయడం ఉత్సుకతగా ఉంది.  శ్రీసింహా, కాలభైరవ, రితేష్‌రానా, థామస్, తేజ  అందరూ కొత్తవాళ్లు కలిసి అద్భుతాన్ని సృష్టించారని ప్రతి ఒక్కరూ ప్రశంసిస్తారనే నమ్మకం ముంది. ఇప్పటివరకు సినిమా చూసిన వారంతా సినిమా బాగుందని మెచ్చుకున్నారు. మేము ఎలాంటి అనుభూతికి లోనయ్యామో థియేటర్‌లో సినిమా చూస్తున్న ప్రేక్షకుడికి అదే ఫీల్‌ను కలిగించినప్పుడే నిజమైన సక్సెస్  లభిస్తుంది. ప్రేక్షకుల అంతిమతీర్పు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం. హిట్ సినిమాతో ఈ ఏడాదిని ముగించబోతున్నామనే నమ్మకం ఉంది అని తెలిపారు.
నటుడు నరేష్ అగస్త్య మాట్లాడుతూ నటుడిగా నా తొలి సినిమా ఇది. ఈ సినిమా ద్వారా మైత్రీ మూవీస్, క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలు  నాతో పాటు చాలా మంది కొత్తవాళ్లను ప్రోత్సహించడం ఆనందంగా ఉంది. శ్రీసింహా తొలి సినిమాలా కాకుండా అనుభవజ్ఞుడిలా నటించారు. కాలభైరవ మంచి సంగీతాన్ని అందించాడు. ఈ సినిమాతో ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తున్నాం అని అన్నారు.
సంగీత దర్శకుడు కాలభైరవ మాట్లాడుతూ సంగీత దర్శకుడిగా నా మొదటి సినిమా ఇది.   తొలి సినిమా ఎవరికైనా ప్రత్యేకంగా ఉంటుంది. కానీ ఇది నాకు డబుల్ స్పెషల్. ఈ సినిమాతో నేను సంగీత దర్శకుడిగా, నా తమ్ముడు హీరోగా అరంగేట్రం చేస్తున్నాం.పూర్తిస్థాయి థ్రిల్లర్ సినిమా ఇది. నవ్విస్తూనే ఉత్కంఠను పంచుతుంది. సినిమా చేస్తున్నప్పుడు, చూసినప్పుడు చివరిక్షణం వరకు మేము ఎంజాయ్ చేశాం. మేము ఎంతగా ఆనందించామో ప్రేక్షకులు అలాగే ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాం. తొలి సినిమాతోనే మంచి కాన్సెప్ట్, ప్రతిభావంతులైన సాంకేతిక నిపుణులతో పనిచేసే అవకాశం వచ్చిన నిర్మాత చెర్రీకి,  మైత్రీ మూవీస్‌కు కృతజ్ఞతలు. ఇటీవల విడుదలైన  టీజర్, పాటకు చక్కటి స్పందన లభిస్తున్నది. ట్రైలర్‌తో పాటు సినిమా ప్రతి ఒక్కరిని మెప్పిస్తుందనే నమ్మకం ఉంది.
దర్శకుడు రితేష్‌రానా మాట్లాడుతూ మూడేళ్ల క్రితం రవిశంకర్, చెర్రీ ఈ కథ వినిపించాం. నాయకానాయికలు, ప్రేమకథ, పాటలు  లేకుండా కేవల పాత్రలు, వాటి చుట్టూ అల్లుకున్న సన్నివేశాలు మాత్రమే కనిపిస్తాయి.   యథార్థ సంఘటనల్ని ఆధారంగా చేసుకొని రూపొందించాం. వినోదం, థ్రిల్లర్ సమ్మిళితంగా  మేము చేసిన సరికొత్త ప్రయత్నమిది అని అని తెలిపారు.
హీరో శ్రీసింహా మాట్లాడుతూ  కథానాయకుడు, దర్శకుడు,నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరూ కొత్తవాళ్లను నమ్మి సినిమా చేయడం అంటే సాహసమనే చెప్పాలి. మమ్మల్ని నమ్మి అవకాశం ఇచ్చిన నిర్మాత చెర్రీతో పాటు  మైత్రీ మూవీస్ వారికి కృతజ్ఞతలు. థ్రిల్లర్ ప్రధానంగా సాగే చిత్రమిది. హీరో రానా ట్రైలర్‌ను విడుదల చేయడం ఆనందంగా ఉంది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో  ఛాయాగ్రాహకుడు సురేష్‌సారంగం, విజువల్ ఎఫెక్ట్స్ రవితేజ తదితరులు పాల్గొన్నారు.
అన్నారు.
నరేష్ ఆగస్త్య, అతుల్య చంద్ర, సత్య, వెన్నెలకిషోర్, బ్రహ్మాజీ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: సురేష్ సారంగం, ఎడిటర్: కార్తీక్ శ్రీనివాస్, ప్రొడక్షన్ డిజైనర్: ఏ.ఎస్.ప్రకాష్, క్రియేటివ్ హెడ్: థోమస్‌జై, కొరియోగ్రాఫర్: యశ్వంత్, స్టయిలింగ్, స్టంట్ కో-ఆర్టినేటర్: శంకర్ ఉయ్యాల, కో-రైటర్: తేజ.ఆర్, సాహిత్యం: రాకేందుమౌళి, సంగీతం: కాలభైరవ, లైన్ ప్రొడ్యూసర్: పి.టి.గిరిధర్ రావు, పబ్లిసిటీ డిజైనర్: ది రవెంజర్ట్, కథ, దర్శకత్వం: రితేష్ రానా.

