Home Blog Page 59

‘Hara Hara Shankara’ Song launched by Prominent Actor Tanikella Bharani from ‘Mutton Soup’ Movie

రామకృష్ణ వట్టికూటి సమర్పణలో అలుక్కా స్టూడియోస్, శ్రీ వారాహి ఆర్ట్స్, భవిష్య విహార్ చిత్రాలు (BVC) బ్యానర్లపై రమణ్, వర్షా విశ్వనాథ్ హీరో హీరోయిన్లుగా రామచంద్ర వట్టికూటి తెరకెక్కించిన చిత్రం ‘మటన్ సూప్’. ‘విట్‌నెస్ ది రియ‌ల్ క్రైమ్‌’ ట్యాగ్ లైన్‌. మల్లిఖార్జున ఎలికా (గోపాల్), అరుణ్ చంద్ర వట్టికూటి, రామకృష్ణ సనపల నిర్మాతలుగా రానున్న ఈ నూతన చిత్రానికి సంబంధించిన టైటిల్‌ పోస్టర్‌, మోష‌న్ పోస్ట‌ర్‌ను సీనియ‌ర్ నిర్మాత కె.ఎస్‌.రామారావు ఇటీవలె విడుదల చేయడం, సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వడం అందరికీ తెలిసిందే. ఇక మంగళవారం నాడు (ఆగస్ట్ 26) ‘మటన్ సూప్’ నుంచి ‘హర హర శంకర’ సాంగ్‌ను ప్రముఖ నటుడు తనికెళ్ళ భరణి గారు విడుదల చేశారు. ఈ మేరకు నిర్వహించిన కార్యక్రమంలో ..

ప్రముఖ నటుడు తనికెళ్ల భరణి మాట్లాడుతూ .. ‘ఆ విఘ్నేశ్వరుడి దయతో ఏ విఘ్నాలు లేకుండా ‘మటన్ సూప్’చిత్రం పెద్ద విజయం సాధించాలి. ప్రస్తుతం ఇండస్ట్రీలోకి కొత్త రక్తం వస్తోంది. నలభై ఏళ్లుగా ఈ ఇండస్ట్రీలో ఉన్నాను. ఓ సినిమా తీయాలంటే ఎంత కష్టపడాల్సి వస్తుందో నాకు తెలుసు. ఈ మూవీ తీసిన వారి, చూసిన వారి జీవితాలు మారిపోవాలి. ‘హర హర శంకర’ పాటలో సమాజంలో జరుగుతున్న ఘోరాల్ని చూపించారు. ‘మటన్ సూప్’ టీం పడిన కష్టానికి తగ్గ ప్రతిఫలం రావాలి. ఈ మూవీ విజయవంతం అవ్వాలని ఆ పరమేశ్వరుడ్ని ప్రార్థిస్తున్నాను’ అని అన్నారు.

రామచంద్ర వట్టికూటి మాట్లాడుతూ .. ‘మా ‘మటన్ సూప్’ చిత్రంలోని ‘హర హర శంకర’ పాటను రిలీజ్ చేసిన తనికెళ్ల భరణి గారికి ధన్యవాదాలు. నాకు ఈ ప్రయాణంలో తోడుగా నిలిచిన మల్లిఖార్జున ఎలికా (గోపాల్), అరుణ్ చంద్ర వట్టికూటి, రామకృష్ణ సనపల గారికి థాంక్స్. నన్ను ముందుండి నడిపిస్తున్న మా పర్వతనేని రాంబాబు గారికి ధన్యవాదాలు. అడిగిన వెంటనే సాయం చేసిన శివ గారికి థాంక్స్. త్వరలోనే మా చిత్రానికి సంబంధించిన మరిన్ని అప్డేట్లు ఇస్తాం. సెప్టెంబర్‌లో మూవీని విడుదల చేసేదుకు ప్రయత్నిస్తున్నామ’ని అన్నారు.

నిర్మాత మల్లిఖార్జున ఎలికా (గోపాల్) మాట్లాడుతూ .. ‘తనికెళ్ల భరణి గారు మా పాటను లాంచ్ చేయడం ఆనందంగా ఉంది. ఆయన రావడంతో మాకు స్వయంగా ఆ శివుడే వచ్చినట్టుగా అనిపిస్తోంది. ఇక్కడే మేం విజయం సాధించినట్టుగా అనిపిస్తోంది’ అని అన్నారు.

