Home Blog Page 35

‘Santhana Prapthirasthu’ Rules OTT Charts — No.1 on Jio Hotstar & Top 10 on Amazon India

విక్రాంత్, చాందినీ చౌదరి జంటగా నటించిన “సంతాన ప్రాప్తిరస్తు” సినిమా ఓటీటీ వేదికలపై ప్రేక్షకులకు మరింత రీచ్ అవుతోంది. ఈ నెల 19వ తేదీ నుంచి అమోజాన్ ప్రైమ్ వీడియో, జియో హాట్ స్టార్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. ప్రేక్షకాదరణతో జియో హాట్ స్టార్ లో తెలుగు మూవీస్ లో నెం.1 ప్లేస్ లో, అమోజాన్ ప్రైమ్ వీడియోలో టాప్ 10 ఇండియన్ మూవీస్ లో “సంతాన ప్రాప్తిరస్తు” ట్రెండింగ్ అవుతుండటం విశేషం. మంచి కంటెంట్ ఉన్న సినిమాకు థియేటర్స్ లోనే కాదు ఓటీటీల్లోనూ రెస్పాన్స్ బాగుంటుందని చెప్పేందుకు “సంతాన ప్రాప్తిరస్తు” టాప్ లో ట్రెండ్ అవడమే ప్రూఫ్ గా నిలుస్తోంది. వినోదంతో పాటు ఒక మంచి సందేశాన్ని “సంతాన ప్రాప్తిరస్తు” అందించింది. మేల్ ఇన్ ఫెర్టిలిటీ వంటి సెన్సిటివ్ అంశాన్ని ఎంచుకుని ఎలాంటి అసభ్యత లేకుండా ప్రేక్షకులు సకుటుంబంగా చూసేలా ఈ సినిమాను దర్శకుడు సంజీవ్ రెడ్డి రూపొందించడంపై ప్రశంసలు వస్తున్నాయి. 2025లో రిలీజైన మంచి కంటెంట్ ఉన్న చిత్రాల్లో ఒకటిగా “సంతాన ప్రాప్తిరస్తు” సినిమా నిలిచింది.

“సంతాన ప్రాప్తిరస్తు” సినిమాను మధుర ఎంటర్ టైన్ మెంట్, నిర్వి ఆర్ట్స్ బ్యానర్స్ పై మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి నిర్మించారు. దర్శకుడు సంజీవ్ రెడ్డి రూపొందించారు. కల్యాణ్ రాఘవ్ డైలాగ్స్, అజయ్ అరసాడ మ్యూజిక్ ఈ సినిమాకు ఆకర్షణగా నిలిచాయి. వెన్నెల కిషోర్, తరుణ్ భాస్కర్, అభినవ్ గోమటం, మురళీధర్ గౌడ్, హర్షవర్థన్ ఇతర కీ రోల్స్ లో ఆకట్టుకున్నారు.

The Theatrical Experience of ‘Eesha’ Will Haunt You for a Long Time : Actor Sri Vishnu at the Pre-Release event

సాధారణంగా హారర్‌ సినిమాలు థియేటర్‌లో ప్రేక్షకులను భయపెడతాయి. కానీ హారర్‌ కాన్సెప్ట్‌తో చేసిన ఈవెంట్‌ కూడా అక్కడికి వచ్చిన వారిని భయపెడుతుందని, ఓ హారర్‌ సినిమా చూసిన ఫీల్‌ ఉంటుందని మంగళవారం జరిగిన ఈషా హాంటెండ్‌ నైట్‌ ఈవెట్‌ ప్రూవ్‌ చేసింది. ఈషా చిత్రం ప్రీరిలీజ్‌ వేడుకలో భాగంగా ఈ కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. వంశీ నందిపాటి ఎంటర్ టైన్ మెంట్స్, బన్నీ వాస్ వర్క్స్ బ్యానర్స్ పై వంశీ నందిపాటి, బన్నీ వాస్ గ్రాండ్‌గా ఈ చిత్రాన్నిడిసెంబరు 25న చిత్రాన్ని థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నారు. అఖిల్‌రాజ్‌ త్రిగుణ్‌ హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రంలో హెబ్బాపటేల్‌ కథానాయిక. సిరి హనుమంతు, బబ్లూ, పృథ్వీరాజ్‌ ఇతర ముఖ్యపాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని హెచ్‌వీఆర్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై ప్రముఖ నిర్మాత కేఎల్‌ దామోదర ప్రసాద్‌ సమర్పణలో హేమ వెంకటేశ్వరరావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీనివాస్‌ మన్నె దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఈ నెల 25న చిత్రం విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్ర హాంటెండ్‌ నైట్‌, ప్రీరిలీజ్‌వేడుక జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కింగ్‌ ఆఫ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ కథానాయకుడు శ్రీవిష్ణు బిగ్‌టికెట్‌ను లాంచ్‌చేస బిగ్‌ టికెట్‌ను లాంచ్‌ చేసి, ప్రేక్షకుని అంగీకార పత్రంపై శ్రీవిష్ణు సైన్‌ చేశారు.

ఈ సందర్భంగా శ్రీ విష్ణు మాట్లాడుతూ ” హారర్‌ సినిమాలు నాకు పర్సనల్‌గా ఇష్టం. హారర్‌ సినిమాలు థియేటర్‌లో ఫ్రెండ్స్‌తో చూసినప్పుడు థ్రిల్ల్‌గా ఫీలవుతాను. హారర్‌ సినిమా ఎక్స్‌పీరియన్స్‌ చాలా రోజులు గుర్తుండిపోతుంది. ఈ ఈషా సినిమా థియేట్రికల్‌ ఎక్స్‌పీరియన్స్‌ కూడా చాలా రోజులు అందరిని వెంటాడుతుంది. సో.. అందరూ ఈ సినిమా చూసి అందరూ ఆ ఎక్స్‌పీరియన్ష్‌ పొందగలరు. దర్శకుడు శ్రీనివాస్‌ మన్నె గారి కథల్లో నావెల్టీ ఉంటుంది. ఆయన కలిసినప్పుడు చాలా కథలు చెబుతుండేవాడు. ఈ కథ కూడా తప్పనిసరిగా నావెల్టీతో పాటు సినిమాలో మంచి ట్విస్టులు ఉండబోతున్నాయి. ఈ సినిమాలో యాక్ట్‌ చేసిన అందరికి మంచి విజయం వస్తుందని ఆశిస్తున్నాను. మంచి అభిరుచి ఉన్న దామోదర ప్రసాద్‌ సమర్పకుడిగా ఉండటంతో ఈ సినిమా మీద అందరిలో అంచనాలు ఉంటాయి. ఇక బన్నీవాసు, వంశీ నందిపాటి మంచి టాలెంట్‌ ఉన్న టీమ్‌తో వాళ్ల ప్లానింగ్‌తో సపోర్ట్‌ చేస్తున్నారు. కొత్త వాళ్లను ఎంతో ఎంకరైజ్‌ చేస్తున్నారు. మంచి సినిమాలను మరో స్థాయికి తీసుకవెళతారు. ఈ సినిమాతో వాళ్లు మరో విజయం అందుకుంటారని అనుకుంటున్నాను’ అన్నారు.

కేఎల్‌ దామోదర ప్రసాద్‌ మాట్లాడుతూ ” కంటెంట్‌ ఉన్నసినిమాలే చేస్తాను. కంటెంట్‌తో పాటు మంచి టీమ్‌ కుదరిన తరువాత మంచి ప్రొడక్ట్‌ తీసుకొస్తాం. ఇక సినిమాను జనాలకు రీచ్‌ చేయడం మరో ఎత్తు. ఇప్పుడు జనాలకు సినిమాను రీచ్‌ చేసే బాధ్యతను బన్నీవాస్‌, వంశీ వాసు తీసుకొని ఓ ఫ్లాట్‌ఫామ్‌ను క్రియేట్‌ చేశారు. ఈ సినిమా ఇప్పుడు వీరి వల్ల జనాలకు రీచ్‌ అయ్యిందని నమ్ముతున్నాను. ఇదొక హారర్‌ సినిమా, జనాలకు నచ్చుతుందనే నమ్మకం కలిగింది. ఈ సినిమాకు టిక్కెట్లు రేట్లు కూడా అందరికి అందుబాటులో ఉంటుంది.ఇలాంటి సినిమాను థియేటర్‌లో చూసి ఎంజాయ్‌ చేయాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా తప్పకుండా అందరికి నచ్చుతుంది. కథ సినిమా తరువాత దర్శకుడు ఎంతో ఓపికగా వెయిట్‌చేసి మంచి కంటెంట్‌తో ఈ సినిమా చేశాడు’ అన్నారు.

వంశీ నందిపాటి మాట్లాడుతూ ‘‘ శ్రీవిష్ణు మాకు లక్కీహ్యాండ్‌.. బంగారం లాంటి మనిషి ఆయన ఈ ఫంక్షన్‌కు రావడం హ్యపీగా ఉంది. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా ప్రేక్షకుని అంగీకార పత్రం సైన్‌ చేసి థియేటర్‌లోకి అడుగుపెట్టి భయపడాలి. తప్పని సరిగా ఈ సినిమాతో ప్రేక్షకుడిని భయపెట్టి, ఓ మీనింగ్‌ ఫుల్‌ మేసేజ్‌ ఇచ్చి.. ఓ మంచి సినిమా చూసిన ఫీలింగ్‌తో థియేటర్‌ నుంచి బయటికి వస్తారు. ఈ సినిమా 99 రూపాయిలకే ఒక రోజు ముందుగానే అంటే ఈ నెల 24 నుంచి ప్రీమియర్స్‌ తో ఈసినిమాను విడుదల చేస్తున్నాం. తప్పకుండా ఈ సినిమా అందరిని భయపెడుతుంది. ఎంటర్‌టైన్‌ చేస్తుంది’ అన్నారు.