Athade Srimannarayana to release worldwide on January 1

ర‌క్షిత్ శెట్టి హీరోగా పుష్క‌ర్ ఫిలింస్ బ్యాన‌ర్‌పై పుష్క‌ర్ మ‌ల్లిఖార్జున‌, హెచ్‌.కె.ప్ర‌కాశ్ నిర్మిస్తోన్న చిత్రం `అత‌డే శ్రీమ‌న్నారాయ‌ణ‌`. స‌చిన్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచయం అవుతున్నారు. శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై దిల్‌రాజు ఈ చిత్రాన్ని తెలుగులో విడుద‌ల చేస్తున్నారు. జ‌న‌వ‌రి 1న సినిమా ప్ర‌పంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అవుతుంది. ఈ సంద‌ర్భంగా బుధ‌వారం జ‌రిగిన పాత్రికేయుల స‌మావేశంలో రక్షిత్ శెట్టి, బాలాజీ మ‌నోహార్‌, ప్ర‌మోద్ శెట్టి, ఇమ్రాన్‌, రాజేష్‌, డిస్ట్రిబ్యూట‌ర్ స‌తీష్‌, రామజోగ్య‌శాస్త్రి, శాన్వి శ్రీవాత్స‌వ త‌దిత‌రులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా…