నిర్మాత అరుణ్ చంద్ర వట్టికూటి మాట్లాడుతూ .. ‘తనికెళ్ల భరణి గారు రావడమే మా మొదటి విజయం. మా తమ్ముడు రామచంద్రను ఇలా చూస్తుంటే ఆనందంగా ఉంది. ‘మటన్ సూప్’ చిత్రాన్ని పెద్ద హిట్ చేయాలి’ అని అన్నారు.

నిర్మాత రామకృష్ణ సనపల మాట్లాడుతూ .. ‘మా పాటను రిలీజ్ చేసిన తనికెళ్ల భరణి గారికి థాంక్స్. సినిమాల్లో చూస్తూ పెరిగిన నేను ఈ రోజు ఇలా ఆయన పక్కన నిల్చోవడం అదృష్టంగా భావిస్తున్నాను. మా కోసం ఆ శివుడే తరలి వచ్చినట్టుగా అనిపిస్తోంది’ అని అన్నారు.

శివ మల్లాల మాట్లాడుతూ .. ‘‘హర హర శంకర’ అనగానే అందరికీ తనికెళ్ల భరణి గారు గుర్తుకు వస్తున్నారు. ‘మటన్ సూప్’ చిత్రం కోసం ఆయన రావడం ఆనందంగా ఉంది’ అని అన్నారు.

హీరో రమణ్ మాట్లాడుతూ .. ‘‘మా పాటను విడుదల చేసిన తనికెళ్ల భరణి గారికి థాంక్స్. మేమంతా ఎంతో కష్టపడి ఈ మూవీని తీశాం. ప్రతీ సీన్ జీవితంలో జరిగినట్టుగానే అనిపిస్తుంది. ఈ పాటను వింటుంటూ నాకు కన్నీళ్లు వస్తాయి. ఈ మూవీని అందరూ చూసి సక్సెస్ చేయండి’ అని అన్నారు.

నటి సునీత మనోహర్ మాట్లాడుతూ .. ‘‘మటన్ సూప్’ మూవీని ఎంతో కష్టపడి చేశాం. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థాంక్స్. ఈ మూవీ చాలా పెద్ద సక్సెస్ కానుంది’ అని అన్నారు.

నటుడు గోవింద్ మాట్లాడుతూ.. ‘మటన్ సూప్ సినిమాకి పని చేయడం ఆనందంగా ఉంది. హర హర శంకర పాటను రిలీజ్ చేసిన తనికెళ్ళ భరణి గారికి ధన్యవాదాలు’ అని అన్నారు.

ఇంకా ఈ కార్య‌క్ర‌మంలో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ పర్వ‌త‌నేని రాంబాబు, లైన్ ప్రొడ్యూస‌ర్ కొమ్మా రామ కృష్ణ, ఎడిట‌ర్ లోకేష్ క‌డ‌లి, న‌టుడు గోవింద్ రాజ్ నీరుడి త‌దిత‌రులు పాల్గొని తనికెళ్ల భరణి గారికి ధ‌న్య‌వాదాలు తెలియ‌జేశారు. వినాయక చవితి సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ మట్టి వినాయకుడి విగ్రహాన్ని అందించారు.

నటీనటులు : రమణ్, వర్ష విశ్వనాథ్, జెమినీ సురేష్, గోవింద్ శ్రీనివాస్, శివరాజ్, ఎస్ఆర్‌కే, చరణ్, కిరణ్, గోపాల్ మహర్షి, సునీత మనోహర్, మాస్టర్ విహార్, కిరణ్ మేడసాని తదితరులు

సాంకేతిక బృందం
బ్యానర్స్ : అలుక్కా స్టూడియోస్, శ్రీ వారాహి ఆర్ట్స్, భవిష్య విహార్ చిత్రాలు (BVC)
సమర్పణ : రామకృష్ణ వట్టికూటి
దర్శకుడు : రామచంద్ర వట్టికూటి
నిర్మాత : మల్లిఖార్జున ఎలికా (గోపాల్), అరుణ్ చంద్ర వట్టికూటి, రామకృష్ణ సనపల
కెమెరామెన్ : భరద్వాజ్, ఫణింద్ర
మ్యూజిక్ : వెంకీ వీణ
ఎడిటింగ్ : లోకేష్ కడలి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : పర్వతనేని రాంబాబు
కో డైరెక్టర్ : గోపాల్ మహర్షి
పి.ఆర్‌.ఒ : మోహన్ తుమ్మల