బన్నీ వాసు మాట్లాడుతూ ” వంశీ నందిపాటి సినిమాను భుజాల మీద తీసుకెళ్లి.. జనాలకు తీసుకవెళతారు. ఈ సినిమాను ప్రేక్షకులను రీచ్‌ చేయడం కోసం ఏమైనా చేస్తాడు. ఈ సినిమా కోసం వంశీ అన్ని చూస్తున్నాడు. ఈ సినిమా చూస్తుంటే అందరి వెన్నులో వణుకు పుడుతుంది. చిన్నప్పుడు దెయ్యాలు ఉన్నాయా లేవా అని తెలియడం కోసం నేను చాలా చేశాను. ఈ సినిమాను చూసిన తరువాత అప్పుడప్పుడు వెనక్కి చూసి భయపడుతున్నాను. అంతలా ఈ సినిమా అందర్ని వెంటాడుతుంది. హారర్‌ సినిమా లవర్స్‌ ఈ సినిమాను బాగా ఎంజాయ్‌ చేస్తారు. ఈ సినిమాలో ప్రేక్షకులు భయపడి అరుస్తుంటారు.ఈ సినిమా పతాక సన్నివేశాలు అందర్ని షాకింగ్‌కు గురిచేస్తాయి. థియేటర్‌లో ఖచ్చితంగా అందరూ భయపడతారు. భయపడే గర్లఫ్రెండ్‌ ఉండే తీసుకొని వెళ్లండి. శ్రీ విష్ణు మా లక్కీ హ్యాండ్‌ ఆయన ఈ ఫంక్షన్‌కు రావడం ఆనందంగా ఉంది. ఈ సినిమాలో యాక్ట్‌ చేసిన అందరికి ఈ సినిమా మంచి బ్రేక్‌ ఇవ్వాలి అని కోరుకుంటున్నాను. మిత్రమండలి తరువాత కాస్త బ్రేక్‌ తీసుకుందామని.. ఫ్యామిలీతో టైమ్‌ గడుపుదామని అనుకున్నాను. కానీ వంశీ నందిపాటి నన్ను ఖాళీగా ఉంచకుండా… సినిమాలు చూపిస్తూ.. సినిమాలు తీసుకుంటున్నాడు. నేను సినిమాలకు బ్రేక్‌ ఇద్దామన్నా కుదరడం లేదు.

హీరో అఖిల్‌ మాట్లాడుతూ ” రాజు వెడ్స్‌ రాంబాయి సినిమాను హిట్‌చేసిన ప్రేక్షకులు నేను నటించిన ఈసినిమా కూడా ఆదరిస్తారని కోరుకుంటున్నాను. ఈ సినిమాకు థియేటర్‌లో చూడడానికి ఎదురుచూస్తున్నాను. నాకు హారర్‌ సినిమాలంటే భయం. అయినా ఈసినిమాను థియేటర్‌లో చూస్తాను. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థ్యాంక్స్. రాజు వెడ్స్‌ రాంబాయ్‌ తరువాత నా మరో సినిమా థియేటర్‌లోకి రావడం సంతోషంగా ఉంది. ఈసినిమాను అందరూ చూసి భయపడి..ఆ ఎమోషన్‌తో ఎంటర్‌టైన్‌ అవుతారని అనుకుంటున్నాను’ అన్నారు.

దర్శకుడు శ్రీనివాస్‌ మన్నె మాట్లాడుతూ ” శ్రీ విష్ణు లక్కీ హ్యాండ్‌ ఈ సినిమా ఫంక్షన్‌కు రావడం ఆనందంగా ఉంది. ఓ సినిమా మాట్లాడితే.. ఆ తరువాత దర్శకుడు మాట్లాడాలి అని నమ్మే వ్యక్తిని. ఈ సినిమాను విడుదల వరకు తీసుకొచ్చినా.. అందరికి కృతజ్తతలు. ఈ సినిమాను అందరికి రీచ్‌ అవ్వడానికి వంశీ, వాసు గారు ఇచ్చిన ఇన్‌పుట్స్‌ నాకు ఎంతో ఉపయోగపడ్డాయి. వాళ్లుచెప్నిన కరెక్షన్స్‌ ఈ సినిమాను వందశాతం ఫర్‌ఫెక్ట్‌గా రావడానికి దోహదపడ్డాయి అన్నారు.

హీరో త్రిగుణ్‌ మాట్లాడుతూ ” కథ ద్వారా దర్శకుడు శ్రీనివాస్‌మన్నె నన్ను హీరోని చేశాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇంత దూరం వస్తానని ఈ స్థాయికి వస్తానని అనుకోలేదు. అనుకోకుండా ఈ సినిమాలోకి నేను ఎంట్రీ అయ్యాను. ఈ సినిమాను అందరికి రీచ్‌ చేసిన బన్నీవాస్, వంశీ నందిపాటికి నా థ్యాంక్స్. దామోదర్‌ ప్రసాద్‌, వెంకట్‌లకు నా కృతజ్క్షతలు. ఈ సినిమాను చూస్తుంటే ఓ ఇంటర్నేషన్‌ హారర్‌ సినిమా చూస్తున్న ఫీల్‌ కలుగుతుంది అన్నారు. ఈ కార్యక్రమంలో సిరి హనుమంతు, హెబ్బా పటేల్‌, నిర్మాత వెంకట్‌ తదితరలు పాల్గొన్నారు.

Hero Aadi Saikumar interview about Supernatural thriller ‘Shambhala’ Movie

ఆది సాయి కుమార్ హీరోగా తెరకెక్కిన ‘శంబాల’ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్‌లు, పోస్టర్లు, పాటలు ఇలా అన్నీ కూడా ఆడియెన్స్‌లో మంచి బజ్‌ను క్రియేట్ చేశాయి. డిసెంబర్ 25న ఈ చిత్రం గ్రాండ్‌గా రిలీజ్ అవుతోంది. డిసెంబర్ 23న ఆది సాయి కుమార్ పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో ముచ్చటిస్తూ ‘శంబాల’ గురించి ఎన్నో విషయాల్ని పంచుకున్నారు. ఈ మూవీ గురించి ఆయన చెప్పిన సంగతులివే..
శంబాల’పై మంచి బజ్ ఏర్పడింది? ఈ చిత్రంపై పెరిగిన అంచనాల గురించి మీరేం చెబుతారు?
‘శంబాల’ చిత్రం బాగా వచ్చింది. ఆడియెన్స్‌కి మా సినిమా బాగా నచ్చుతుంది. అందరూ మా మూవీని ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను.
డిసెంబర్ 25న చాలా కాంపిటీషన్ ఉంది కదా? శ్రీకాంత్ గారితో మీకు మంచి ఫ్యామిలీ బాండింగ్ కూడా ఉంది. ఈ కాంపిటీషన్‌ను ఎలా చూస్తారు?*
క్రిస్మస్, డిసెంబర్ 25 అనేది మంచి సీజన్. శ్రీకాంత్ గారి ఫ్యామిలీతో మాకు మంచి బాండింగ్ ఉంది. రోషన్‌తో నాకు మంచి పరిచయం ఉంది. మా క్రికెట్‌ టీంలో రోషన్ చురుకుగా ఉంటాడు. రోషన్ నటించిన ‘ఛాంపియన్’ సినిమా కూడా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను.
‘శంబాల’ నుంచి వచ్చిన ప్రతీ కంటెంట్ వైరల్ అయింది కదా? సినిమా మీద చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నట్టున్నారు?*
‘శంబాల’ స్టిల్ వదిలిన క్షణం నుంచి మంచి బజ్ ఏర్పడింది. దుల్కర్ గారు, ప్రభాస్ గారు, నాని గారు వదిలిన టీజర్, ట్రైలర్‌లు మంచి రెస్పాన్స్‌ను దక్కించుకున్నాయి. ఆడియెన్స్‌లో మా మూవీ పట్ల మంచి బజ్ ఏర్పడింది. ఈ సారి మేం మంచి విజయాన్ని అందుకోబోతోన్నామనే కాన్ఫిడెన్స్ ఉంది.
*‘శంబాల’ లాంటి చిత్రానికి యాక్షన్ సీక్వెన్స్, కాస్ట్యూమ్స్ చాలా ఇంపార్టెంట్ కదా?*
‘శంబాల’ చిత్రంలో అద్భుతమైన పోరాట సన్నివేశాలున్నాయి. రాజ్ కుమార్ మాస్టర్ అన్ని యాక్షన్ సీక్వెన్స్‌కి రిహార్సల్స్ చేశారు. దర్శకుడు యుగంధర్‌తో పాటుగా రాజ్ కుమార్ ట్రావెల్ చేశారు. క్లైమాక్స్‌లో వచ్చే యాక్షన్ సీక్వెన్స్‌ అదిరిపోతుంది. 80వ దశకంలో వచ్చే కథ కాబట్టి.. లుక్స్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నాం. అందుకే కాస్ట్యూమ్స్ ని చాలా సెలెక్టివ్‌గా తీసుకున్నాం.
*‘శంబాల’ మూవీలోని వీఎఫ్ఎక్స్ గురించి చెప్పండి?*
‘శంబాల’ చిత్రంలో ఎక్కువ వీఎఫ్ఎక్స్ షాట్స్ ఉండవు. కానీ ఉన్న వాటిని మాత్రం చాలా జాగ్రత్తగా చేసుకున్నాం. ఆ అవుట్ పుట్ చూసి మేం అంతా సంతృప్తి చెందాం. శ్రీ చరణ్ పాకాల ఆర్ఆర్ చూసి అందరం షాక్ అయ్యాం. ఆయన ఎక్కడా కూడా ఓ పట్టాన సంతృప్తి చెందరు. చివరి క్షణం వరకు థీమ్స్ చేస్తూనే వచ్చారు. ప్రతీ ఒక్క పాత్రకి ఆయన అద్భుతమైన థీమ్ సెట్ చేశారు.
‘శంబాల’ మ్యూజిక్ గురించి చెప్పండి?*
‘శంబాల’లో సాంగ్స్ ఎక్కువగా ఉండవు. ప్రమోషనల్ సాంగ్ అని అనుకున్నాం. కానీ మాకు అంత టైం సరిపోలేదు. అయినా ఇలాంటి జానర్ చిత్రాలకు హుక్ స్టెప్స్, సాంగ్స్ సెట్ అవ్వవేమో. కానీ ఈ సినిమాకు శ్రీ చరణ్ పాకాల ఇచ్చిన మ్యూజిక్ కంటే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోతోంది. ఆర్ఆర్‌తో ఈ మూవీ నెక్ట్స్ లెవెల్‌కు వెళ్లింది. సినిమా చూసిన తరువాత ప్రతీ ఒక్కరూ ఆర్ఆర్ గురించి మాట్లాడుకుంటారు.
మన పురాణాల్లోని ‘శంబాల’ గురించి మీకు తెలుసా?*
‘శంబాల’ అనేది ఉందా? లేదా? అనేది ఎవ్వరికీ తెలీదు. మన పురాణాల ప్రకారం శంబాలకి ఓ మంచి గుర్తింపు ఉంది. శంబాల అని టైటిల్ చెప్పినప్పుడే నేను చాలా ఎగ్జైట్ అయ్యాను. ఈ కథ విన్న కొన్ని రోజులకే ‘కల్కి’ రిలీజ్ అయింది. ఆ తరువాత శంబాల పేరు మరింత ఎక్కువగా ట్రెండ్ అయింది.
‘శంబాల’ చిత్రీకరణ సమయంలో గాయాలయ్యాయని విన్నాం?*
షూటింగ్‌లో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఏదో ఒక సందర్భంలో గాయాలు అవుతుంటాయి. ఫైర్‌తో ఓ సీక్వెన్స్ ఉన్నప్పుడు చిన్నగా గాయమైంది. పోరాట సన్నివేశాల్లో గాయాలు అనేవి కామన్.
ప్రస్తుతం ఆడియెన్స్ థియేటర్ కంటే ఓటీటీల్లోనే సినిమాలు ఎక్కువ చూస్తున్నారు కదా?*
ప్రస్తుతం ఆడియెన్స్‌కు అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్ కావాలి. ఇలాంటి జానర్‌లను ఆడియెన్స్ ఎక్కువగా ఇష్టపడుతున్నారు. మా టీం నుంచి వచ్చిన ప్రతీ పోస్టర్, ప్రతీ కంటెంట్ ప్రేక్షకుల్లో అంచనాల్ని పెంచేసింది. మా చిత్రానికి మంచి బజ్ అయితే ఏర్పడింది. మా నిర్మాతలు ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాకుండా భారీ ఎత్తున నిర్మించారు. మా ప్రమోషన్స్ అయితే ఆడియెన్స్‌ను ఆకట్టుకున్నాయి. ‘శంబాల’ లాంటి చిత్రాల్ని థియేటర్లో చూస్తేనే ఆ ఫీల్‌ను ఎంజాయ్ చేయగలుగుతారు.
అమ్మ గారు ఈవెంట్లో చెప్పిన డైలాగ్ బాగా వైరల్ అయింది కదా?*
నాకు, అమ్మకి మంచి బాండింగ్ ఉంటుంది. ఇంట్లో ఎప్పుడూ కూడా అలా డైలాగ్ చెప్పలేదు. కానీ ఆమె ఈవెంట్‌లో అలా డైలాగ్ చెప్పడం చూసి నేను కూడా షాక్ అయ్యాను.
‘శంబాల’ విషయంలో డైరెక్టర్ గారితో మీ జర్నీ ఎలా ఉంది?*
యుగంధర్‌కి సినిమా పట్ల చాలా ప్యాషన్ ఉంటుంది. యుగంధర్ గారి మొదటి చిత్రం నాకు చాలా ఇష్టం. ఈ కథ కోసం ఆయన చాలా కష్టపడ్డారు. చెప్పిన కథను తెరపై చూపించారు. ఆయన పెద్ద డైరెక్టర్ అవుతారు.
‘శంబాల’ విషయంలో నిర్మాతల సహకారం గురించి చెప్పండి?*
నిర్మాతలు ఎంతో ప్యాషన్‌తో ‘శంబాల’ని నిర్మించారు. మేం ఎక్కడా కూడా వేస్టేజ్ చేయకుండా సినిమాను తీశాం. నా మార్కెట్ కంటే ఎక్కువగానే ఖర్చు పెట్టారు. ప్రమోషన్స్ కూడా భారీ ఎత్తున నిర్వహించారు. ఈ డేట్‌కి చాలా కాంపిటీషన్ ఏర్పడింది. మేం సినిమాని కష్టపడి చేశాం. ఆల్రెడీ చిత్రాన్ని చూశాం. మేం సినిమా పట్ల చాలా సంతృప్తిగా ఉన్నాం. హిందీలోనూ మా మూవీని ప్లాన్ చేస్తున్నాం. అయితే ఇక్కడ ముందుగా రిలీజ్ చేస్తున్నాం. ఆ తరువాత హిందీలో విడుదల చేయబోతోన్నాం. ఇక్కడ పాజిటివ్ టాక్ వచ్చిన తరువాత అక్కడ ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తాం.
డిసెంబర్ 25కి చాలా కాంపిటీషన్ ఉంది కదా? వేరే డేట్ ఏదైనా మళ్లీ అనుకున్నారా?*
డిసెంబరర్ 25 డేట్‌ని వదులుకుంటే మళ్లీ ఇంత మంచి డేట్ నాకు దగ్గర్లో కనిపించలేదు. మేం ప్రీమియర్లతో ముందుకు వస్తున్నాం. ఇప్పటికే ప్రీమియర్లకు మంచి స్పందన వస్తోంది. ప్రీమియర్ల నుంచి పాజిటివ్ టాక్ బయటకు వెళ్తే.. డే వన్ నుంచే పికప్ అవుతుంది. కానీ ఈ డేట్‌కి టఫ్ కాంపిటీషన్ అయితే ఉంది.
‘శంబాల’లోని పాత్రకు మీ రియల్ లైఫ్ కారెక్టర్‌కు ఉన్న తేడా ఏంటి? మీకు మూఢ నమ్మకాలున్నాయా?*
నాకు మరీ పెద్దగా మూఢ నమ్మకాలు అయితే లేవు. చిన్న చిన్న వాటిని నమ్ముతాను. ఇంట్లో పాటించే సెంటిమెంట్స్‌ను మాత్రం నమ్ముతాను. 
‘శంబాల’ చిత్రీకరణలో ఎదురైన సవాళ్లు ఏంటి?*
‘శంబాల’ సినిమాను దాదాపు విపరీతమైన చలిలో నైట్ షూట్ చేశాం. క్లైమాక్స్ పార్ట్ మొత్తం నైట్ షూట్‌లోనే జరిగింది. ఎంత కష్టమైనా కూడా అందరం ఇష్టంతో కలిసి పని చేశాం.
‘శంబాల’ మూవీలోని కారెక్టర్స్ గురించి చెప్పండి?*
‘శంబాల’ చిత్రంలో అన్ని పాత్రలు బాగుంటాయి. అర్చన కారెక్టర్ నాతోనే ప్రయాణం చేస్తుంటుంది. ఆమె పాత్ర అందరినీ ఆకట్టుకుంటుంది.
‘శంబాల’ పార్ట్ 2 తీస్తారా?*
‘శంబాల’ని ఆడియెన్స్ హిట్ చేస్తే.. పార్ట్ 2 ప్లాన్ చేస్తాం (నవ్వుతూ)
తదుపరి చిత్రాల గురించి చెప్పండి?*
ప్రస్తుతం ఈటీవీ విన్‌కి సబ్ ఇన్ స్పెక్టర్ యుగంధర్ చేశాను. ఆ సినిమా చాలా బాగా వచ్చింది. త్వరలోనే ఆడియెన్స్ ముందుకు తీసుకు వస్తాం.