రాజేష్ మాట్లాడుతూ – “అతడే శ్రీమ‌న్నారాయ‌ణ‌` చిత్రం ప్యాన్ ఇండియా చిత్రంగా జ‌న‌వ‌రి 1న విడుద‌లవుతుంది. ఈ చిత్రాన్ని దిల్‌రాజుగారి శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌లో ఈ సినిమా విడుద‌ల‌వుతుంది. ఆయ‌న బ్యాన‌ర్‌లో సినిమా వ‌స్తుందంటే సినిమా స‌క్సెస్ అయిన‌ట్లే. చాలా హ్యాపీగా ఉన్నాం. ఇప్ప‌టి వ‌ర‌కు శాన్విగారు న‌టించ‌ని ఓ జోన‌ర్‌లో న‌టించారు. ఆమె చుట్టూనే క‌థంతా తిరుగుతుంటుంది. దానికి గ‌ల కార‌ణ‌మేంటో తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. ర‌క్షిత్ శెట్టిలాంటి హీరోకు డైలాగ్స్ రాయ‌డమంటే ఛాలెజింగ్ విష‌యం. డైరెక్ట‌ర్ స‌చిన్‌గారు సినిమాను అద్భుత‌మైన స్క్రీన్‌ప్లేతో న‌డిపించారు. అజ‌నీష్ లోక్‌నాథ్ సంగీతంలో విడుద‌లైన పాట‌ల‌కు మంచి స్పంద‌న వ‌స్తుంది. అలాగే అద్భుత‌మైన నేప‌థ్య సంగీతాన్ని అందించారు. నిధి అన్వేష‌ణపైన జ‌రిగే క‌థ ఇది. చిన్న పీరియాడిక్‌లా, కౌబోయ్ త‌ర‌హా చిత్రం. డిఫ‌రెంట్ జోన‌ర్‌లో సాగుతుంది. త‌ప్ప‌కుండా ప్రేక్ష‌కుల‌ను మెప్పించే చిత్ర‌మ‌వుతుంది“ అన్నారు.
హీరోయిన్ శాన్వి శ్రీవాత్స‌వ మాట్లాడుతూ – “ఐదేళ్ల త‌ర్వాత తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు `అత‌డే శ్రీమ‌న్నారాయ‌ణ‌` చిత్రంతో రావ‌డంతో చాలా సంతోషంగా ఉంది. రౌడీ సినిమా త‌ర్వాత ఏడాదిన్న‌ర పాటు ఏ సినిమా చేయ‌లేదు. అయితే ప్రేక్ష‌కుల స‌పోర్ట్‌తో మ‌ళ్లీ సినిమాలు చేసుకుంటూ వ‌చ్చాను. ఇప్పుడు ఇంత పెద్ద సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నందుకు ఆనందంగా ఉంది“ అన్నారు.
హీరో ర‌క్షిత్ శెట్టి మాట్లాడుతూ – “ఉడిపి నుండి ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చాను. ఇంజ‌నీరింగ్ చ‌దివే స‌మ‌యంలో వంశీకృష్ణ అనే మిత్రుడు ప‌రిచ‌యం అయ్యాడు. అలా అప్పుడే తెలుగుతో ప‌రిచ‌యం ఉంది. నా ఇంజ‌నీరింగ్ స‌మ‌యంలో నేను యాక్ట‌ర్ అవుతాన‌ని ఎవ‌రితోనూ చెప్పుకోలేదు. వంశీకృష్ణ‌తోనే చెప్పుకునేవాడిని. మేం ఇద్ద‌రి క‌లిసి షార్ట్ ఫిలింస్ చూసేవాళ్లం. చిరంజీవిగారు, నాగార్జున‌గారు, వెంక‌టేశ్‌గారి సినిమాలు చూసేవాడిని. కానీ తేడా తెలిసేది కాదు.. కానీ వంశీకృష్ణ‌ను చూసిన త‌ర్వాత సినిమాపై ఎంత ప్యాష‌నేట్‌గా ఉండాల‌నేది తెలిసింది. నేను సినిమా ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన త‌ర్వాత ఇక్క‌డి ప్రేక్ష‌కులు సినిమాను ఎంత‌లా ఆదరిస్తారు, ప్రేమిస్తారు అని తెలిసింది. అందుకనే నా శ్రీమ‌న్నారాయ‌ణ‌ను తెలుగులో విడుద‌ల చేయాల‌ని అనుకున్నాను. చాలా ప్యాష‌న్‌తో, ప్రేమ‌తో సినిమా చేశాం. మూడేళ్ల క‌ష్టం. గొప్ప జ‌ర్నీ. తెలుగు ప్రేక్ష‌కులు నా సినిమాను ఎలా ఆద‌రిస్తారో చూడాల‌ని ఆస‌క్తిగా ఉన్నాను. రామ‌జోగ్య‌గారికి థ్యాంక్స్‌. అలాగే తెలుగులో మా సినిమాను విడుద‌ల చేస్తున్న దిల్‌రాజుగారికి థ్యాంక్స్‌“ అన్నారు.
రామ‌జోగ‌య్య శాస్త్రి మాట్లాడుతూ – “రక్షిత్ శెట్టిగారికి తెలుగు సినిమా ప‌రిశ్ర‌మ‌లోకి ఆహ్వానం ప‌లుకుతున్నాం. ఏ క‌ళాకారుడైన ఎక్కువ మంది ప్రేక్ష‌కులను రంజింప చేయాల‌నుకుంటారు. అలాంటి ప్ర‌య‌త్న‌మే ఇది. ర‌క్షిత్ శెట్టిగారు మూడేళ్లు క‌ష్ట‌ప‌డి ఈ సినిమాను రూపొందించారు. ఆయ‌న నాయ‌కత్వంలో చేసిన ఈ సినిమాను ఐదు భాష‌ల్లో విడుద‌ల చేయ‌డం చాలా గొప్ప విష‌యం. ఓ బాహుబ‌లి, కె.జి.య‌ఫ్ త‌ర‌హాలో ఈ సినిమా ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తుంద‌ని భావిస్తున్నాను. జ‌న‌వ‌రి 1న ఈ సినిమా విడుద‌ల‌వుతుంది. దిల్‌రాజుగారు ఈ సినిమాను విడుద‌ల చేస్తున్నందుకు ఆయ‌న‌కు కృత‌జ్ఞ‌త‌లు. అన్ని పాట‌లు క‌థ‌లో భాగంగా ఉంటాయి. తెలుగు ప్రేక్ష‌కులు ఈ సినిమాను గొప్ప‌గా ఆద‌రిస్తార‌ని కోరుకుంటున్నాను“ అన్నారు