‘Kotha Lokah 1: Chandra’ Trailer Unveils India’s First Female-Led Superhero Saga

The much-anticipated telugu trailer for Lokah Chapter 1: Chandra is setting social media ablaze with excitement. Produced by Dulquer Salmaan’s Wayfarer Films and directed by Dominic Arun. Film Starring Kalyani Priyadarshan as Chandra, India’s trailblazing superheroine and marks the inception of a bold new cinematic universe rooted in Indian culture, folklore and mythology.

The trailer is a visual spectacle blending mythology with modern day action. It opens with fiery battlefield scenes showcasing Kalyani Priyadarshan in a fierce never before seen avatar. Alongside her, Naslen K. Gafoor shines as Sunny.

Written by Dominic Arun and additional screenplay by Santhy Balachandran. The trailer’s high octane action choreographed by international stunt expert Yannick Ben paired with Jakes Bejoy’s pulsating score and Nimish Ravi’s stunning cinematography sets the stage for a genre-defining experience in Telugu Cinema .

The film is scheduled for a pan-India release on August 29th, It will be presented by noted Tollywood producer Suryadevara Naga Vamsi under the banner of Sithara Entertainments, with distribution across Andhra Pradesh and Telangana.

Mass Maharaja Ravi Teja’s ‘Mass Jathara’ Postponed

Mass Maharaja Ravi Teja’s much awaited film Mass Jathara which was originally scheduled for release on August 27th has been postponed.

The makers officially confirmed that due to the recent industry wide strikes and unexpected delays in the completion of crucial content film could not be readied in time for its planned date. They emphasized that rather than rushing the process, team is determined to deliver the film at its absolute best and give audiences the kind of grand massive experience they deserve.

The producers added that work is progressing at full speed with every department putting in relentless effort to make Mass Jathara a festival style entertainer worthy of the wait. While the new release date is yet to be finalized team assured fans that the announcement will come very soon along with surprises that will make the wait worthwhile.

‘Brahmanda’ Pre-Release Event held grandly, Movie Releasing on Aug 29

ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆధ్యత్మిక కథలకు కూడా మంచి ఆదరణ లభిస్తుంది. ఒకవైపు పెద్ద సినిమాలు ఎలా అయితే ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకొస్తున్నాయో, మరోవైపు చిన్న సినిమాలు చాలామంది హృదయాలను తాకుతున్నాయి. ఇక ప్రస్తుతం రాబోతున్న సినిమాలలో బ్రహ్మాండ సినిమా ఒకటి. ఈ సినిమా శుక్రవారం రిలీజ్ కాబోతుంది. ఈ సందర్భంగా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ సినిమాలో నటి ఆమని ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.

నటి ఆమని మాట్లాడుతూ..బ్రహ్మాండ మూవీ తెలుగు ప్రేక్షకులకి ఓ కొత్త అనుభూతి అనుభూతిని ఇస్తుంది అని తెలిపారు. అలానే ఈ సినిమా గురించి మరిన్ని విషయాలను చెప్పారు నటి ఆమని. ఇంత మంచి సినిమా సినిమా డైరెక్ట్ చేసిన రాంబాబు గారు మన మధ్య లేకపోవడం బాధకారం.

హీరో బన్నీ రాజు మాట్లాడుతూ..ఈ సినిమాలో నాది అద్భుతమైన పాత్ర. సినిమా నా కెరీర్‌లో గుర్తుండిపోతుంది. ఈ సినిమాను శుక్రవారం రిలీజ్ చేయబోతున్నాం. అందరూ చూసి ఆదరించండి. ముఖ్యంగా క్లైమాక్స్ ని మిస్ చేయకండి. అద్భుతమైన అనుభూతిని పొందుతారు.

నిర్మాత దాసరి సురేష్ మాట్లాడుతూ స్క్రిప్ట్ దశలో మేము అనుకున్నది అనుకున్నట్టుగా .. అంతకుమించి చిత్రీకరించా చిత్రీకరించాం. మా డైరెక్టర్ ఇప్పుడు మా మధ్య లేకపోవడం బాధకరం. ముఖ్యంగా ఆమని గారు బలగం జయరాం గారు కొమురక్క గార్ల సహకారం మేము మరవలేము అని చెప్పారు .