Hero Akhil Raj interview about horror thriller Movie ‘Eesha’

ఇటీవల లిటిల్‌హార్ట్స్‌, రాజు వెడ్స్‌ రాంబాయి లాంటి సూపర్‌హిట్‌ కల్ట్‌ చిత్రాలను ప్రేక్షకులకు అందించిన బన్నీవాస్‌, వంశీ నందిపాటి ద్వయం తాజాగా ‘ఈషా’ పేరుతో ఓహారర్‌ థ్రిల్లర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకరాబోతున్నారు.  వంశీ నందిపాటి ఎంటర్ టైన్ మెంట్స్, బన్నీ వాస్ వర్క్స్ బ్యానర్స్ పై వంశీ నందిపాటి, బన్నీ వాస్ గ్రాండ్‌గా ఈ చిత్రాన్నిడిసెంబరు 25న చిత్రాన్ని  థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నారు. ఇటీవల రాజు వెడ్స్‌ రాంబాయి చిత్రంతో సూపర్‌హిట్‌ కొట్టిన అఖిల్‌రాజ్‌తో పాటు త్రిగుణ్‌ హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రంలో హెబ్బాపటేల్‌ కథానాయిక.  సిరి హనుమంతు, బబ్లూ, పృథ్వీరాజ్‌ ఇతర ముఖ్యపాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని హెచ్‌వీఆర్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై ప్రముఖ నిర్మాత  కేఎల్‌ దామోదర ప్రసాద్‌ సమర్పణలో హేమ వెంకటేశ్వరరావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీనివాస్‌ మన్నె దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం  ఈ నెల 25న చిత్రం విడుదల కానుంది. ఈ నేపథ్యంలో హీరో అఖిల్‌ రాజ్‌ మంగళవారం విలేకరులతో మాట్లాడారు. ఆ విశేషాలివి.

రాజు వెడ్స్‌ రాంబాయి సక్సెస్‌ తరువాత కొంత గ్యాప్‌లోనే  ఈషా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు?
అనుకోకుండా ఈసినిమా విడుదల డేట్‌ కుదిరింది. రాజు వెడ్స్‌ రాంబాయి కంటే ముందు ఒప్పుకున్న సినిమా ఇది. అడిషన్‌ ఇచ్చి సెలెక్ట్‌ అయిన సినిమా ఇది. దర్శకుడు ‘ఈషా’ శ్రీనివాస్‌ రాగా గారు నన్నుఎంపిక చేసుకున్నారు. ప్రేక్షకులు ఈ సినిమాను కూడా ఆదరిస్తారని నమ్మకం ఉంది.  

ఈషా కథ వినగానే మీకు ఎలా అనిపించింది?
ఈ కథ చెప్పగానే ఎంతో షాకింగ్‌గా అనిపించింది. నేను ఎంతో ఎంగేజ్‌ అయ్యాను. తప్పకుండా హారర్‌ థ్రిల్లర్‌ సినిమాలు చూస్తే వారికి కొత్త అనుభూతినిస్తుంది. సినిమాలో ట్విస్టులు, సౌండ్‌ డిజైనింగ్‌ సూపర్భ్‌. థియేట్రికల్‌ ఎక్స్‌పీరియన్ష్‌ ఇచ్చే సినిమా ఇది. ఈ సినిమా లైట్‌ ప్యాట్రాన్‌, విజువల్స్‌, సౌండ్‌ డిజైనింగ్‌ బాగుంటుంది. సినిమా కొత్త ఎక్స్‌పీరియన్స్‌ ఇస్తుంది.

కథ వినగానే మీరు ఉలిక్కిపడ్డారా?
కథ చెప్పినప్పుడు నేను కూడా ఉలిక్కి పడ్డాను. ట్రైలర్‌ చూసినప్పుడు కూడా అదే ఫిలింగ్‌. లిటిల్‌హార్ట్స్‌, రాజు వెడ్స్‌ రాంబాయి సినిమాను విడుదల చేసిన వంశీ నందిపాటి, బన్నీవాస్‌ ఆ సినిమా విషయాల్లో ఎలా సక్సెస్‌ అయ్యారో. ఈసినిమా విషయంలో కూడా అంతే సక్సెస్‌ అవుతారని నమ్ముతున్నాను. తప్పకుండా అందర్ని భయపెట్టే సినిమా ఇది.

ఈ సినిమాలో మీ పాత్ర ఎలా ఉంటుంది?
వినయ్‌ అనే పాత్రను చేస్తున్నాను. నలుగురు చిన్నప్పటి స్నేహితుల్లో నేను ఒకర్ని. త్రిగుణ్‌, సిరి, హెబ్బా పటేల్‌, మైమ్‌ మధు వంటి మంచి నటులతో తో కలిసి నటించడం సంతోషంగా ఉంది. ఈ సినిమా నుంచి చాలా నేర్చుకున్నాను. దర్శకుడు శ్రీనివాస్‌ రాగా నుంచి కూడా చాలా నేర్చుకున్నాను.