Hero Saitej interview about ‘Prathiroju pandage’

చిత్రాలహరి సినిమా విజయం తో ఫుల్ జోష్ లో ఉన్న సాయితేజ్,ప్రతిరోజు పండగే చిత్రం తో మరో సక్సెస్ కు రెడీ అయి పోతున్నారు.సాయి తేజ్, రాశి ఖన్నా హీరో హీరోయిన్లుగా యూత్ ఫుల్ చిత్రాల దర్శకుడు మారుతీ తెరకెక్కించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ ప్రతిరోజూ పండుగే. పల్లెటూరి నేపథ్యంలో పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ చిత్రం ఈనెల 20న విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో సాయి తేజ్ పాత్రికేయుల సమావేశంలో పాల్గొని చిత్ర విశేషాలు పంచుకున్నారు.

ఈ సినిమా గురుంచి చెప్పండి?
—–ఇది తాత,మనవడి కథ వాళ్లిద్దరి మధ్య జరిగే ఎమోషన్ బాండ్.జీవితం చివరి దశ లో ఉన్న ఒక వ్యక్తి కి తన కుటుంబం ఇచ్చే బహుమతి ఎలా ఉండాలి. కొద్దిరోజులలో చనిపోతాడు అని తెలిసిన వ్యక్తి చావుని కూడా పండుగగా ఎలా ముగించవచ్చు అనే విషయాలను ఫన్ అండ్ ఎమోషనల్ గా చెప్పాము.ఒక ఉగాది పచ్చడిలాగా అన్ని ఎమోషన్స్ ఉంటాయి.

ఇందులో మీ పాత్ర ఎలా ఉంటుంది?
—-తన తాత గారి పరిస్థితి తెలుసుకొని విలేజ్ కొచ్చిన మనవడి పాత్ర నాది. కొద్దిరోజులలో చచ్చిపోయే తన తాత సంతోషం కోసం తపించే కుర్రాడిలా ఉంటాను. ఫన్, ఎమోషన్స్ మరియు యాక్షన్ ఇవ్వన్నీ కలగలిసిన పాత్ర నాది.

ఇందులో మీరు సిక్స్ ప్యాక్ చేయ డానికి గలా కారణమేంటి?
—నా మొదటి చిత్రం కోసం కూడా నేను సిక్స్ ప్యాక్ చేశాను. చిత్రలహరి మూవీ కోసం కొంచెం వెయిట్ పెరిగాను. అది తగ్గించడం కోసం వ్యాయామం చేయడం జరిగింది. అలాగే ఈ మూవీలో నాకు మంచి యాక్షన్ ఎపిసోడ్స్ కూడా ఉన్నాయి. అందుకే సిక్స్ ప్యాక్ చేయడం జరిగింది.

సత్యరాజ్ గారి తో ఎలా ఉండేవారు?
ఇంట్లో మా తాత గారితో ఎలా ఉండే వాన్నో వీరితోను అలాగే ఉన్నాను.

మారుతీ గారితో ఈ మూవీ ఎలా స్టార్ట్ అయ్యింది?
–నేను 2007లో ఎం బి ఏ చదివేటప్పుడు మారుతీ, ఎస్ కె ఎన్, బన్నీవాసు గారితో నాకు పరిచయం ఉంది. అప్పుడు మారుతీ నాకు ఓ కథ వినిపించారు. మేమిద్దరం ఎప్పటి నుండో ఒక మూవీ చేయాలనుకుంటున్నాం, ఇప్పటికి ఈ కథతో అది కుదిరింది.