నటీనటులు :
ఆమని బలగం జయరాం కొమరక్క బన్నీ రాజు, కనీకావాధ్వ చత్రపతి శేఖర్ అమిత్, దిల్ రమేష్ ప్రసన్నకుమార్ దేవిశ్రీ కర్తానందం తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.

నిర్మాత : దాసరి సురేష్
సహా నిర్మాత శ్రీమతి దాసరి మమత
కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం :రాంబాబు
డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ : కాసుల కార్తీక్
ఎడిటింగ్ : ఎమ్మార్ వర్మ
సంగీతం : వరికుప్పల యాదగిరి
మాటలు : రమేష్ రాయి జి ఎస్ నారాయణ
కొరియోగ్రఫీ :కళాధర్ రాజు , రాజు కోనేటి(SDC) ,కిరణ్.
పీ ఆర్వో : శ్రీపాల్ చోల్లేటి

Aha Rewards ‘Sarkaar Tho Aata’ Winners with Franklin EV Bikes

Super host Sudigali Sudheer made Sarkaar Season 5’s success meet even more special by presenting brand-new Franklin EV bikes to two lucky winners of the newly introduced audience play-along segment, “Sarkaar Tho Aata.”

This exciting segment, launched in Season 5, allowed viewers to take part in the show by answering questions via WhatsApp. The response was tremendous, with over 2 lakh people participating. From them, two lucky winners were selected and rewarded in style by Sudheer himself.

With Sarkaar Season 5 emerging as one of Aha’s most successful shows, the platform expressed its happiness and promised many more engaging formats for the audience in the future.

“Em Jarugutondi…” Lyrical Song Released from National Crush Rashmika Mandanna’s ‘The Girlfriend’ Movie

National Crush Rashmika Mandanna pairs with talented actor Dheekshith Shetty in the upcoming film The Girlfriend. Directed by Rahul Ravindran, this beautiful love story is being produced jointly under the prestigious banners Geetha Arts and Dheeraj Mogilineni Entertainment, with presentation by Allu Aravind. Dheeraj Mogilineni and Vidya Koppineedi are producing the film.

Today, the makers unveiled the lyrical song “Em Jarugutondi…”. The soulful number has lyrics by Rakendu Mouli, vocals by Chinmayi, and music composed by Hesham Abdul Wahab, who has delivered yet another chartbuster tune. The song captures a heartfelt love feel with lines like “Kalakalamuna kalagalipina katha modalaa… Kalavaramuna teginaligina nijamu kalaa… Em jarugutondi… Manasa telusaa…” leaving a deep impact.

The release date of The Girlfriend will be announced soon.

Cast: Rashmika Mandanna, Dheekshith Shetty and others

Technical Crew:

Cinematography: Krishnan Vasant
Music: Hesham Abdul Wahab
Costumes: Sravya Varma
Production Design: S. Ramakrishna, Mounika Nigothri
PRO: GSK Media, Vamsi Kaka
Marketing: First Show
Presented by: Allu Aravind
Banners: Geetha Arts, Dheeraj Mogilineni Entertainment
Producers: Dheeraj Mogilineni, Vidya Koppineedi
Written & Directed by: Rahul Ravindran

‘Mr. Ramu’ Audio Release Event held grandly

The audio for the upcoming film ‘Mr. Ramu’, starring Bontha Ramu in the lead role, was officially launched at a grand event in Hyderabad. The film, which also features Ajay Ghosh as the villain and Jabardasth Apparao in a key role, is produced by Bontha Ramu under the Renuka Devi Films banner and directed by Ajay Koundinya.

A Film with a Message
Speaking at the event, director Ajay Koundinya shared that ‘Mr. Ramu’ is an entertaining film with a strong message. “We made this film by combining message-oriented and entertainment elements. Our producer, Ramu, also acted as the hero in this film, and his performance as an auto driver will be impressive,” he said. He added that the film is based on the theme of child kidnappings in hospitals.

Ajay Koundinya expressed his gratitude to Ajay Ghosh and Jabardasth Apparao for agreeing to be part of the film. He also highlighted the challenges faced by small films and hoped that his movies would also gain global recognition.