ఈ సినిమాకు ఎలాంటి హోమ్‌వర్క్‌ చేశారు.
ప్రతి ప్రాజెక్టును ఓన్‌ చేసుకోని చేస్తాను. ఈ సినిమా పట్ల కూడా అంతే నమ్మకంతో ఉన్నాను. నా వైపు నుంచి ఉన్న ప్రమోపన్ష్‌ కూడా చేస్తాను.
లితం ఆశించకుండా కష్టపడాలి. యూనివర్శ్‌ మనకు కావాలిసిన ఫలితం ఇస్తుంది. కంటెంట్‌ బాగున్న సినిమాను ఎవరూ ఆపలేరు.

అన్‌సెట్స్‌లో మీకు ఈ సినిమా షూటింగ్‌ జరుగుతున్నప్పుడు ఏమైనా సంఘటనలు జరిగాయా?
అరకులో షూటింగ్‌ పూర్తయిన తరువాత ఓ పురుగు కుట్టి ఫీవర్‌ వచ్చింది. ఆ తరువాత నెల రోజులు జ్వరం వచ్చింది. అంతే తప్ప ఇంకే మీ అనుకోని సంఘటనలు జరగలేదు.

హారర్‌ సినిమాలకు నేపథ్య సంగీతం ఎంతో ముఖ్యం ఈ సినిమా ఎలా ఉండబోతుంది?
సౌండ్‌ డిజైనింగ్‌ భయంకరంగా ఉంటుంది. అందరూ భయపడే విధంగా ఉంటుంది. నిజంగా హార్ట్ వీక్‌గా ఉన్నవాళ్లు ఈ సినిమాను చూడలేరేమో

హారర్‌ సినిమాను ఒప్పుకోవడానికి రీజన్‌ ఏమిటి?
వెర్సెటైల్‌ యాక్టర్‌గా అనిపించుకోకుడం నాకు ఇష్టం. ఇన్ని రోజులు  రాజు అనే పాత్రలో ఉన్నాను. ఇక ఆ పాత్ర నుంచి వినయ్‌ రోల్‌లో త్వరలో కనిపిస్తాను. ఈ పాత్రకు  ఎలాంటి రెస్పాన్స్‌ వస్తుందో చూడాలి. కంప్లీట్‌ డిఫరెంట్‌ రోల్స్‌.. హారర్‌ అంటే ఇమేజినేషన్‌ కేటగిరి. పర్‌ఫార్మెన్స్‌కు స్కోప్‌ ఎక్కువగా ఉంటుంది. సఖియా అనే వెబ్‌సీరిస్‌ సంబంధించి గ్లింప్స్‌ చూసి దర్శకుడు నన్ను ఎంపిక చేసుకున్నాడు.నాకు ఈ సినిమాతో ఓ గుర్తింపు వస్తుందనే నమ్మకం ఉంది, అందుకే ఈ సినిమాను ఒప్పుకున్నాను.

రాజు వెడ్స్‌ రాంబాయి సక్సెస్‌ మీ లైఫ్‌ను ఎలా మార్చింది?

నాలైఫ్‌ను చాలా మార్చింది. ఎప్పటికి ఆ సినిమాకు, ఆసినిమా టీమ్‌కు రుణపడి ఉంటాను. నాకు ఓ ఫేస్‌ను ఇచ్చింది. అఖిల్‌రాజ్‌కు గుర్తింపు ఇచ్చింది. ఇది నాకెరీర్‌లో స్పెషల్‌ ప్రాజెక్ట్‌.

మీకు దెయ్యాలు ఆత్మలంటే భయము ఉండేదా?
చిన్నప్పుడు  నుంచి నాకు భయం ఉండేది. ఏజ్‌ పెరుగుతున్న కొద్ది ఆ భయం పోయింది. నైట్‌ టైమ్‌ సుసుకు వెళ్లిన భయపడేవాడ్ని. ఇప్పుడు ఆ భయమే లేదు.

దర్శకుడు శ్రీనివాస్‌ మన్నె గురించి?

సినిమా పట్ల కన్వెషన్‌, క్లారిటి ఉన్న దర్శకుడు. థ్రిలింగ్‌ ఎలిమెంట్స్‌ విషయంలో ఆయన చాలా స్ట్రాంగ్‌. ఇది తప్పకుండా విజయవంతం అవుతుందని అనుకుంటున్నాను.

ప్రస్తుతం చేస్తున్న సినిమాలు?
నాలుగైదు ప్రాజెక్టులు చర్చల దశలో ఉన్నాయి. అన్‌సెట్స్‌లో తరుణ్‌భాస్కర్‌, అనుపమతో కలిసి ఓ సినిమా చేస్తున్నాను. భద్రి దర్శకుడు. రాజు వెడ్స్ రాంబాయి తరువాత చేస్తున్న సినిమా ఇది.

Asia’s first real-life, multi-theme adventure destination ‘Magic District’ Adventure Destination Launched at AMB Sarath City Capital Mall

కొండాపూర్ లోని AMB మాల్‌లోని శరత్ సిటీ క్యాపిటల్ మాల్‌లో ఆసియాలోనే మొట్టమొదటి రియల్-లైఫ్ మల్టీ-థీమ్ అడ్వెంచర్ డెస్టినేషన్ ‘మ్యాజిక్ డిస్ట్రిక్ట్’ (Magic District) ప్రారంభమైంది. ఈ అడ్వెంచర్ జోన్ విశేషాలపై మీడియా సమావేశంలో నిర్వాహకులు తెలిపారు.

AMB మాల్‌లోని 6వ అంతస్తులో సుమారు 38,000 చదరపు అడుగుల భారీ విస్తీర్ణంలో దీనిని ఏర్పాటు చేశారు. ఇది కేవలం చూసే వినోదం మాత్రమే కాదు, సందర్శకులు స్వయంగా కథలో పాత్రధారులుగా మారి నడుస్తూ సాహసాలను అనుభవించే సరికొత్త ఫార్మాట్.

నేషనల్ అవార్డు గ్రహీత, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ హోల్డర్ తవ్వ శ్రీనివాస్ ఈ ‘మ్యాజిక్ డిస్ట్రిక్ట్‌’కు రూపకల్పన చేశారు. భారతీయుల మేధస్సు, సృజనాత్మకతను ప్రపంచానికి చాటిచెప్పడమే మా లక్ష్యం” అని ఆయన పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా మరో 27 విభిన్న కాన్సెప్టులను తీసుకురావాలని ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారు.

 ‘మ్యాజిక్ డిస్ట్రిక్ట్’ సృష్టికర్త నేషనల్ అవార్డు గ్రహీత, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ హోల్డర్ తవ్వ శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఈ రంగంలో మాకు 25 ఏళ్ల అనుభవం ఉంది. ఇండియాలో మరెక్కడ లేనివిధంగా ప్రపంచస్థాయి సాహసాల అనుభవాలను హైదరాబాద్ ప్రజలకు మేము అందించేందుకు AMB మాల్‌లోని 6వ అంతస్తులో అడ్వెంచర్ డెస్టినేషన్ ‘మ్యాజిక్ డిస్ట్రిక్ట్’ను 38,000 చదరపు అడుగుల భారీ విస్తీర్ణంలో ఏర్పాటు చేశాం. భారతీయ ప్రజలకు సరికొత్త సాహసాలను పరిచయం చేసేందుకు మా కూతురు, ఆపరేషన్ మేనేజర్ చందన లిపి అమెరికాలో జాబ్ వదిలేసి వచ్చింది. ఈ ఫేస్ 1 ఇప్పుడు ప్రారంభించాము.” అని అన్నారు.

ఆపరేషన్ డైరెక్టర్ చందన లిపి మాట్లాడుతూ… మొదటి దశలో నాలుగు సాహస ప్రపంచాలను అందుబాటులోకి తీసుకొచ్చాము. ప్రస్తుతం అందుబాటులో 4 రకాల సాహసాల్లో… జోంబీ సిటీ (Zombie City), స్కేరీ ఎస్కేప్స్ (Scary Escapes), స్కేరీ హౌస్ (Scary House), బూ బూ హౌస్ (Boo Boo House) ఉన్నాయి.” అని అన్నారు.

నిర్వాహకుల్లో ఒకరైన కే రాజ్ కుమార్ మాట్లాడుతూ.. మేము ఏర్పాటు చేసిన సరి కొత్త కాన్సెఫ్ట్ లు ఏర్పాటు చేశాం. రెస్పాన్స్ భారీగా వస్తోంది.” అని చెప్పారు.

 మొత్తం ఏడు విభిన్న థీమ్‌లను ప్లాన్ చేయగా, ప్రస్తుతం మొదటి దశలో నాలుగు సాహస ప్రపంచాలను అందుబాటులోకి తెచ్చారు.
ప్రస్తుతం అందుబాటులో ఉన్న నాలుగు రకాల సాహసాలను చూస్తే…
 * జోంబీ సిటీ (Zombie City): జోంబీలు ఆక్రమించిన నగరం నుంచి ప్రాణాలతో బయటపడటం ఈ అడ్వెంచర్ ముఖ్య ఉద్దేశ్యం.
 * స్కేరీ ఎస్కేప్స్ (Scary Escapes): భయంకరమైన వాతావరణంలో చిక్కుకున్నప్పుడు క్లూస్‌ని వెతికి, పజిల్స్ సాల్వ్ చేస్తూ టీమ్ వర్క్‌తో తప్పించుకోవాలి.
 * స్కేరీ హౌస్ (Scary House): హార్డ్‌కోర్ హారర్ అనుభవాన్ని కోరుకునే వారి కోసం లైవ్ ఇంటరాక్షన్లు, భయంకరమైన సౌండ్ ఎఫెక్ట్స్‌తో దీనిని రూపొందించారు.
 * బూ బూ హౌస్ (Boo Boo House): ఇది ప్రత్యేకంగా పిల్లల కోసం రూపొందించబడింది. పిల్లల్లో ధైర్యాన్ని పెంచుతూ, నవ్వుతూ ఆడుకునేలా ఇక్కడ స్పూకీ థీమ్స్ ఉంటాయి.

కుటుంబ సభ్యులు, విద్యార్థులు, పర్యాటకులు అందరికీ ఒక మరపురాని అనుభవాన్ని అందించేలా మ్యాజిక్ డిస్ట్రిక్ట్ సిద్ధంగా ఉంది.

indian Animated Film Mission Santa Set for Global Release on December 25  

The animated feature film Mission Santa, crafted to international standards, is set to release in theatres worldwide as a special Christmas offering on December 25. This high-energy animated adventure film, developed with a family-friendly narrative, will premiere simultaneously in India, France, Germany, and several other countries, including major cities across the two Telugu-speaking states.

Following the recent success of the animated film Narasimha Avatar, which gained notable appreciation across India and in the Telugu states, Mission Santa marks the arrival of another major animated feature. The film promises an exceptional viewing experience with its quality animation, emotional depth, entertainment value, and adventurous storytelling.

Producers claim that the film will appeal to audiences of all age groups, especially children, parents, and grandparents, positioning it as a full-fledged family entertainer. According to the makers, the film’s standout features include stunning visual effects, a fast-paced narrative, touching emotional elements, thrilling adventures, and characters defined by courage and conviction.