మ్యూజిక్ డైరెక్టర్ థమన్ గురించి చెప్పండి?
—-థమన్ నాకు మ్యూజిక్ డైరెక్టర్ కంటే కూడా మంచి మిత్రుడు అని చెప్పాలి, మా ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు పెద్దగా అడకపోయినా ఆయన ఇచ్చిన సాంగ్స్ హిట్ అయ్యాయి. ఈ మూవీ కొరకు థమన్ ఇచ్చిన పాటలు మంచి ఆదరణ దక్కించుకున్నాయి.

ఈ కథ చిరంజీవిగారికి మారుతి గారు చెప్పి వినిపించారు కదా ఆయన ఈ కథ గురుంచి మీకు ఏం చెప్పారు?
చిరంజీవి గారికి ఈ కథ బాగా నచ్చింది. చెప్పినట్లు తీస్తారా లేదా చూస్తాను అన్నారు.చిత్రాలహరి తరువాత నా పెర్ఫార్మన్స్ ను మెచ్చుకొన్నారు..

మీరు పెద్ద కుటుంబం నుండి వచ్చారు అది మీకు, బలమా.. బలహీనత?
—అది ఒక బాధ్యత.. అని నా ఫీలింగ్. మెగాస్టార్ లాంటి కుటుంబం నుండి వచ్చినప్పుడు మనం చేసే సినిమాలు, నిర్ణయాలు వారు సెట్ చేసిన బెంచ్ మార్క్ అందుకునేలా ఉండాలి.

సత్య రాజ్ గారి గురించి చెప్పండి ?
–సత్య రాజ్ గారు ఒక జీనియస్, ఆయనకు ఏ వయసు వారితో ఎలా మాట్లాడాలో తెలుసు.ఆయన డైరెక్టర్ యాక్టర్, ఆయన ఒక సారి చెపుతూ మంచి కథ దొరకక నేను ”రెండేళ్లు నేను మేక్ అప్ వేసుకోలేదు, అయినా నేను విశ్వాసం కోల్పోలేదు. పొలిటికల్ రౌడీ చిత్రంతో నాకు మళ్ళీ లైఫ్ వచ్చింది” అని చెప్పారు. అయన దగ్గర పనిచేసే వారి దగ్గర నుండి సెట్ లో ఉన్న అందరినీ ఆయన గౌరవిస్తారు. ఆయన మాటలు స్ఫూర్తి నింపుతాయి.

సోలో బ్రతుకే సో బెటర్ మూవీ ఎంతవరకు వచ్చింది ?
—మూడు రోజుల చిన్న షెడ్యూల్ చేశాం, ప్రతిరోజూ పండుగే విడుదల తరువాత మరలా షూటింగ్ స్టార్ట్ చేస్తాం.

మెగా హీరోలతో మల్టీ స్టారర్ ఏమైనా చేస్తున్నారా?
—అవును వరుణ్, నేను కథ కోసం వైటింగ్. ఇప్పటికే ఈ విషయంపై మేమిద్దరం మాట్లాడుకోవడం జరిగింది. సరైన కథ దొరికితే చేయడానికి మేము సిద్ధం, రవి తేజ గారు కూడా మల్టీ స్టారర్ చేద్దాం అని అడిగారు.

Vijay Devarakonda – Shiva Nirvana Movie announcement

క్రేజీ స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా `నిన్నుకోరి`, `మ‌జిలీ` వంటి సూప‌ర్ హిట్ చిత్రాల‌ను తెర‌కెక్కించిన‌ సెన్సిబుల్ డైరెక్ట‌ర్ శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా రూపొంద‌నుంది. ఎన్నో విజ‌య‌వంత‌మైన చిత్రాల‌ను తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందించిన ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. డిసెంబ‌ర్ 18న దిల్‌రాజు పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఈ చిత్రాన్ని అధికారికంగా ప్ర‌క‌టించారు. 2020 లో ఈ సినిమా ప్రారంభం అవుతుంది. త్వ‌ర‌లోనే న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల వివ‌రాల‌ను ప్ర‌క‌టిస్తామ‌ని చిత్ర యూనిట్ తెలియ‌జేసింది.
Attachments area