A Debut with Big Plans
Hero and producer Bontha Ramu shared his lifelong dream of becoming a hero. “When director Ajay Koundinya narrated this story, I immediately liked it and decided to move forward,” he said. He also announced that he and director Ajay Koundinya will be collaborating on nine more films after ‘Mr. Ramu’, making it a total of ten films together. “As soon as ‘Mr. Ramu’ is released, we will announce our new film,” he promised.

Special Performances and Music
The cast and crew also spoke about their roles and contributions to the film. Actor Jabardasth Apparao praised the film’s director, music director Hruday Mugdal, and cameraman Charan. Actress Avantika, who performed a special song in the film, expressed her excitement, hoping for a great response from the audience in theaters.

Heroine Sandhya was thrilled to have received a role she had always wished for. Music director Hruday Mugdal mentioned that he not only composed the music but also wrote the lyrics for the songs, expressing hope that the audience would enjoy them, especially the song “Paya Paya.”

Technical Team:
Banner: Renuka Devi Films,
Producer: Bontha Ramu,
Story, Direction: Ajay Koundinya,
Music: Hruday Mugdal,
Camera: Charan,

Cast:
Bontha Ramu, Sandhya, Ajay Ghosh, Jabardasth Apparao, Avantika, and others.

Producer Vijaypal Reddy Adidhala interview about “Tribanadhari Barbarik” Movie 

Presented by star director Maruthi on Maruthi Team Product, producer Vijaypal Reddy Adidhala of Vanara Celluloid banner has brought forth the film “Tribanadhari Barbarik”, directed by Mohan Srivatsa. The movie features senior actor Sathyaraj, Udaya Bhanu, Vasishta N. Simha, Satyam Rajesh, Kranthi Kiran, and Sanchi Roy in key roles. The film is set to release on August 29, and both the teaser and trailer have already gained significant traction online. On this occasion, producer Vijaypal Reddy shared his thoughts and experiences about the film.

*How did the journey of ‘Tribanadhari Barbarik’ begin?*
I was busy with my business ventures when I happened to hear this story. Director Mohan narrated it to me, and I instantly liked it. Initially, we thought of making it as a small-budget film. Later, I met director Maruthi. He said, “If you’re making this film, do it on a big scale—otherwise don’t do it at all.” That gave me the confidence to go ahead with a grand production.

*What is the story of ‘Tribanadhari Barbarik’?*
It’s a very new kind of story, quite thrilling in nature. Just like Malayalam films are often made realistically, we shot it with a natural style as well. At the same time, we have included the necessary commercial elements for the Telugu audience. Though we first thought of producing it on a smaller scale, the story demanded a grandeur that we eventually provided.

*What response did you get from the premieres?*
A fresh element in this film is how we blended in the mythological genre with the story. We held premieres in Warangal and Vijayawada, and the response was overwhelming. Many people were moved to tears. Everyone praised the movie, saying it was excellent. That gave us immense satisfaction.

*How is the film technically?*
Today’s audience appreciates fresh content and different concepts. Since I am new to the industry, Maruthi garu stood by me as strong support. Technically too, this film is rich. We brought Infusion Band for the soundtrack, their songs and re-recording have come out brilliantly. Cinematographer Kushender Ramesh Reddy’s visuals will surely impress viewers.

*You’re producing back-to-back films. Why so?*
Yes, my intention from the beginning was to continuously produce quality films. Along with Tribanadhari Barbarik, we also started another film titled Beauty. I believe in good content, which is why I confidently went ahead with both projects. I can assure you—there won’t be a single boring moment in either of these films. That’s my challenge.

*Tell us about the actors in this film.*
Sathyaraj garu agreed to our film during the very first narration itself. He plays a role unlike anything he has done before. Every character here has importance. Udaya Bhanu garu got a very strong role, and this film will give her an excellent restart in her second innings. Likewise, Satyam Rajesh, Vasishta, Sanchi Roy, and others have delivered engaging performances.

*What was director Maruthi’s reaction after watching the film?*
After watching the film, Maruthi garu was extremely satisfied. He is very confident about its success. To ensure wider reach, we screened premieres in places like Warangal and Vijayawada. For now, we are releasing it in Telugu, but soon we will dub it into other languages as well.

*Why was the film’s release postponed?*
Mythri Movie Makers are releasing our film in the Nizam region. Since War 2 and Coolie are also playing currently, we needed sufficient theatres to match our scale. Hence, they suggested shifting the release from August 22 to August 29. Now we’ve secured the required number of theatres and are ready for a grand release.