Mission Santa is projected to become a significant milestone for the Indian animation industry. The story, script, and character design were developed in Los Angeles, while the full animation production was executed in India under the supervision of senior Indian animation experts. Over 150 Indian animation professionals worked on the film for approximately 20 months.

Produced by Broadvision India and Studio56, this project was undertaken with the aim of elevating Indian animation from a service-oriented sector to a globally recognized creative and commercial force. Releasing in English, the film is expected to deliver a premium animated theatrical experience to audiences.

Star hero Vijay Deverakonda’s highly anticipated film ‘Rowdy Janardhana’ Title Glimpse Released held grandly

స్టార్ హీరో విజయ్ దేవరకొండ ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ లో నటిస్తున్న క్రేజీ మూవీ “రౌడీ జనార్థన”. స్టార్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. టాలెంటెడ్ యంగ్ డైరెక్టర్ రవి కిరణ్ కోలా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. రూరల్ యాక్షన్ డ్రామా నేపథ్యంతో భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా “రౌడీ జనార్థన” సినిమా రూపొందుతోంది. ఈ సినిమా టైటిల్ గ్లింప్స్ ను ఈ రోజు హైదరాబాద్ లో విజయ్ దేవరకొండ అభిమానుల కేరింతల మధ్య గ్రాండ్ గా రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో

ప్రొడక్షన్ డిజైనర్ డినో శంకర్ మాట్లాడుతూ – డైరెక్టర్ రవికిరణ్ ఈ సినిమా కోసం నన్ను అప్రోచ్ అయ్యాడు. ఆయనను మొదటిసారి కలిసినప్పుడే ఎంత పెద్ద విజన్ తో ఉన్నాడు అనేది అర్థమైంది. ఇప్పుడు మీరు చూసిన టైటిల్ గ్లింప్స్ చిన్న శాంపిల్ మాత్రమే. ఇంకా ఎగ్జైటింగ్ కంటెంట్ రాబోతోంది. మీ లవ్ అండ్ సపోర్ట్ ఇలాగే కంటిన్యూ చేస్తారని కోరుకుంటున్నాం. అన్నారు.

డీవోపీ ఆనంద్ సి చంద్రన్ మాట్లాడుతూ – రౌడీ ఫ్యామిలీ అందరికీ హాయ్. మీకు రౌడీ జనార్థన టైటిల్ గ్లింప్స్ నచ్చిందని నమ్ముతున్నాను. ఈ మూవీ నుంచి ఇంకా చాలా సర్ ప్రైజింగ్ కంటెంట్ రాబోతోంది. త్వరలోనే ఆ కంటెంట్ మీ ముందుకు తీసుకొస్తాం. అన్నారు.

డైరెక్టర్ రవికిరణ్ కోలా మాట్లాడుతూ – మీ అందరి లాగే నేను కూడా విజయ్ దేవరకొండ అభిమానిని. నేను అభిమానించే కీర్తి సురేష్, రాజు గారు వంటి వారితో కలిసి ఈ సినిమా చేస్తున్నాను. రౌడీ జనార్థన టైటిల్ మీకు నచ్చిందని అనుకుంటున్నా. రౌడీ జనార్థన ఎలా ఉంటాడో పరిచయం చేసి ఆ తర్వాత టైటిల్ రివీల్ చేయాలని అనుకున్నాం. కానీ టైటిల్ మీకు తెలిసిపోయింది. సినిమా అనుకున్నది అనుకున్నట్లుగా వస్తోంది. అందుకు మా టీమ్ మెంబర్స్ చాలా కష్టపడుతున్నారు. ఇకపై మా మూవీ నుంచి రిలీజ్ చేసే కంటెంట్ కూడా మీకు నచ్చుతుందని ఆశిస్తున్నా. ఈ కథ చెప్పిన కొద్దిసేపటికే  విజయ్ ఆ క్యారెక్టర్ లా మాట్లాడటం, చెప్పే సీన్ కు రౌడీ జనార్థనలా రియాక్ట్  అవడం మొదలుపెట్టాడు. ఇన్ స్టంట్ గా క్యారెక్టర్ ను ఓన్ చేసుకున్నాడు. నాకు ఎంకరేజింగ్ గా అనిపించి మిగతా స్క్రిప్ట్ ను ఉత్సాహంగా చెప్పేశాను. ఆ తర్వాత మేము చాలాసేపు మాట్లాడుకున్నాం. అలా ఈ ప్రాజెక్ట్ ఓకే అయ్యింది. వర్క్ షాప్స్ అన్నీ చేసి ఫస్ట్ డే షూట్ కోసం సెట్ రెడీ చేస్తున్నాం. 8 నిమిషాల లాంగ్ సీన్ చేయాలి. ఆ ముందు రోజే విజయ్ సెట్ లోకి వచ్చి ఆ డైలాగ్స్ మొత్తం చెప్పేస్తున్నాడు. అప్పుడు చాలా కాన్ఫిడెంట్ గా అనిపించింది. ఈస్ట్ గోదావరి యాసలో విజయ్ గారు చాలా ఆక్యురేట్ గా డైలాగ్స్ చెబుతున్నారు. నేను ఆ ఏరియాలో పుట్టి పెరిగిన వాడిని కాబట్టి సరిగ్గా మాట్లాడుతున్నారా లేదా అనేది తెలిసిపోతుంది. విజయ్ ఆ యాసలో మాట్లాడటం మేమంతా ఎంజాయ్ చేస్తున్నాం. కథ ఎంత బాగుందో, ఈస్ట్ గోదావరి యాసలో విజయ్ మాట్లాడటం అనేది కూడా అంతే బాగుందని రాజు గారు అనేవారు. అలాగే ఈ యాసలో డైలాగ్స్ ఫ్లేవర్ అలాగే రావాలని విజయ్, రాజు గారు పర్టిక్యులర్ గా ఉండేవారు. అన్నారు.

ప్రొడ్యూసర్ దిల్ రాజు మాట్లాడుతూ – రౌడీ జనార్థన టైటిల్ గ్లింప్స్ మీకు చూపించేందుకు రవి కిరణ్ కొద్ది రోజులుగా తన టీమ్ తో వర్క్ చేస్తూ వచ్చాడు. మూడు రోజుల క్రితం ఈ సినిమాను ఎలా చూపించబోతున్నాం అనేది చిన్న స్టోరీ రివీల్ చేశాడు. విజయ్ దేవరకొండ డిఫరెంట్ డిఫరెంట్ మూవీస్ చేస్తూ వచ్చాడు కానీ తొలిసారిగా ఈ మూవీలో ఆంధ్రలోని ఈస్ట్ గోదావరి యాసలో మాట్లాడిస్తున్నాం. విజయ్ ఈస్ట్ గోదావరి యాసలో మాట్లాడటం ఈ స్టోరీ విన్నప్పుడు నాకు యూనిక్ గా అనిపించింది. విజయ్ పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీత గోవిందం వంటి యూత్ ఫుల్ మూవీస్ చేశాడు. కానీ ఇప్పటిదాకా ఇంత మాస్, బ్లడ్ షెడ్ ఉన్న క్యారెక్టర్ చేయలేదు. ఔట్ అండ్ ఔట్ మాస్ క్యారెక్టర్ లో విజయ్ కనిపించబోతున్నాడు. 80 దశకం బ్యాక్ డ్రాప్ లోని వరల్డ్ ను ఈ సూపర్బ్ టెక్నీషియన్స్ అంతా క్రియేట్ చేశారు. రవికిరణ్ విజన్ లోని కొత్తదనాన్ని తీసుకొచ్చేందుకు ఈ టీమ్ అంతా కష్టపడుతున్నారు. ఆ కష్టాన్ని మేము ఎంకరేజ్ చేస్తుంటే ఇలాంటి మంచి గ్లింప్స్ మీ ముందుకు వచ్చింది.  సినిమా కూడా అలా వచ్చేవరకు రవి కష్టపడి చేయించుకుంటాడని నమ్మకం ఉంది. రాజా వారు రాణి గారు అనే చిన్న సినిమా చేసి ఇండస్ట్రీని, ప్రేక్షకుల్ని తన వైపు తిప్పుకోగలిగాడు. రెండో సినిమాకు మంచి స్క్రిప్ట్ అందించాడు. ఇప్పుడు మూడో సినిమాకు రౌడీ జనార్థనతో పెద్ద బాధ్యత పెట్టుకున్నాడు. మీ అందరినీ అలరించేందుకు నెక్ట్స్ ఇయర్ రిలీజ్ కు మూవీని తీసుకొస్తాం.  

నటీనటులు – విజయ్ దేవరకొండ, కీర్తి సురేష్, తదితరులు

టెక్నికల్ టీమ్
————————
ప్రొడక్షన్ డిజైనర్ – డినో శంకర్
డీవోపీ – ఆనంద్ సి చంద్రన్
బ్యానర్ – శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
ప్రొడ్యూసర్స్ – దిల్ రాజు,  శిరీష్
పీఆర్ఓ – జీఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్)
స్టోరీ డైరెక్షన్ – రవికిరణ్ కోలా

superstar Mohanlal’s “Vrusshabha” Pre-release event held grandly, Movie releasing on Dec 25

మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ నటిస్తున్న ప్రెస్జీజియస్ మూవీ “వృష‌భ‌”. ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని ఈ నెల 25న గీతా ఫిలిం డిస్ట్రిబ్యూషన్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకొస్తోంది. “వృష‌భ‌” చిత్రాన్ని కన్నెక్ట్ మీడియా, బాలాజీ టెలిఫిల్మ్స్, అభిషేక్ ఎస్ వ్యాస్ స్టూడియోస్ బ్యానర్లపై శోభా కపూర్, ఏక్తా ఆర్ కపూర్, సి.కె. పద్మ కుమార్, వరుణ్ మాథుర్, సౌరభ్ మిశ్రా, అభిషేక్ ఎస్ వ్యాస్, ప్రవీర్ సింగ్, విశాల్ గుర్నాని, జూహి పరేఖ్ మెహతా నిర్మిస్తున్నారు. విమ‌ల్ ల‌హోటి స‌హ నిర్మాత‌గా వ్యవహరిస్తున్న “వృష‌భ‌” సినిమాను  దర్శకుడు నందకిషోర్ మ‌ల‌యాళం, తెలుగులో రూపొందించారు. ఈ రోజు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో గ్రాండ్ గా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో

నటుడు బలగం సంజయ్ మాట్లాడుతూ – ఏడాది కిందట “వృష‌భ‌” సినిమా షూటింగ్ చేశాం. షూటింగ్ మొత్తం ముంబైలో జరిగింది. మోహన్ లాల్ గారితో కలిసి నటించడం మర్చిపోలేను. ఆయనకు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ దక్కడం సంతోషంగా ఉంది. ఈ సినిమా నాకు చాలా స్పెషల్ మూవీ. ఇలాంటి ప్రెస్టీజియస్ మూవీలో నటించడం అదృష్టంగా భావిస్తున్నా. సమర్జిత్ తో నా ఫైట్స్ కు మంచి గుర్తింపు వస్తుంది. ఈ సినిమా గ్రాండియర్, సీజీ వర్క్ మిమ్మల్ని ఆకట్టుకుంటాయి. అన్నారు.