*Will your production house continue making unique content films?*
Yes. Barbarik is a thrilling film. Beauty is a full-fledged family and commercial entertainer. Next, I have approved a horror-comedy project, and there are two more in the pipeline. Each one will be distinctly different.

*What has given you the most satisfaction with ‘Tribanadhari Barbarik’?*
We want families to come together and watch this movie. That’s why we’ve capped the ticket price at just Rs 150 for both multiplexes and single screens. The film carries a meaningful message while also offering the entertainment that audiences expect. It’s designed to explain the true essence of Tribanasthra and convey it in a powerful way.

During a special premiere in Warangal, one couple watched the movie for free. But afterwards, they felt it was so valuable that they voluntarily paid for the tickets. That moment gave me immense satisfaction as a producer.

“1990’s” movie trailer and songs launched by Directors Association President Veerashankar

అరుణ్ రాయదుర్గం, రాణి వరదా హీరో హీరోయిన్లు గా నటిస్తున్న సినిమా “1990’s”. ఈ చిత్రాన్ని మనసు మల్లిగే బ్యానర్ పై చంద్రశేఖర్.బి.ఎస్. నిర్మిస్తున్నారు. నందకుమార్. సి.ఎం. దర్శకత్వం వహిస్తున్నారు. 1990’S సినిమా త్వరలో కన్నడ, తెలుగు, తమిళ, మలయాళంలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు ఈ సినిమా ట్రైలర్, సాంగ్స్ లాంఛ్ ఈవెంట్ ను డైరెక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వీరశంకర్ చేతుల మీదుగా హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో

సినీ జర్నలిస్ట్ వినాయకరావు మాట్లాడుతూ – 1990’S సినిమా ట్రైలర్, సాంగ్స్ చాలా బాగున్నాయి. నూతన దర్శకుడైనా మూవీని బాగా రూపొందించాడు. కన్నడ నుంచి తెలుగులోకి వస్తున్న ఈ చిత్రానికి మన తెలుగు ఆడియెన్స్ ఆదరణ తప్పకుండా దక్కాలని కోరుకుంటున్నా. 1990’S చిత్ర యూనిట్ కు నా బెస్ట్ విశెస్ చెబుతున్నా. అన్నారు.

సినీ జర్నలిస్ట్ ప్రభు మాట్లాడుతూ – 1990’S సినిమా ట్రైలర్, సాంగ్స్ రిలీజ్ ఈవెంట్ లో మా డైరెక్టర్ వీరశంకర్ గారి బర్త్ డే వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉంది. ఈ మూవీ కన్నడ నుంచి తెలుగు ఆడియెన్స్ ముందుకు రాబోతోంది. నేను ఇటీవలే బెంగళూరుకు ఓ ఫిలిం ఫెస్టివల్ కోసం వెళ్లాను. ఈ చిత్ర ట్రైలర్, సాంగ్స్ చాలా ప్రామిసింగ్ గా ఉన్నాయి. దర్శకుడు నందకుమార్ కొత్త వాడైనా బాగా రూపొందించాడు. ఈ మూవీ టీమ్ అందరికీ ఈ సినిమా పెద్ద సక్సెస్ ఇవ్వాలని కోరుకుంటున్నా. అన్నారు.

సినీ జర్నలిస్ట్ సంతోషం సురేష్ మాట్లాడుతూ – కంటెంట్ బాగుంటే ఏ భాష చిత్రాలైనా తెలుగు ఆడియెన్స్ ఆదరిస్తారు. అందుకు నిర్మాతగా నేనే ఎగ్జాంపుల్. నేను చేసిన మంచి డబ్బింగ్ మూవీస్ తెలుగులో ఆదరణ పొందాయి. 1990’S మూవీ స్ట్రాంగ్ కంటెంట్ తో తీసినట్లు ట్రైలర్, సాంగ్స్ తో తెలుస్తోంది. ఈ చిత్రాన్ని కూడా తెలుగు ఆడియెన్స్ సక్సెస్ చేస్తారని ఆశిస్తున్నా. అన్నారు.

డైరెక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వీరశంకర్ మాట్లాడుతూ – ఈ రోజు నా బర్త్ డే అని తెలుసుకుని కేక్ కట్ చేయించి బర్త్ డే సెలబ్రేషన్స్ చేయడం హ్యాపీగా ఉంది. నేనూ పుట్టి పెరిగింది కర్ణాటకలోనే. కన్నడతో నాకు మంచి అనుబంధం ఉంది. గతంలో నేను చేసిన ఓ కన్నడ మూవీకి ఈ సినిమా డీవోపీ ఆలేష్ అసిస్టెంట్ గా పనిచేశారు. ఆయన ఈ మూవీకి ఇచ్చిన విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. కన్నడలో ఫేమస్ ఎడిటర్ జనార్థన్ గారి అబ్బాయి అరుణ్ ఈ చిత్రంతో హీరోగా మన ముందుకు వస్తున్నారు. మనసు మల్లిగే అంటే మనసు మల్లెపువ్వు అనే పొయెటిక్ బ్యానర్ పెట్టడం ప్రొడ్యూసర్ టేస్ట్ ను చూపిస్తోంది. సినిమా మాత్రం మాస్ గా చేస్తూ చివరలో పొయెటిక్ టచ్ ఇవ్వడం ట్రైలర్ లో ఆకట్టుకుంది. 1990’S టీమ్ డైరెక్టర్ నందు, హీరో వరుణ్, హీరోయిన్ రాణి వరదా, ప్రొడ్యూసర్ చంద్రశేఖర్..అందరికీ నా ఆల్ ది బెస్ట్ చెబుతున్నా. అన్నారు.

ప్రొడ్యూసర్ చంద్రశేఖర్ బి.ఎస్. మాట్లాడుతూ – సినిమా అంటే లెక్కలు వేసుకుని చేస్తారు. కానీ మేము 1990’S చిత్రాన్ని లెక్కలు వేసుకుని చేయలేదు. ఒక ప్యాషన్ తో చేశాం. ప్యాషనేట్ టీమ్ ఈ సినిమాకు పనిచేసింది. నేను తెలుగువాడినే. ఐటీ రంగంలో కర్ణాటకలో సెటిల్ అయ్యాను. 1990’S సినిమా చాలా రూటెడ్ గా ఉంటుంది. మన మూలాలు కలిగిన కథా కథనాలతో సాగుతుంది. తెలంగాణతో పాటు శ్రీరంగపట్నం, మైసూర్ లో షూటింగ్ చేశాం. కంటెంట్ ఉన్న మూవీస్ కు ఆదరణ దక్కుతున్న ట్రెండ్ చూస్తున్నాం. మేమూ 1990’S చిత్రంలో అలాంటి మంచి కంటెంట్ తో వస్తున్నాం. మీ అందరి ఆదరణ దక్కుతుందని ఆశిస్తున్నాం. అన్నారు.

డైరెక్టర్ నందకుమార్ సి.ఎం. మాట్లాడుతూ – మా మూవీ ట్రైలర్, సాంగ్స్ లాంఛ్ ఈవెంట్ కు వచ్చిన పెద్దలు అందరికీ థ్యాంక్స్. సినిమా బాగుంటే తప్పకుండా తెలుగు ఆడియెన్స్ ఆదరిస్తారనే నమ్మకంతోనే 1990’S చిత్రాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాం. మీరు సపోర్ట్ చేస్తేనే కొత్త వాళ్లమైన మేము ఇండస్ట్రీలో నిలబడగలం. మా మూవీ ట్రైలర్, సాంగ్స్ మిమ్మల్ని ఆకట్టుకున్నాయని ఆశిస్తున్నాం. అలాగే సినిమా కూడా కొత్త తరహాలో సాగుతూ మిమ్మల్ని మెప్పిస్తుంది. అన్నారు.

హీరో అరుణ్ రాయదుర్గం మాట్లాడుతూ – మా మూవీని సపోర్ట్ చేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ థ్యాంక్స్. 1990’S సినిమా మిగతా వెర్షన్స్ కంటే తెలుగు బాగా వస్తుందని మా నమ్మకం. తెలుగు కోసం ఆరుగురితో మంచి టీమ్ ను పెట్టి రాయించాం. తెలుగులో మా మూవీ మిగతా అన్ని భాషల కంటే బాగా రీచ్ అవుతుందని ఆశిస్తున్నాం. అన్నారు.