హీరోయిన్ నయన్ సారిక మాట్లాడుతూ – “వృష‌భ‌” ఒక పవర్ ఫుల్ సినిమా. ఈ సినిమాలో నెక్ట్స్ ఏం జరుగుతుంది అనేది ఊహించలేరు. సినిమా ప్రారంభం నుంచి చివరి దాకా ఆసక్తిగా చూసేలా ఉంటుంది. ఈ సినిమా క్లైమాక్స్ మైండ్ బ్లోయింగ్ గా ఉంటుంది. మోహన్ లాల్ గారి లాంటి లెజెండరీ యాక్టర్ తో కలిసి నటించడం సంతోషంగా ఉంది. ఈ సినిమాతో నేను మలయాళ ఇండస్ట్రీకి పరిచయమవుతున్నాను. ఇంత భారీ చిత్రంతో నేను మలయాళంలో అడుగుపెడతానని అనుకోలేదు. ఈ సినిమాలో పాత్రకు మంచి ఇంపార్టెన్స్ ఉంటుంది. నా క్యారెక్టరే కాదు కథలోని ప్రతి పాత్ర కీలకంగా ఉంటుంది. నందకిషోర్ గారు కథను అలా రాసుకున్నారు. కన్నెక్ట్ మీడియా, బాలాజీ టెలిఫిల్మ్స్, ఎస్ వీ స్టూడియోస్ వంటి బ్యానర్స్ లో నటించడం గర్వంగా ఉంది. గీతా ఆర్ట్స్ నా హోమ్ బ్యానర్. ఆయ్ సినిమాతో నాకు ఫస్ట్ హిట్ ఇచ్చింది ఈ సంస్థ. ఈ సంస్థ ద్వారా మా “వృష‌భ‌” సినిమా రిలీజ్ అవుతోంది. ఈ చిత్రం నా కెరీర్ కు మరో విజయాన్ని అందిస్తుందని నమ్ముతున్నాను. ఈ నెల 25న మా “వృష‌భ‌” సినిమాను థియేటర్స్ లో చూడండి. అన్నారు.

నటుడు అలీ మాట్లాడుతూ – ఈ చిత్ర దర్శకుడు నందకిషోర్ కన్నడలో చేసిన ప్రతి సినిమా హిట్టే. పొగరు, కరెంట్ తీగ వంటి చిత్రాలు ఆయనవే. ఈ సినిమాను ఎంతో కష్టపడి నందకిషోర్ రూపొందించారు. ఎలాంటి గర్వం లేని దర్శకుడు నందకిషోర్. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ గారు ఈ సినిమాలో నటిస్తే, తెలుగు ప్రొడ్యూసర్స్ లో సూపర్ స్టార్ అయిన అల్లు అరవింద్ గారు “వృష‌భ‌” సినిమాను రిలీజ్ చేస్తున్నారు. అలాగే బన్నీ వాస్ గారిది లక్కీ హ్యాండ్. హీరో సమర్జిత్ టాలెంటెడ్ యాక్టర్. బాలాజీ టెలిఫిలింస్ జితేందర్ గారితో నేను తోఫా అనే మూవీతో పాటు మొత్తం 3 చిత్రాలు చేశాను. ఇప్పుడు ఈ సినిమాలో నటించాను. ఈ నెల 25న రిలీజ్ అవుతున్న  “వృష‌భ‌” సినిమా మంచి వి జయం సాధించాలని, టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెబుతున్నా. అన్నారు.

హీరో సమర్జీత్ లంకేష్ మాట్లాడుతూ – “వృష‌భ‌” బిగ్గెస్ట్ యాక్షన్ ఫిలిం. అలాగే లవ్, ఫాదర్ సన్ మధ్య ఎమోషన్ కూడా చాలా  ఉంటుంది. మోహన్ లాల్ గారితో నటించేప్పుడు మొదట భయం వేసింది. ఆయనే నన్ను ఎంకరేజ్ చేసి నటించేలా చేశారు. ఈ సినిమాతో తెలుగు ఆడియెన్స్ కు పరిచయం కావడం సంతోషంగా ఉంది. అలీ గారితో సెట్ లో ఫన్ గా ఉండేది. ఆయన మంచి బిర్యానీ తీసుకొచ్చేవారు. గీతా ఆర్ట్స్ తో మా “వృష‌భ‌” సినిమా రిలీజ్ అవుతోంది. అరవింద్ గారికి, బన్నీ వాస్ గారికి థ్యాంక్స్ చెబుతున్నా. ఈ నెల 25న మా చిత్రాన్ని చూసి సపోర్ట్ చేయాలని కోరుతున్నా. అన్నారు.

ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్ బన్నీ వాస్ మాట్లాడుతూ –  భారీ బడ్జెట్ ఖర్చు పెట్టి “వృష‌భ‌” సినిమాను నిర్మించారు. ఈ సినిమా విజువల్స్ గ్రాండ్ గా ఉంటాయి. కింగ్ ఎపిసోడ్ వచ్చినప్పటి నుంచి సినిమా మరో స్థాయికి వెళ్తుంది. ఫైట్స్, ఎమోషనల్ కంటెంట్ కూడా బాగుంటుంది. సామ్ సీఎస్ గారు మంచి మ్యూజిక్ ఇచ్చారు. నేను దాదాపు 45 నిమిషాల పుటేజ్ చూశాను. సమర్జిత్ లో ఈజ్ ఉంది. అతను కన్నడలో పెద్ద స్టార్ అవుతాడు. నయన్ ఆయ్, క సినిమాల తర్వాత వృషభతో హ్యాట్రిక్ అందుకోవాలి. మోహన్ లాల్ గారు అంటే మనందరికీ గౌరవం. ఆయన ఈ సినిమాను రిలీజ్ చేసే అవకాశం మాకు ఇచ్చినందుకు సంతోషంగా ఉంది. ఈ సినిమాలో అన్ని భాషల నటీనటులు ఉన్నారు. డైరెక్టర్ నందకిషోర్ గారు టాలెంటెడ్ టెక్నీషియన్. ఆయన మేకింగ్ ఎంత గ్రాండ్ గా ఉంటుందో ఈ సినిమాలో చూస్తారు. ఈ 25న ఏడు సినిమాలు రిలీజ్ కు వస్తున్నాయి. అన్ని మూవీస్ కు మంచి బజ్ క్రియేట్ అయ్యింది. 25 నుంచి మళ్లీ సంక్రాంతి హాలీడేస్ వరకు సినిమా ఇండస్ట్రీకి మంచి సీజన్ అని చెప్పొచ్చు. హాలీడేస్ ఉన్నాయి. అన్ని సినిమాలు ఆదరణ పొందాలని కోరుకుంటున్నా. “వృష‌భ‌” సినిమాను రెండు నెలల క్రితమే రిలీజ్ చేయాలి. అనివార్య కారణాలతో పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. ఇది డబ్బింగ్ మూవీ కాదు. అన్ని భాషల్లో పాన్ ఇండియా చిత్రంగా రూపొందించారు. తెలుగులో కూడా మూవీ షూట్ చేశారు. ముందుగానే  చేసుకున్న ఒప్పందం ప్రకారం మేము ఈ సినిమాను ఈ కాంపిటీషన్ లో రిలీజ్ చేయాల్సివస్తోంది. చిన్న సినిమాకు టికెట్ ప్రైస్ రూ. 99 పెడుతున్నాం కానీ మోహన్ లాల్ వంటి స్టార్ ఉన్నారు కాబట్టి ఈ సినిమాకు అలా చేయలేం. అన్నారు.

నటీనటులు –  మోహన్ లాల్, స‌మ‌ర్జీత్ లంకేష్‌, రాగిణి ద్వివేది, న‌య‌న్ సారిక‌, అజ‌య్‌, నేహా స‌క్సేనా, గ‌రుడ రామ్‌, విన‌య్ వ‌ర్మ‌, అలీ, అయ‌ప్ప పి.శ‌ర్మ‌, కిషోర్, తదితరులు

టెక్నికల్ టీమ్
——————  
ఎడిటింగ్ – కేఎమ్ ప్రకాష్
సినిమాటోగ్రఫీ – ఆంటోనీ సామ్ సన్
స్టంట్స్ – పీటర్ హెయిన్స్, స్టంట్ సిల్వ, నిఖిల్
సౌండ్ డిజైన్ – రసూల్ పూకుట్టి
డైలాగ్స్ -ఎస్ ఆర్ కే, జనార్థన మహర్షి, కార్తీక్
మ్యూజిక్ – సామ్ సీఎస్, అరియన్ మెహెదీ
రిలీజ్ – గీతా ఫిలిం డిస్ట్రిబ్యూషన్
పీఆర్ఓ – జీఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్)
బ్యానర్స్ – కన్నెక్ట్ మీడియా, బాలాజీ టెలిఫిల్మ్స్, అభిషేక్ ఎస్ వ్యాస్ స్టూడియోస్
ప్రొడ్యూసర్స్ – శోభా కపూర్, ఏక్తా ఆర్ కపూర్, సి.కె. పద్మ కుమార్, వరుణ్ మాథుర్, సౌరభ్ మిశ్రా, అభిషేక్ ఎస్ వ్యాస్, ప్రవీర్ సింగ్, విశాల్ గుర్నాని, జూహి పరేఖ్ మెహతా
కో ప్రొడ్యూసర్ – విమల్ లహోటి
డైరెక్టర్ – నందకిషోర్

Aadi experimented across genres and proven himself as a brilliant actor: Anil Ravipudi at the ‘Shambhala’ pre-release event