హీరోయిన్ రాణి వరదా మాట్లాడుతూ – 1990’S సినిమాతో మీ ముందుకు వస్తున్నాం. తెలుగు ఆడియెన్స్ మా టీమ్ ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాం. 1990’S మూవీ ఒక కొత్త ప్రయత్నంగా పేరు తెచ్చుకుంటుంది. ఈ చిత్రం కోసం మా టీమ్ అంతా చాలా ఎఫర్ట్స్ పెట్టాం. త్వరలోనే మా మూవీ మీ ముందుకు రాబోతోంది. మా సినిమాకు సక్సెస్ అందిస్తారని ఆశిస్తున్నాం. అన్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ ఇ.సి.మహారాజ్ మాట్లాడుతూ – 1990’S సినిమా తెలుగులో నాకు ఫస్ట్ మూవీ. ఈ చిత్రంలోని సాంగ్స్ మీకు తప్పకుండా నచ్చుతాయి. నెక్ట్స్ టైమ్ ఈవెంట్ లో కంప్లీట్ గా తెలుగు నేర్చుకుని మాట్లాడుతా. 1990’S ట్రైలర్, సాంగ్స్ లాగే సినిమా కూడా మిమ్మల్ని ఎంగేజ్ చేస్తుంది. అన్నారు.

నటీనటులు – అరుణ్ రాయదుర్గం, రాణి వరదా, పునీత్ సాయి, స్వప్న, సిధార్థ, రమేష్, దేవరాజ్

టెక్నికల్ టీమ్

బ్యానర్… మనసు మల్లిగే
ప్రొడ్యూసర్ : చంద్ర శేఖర్ B. S
కో. ప్రొడ్యూసర్ : అరుణ్ కుమార్
డైరెక్టర్ : నంద కుమార్ C.M
కెమెరా : ఆలేష్. S
సంగీతం : E C. మహారాజ్
ఎడిటింగ్ : కృష్ణ
డాన్స్ : సాధిక్ సర్దార్
పీఆర్ఓ – లక్ష్మీ నివాస్

“Mana Inti Bhojanm” Restaurant launched by Actress Mahathi

ప్రముఖ సీరియల్ నటి మహతి చేతుల మీదగా హైదరాబాద్ బాచుపల్లిలో మన ఇంటి భోజనం రెస్టారెంట్ లాంచ్ కావడం జరిగింది. బాచుపల్లి చౌరస్తాలోని పెట్రోల్ బంక్ ఎదురుగా ఈ రెస్టారెంట్ ప్రారంభించారు. అంతేకాక ఈ రెస్టారెంట్ వారు ఆర్డర్ పై భోజనం క్యాటరింగ్ చేయడం ప్రత్యేకం.

ఈ సందర్భంగా నటి మహతి మాట్లాడుతూ… “అందరికీ నమస్కారం. నా దగ్గర వర్క్ చేసినటువంటి నాని నేడు ఇలా ఒక రెస్టారెంట్ పెట్టడం అనేది నాకు ఎంతో ఆనందాన్ని కలిగించింది. అంతేకాక బాచుపల్లి వస్తే నాకు మా సొంత ఊరికి వచ్చినట్లు అనిపిస్తుంది. ఈ ప్రాంతం కూడా చాలా వేగంగా అభివృద్ధి చెందుతూ వస్తుంది. అటువంటి ఈ ప్రాంతంలో నాని రెస్టారెంట్ పెట్టడం విశేషం. నాని అలాగే తన పార్ట్నర్ పద్మతో కలిసి ఎంతో వేగంగా ఈ వ్యాపారంలో అభివృద్ధి చెందాలని, భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను” అన్నారు.

మన ఇంటి భోజనం రెస్టారెంట్ యజమాని నాని మాట్లాడుతూ… “మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ అడిగిన వెంటనే కాదనకుండా ఏమీ ఆశించకుండా రెస్టారెంట్ ప్రారంభోత్సవానికి వచ్చిన నటి మహతి గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. ఆమె ఇప్పటికే ఎన్నో మంచి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. అదేవిధంగా మమ్మల్ని కూడా ఎంకరేజ్ చేస్తున్నందుకు చాలా థాంక్స్” అన్నారు.

మన ఇంటి భోజనం రెస్టారెంట్ ప్రారంభోత్సవం తర్వాత నటి మహతి గారు రెస్టారెంట్ యజమాని నాని, పద్మజ కుటుంబాలతో ముచ్చటించారు.