వెర్సటైల్ యాక్టర్ ఆది సాయి కుమార్ హీరోగా షైనింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై రాజశేఖర్ అన్నభిమోజు, మహీధర్ రెడ్డి నిర్మించిన చిత్రం ‘శంబాల’. యగంధర్ ముని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో అర్చన అయ్యర్, స్వసిక, రవివర్మ, మధునందన్, శివ కార్తీక్ తదితరులు కీలక పాత్రల్ని పోషించారు. ఈ సినిమాను డిసెంబర్ 25న భారీ ఎత్తున రిలీజ్ చేయబోతోన్నారు. ఈ సందర్భంగా ఆదివారం నాడు ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు మంచు మనోజ్, కిరణ్ అబ్బవరం, ప్రియదర్శి, తమన్, అనిల్ రావిపూడి, నవీన్ యెర్నెని, టీజీ విశ్వ ప్రసాద్, అశ్విన్ బాబు, మైత్రి శశి వంటి ప్రముఖులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో..
*కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ* .. ‘‘శంబాల’ మీద ముందు నుంచీ పాజిటివ్ వైబ్ ఉంది. యుగంధర్ ముని మంచి దర్శకుడు. శ్రీ చరణ్ పాకాల గారి ఆర్ఆర్, మ్యూజిక్ నాకు చాలా ఇష్టం. ‘ఎస్ఆర్ కళ్యాణమండపం’లో ధర్మ కారెక్టర్ కోసం సాయి కుమార్ గారి వద్దకు వెళ్లాను. ఆ టైంలో ఆయన మాకు చేసిన సపోర్ట్‌ని ఎప్పటికీ మర్చిపోలేను. ఇండస్ట్రీలో నాకు పరిచయమైన పెద్ద హీరో ఆయనే. సాయి కుమార్ గారి వల్లే నా కెరీర్ బాగుందని అనుకుంటూ ఉంటాను. ఇండస్ట్రీలోని ప్రతీ ఒక్కరి గురించి పాజిటివ్‌గానే మాట్లాడతారు. ప్రతీ ఒక్క సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటారు. ఆది అన్న ‘ప్రేమ కావాలి’ సినిమా టైంకి నేను ఇంటర్‌లో ఉన్నాను. హిట్లు కొట్టడం ఒకెత్తు అయితే.. ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం మరో ఎత్తు అని ఆది అన్నని చూస్తే అర్థమైంది. ‘శంబాల’ గురించి పాజిటివ్ టాక్ వింటున్నాను. ఈ సారి ఆది అన్నకి మంచి సక్సెస్ రావాలని అందరం కోరుకుంటున్నాం. డిసెంబర్ 25న ‘శంబాల’ని అందరూ చూడండి. కచ్చితంగా అందరికీ నచ్చుతుంది’ అని అన్నారు.
*మంచు మనోజ్ మాట్లాడుతూ* .. ‘‘శంబాల’ ట్రైలర్ బాగుంది. ఆదికి ఈ చిత్రంతో మంచి విజయం రావాలి. చిన్న సినిమా పెద్ద సినిమా అని ఉండదు.. మంచి చిత్రాల్ని ఆడియెన్స్ ఎప్పుడూ ఆదరిస్తూనే ఉంటారు. నిరంతరం కష్టపడుతూ ఉండే ఆదికి ఈ చిత్రంతో బ్లాక్ బస్టర్ రావాలి. యుగంధర్‌కి సినిమా పట్ల చాలా ప్యాషన్ ఉంది. కథను నమ్మి ఇంత ఖర్చు పెట్టిన నిర్మాతలకు హ్యాట్సాఫ్. ఈ చిత్రం పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. డిసెంబర్ 25న ఈ చిత్రాన్ని థియేటర్లోనే అందరూ చూడండి’ అని అన్నారు.
*ఆది సాయి కుమార్ మాట్లాడుతూ* .. ‘‘శంబాల’ ఈవెంట్‌కు వచ్చిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. నా ఈ ప్రయాణంలో మీడియా, ఆడియెన్స్ ఎప్పుడూ సపోర్ట్ చేస్తూనే వచ్చారు. గత ఏడాది డిసెంబర్‌లో ‘శంబాల’ ఫస్ట్ పోస్టర్‌ నుంచి అందరూ సపోర్ట్ చేస్తూ వచ్చారు. టీజర్‌ను దుల్కర్ గారు రిలీజ్ చేశారు. ప్రభాస్ గారు, నాని గారు రిలీజ్ చేసిన ట్రైలర్‌లు అంచనాల్ని పెంచేశాయి. యుగంధర్ ముని అద్భుతంగా తీశాడు కాబట్టే ఈ రోజు చిత్రంపై హైప్ ఏర్పడింది. దర్శక, నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ మూవీని రూపొందించారు. బడ్జెట్ ఎక్కువ అయినా కూడా నిర్మాతలు మహీధర్ గారు, రాజశేఖర్ గారు వెనుకాడలేదు. ప్రవీణ్ విజువల్స్, శ్రీచరణ్ ఆర్ఆర్ సినిమాకు ప్రధాన ఆకర్షణ అవుతుంది. ‘శంబాల’లో అందరూ అద్భుతంగా నటించారు. థియేటర్లో అందరూ మా మూవీని చూసి సర్ ప్రైజ్ అవుతారు. ఈ చిత్రాన్ని అందరూ థియేటర్లో చూస్తేనే ఆ ఫీల్‌‌ను ఎంజాయ్ చేస్తారు. నాకు సినిమా తప్పా ఇంకో ప్రపంచం తెలీదు. సాయి కుమార్ కొడుకుగా పుట్టడం నేను చేసుకున్న అదృష్టం. ఆయన కొడుకుని అని చెప్పుకోవడాన్ని గర్వంగా ఫీల్ అవుతాను. నేను హిట్టు కొట్టాలని ఆయన ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ‘శంబాల’తో మేం డిసెంబర్ 25న హిట్టు కొట్టబోతోన్నాం. క్రిస్మస్‌కి రిలీజ్ కాబోతోన్న అన్ని చిత్రాలు హిట్ అవ్వాల’ని అన్నారు.
*అనిల్ రావిపూడి మాట్లాడుతూ* .. ‘‘శంబాల’కి పని చేసిన ప్రతీ ఒక్కరికీ మంచి పేరు, సక్సెస్ రావాలని కోరుకుంటున్నాను. సాయి కుమార్ గారు నాకు ఫ్యామిలీ మెంబర్. ఆది నాకు బ్రదర్ లాంటి వాడు. ఆదికి ఎన్నో జానర్లను ట్రై చేశాడు. ఆది అద్భుతమైన నటుడు. ఈ చిత్రంతో ఆదికి మంచి విజయం దక్కాలి. ‘పటాస్’కి సాయి కుమార్ చేసిన సహకారాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను. ప్రతీ శుక్రవారం రిలీజ్ అయ్యే సినిమా గురించి సాయి కుమార్ గారు ఎంక్వైరీ చేస్తుంటారు. హిట్ అయితే సంతోషంగా చెబుతారు. ఫ్లాప్ అయితే బాధగా చెబుతారు. అలా చెప్పగలిగే గుణం చాలా తక్కువ మందిలో ఉంటుంది. డిసెంబర్ 25న ‘శంబాల’ బ్లాక్ బస్టర్ అన్న టాక్‌ను ఆయన విని సంతోషించాలి. ‘శంబాల’ మూవీని డిసెంబర్ 25న అందరూ చూసి సక్సెస్ చేయండి’ అని అన్నారు.
*సాయి కుమార్ మాట్లాడుతూ* .. ‘మా అమ్మానాన్న గార్లతో మొదలైన సినీ ప్రయాణం ప్రేక్షకుల ఆదరణతో ఇంకా కొనసాగుతోంది. 1975లో నేను హీరోగా పరిచయం అయ్యాను. 2011లో ‘ప్రేమ కావాలి’తో హీరోగా పరిచయం అయ్యారు. జయాపజయాలు అందరికీ సహజమే. కానీ ప్రయత్నం చేయడం మాత్రం ఎప్పుడూ ఆపలేదు. ‘శంబాల’తో ఆదికి విజయం దక్కబోతోంది. నిజంగానే మునిలా యుగంధర్ ఈ మూవీని రూపొందించారు. గత డిసెంబర్‌లో రిలీజ్ చేసిన పోస్టర్‌ నుంచి ఇప్పటి వరకు పాజిటివిటీ ఏర్పడుతూనే వచ్చింది. దుల్కర్, ప్రభాస్, నాని ఇలా అందరూ ‘శంబాల’కు సపోర్ట్ చేశారు. కంటెంట్ బాగుంటే ఆడియెన్స్ ఆదరిస్తారు. కిరణ్ అబ్బవరం, అనిల్ రావిపూడి, ప్రియదర్శి ఇలా అందరూ నాకు ఫ్యామిలీ లాంటివారు. జయాపజయాలతో సంబంధం లేకుండా మా కోసం నిలబడిన అభిమానులకు థాంక్స్. అభిమానుల పేరు, నా పేరుని ఈ సారి ఆది నిలబెడతారు. మైత్రి శశి గారు ఈ మూవీని చూసి హిట్ అవుతుందని చెప్పడంతో కాస్త ఉపశమనం కలిగించింది. ఓవర్సీస్‌లో భారీ ఎత్తున ఈ మూవీని రిలీజ్ చేయబోతోన్నారు. ‘శంబాల’ డిసెంబర్ 25న కచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుంది. ‘శంబాల’తో ఆదికి చిత్రోత్సాహం, నాకు పుత్రోత్సాహం, టీంకు విజయోత్సాహం రావాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
*తమన్ మాట్లాడుతూ* .. ‘సాయి కుమార్ గారు, ఆది మంచి మనసు చూసి ఈ రోజు ఇంత మంది ఇక్కడికి వచ్చారు. ఆది చాలా మంచి వ్యక్తి. ఆది ‘శంబాల’ గురించి ఎప్పుడూ చెబుతూనే ఉంటాడు. డిసెంబర్ 25న ఈ చిత్రం బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను. శ్రీ చరణ్ పాకాల ఆర్ఆర్ అదిరిపోయింది. ఈ రోజు ఇచ్చిన లైవ్ పర్ఫామెన్స్ అదరగొట్టేశాడు. దర్శక, నిర్మాతలు, శంబాల టీంకు ఆల్ ది బెస్ట్’ అని అన్నారు.
*అశ్విన్ బాబు మాట్లాడుతూ* .. ‘‘శంబాల’ ప్రమోషన్స్ చాలా యూనిక్‌గా, ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి. ఈ మూవీని చూడాలని ప్రేక్షకులంతా వెయిట్ చేస్తున్నారు. యుగంధర్ చెప్పిన కథను నమ్మి భారీగా ఖర్చు పెట్టి తీసిన నిర్మాతలకు కంగ్రాట్స్. ఈ చిత్రం మంచి విజయం సాధించబోతోంది. ఆది నాకు మంచి స్నేహితుడు. ఆది ఈ చిత్రం కోసం ప్రాణం పెట్టి నటించాడు. డిసెంబర్ 25న ఈ చిత్రం రిలీజ్ అయి బిగ్గెస్ట్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
*టీజీ విశ్వ ప్రసాద్ మాట్లాడుతూ* .. ‘‘మహిధర్ నాకు 20 ఏళ్ల నుంచి తెలుసు. సియాటెల్‌లో ఇండియన్ చిత్రాల్ని మేం కలిసి రిలీజ్ చేస్తుండేవాళ్లం. అలా మా ప్రయాణం కొనసాగుతూ వచ్చింది. రెండు, మూడు వారాల క్రితం ‘శంబాల’ సినిమాని చూశాను. ఆదికి బ్లాక్ బస్టర్ హిట్ రాబోతోంది. ‘శంబాల’టీంకి ఆల్ ది బెస్ట్’ అని అన్నారు.
*ప్రియదర్శి మాట్లాడుతూ* .. ‘‘శంబాల’ ట్రైలర్ నాకు చాలా నచ్చింది. సైన్స్ గొప్పదా? శాస్త్రం అని గొప్పదా? అంటూ చూపించిన అంశాలు అద్భుతంగా ఉన్నాయి. ఆది అన్నకి ఈ చిత్రంతో మంచి సక్సెస్ రావాలని కోరుకుంటున్నాను. ‘శంబాల’ టీంకు ఆల్ ది బెస్ట్. డిసెంబర్ 25న ఈ చిత్రాన్ని నేను చూడబోతోన్నాను. ఈ మూవీని అందరూ థియేటర్లోనే చూడండి’ అని అన్నారు.
*దర్శకుడు యుగంధర్ ముని మాట్లాడుతూ* .. ‘నిర్మాత రాజశేఖర్ గారి వల్లే ఈ ‘శంబాల’ స్టార్ట్ అయింది. ఆ తరువాత కథను మహీధర్ గారికి కూడా చెప్పాం. ఆ ఇద్దరే ఈ చిత్రానికి బ్యాక్ బోన్‌లా నిల్చున్నారు. అన్ని రకాల ఎమోషన్స్ పండించే హీరో కావాలని నిర్మాతలకు చెప్పాను. ఆ తరువాత ఆది గారు మా ప్రాజెక్ట్‌లోకి వచ్చారు. ఆయనకు కూడా కథ చాలా నచ్చింది. నాకు అండగా నిలిచిన ఆది గారికి థాంక్స్. నా టెక్నికల్ టీం సపోర్ట్ వల్లే సినిమాను ఇంత గొప్పగా తీయగలిగాను’ అని అన్నారు. 
*నిర్మాత మహీధర్ రెడ్డి మాట్లాడుతూ* .. ‘‘శంబాల’ కోసం టీం అంతా చాలా కష్టపడింది. యుగంధర్ గారు ఈ మూవీని అద్భుతంగా తెరకెక్కించారు. డిసెంబర్ 25న రాబోతోన్న మా సినిమాను అందరూ చూసి విజయాన్ని అందించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
*నిర్మాత రాజశేఖర్ అన్నభిమోజు మాట్లాడుతూ* .. ‘‘శంబాల’ చిత్రం చాలా బాగా వచ్చింది. డిసెంబర్ 25న మా మూవీ రాబోతోంది. అందరూ మా సినిమాను చూసి హిట్ చేయాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
*మైత్రి నవీన్ యెర్నెని మాట్లాడుతూ* .. ‘‘శంబాల’ ట్రైలర్ చాలా బాగుంది. ఆదికి కమ్ బ్యాక్ అవుతుంది. ‘శంబాల’ టీంకు ఆల్ ది బెస్ట్. ఈ చిత్రం పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
*మైత్రి శశి మాట్లాడుతూ* .. ‘రాజశేఖర్ గారు, మహిధర్ గారు మాకు ‘శంబాల’ సినిమా ఇవ్వడం ఆనందంగా ఉంది. ఈ చిత్రాన్ని ఆల్రెడీ చూశాను. ఇంటర్వెల్ బ్లాక్ చూసి ఆశ్చర్యపోయాను. దర్శకుడు అందరినీ మెస్మరైజ్ చేశారు. చివరి వరకు ఎంగేజ్ చేసేలా ఉంటుంది. ఇది కచ్చితంగా థియేటర్లోనే చూడాలి. అప్పుడే మీకు విజువల్‌గా, సౌండింగ్‌ను ఎంజాయ్ చేస్తారు. ఆదికి ఈ చిత్రంతో పెద్ద విజయం రానుంది. సినిమా రిలీజ్ తరువాత తండ్రిగా సాయి కుమార్ గారు ఎంతో గర్వపడతారు’ అని అన్నారు.
*ఉషా పిక్చర్స్ సురేష్ మాట్లాడుతూ* .. ‘‘శంబాల’ మూవీని ఆల్రెడీ చూశాను. చిత్రం అద్భుతంగా వచ్చింది. సాయి కుమార్ గారితో మాకు ఎన్నో ఏళ్ల నుంచి అనుబంధం ఉంది.  ఈ మూవీ పెద్ద సక్సెస్ కాబోతోంది’ అని అన్నారు.
*ఆహా శ్రీనివాస్ మాట్లాడుతూ* .. ‘‘శంబాల’ నుంచి వస్తున్న ప్రతీ కంటెంట్ వైరల్ అయింది. ఇది చిన్న చిత్రం కాదు. పెద్ద సినిమా అవుతుంది. డిసెంబర్ 25న బ్లాక్ బస్టర్ కాబోతోంది. ఆది గారికి అద్భుతమైన విజయం దక్కబోతోంది’ అని అన్నారు.
*శ్రీచరణ్ పాకాల మాట్లాడుతూ* .. ‘‘శంబాల’ నిర్మాతలకు సినిమాల పట్ల చాలా ప్యాషన్ ఉంది. ఇంత మంచి ప్రాజెక్ట్‌లో భాగమైనందుకు ఆనందంగా ఉంది. యుగంధర్‌కి సౌండింగ్ మీద మంచి పట్టుంది. ప్రవీణ్ గారి విజువల్స్ బాగుంటాయి. ఇది నా 49వ చిత్రం. ‘శంబాల’ నా కెరీర్‌లో ఎంతో స్పెషల్ మూవీ. ఆదితో ఇది వరకే కలిసి పని చేశాం. ఈ మూవీతో ఆదికి మంచి విజయం రాబోతోంది. డిసెంబర్ 25న ఈ సినిమాను అందరూ చూడండి’ అని అన్నారు.
*అర్చనా అయ్యర్ మాట్లాడుతూ* .. ‘‘శంబాల’ నాకెంతో ప్రత్యేకమైన చిత్రం. ఎంతో మంది అద్భుతమైన ఆర్టిస్టులు, టెక్నీషియన్లతో పని చేశాను. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థాంక్స్. ఆది గారి చాలా మంచి వ్యక్తి. ఆయన ఈ చిత్రంలో అద్భుతంగా నటించారు. డిసెంబర్ 25న మా చిత్రాన్ని అందరూ చూసి సపోర్ట్ చేయండి’ అని అన్నారు.
*డీఓపీ ప్రవీణ్ కె బంగారి మాట్లాడుతూ* .. ‘‘శంబాల’ మూవీని థియేటర్లో చూస్తేనే అద్భుతమైన ఫీల్ వస్తుంది. విజువల్‌గా ఈ చిత్రం గ్రాండియర్‌గా ఉంటుంది. డిసెంబర్ 25న ఈ చిత్రాన్ని అందరూ చూడండి’ అని అన్నారు.
*ఎడిటర్ శ్రవణ్ మాట్లాడుతూ* .. ‘‘శంబాల’కి టెక్నిషియన్‌గా కాకుండా ఓ ఆడియెన్‌లా పని చేశాను. ఈ చిత్రం అద్భుతంగా వచ్చింది. డిసెంబర్ 25న ఈ మూవీని అందరూ చూసి సక్సెస్ చేయండి’ అని అన్నారు.

‘Diamond dacoit’ Movie teaser launched held grandly

హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్ లో సినీ ప్రముకుల సమక్షంలో విన్నుత్నం గా హీరో పార్ధ గోపాల్ మరియు హీరోయిన్ మేఘన టీజర్ ని ప్రేక్షకులు మరియు పాత్రికేయ మిత్రుల కరత్వాలా ధ్వనుల మధ్య మూవీ టీజర్ ని రిలీజ్ చేసారు ముందుగా

హీరో పార్ద గోపాల్ మాట్లాడుతూ నేను మా డైరెక్టర్ సూర్య జి యాదవ్ గారు గత మూడు సంవత్సరాలనుండి జర్నీ చేస్తూ చాలా ఒడి దుడుకులు ఎదుర్కొని ఇ చిత్రాన్ని తెర కేక్కించ్చినాము ఈరోజు మీ అందరి సమక్షంలో టీజర్ రిలీజ్ చేయటం చాలా ఆనందం గా వుంది, డైమండ్ డెకాయిట్ ఒక ఫ్యామిలీ ఎమోషనల్ రివంజ్ డ్రామా 2026 ఫిబ్రవరి లో ప్రేక్షకులు ముందుకు తీసుకువస్తున్నాం మీ అందరి సపోర్ట్ కావాలి అని ముగించారు.

హీరోయిన్ మేఘన మాట్లాడుతూ ఇ సినిమా ని చాలా కష్ట పడి పనిచేసాము ముఖ్యం గా మా డైరెక్టర్ గారు మరియు హీరో &ప్రొడ్యూసర్ గా చేసిన పార్ద గోపాల్ గారు అందరం కష్ట పడి పనిచేసాము మీ అందరి సపోర్ట్ కావాలి థాంక్ యు.

మ్యూజిక్ డైరెక్టర్ పెద్దపల్లి రోహిత్ మాట్లాడుతూ ఇ మధ్య చిన్న సినిమాలు బాగా ఆడుతున్నాయి ఇ సినిమా కూడా అదే కోవలోకి వస్తుంది అని ఆశిస్తున్నాను మా డైరెక్టర్ గారు హీరో గారు చాలా కష్ట పడి వర్క్ చేసారు సాంగ్స్ కూడా బాగా వచ్చాయి లవ్ సాంగ్ కానీ, టైటిల్ సాంగ్ కానీ అన్ని బాగా వచ్చాయి టీజర్ కి మించి ఇ సినిమా టెన్ టైమ్స్ ఎక్కువగానే ఉంటుంది కచ్చితంగా మంచి విజయం సాధిస్తుంది అని థాంక్ యు.

డైరెక్టర్ సూర్య జి యాదవ్ గారు మాట్లాడుతూ ఇ సినిమా అంత కడప జిల్లాలో అరవై లొకేషన్స్ లో చాలా వ్యయ ప్రయాసలు పడి మా హీరో మరియు ప్రొడ్యూసర్ పార్ద గోపాల్ గారు ఎక్కడ రాజి పడకుండా నిర్మించి నటించారు, ఇ సినిమా ఫ్యామిలీ ఎమోషన్ రివెంజ్ డ్రామా, ఇ చిత్రానికి సాంగ్స్ &బీజీమ్ కూడా బాగా వర్క్ అవుట్ అయ్యింది కొత్త సంవత్సరం లో ఫిబ్రవరి లో మీ ముందుకు తీసుకువస్తున్నాము తప్పకుండ మీరు ఆధారిస్తారు అని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను.

తారగణం :
హీరో :పార్ద గోపాల్
హీరోయిన్ :మేఘన
మరియు తదితరులు

టెక్నికల్ టీమ్
డి. ఓ. పి :ఆచంట శివ
ఎడిటర్ :శివ సర్వాణి
అసోసియేట్ డైరెక్టర్ :అందులూరు ఓబుల్ రెడ్డి
మ్యూజిక్ డైరెక్టర్ :పెద్దపల్లి రోహిత్ (PR)
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ :తాటి సుధేష్ణ దేవి
ప్రొడ్యూసర్ :పార్ద గోపాల్
డైరెక్టర్ :సూర్య జి యాదవ్ (సురేష్ బాబు )